TikToker Hospitalised After Drinking Too Much Water - Sakshi
Sakshi News home page

నీళ్లు ఎక్కువగా తాగి ప్రాణాలు మీదకు తెచ్చుకుంది..  

Published Mon, Jul 31 2023 7:40 AM | Last Updated on Mon, Jul 31 2023 8:39 AM

TikToker Hospitalised For Drinking Too Much Water - Sakshi

టొరంటో: టిక్ టాక్ ఛాలెంజ్ పేరుతో కెనడాకు చెందిన ఒకమ్మాయి రోజుకు నాలుగు లీటర్ల చొప్పున తాగి ప్రాణం మీదకు తెచ్చుకుంది. 12 రోజుల పాటు ఇలా రోజుకు 4 కంటే ఎక్కువ లీటర్లు తగ్గటంతో చివరి రోజున ఆమెకు కొంత అసౌకర్యంగా అనిపించి డాక్టరును సంప్రదించింది. డాక్టర్లు ఆమెకు పరీక్షలు నిర్వహించి శరీరంలో సోడియం స్థాయిలు బాగాతగ్గిపోయాయని తెలిపారు. మరి కొంచెముంటే ప్రాణాపాయమేనని తెలిపారు. 

అదోరకం వెర్రి.. 
సొషల్ మీడియాలో క్రేజ్ కోసం జనం ఎంతగా వెంపర్లాడుతూ ఉంటారంటే తొందరగా స్టార్లు అయిపోయి చేతికందినంత సంపాదించుకోవాలి. ఎక్కడికెళ్లినా కూడా జనం వారిని గుర్తించాలి. ఇదొక్కటే వారికున్న లక్ష్యం. ఈ క్రమంలో ఎలాంటి పిచ్చి పని చేయడానికైనా వెనకాడరు. తాజాగా కెనడాలో వైరల్ గా మారిన ఒక ఫిట్నెస్ ఛాలెంజ్ ఒకమ్మాయిని దాదాపుగా చావు అంచుల వరకు తీసుకుని వెళ్ళింది.

75 హార్డ్ ఛాలెంజ్.. 
కెనాడకు చెందిన మిచెల్ ఫెయిర్‌బర్న్ అనే టిక్‌టాక్ స్టార్ ఆండీ ఫ్రైసెల్లా అనే ఓ యూట్యూబర్ 2019లో ప్రారంభించిన 75హార్డ్ అనే  ఫిట్నెస్ ఛాలెంజ్ ను స్వీకరించింది. ఇందులో భాగంగా ఆమె రోజుకు నాలుగు లీటర్ల కంటే ఎక్కువ నీళ్లు తాగాల్సి ఉంటుంది. కనీసం 45 నిముషాల పాటు రోజుకు రెండు సార్లు వర్కౌట్లు కూడా చేయాలి. రోజుకు 10 పేజీలు చదవాలి. ఇవన్నీ చేస్తునట్టుగా ఒక ఫోటో తీసి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వాలి. 

అయినా బుద్ధి మారలేదు.. 
పాపం ఫెయిర్‌బర్న్ ఈ ఛాలెంజ్ చివరి రోజు వరకు బాగానే చేసింది. 12వ రోజున మాత్రం కొంత అసౌకర్యంగా అనిపించడంతో వెంటనే  డాక్టరును సంప్రదించింది. డాక్టర్ రోజుకు కేవలం అరలీటరు నీళ్లు మాత్రమే తాగాలని సూచంచారట. ఈ విషయాన్ని స్వయంగా ఫెయిర్‌బర్న్ చెబుతూ.. నేను ఎలాగైనా ఈ ఛాలెంజ్ పూర్తి చేసి తీరతాను. మొదటిసారి కావడంతో కాస్త ఇబ్బంది పడ్డాను. ఎక్కువ నీళ్లు తాగడంతో రాత్రి పూత ఎక్కువగా మూత్రానికి పోవాల్సి వచ్చేది. ఇప్పుడు అరలీటరు నెల మాత్రమేతాగా మంటున్నారు కష్టమే కానీ ప్రయత్నిస్తానంది. 

ఇది కూడా చదవండి: ఫాతిమాగా మారిన అంజు... ఇల్లు కట్టుకోవడానికి స్థలం, డబ్బు..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement