KIA
-
కియా కొత్త ఎస్యూవీ సిరోస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ కియా ఇండియా సరికొత్త సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ సిరోస్‌ను భారత్ వేదికగా అంతర్జాతీయంగా ఆవిష్కరించింది. 2025 జనవరి 3 నుంచి బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి మొదటి వారం నుంచి డెలివరీలు మొదలవుతాయి. ధర ఎక్స్‌షోరూంలో రూ.10–15 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. 118 బీహెచ్పీ, 172 ఎన్ఎం టార్క్‌తో పెట్రోల్ వేరియంట్ 1.0 లీటర్ త్రీ–సిలిండర్ టర్బోచార్జ్డ్ ఇంజిన్‌తో తయారైంది. 6 స్పీడ్ మాన్యువల్ లేదా 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ఎంచుకోవచ్చు. లెవెల్–2 అడాస్, 6 ఎయిర్‌బ్యాగ్స్, ఎల్రక్టానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి భద్రతా ఫీచర్లు జోడించారు. 30 అంగుళాల పనోరమిక్ డ్యూయల్ స్క్రీన్ సెటప్, 360 డిగ్రీ పార్కింగ్ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి హంగులు జోడించారు. -
సెల్టోస్ ఎక్స్లైన్ వెర్షన్లో బ్లాక్ కలర్
న్యూఢిల్లీ: కియా తన సెల్టోస్ ‘ఎక్స్లైన్ వెర్షన్’లో బ్లాక్ కలర్ వేరియంట్‌ను తెచ్చింది. అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ కొత్త కలర్ వేరియంట్లో కేవలం ఎక్ట్సీరియర్‌లో మాత్రమే కాకుండా ఇంటీరియర్‌లో కూడా కొన్ని మార్పు లు చేశారు.సెల్టోస్ ఎక్స్ లైన్ క్యాబిన్ బ్లాక్, స్ల్పెండిడ్ సేజ్ గ్రీన్ 2టోన్ కాంబినేషన్లో వేర్వేరు రంగులను కలిగి ఉంది. రియర్ స్కిడ్ ప్లేట్లు, షార్క్ ఫిన్ యాంటెన్నా, ఫాక్స్ ఎగ్జాస్ట్, వెనుక బంపర్‌పై ఫ్రంట్, ఔటర్ రియర్ మిర్రర్లు, టెయిల్ గేట్ గార్నిష్ తో సహా మరికొన్ని మార్పులు చేశారు.‘‘ఇప్పటి వరకు గ్రే కలర్ వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉండే సెల్టోస్ అతి తక్కువ సమయంలో 5 లక్షల యూనిట్లు అమ్ముడైంది. కస్టమర్ల నుంచి డిమాండ్ భారీగా ఉంది. వారి ఫీడ్ బ్యాక్ ఆధారంగానే దీనిని బ్లాక్ కలర్ ఆప్షన్లో తీసుకొచ్చాము’’ అని కియా ఇండియా చీఫ్ సేల్స్ ఆఫీసర్ తెలిపారు. -
దేశీయంగా ఈవీ బ్యాటరీల తయారీ
న్యూఢిల్లీ: దేశీయంగా ఎలక్ట్రిక్ వాహన బ్యాటరీల తయారీని చేపట్టే దిశగా ఎక్సైడ్ ఎనర్జీ సొల్యూషన్స్‌తో దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజాలు హ్యుందాయ్, కియా జట్టు కట్టాయి. భారత్‌లో తమ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విస్తరణ ప్రణాళికలకు అనుగుణంగా ఇందుకు సంబంధించి ఎక్సైడ్ ఎనర్జీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు హ్యుందాయ్ తెలిపింది. దీని ప్రకారం లిథియం–ఐరన్–ఫాస్ఫేట్ (ఎల్ఎఫ్పీ) సెల్స్ తయారీపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు వివరించింది. స్థానికంగా తయారీ వల్ల బ్యాటరీ వ్యయాలు కొంత మేర తగ్గగలవని, తద్వారా ఇతర సంస్థలతో మరింత మెరుగ్గా పోటీపడగలమని హ్యుందాయ్ మోటర్ .. కియా ఆర్అండ్డీ విభాగం హెడ్ హుయి వాన్ యాంగ్ తెలిపారు. భారత మార్కెట్లో తమ బ్యాటరీల అభివృద్ధి, ఉత్పత్తి, సరఫరా తదితర కార్యకలాపాల విస్తరణకు ఎక్సైడ్ ఎనర్జీతో వ్యూహాత్మక భాగస్వామ్యం తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. హ్యుందాయ్ ప్రస్తుతం భారత్‌లో అయోనిక్ 5, కోనా ఎలక్ట్రిక్ వాహనాలను, కియా ఇండియా ఈవీ6 మోడల్‌ను విక్రయిస్తున్నాయి. -
4వేలకు పైగా కార్లు వెనక్కి.. సమస్య ఏమిటంటే..
తయారీ సంస్థలు తమ వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందించాలని కోరుకుంటాయి. అందుకు అనువుగానే ఉత్పత్తులను తయారుచేస్తాయి. అయితే హార్డ్‌వేర్ కారణాలు, ఇతర సాంకేతిక కారణాల వల్ల కంపెనీ లేదా వినియోగదారులు ఊహించిన విధంగా ఆయా ఉత్పత్తులు పనిచేయవు. దాంతో ప్రధానంగా వాటిలో గుర్తించిన సమస్యలను పరిష్కరించి తిరిగి వాటిని వినియోగదారులకు అందిస్తారు. తాజాగా ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ అయిన కియా మధ్యస్థాయి ఎస్యూవీ సెల్టోస్ పెట్రోల్ మోడల్ కారులో ఎలక్ట్రానిక్ ఆయిల్ పంపు నియంత్రణ వ్యవస్థలో లోపాలను గుర్తించినట్లు వెల్లడించింది. దీంతో దేశ వ్యాప్తంగా 4,358 కార్లను స్వచ్ఛందంగా వెనక్కి పిలిపిస్తున్నట్లు పేర్కొంది. ఇదీ చదవండి: భవిష్యత్తులో కరెంట్ కష్టాలు తీరేనా..? గత ఏడాది ఫిబ్రవరి 28 నుంచి జులై 13 వరకు తయారు చేసిన జీ1.5 పెట్రోల్ సెల్టోస్ (ఐవీటీ ట్రాన్స్మిషన్) కార్లు కొన్నింటిలో ఈ లోపం ఉన్నట్లు సంస్థ పేర్కొంది. దీనివల్ల వాహనం ఎలక్ట్రానిక్ ఆయిల్ పంపు నియంత్రణలో ఇబ్బంది ఎదురవుతుందని తెలిపింది. లోపాలున్న భాగాలను మార్చి ఇస్తామని, ఇప్పటికే సంబంధిత కార్ల యజమానులకు సమాచారం ఇచ్చినట్లు కియా ఇండియా చెప్పింది. -
కియా సెల్టోస్ కొత్త వేరియంట్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ కియా ఇండియా తాజాగా సెల్టోస్ కొత్త వేరియంట్లను ప్రవేశపెట్టింది. అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఏడీఏఎస్) లెవెల్–2 సాంకేతికతతో ఇవి రూపుదిద్దుకున్నాయి. జీటీఎక్స్ ప్లస్ (ఎస్), ఎక్స్-లైన్ (ఎస్) వేరియంట్లలో పెట్రోల్ ఇంజన్‌తో 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్, డీజిల్ ఇంజన్‌తో 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ఇవి తయారయ్యాయి. ఎక్స్షోరూలో ధర రూ. 19.39 లక్షల నుంచి ప్రారంభం. కొత్త సెల్టోస్ సగటు వెయిటింగ్ పీరియడ్ 15=16 వారాలు ఉంది. నూతన వేరియంట్లను 7-9 వారాల్లోనే డెలివరీ చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. రెండు నెలల్లోనే కొత్త సెల్టోస్ 50,000 యూనిట్ల బుకింగ్స్ మైలురాయిని అధిగమించిందని కియా ఇండియా వెల్లడించింది. -
‘కియా’కు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి: కియా ఇండియా నాలుగేళ్లలోనే 10 లక్షల కార్లను ఉత్పత్తి చేయడంపై సీఎం వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. స్వల్ప కాలంలోనే మిలియన్ కార్లను ఉత్పత్తి చేయడం ద్వారా కియా ఇండియా చరిత్ర సృష్టించిందని.. ఇందుకు కియా ఇండియాకు హృదయపూర్వక అభినందనలంటూ ఆయన గురువారం ట్వీట్ చేశారు. ఏపీ ఆటోమొబైల్ రంగం పెట్టుబడులకు అనుకూలమైన గమ్యస్థానమని ఈ మైలురాయి చాటి చెప్పిందని పేర్కొన్నారు. అలాగే పుష్కల వనరులున్న రాష్ట్రమని మరోసారి అందరికీ తెలియజేసిందన్నారు. భవిష్యత్‌లో కియా ఇండియా మరిన్ని విజయాలు సాధించాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. చదవండి: వలంటీర్ల వ్యవస్థ రద్దు కోసమే కుట్ర Hearty congratulations to the @KiaInd team for creating history by producing their millionth car in a short span of 4 years! This milestone makes Andhra Pradesh a favoured destination for the automobile industry and reiterates that Andhra Pradesh truly is Where Abundance meets… — YS Jagan Mohan Reddy (@ysjagan) July 13, 2023 -
కియా దూకుడు.. ఏపీ కియా ప్లాంట్‌లో ఎలక్ట్రిక్ కార్ల తయారీ!
న్యూఢిల్లీ: వాహన తయారీలో ఉన్న దక్షిణ కొరియా సంస్థ కియా.. భారత మార్కెట్లో 2025 నాటికి మరో మూడు మోడళ్లను ప్రవేశపెట్టనుంది. వీటిలో రెండు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయని కియా ఇండియా ఎండీ, సీఈవో టే–జిన్ పార్క్ మంగళవారం వెల్లడించారు. సెల్టోస్ అప్డేటెడ్ వెర్షన్ విడుదల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కియా 2.0 వ్యూహంలో భాగంగా సమీప భవిష్యత్తులో భారత ప్యాసింజర్ వెహికల్స్ మార్కెట్లో కంపెనీ వాటాను 10 శాతానికి చేర్చాలని లక్ష్యంగా చేసుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం కియాకు సుమారు 7% వాటా ఉందన్నారు. 2030 నాటికి మొత్తం అమ్మకాల్లో ఈవీల వాటా 20%కి చేరుతుందని అంచనా వేశారు. అనంతపురం ప్లాంటులో: ప్రపంచంలో మూడవ అతిపెద్ద వాహన మార్కెట్ అయిన భారత్ విషయంలో దీర్ఘకాలిక లక్ష్యంతో ఉన్నట్టు టే–జిన్ పార్క్ తెలిపారు. ‘ఇక్కడి వృద్ధి తీరుకు అనుగుణంగా వాటాను పెంచుకోవాలంటే కంపెనీ ప్రస్తుతం ఆఫర్ చేస్తున్న మోడళ్లు సరిపోవు. అందుకే కొత్త కార్లను ప్రవేశపెట్టనున్నాం. కొత్తగా వచ్చే మూడు మోడళ్లు కూడా ప్రపంచవ్యాప్తంగా కియా అభివృద్ధి చేసిన రీక్రియేషనల్ (వినోద) వెహికల్స్. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్ ప్లాంటులో వీటిని అసెంబుల్ చేస్తాం’ అని వివరించారు. పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి ఈ ఏడాది వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 3.5 లక్షల యూనిట్లకు పెంచుకుంటున్నట్టు వెల్లడించారు. ఇది ఏడాదికి 4.3 లక్షల యూనిట్లకు చేరుకోగలదని అన్నారు. డిమాండ్ బలంగా కొనసాగితే అనంతపురం ప్లాంటులో కొత్త లైన్ ఏర్పాటును కియా పరిశీలించవచ్చని పేర్కొన్నారు. మరో 15 ఏళ్లు.. భారత్‌లో 2025 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగవంతం అవుతుందని కంపెనీ అంచనా వేస్తోంది. అయితే యూరప్ మార్కెట్లా కాకుండా ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్‌తో (ఐసీఈ) కూడిన వాహనాలు మరో 10–15 సంవత్సరాల పాటు ఇక్కడ కొనసాగుతాయని పార్క్ అన్నారు. డీజిల్ మోడళ్లు సైతం..: డిమాండ్ కొనసాగుతున్నందున దేశంలో డీజిల్ వాహనాల విక్రయాన్ని కొనసాగిస్తామని కంపెనీ ఎండీ తెలిపారు. ఉద్గార నిబంధనలు కఠినతరం అయితే హైబ్రిడ్, ఇతర సాంకేతికతలను పరిగణిస్తామని వివరించారు. కాగా, కంపెనీ భారత మార్కెట్‌పై దృష్టి సారించడంతో ఎగుమతులు మొత్తం ఉత్పత్తిలో ప్రస్తుతం ఉన్న 25 నుండి 20%కి తగ్గవచ్చని అన్నారు. -
సింగిల్ ఛార్జ్‌కి 501 కిలోమీటర్ల రేంజ్: కియా కొత్త ఎలక్ట్రిక్ కార్
దక్షిణ కొరియాకు చెందిన రెండో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ కియా కొత్త ఎలక్ట్రిక్ కార్‌ను మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఎలక్ట్రిక్ కార్ల విభాగాన్ని విస్తృతం చేయడంలో భాగంగా ఆల్-ఎలక్ట్రిక్ ఈవీ9 ఫ్లాగ్షిప్ ఎస్‌యూవీని విడుదల చేయనున్నట్లు తాజాగా తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో ఈవీ6 ఎస్‌యూవీని 2021లో విడుదల చేసిన కియా కంపెనీకి ఇది రెండో ఎలక్ట్రిక్ కార్. మూడు వరుసల సీటర్ అయిన ఈ ఎస్యూవీ 99.8 కిలోవాట్-హవర్ బ్యాటరీతో వస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్‌తో 501 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ఇందులో ఆల్-వీల్-డ్రైవ్ మోడల్ కూడా అందుబాటులో ఉందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. దక్షిణ కొరియాలో సోమవారం (జూన్ 19) విడుదల కానున్న ఈవీ9 ఎస్యూవీ ధర 73 నుంచి 82 మిలియన్ వాన్లు ( రూ. 46.8 లక్షలు నుంచి రూ.52.5 లక్షలు) ఉంటుంది. తర్వాత విడతలో ఈ ఎస్‌యూవీని యూరప్, యునైటెడ్ స్టేట్, ఇతర మార్కెట్లలో విడుదల చేయాలని కియా కంపెనీ యోచిస్తోందని యాన్హాప్ అనే కొరియన్ వార్తా సంస్థ నివేదించింది. The future of driving isn’t just a technological jump forward. It will incorporate the humanity and user experience of passengers to help people move in a better way. Learn more: https://t.co/mRhnWQ1OEz#KiaEV9 #Kia pic.twitter.com/dHaRcrrxLY — Kia Worldwide (@Kia_Worldwide) June 16, 2023 -
మోహన్ లాల్ బర్త్ డే.. ఖరీదైన కారు కొనిచ్చిన ఫ్రెండ్!
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌కు సర్ప్రైజ్ ఇచ్చాడు అతని ప్రాణ స్నేహితుడు. మే 21న ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఖరీదైన బహుమతి ఇచ్చి అభిమానం చాటుకున్నారు. మోహన్ లాల్‌కు సరికొత్త కియా ఈవీ-6 ఎలక్ట్రిక్ కారును గిప్ట్గా ఇచ్చాడు. ఈ లగ్జరీ ఎస్యూవీ కారు విలువ దాదాపు రూ. 65 లక్షలకు పైగానే ఉంది. సూపర్ స్టార్ తన భార్యతో కలిసి కారు డెలివరీ తీసుకుంటున్న వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. (ఇది చదవండి: టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూత) మోహన్ లాల్ ఆదివారం తన 63 వ పుట్టినరోజును జరుపుకున్నారు. తెలుగులోనూ పలు చిత్రాలో నటించారు. ఆయన తన పుట్టిన రోజును కొంతమంది నిరుపేద పిల్లల సమక్షంలో జరుపుకున్నారు. వారితో కాసేపు సరదా మాట్లాడి కేక్ కట్ చేశారు. అంతే కాకుండా 2019 వరద రెస్క్యూ ఆపరేషన్‌లో ప్రాణాలు కోల్పోయిన కోజికోడ్‌కు చెందిన వ్యక్తికి మోహన్‌లాల్ ఇంటిని కూడా విరాళంగా ఇచ్చారు. (ఇది చదవండి: వెయిటర్‌గా మారిన 'బిచ్చగాడు' హీరో విజయ్ ఆంటోని) కాగా.. మోహన్‌లాల్ ప్రస్తుతం 'మలైకోట్టై వాలిబన్'లో చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి లిజో జోస్ పెల్లిస్సేరీ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో మోహన్ లాల్ రాజస్థాన్‌కు చెందిన రెజ్లర్ పాత్రలో నటిస్తున్నారు. View this post on Instagram A post shared by TOI ETimes Malayalam (@etimesmalayalam) -
టిక్‌టాక్ కార్ థెఫ్ట్ చాలెంజ్: రాజీకి వచ్చిన హ్యూందాయ్, కియా..
హ్యూందాయ్, కియా కంపెనీలకు చెందిన కొన్ని మోడళ్ల కార్లను ఎంత సులువుగా దొంగిలించవచ్చో చూపించారు కొందరు టిక్‌టాకర్లు. ‘టిక్‌టాక్ థెఫ్ట్ ఛాలెంజ్’ పేరుతో అమెరికాలో ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. దీని తర్వాత కార్ దొంగతనం బాధితులు ఈ రెండు కార్ల కంపెనీలపై కోర్టులో 200 మిలియన్ డాలర్లకు ఓ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని పరిష్కరించుకునేందుకు హ్యుందాయ్, కియా కంపెనీలు ఎట్టకేలకు ముందుకు వచ్చాయి. ఈ మేరకు బాధితులతో ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం... దావా పరిష్కారం కోసం దక్షిణ కొరియాకు చెందిన ఈ కార్ల కంపెనీలకు 200 మిలియన్ డాలర్ల వరకు ఖర్చవుతుంది. దీంట్లో అధిక మొత్తం కార్ల దొంగతనం సంబంధిత నష్టాలను భర్తీ చేసేందుకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే బాధితులతో కార్ల కంపెనీలు చేసుకున్న రాజీ ఒప్పందాన్ని ఆమోదించాలా వద్దా అనేది కోర్టు ఇష్టం. ఇదీ చదవండి: కియా, హ్యుందాయ్ కంపెనీలకు షాక్! ఆ కార్లు రీకాల్ చేసేయాలని అభ్యర్థనలు హ్యూందాయ్, కియా కంపెనీల కార్లను సులభంగా దొంగిలించవచ్చని చూపించే వీడియోలు టిక్‌టాక్‌లో వ్యాప్తి చెందడంతో అమెరికాలో గత సంవత్సరం ఆయా కంపెనీలకు చెందిన కార్ల దొంగతనాలు పెరిగాయి. యూఎస్ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (ఎన్హెచ్టీఎస్ఏ) ప్రకారం.. ఛాలెంజ్‌తో ముడిపడి ఉన్న కారు దొంగతనాలు కనీసం 14 క్రాష్‌లు, ఎనిమిది మరణాలకు దారితీశాయి. దొంగతనాలపై సోషల్ మీడియాలో జరిగిన ప్రమోషన్ వల్ల అమెరికాలో ప్రస్తుతం ఉన్న సుమారు 9 మిలియన్ల హ్యుందాయ్, కియా కార్లు ప్రమాదంలో పడ్డాయని ఆయా కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎన్హెచ్టీఎస్ఏ ప్రకారం.. హ్యుందాయ్, కియా కంపెనీలు తమ కార్లలో ఇప్పటికే యాంటీ థెఫ్ట్ సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేశాయి. కార్ ఓనర్లకు పదివేల స్టీరింగ్ వీల్ లాక్‌లను అందించాయి. ఇదీ చదవండి: కారు కొన్న ఆనందం.. డ్యాన్స్ చేసిన కుటుంబం.. ఆనంద్ మహింద్రా స్పందనేంటో తెలుసా? -
కియా, హ్యుందాయ్ కంపెనీలకు షాక్! ఆ కార్లు రీకాల్ చేసేయాలని అభ్యర్థనలు
దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ వాహన తయారీ సంస్థలైన కియా, హ్యుందాయ్ కంపెనీల కార్లను అమెరికా దేశంలో రీకాల్ చేసేయాలని ఆ దేశ ఫెడరల్ ప్రభత్వానికి అభ్యర్థనలు వచ్చాయి. ఎందుకంటే ఆ కార్లను సులువుగా దొంగిలిస్తున్నారట. ‘అసోసియేటెడ్ ప్రెస్’ కథనం ప్రకారం.. అమెరికాలోని 17 రాష్ట్రాల అటార్నీ జనరల్‌లు మిలియన్ల కొద్దీ కియా, హ్యుందాయ్ కార్లను రీకాల్ చేయాలని ఫెడరల్ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఇదీ చదవండి: వాహన ఇన్సూరెన్స్ చేయిస్తున్నారా? వీటితో భలే బెనిఫిట్స్! అమెరికా దేశంలో గత దశాబ్దంలో విక్రయించిన కొన్ని కియా, హ్యుందాయ్ కార్లలో ఇంజిన్ ఇమ్మొబిలైజర్లు లేవు. వీటిని చాలా కార్లలో ప్రామాణిక ఫీచర్‌గా పరిగణిస్తారు. కీ లేకుండా ఇంజిన్‌ను స్టార్ట్ చేయకుండా ఈ ఇంజిన్ ఇమ్మొబిలైజర్లు నిరోధిస్తాయి. కేవలం స్క్రూడ్రైవర్, యూఎస్బీ కేబుల్‌తో కియా, హ్యుందాయ్ కార్లను ఎలా కొట్టేయొచ్చో చూపించే కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో, టిక్‌టాక్‌లో దర్శనమిస్తున్నాయి. లాస్ ఏంజిల్స్‌లో కేవలం హ్యుందాయ్, కియా కార్ల దొంగతనాలు 2022లో దాదాపు 85 శాతం పెరిగాయి. నగరంలో జరిగిన మొత్తం కార్ల దొంగతనాలలో హ్యుందాయ్, కియా కార్ల దొంగతనాలు 20 శాతం ఉన్నాయని కాలిఫోర్నియా అటార్నీ జనరల్ కార్యాలయం తెలిపింది. దొంగిలించిన ఈ కార్లు 14 ప్రమాదాలు, ఎనిమిది మరణాలకు కారణమయ్యాయని నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంటోంది. గత అక్టోబరులో న్యూయార్క్‌లోని బఫెలోలో జరిగిన కారు ప్రమాదంలో నలుగురు టీనేజర్లు చనిపోయారు. టిక్‌టాక్ ఛాలెంజ్‌లో భాగంగా కియా కారును దొంగిలించిన ఆరుగురు యువకులు వేగంగా దూసుకెళ్లి ప్రమాదానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బొంటా, ఇతర అటార్నీ జనరల్‌లు కియా, హ్యుందాయ్ కార్ల దేశవ్యాప్త రీకాల్‌ను అభ్యర్థిస్తూ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్‌కు లేఖ పంపారు. కియా, హ్యుందాయ్ కంపెనీలు తమ అనేక వాహనాలకు ప్రామాణిక భద్రతా ఫీచర్లను కల్పించడంలో విఫలమవడం వల్ల వాహనదారులను, సామాన్య ప్రజలను ప్రమాదంలో పడేశాయని ఆరోపించారు. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! -
కియా ఎలా వచ్చిందో తెలుసుకో లోకేష్ కు తోపుదుర్తి కౌంటర్..
-
Kia EV9: ఒక్క ఛార్జ్‌తో 450 కి.మీ రేంజ్, లాంచ్ ఎప్పుడంటే?
సౌత్ కొరియా వాహన తయారీ సంస్థ కియా మోటార్స్ త్వరలో తన ఆధునిక ఎలక్ట్రిక్ ఎస్యూవీ 'ఈవీ9'ని విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఈ ఎలక్ట్రిక్ కారుకి సంబంధించిన చాలా సమాచారం కొన్ని టీజర్ వీడియోల ద్వారా వెల్లడైంది. నిజానికి ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ గతేడాది జరిగిన 2022 ఆటో ఎక్స్పో వేదిక మీద కనిపించింది. కంపెనీ ఈ కారుని అభివృద్ధి చేయడానికి 44 నెలల సమయం పట్టిందని వెల్లడించింది. మొదటి సారి 2021 లాస్ ఏంజెల్స్ మోటార్ షో కనిపించినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఉత్పత్తికి నోచుకోలేదు. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహన విభాగంలో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న కియా మోటార్స్, ఈ కొత్త మోడల్ విడుదలతో మరిన్ని అద్భుతమైన అమ్మకాలు పొందే అవకాశం ఉన్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఆటో ఎక్స్‌పోలోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ ఎలక్ట్రిక్ వెర్షన్ త్వరలోనే మార్కెట్లో విడుదలవుతుంది. కియా ఈవీ9 మస్క్యులర్ క్లామ్‌షెల్ బానెట్, టైగర్ నోస్ గ్రిల్, ఆల్ ఎల్ఈడీ లైటింగ్ సెటప్, వైడ్ ఎయిర్ డ్యామ్, ఓఆర్వీఎమ్ స్థానంలో కెమెరాలు, సిల్వర్డ్ స్కిడ్ ప్లేట్స్ వంటి వాటిని పొందుతుంది. వెనుక భాగంలో వర్టికల్లీ స్టేక్డ్ టెయిల్‌ల్యాంప్స్, రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్ వంటివి చూడవచ్చు. ఇక ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే, డాష్‌బోర్డ్ చాలా ఆకర్షణీయంగా కనిపించడమే కాకుండా, యోక్ స్టైల్ స్టీరింగ్ వీల్, పనారోమిక్ సన్ రూఫ్, మల్టీ కలర్ యాంబియెంట్ లైటింగ్, మల్టీ జోన్ క్లైమేట్ కంట్రోల్, రెండు పెద్ద స్క్రీన్స్ వంటివి ఇందులో అమర్చబడి ఉంటాయి. కియా ఈవీ9 ఒక సింగిల్ ఛార్జ్‌తో గరిష్టంగా 450కిమీ రేంజ్ అందిస్తుంది సమాచారం, అయితే వాస్తవ ప్రపంచంలో రేంజ్ ఎలా ఉంటుందనేది తెలియాల్సి ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ నెలలో విడుదలవుతుంది. భారతీయ మార్కెట్లో 2024-2025 మధ్యలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
మహానేత వైఎస్సార్‌ను గుర్తుచేసిన అపోలో వైస్ చైర్పర్సన్ ప్రీతా రెడ్డి
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్బంగా పారిశ్రామికవేత్తలు ఏపీలో పారిశ్రామిక అవకాశాలు, భవిష్యత్త్‌లో పెట్టుబడులపై కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా నాఫ్ సీఈవో సుమ్మిత్ బిదానీ మాట్లాడుతూ.. పరిశ్రమల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోంది. ఏపీలో రోడ్, కనెక్టివిటీ, విద్యుత్ సౌకర్యాలు బాగున్నాయి. ఇన్వెస్టర్స్ సదస్సు పారిశ్రామికవేత్తలకు ఎంతో ఉపయోగం అని అన్నారు. టోరో ఇండస్ట్రీస్ ఎండీ మసహిరో యమగూచి మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వ సహకారం మరువలేనిది. పలు కీలక రంగాల్లో వెంటనే అనుమతులు ఇచ్చారు అని అన్నారు. కియా ఇండియా ప్రతినిథి కబ్ డోంగ్ లి మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వ మద్దతు అమోఘం. రాష్ట్రాభివృద్ధికి కియా తన పాత్ర పోషిస్తోంది. అతిపెద్ద సముద్రతీరం ఉన్న రాష్ట్రం ఏపీ. రాష్ట్రంలో వనరులు పుష్కలంగా ఉన్నాయి. ప్రభుత్వ సహకారాలు కియా అభివృద్ధికి దోహదపడుతున్నాయి. ఏపీలో కియా కార్యకలాపాలు సులువుగా సాగిస్తోంది. అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్పర్సన్ ప్రీతారెడ్డి మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ పథకం ఆవిష్కర్త వైఎస్సార్ కృషిని గుర్తు చేశారు. ఆరోగ్య రంగంలో ఏపీ సర్కార్ కృషి అభినందనీయం. ఏపీలో అపోలో కార్యకలాపాలకు పూర్తి సహకారం లభిస్తోంది. ఏపీలో సర్కార్‌తో అపోలో భాగస్వామిగా ఉండటం సంతోషంగా ఉంది. ఆరోగ్యశ్రీ ఇతర దేశాలకు విస్తరించింది అని అన్నారు. శ్రీ సిమెంట్ కంపెనీ ఛైర్మన్ హరిమోహన్ మాట్లాడుతూ.. ఏపీలో నైపుణ్యమైన మనవ వనరులు ఉన్నాయి. సీఎం జగన్ నాయకత్వంలో ఏపీ పరిశ్రమల హబ్‌గా మారింది. రానున్న రోజుల్లో 5వేల కోట్ల పెట్టుబడులతో 5వేల మందికి ఉపాధి కల్పింబోతున్నామని సభా వేదికపైనే స్పష్టం చేశారు. ఏపీ పారిశ్రామికీకరణలో శ్రీ సిమెంట్ తనదైన పాత్ర పోషిస్తుందని అన్నారు. -
సూపర్ ఉంది కార్! విడుదలకు ముందే రోడ్డెక్కిన కియా ఈవీ9
కియా ఈవీ9 కార్ విడుదలకు ముందే రోడ్డెక్కింది. భారత్‌లో ఇటీవల జరిగిన ఆటోఎక్స్‌పో 2023లో ఈ కార్ కాన్సెప్ట్, మోడల్‌ను కియా ప్రదర్శించింది. వచ్చే ఏడాది ఇది విడుదల కావాల్సి ఉంది. అయితే ఉత్పత్తి దశలో ఉన్న ఈ కార్ ఇటీవల రోడ్డుపైకి వచ్చింది. కర్మాగారానికి సమీపంలో రోడ్డుపై కనిపించిన ఈ కార్‌ను ఓ వ్యక్తి రహస్యంగా వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టారు. (ఇదీ చదవండి: టాప్ లగ్జరీ కార్కు షావోమీ డిజిటల్ కీ... షేరింగ్ ఈజీ!) ఇంతకు ముందు ప్రదర్శించిన మోడల్ లాగే ఈ కార్ క్రిస్టల్ బ్లూ కలర్లో ఉంది. అయితే ఇందులో కొన్ని ముఖ్యమైన అప్డేట్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. నిలువు హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడీ డీఆర్ఎల్లు, మోనో-టోన్ అల్లాయ్ వీల్స్, కొత్త ఓఆర్వీఎంలు, వెనుక బంపర్-మౌంటెడ్ నంబర్ ప్లేట్ హోల్డర్ కన్పిస్తున్నాయి. సిగ్నేచర్ టైగర్-నోస్ గ్రిల్, గ్లోసీ బ్లాక్ క్లాడింగ్, కాంట్రాస్ట్-కలర్డ్ స్కిడ్ ప్లేట్లు, ఎల్ఈడీ టైల్లైట్లు, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ వంటివి కాన్సెప్ట్ కార్లో ప్రదర్శించినట్టుగా ఉన్నాయి. (ఇదీ చదవండి: వన్ ప్లస్ 11 కాన్సెప్ట్ ఫోన్ ఫస్ట్ లుక్.. లిక్విడ్ కూలింగ్ ఫీచర్ అదుర్స్!) కియా ఈవీ9 కారుకు ఈ-జీఎంపీ (ఎలక్ట్రిక్ గ్లోబల్ మాడ్యులార్ ప్లాట్‌ఫాం) నిర్మాణాన్ని ఉపయోగిస్తోంది. ఈ కారు సాంకేతిక వివరాలపై కియా పెదవి విప్పడం లేదు. ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ 77.4 కిలో వాట్ల బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. దీనికి కేవలం 20 నిమిషాలలోపు 80 శాతం చార్జ్ అయ్యేలా ఫాస్ట్ చార్జింగ్ సౌకర్యం ఉంటుందని కియా గతంలో తెలిపింది. ఈవీ9 కారును ఒక్కసారి చార్జ్ చేస్తే 540 కిలో మీటర్ల వరకు నడపొచ్చని పేర్కొంది. కొత్త ఈవీ9 కారు 2024లో విడుదల కానుంది. అయితే ఇది భారత్‌లో కూడా లాంచ్ అవుతుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా ఉంది. View this post on Instagram A post shared by CocheSpias (@cochespias1) -
తగ్గేదేలే అంటున్న కార్ల అమ్మకాలు.. తొలి నెలలోనే అదరగొట్టారు
ముంబై: కొత్త క్యాలండర్ ఏడాది(2023) తొలి నెలలో కార్ల అమ్మకాలు జోరందుకున్నాయి. దిగ్గజాలు మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, ఎంఅండ్ఎం, టీకేఎం, కియా ఇండియా, హ్యుందాయ్ జనవరిలో పటిష్ట విక్రయాలను సాధించాయి. అయితే ఎంజీ మోటార్, హోండా మాత్రం వాహన విక్రయాలలో వెనకడుగు వేశాయి. మారుతీ 12 శాతం అధికంగా 1,72,535 వాహనాలను విక్రయించగా.. ఎంఅండ్ఎం 37 శాతం వృద్ధితో 64,335 వాహనాలను అమ్మింది. ఈ బాటలో టాటా మోటార్స్ అమ్మకాలు సైతం 6 శాతం పుంజుకుని 81,069 వాహనాలకు చేరాయి. టయోటా కిర్లోస్కర్ మోటార్(టీకేఎం) అమ్మకాలు 175 శాతం జంప్‌చేసి 12,835 యూనిట్లను తాకాయి. కియా ఇండియా అమ్మకాలు 48 శాతం మెరుగుపడి 28,634 యూనిట్లకు చేరగా.. హ్యుండాయ్ మోటార్ ఇండియా 17 శాతం అధికంగా 62,276 వాహనాలను విక్రయించింది. చదవండి: Union Budget 2023-24: పెరిగేవి, తగ్గేవి ఇవే! -
అట్టహాసంగా ఆటో ఎక్స్పో-2023, కళ్లు చెదిరే ఈవీల హవా (ఫొటోలు)
-
ఆటో ఎక్స్పో 2023: కియా కేఏ4 ఆవిష్కారం, వేల కోట్ల పెట్టుబడులు
సాక్షి,ముంబై: దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కార్ల తయారీదారులలో ఒకటైన కియా ఇండియా ఆటో ఎక్స్పో 2023లో తన ప్రత్యేకతను చాటుకుంటోంది. కాన్సెప్ట్ EV9 SUV , KA4 కార్లను ఆవిష్కరించింది.అంతేకాదు ఇండియాలో రానున్న 4-5 సంవత్సరాలలో రూ. 2,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఆర్ అండ్ డీ సెంటర్, 2025లో మేడిన్ ఇండియా ఈవీనీ లాంచింగ్‌లో ఈ పెట్టుబడి సహాయపడుతుందని కియా పేర్కొంది. కియా ఇండియా తన ఆల్-ఎలక్ట్రిక్ SUV కాన్సెప్ట్ - కియా కాన్సెప్ట్ ఈవీ9, కొత్త కేఏ4లను జనవరి 11న ప్రారంభమైన ఆటో ఎక్స్పో 16వ ఎడిషన్‌లో లాంచ్ చేసింది. KA4 లాంచ్‌తో, కంపెనీ MPV సెగ్మెంట్లో బలమైన పట్టు సాధించాలని చూస్తోంది. ఈ 4వ జనరేషన్ కార్నివాల్ ఎంపీవీ ఈ ఏడాది చివర్లో భారతదేశంలో విడుదలయ్యే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో కేఏ4 3 ఇంజన్ ఎంపికలతో రానుంది. వీటిలో 3.5-లీటర్ GDi V6 పెట్రోల్, 3.5-లీటర్ MPi V6 పెట్రోల్ , 2.2-లీటర్ డీజిల్ ఇంజన్ ఉన్నాయి. 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అన్ని వేరియంట్లలో ప్రామాణికంగా లభ్యంకానుంది. 3 లేదా 4 వరుసల సీటింగ్ కాన్ఫిగ రేషన్లతో, గరిష్టంగా 11 మంది ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తుందట. 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, అలాగే డ్యాష్ బోర్డ్‌లోని టచ్-సెన్సిటివ్ బటన్స్ ద్వారా ఇన్ఫోటైన్మెంట్, క్లైమేట్ కంట్రోల్ ఫంక్షన్లను నియంత్రించే ఫీచర్లు ప్రధాన ఆకర్షణగా ఉండనున్నాయి. కాగా మూడు సంవత్సరాల కోవిడ్ అనంతరం జరుగుతున్న మొదటి ఆటో ఎక్స్‌పోలో ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. వివిధ విభాగాల నుండి 45 వాహన తయారీదారులతో సహా 70 మంది ఎగ్జిబిటర్లు పాల్గొంటారు.కియా ఇండియా 2023లో 220 నగరాలకు విస్తరించాలని , 2024 నాటికి 100 ప్లస్ అవుట్లెట్లకు చేరుకోవాలని యోచిస్తోంది. -
71 వేల కార్స్ ను రీకాల్ చేసిన కియా ..
-
71 వేల కియా కార్ల రీకాల్.. ఎందుకో తెలుసా?
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కియా తన సంస్థకు చెందిన 71వేల కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా కేంద్రంగా కియా కార్లలో వరుస అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో కార్లలో లోపాల్ని పరిశీలిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. సౌత్ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా 2008 -2009కి చెందిన 71వేల స్పోర్టేజ్ కార్లను రీకాల్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కారులో ఉన్న యాంటీ లాక్ బ్రేక్ సిస్టం (ఏబీఎస్)లోని హైడ్రాలిక్ కంట్రోల్ యూనిట్‌లోని లోపాల కారణంగా అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో కార్లలోని లోపాల్ని సరి చేసేందుకు సిద్ధమైనట్లు కియా వెల్లడించింది. 2017 నుంచి కియా 2017 నుంచి తన 8 స్పోర్టేజ్ స్పోర్ట్ యుటిలిటి వెహికల్స్ (ఎస్యూవీ)లో అగ్నిప్రమాదాలు చోటు చేసుకోవడం, 15 రకాల మెల్టింగ్, డ్యామేజ్లాంటి ప్రమాదాలు గుర్తించింది. 2016 నుంచి ఆ వెహికల్స్‌లోని లోపాల్ని సరిచేయడం ప్రారంభించింది. దూరంగా పార్కింగ్ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (ఎన్హెచ్టీఎస్ఏ) తో కియా దాఖలు చేసిన ప్రకారం , రీకాల్ పూర్తయ్యే వరకు యజమానులు నిర్మాణాలు లేదా ఇతర వాహనాలకు వెలుపల, దూరంగా పార్క్ చేయాలని కియా,ఎన్హెచ్టీఎస్ఏ సమావేశంలో ఈ సమస్యల పరిష్కార మార్గంగా చర్చించాయి. -
మరోసారి, కార్ల ధరల్ని భారీగా పెంచిన కియా!
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కియా కార్ల ధరల్ని భారీగా పెంచింది. సోనెట్ కాంపాక్ట్ ఎస్యూవీ కార్ల ధరల్ని ఒకే సారి రూ.34వేలు పెంచింది. ఈ ఏడాది క్యూ1 ఫలితాల సందర్భంగా జనవరిలో కార్ల ధరల్ని పెంచిన కియా ఇప్పుడు మరోసారి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కియా సోనెట్ సిరీస్‌లో హెచ్‌టీఈ,హెచ్టీకే, హెచ్టీకే ప్లస్, హెచ్‌టీఎక్స్, హెచ్‌టీఎక్స్ ప్లస్,జీటీఎక్స్ప్లస్తో పాటు ఇతర యానివర్సరీ ఎడిషన్ వేరియంట్లు ఉన్నాయి. వీటిలో హెచ్‌టీఈ 1.2 పెట్రోల్ వేరియంట్ కార్ల ధరల్ని అత్యధికంగా రూ.34వేలకు పెంచింది. ఇతర వేరియంట్లపై రూ.10వేలు, రూ.16వేల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. కార్లలో అదిరిపోయే ఫీచర్లు కియా ఇండియా మై2022పేరుతో సోనెట్ వెర్షన్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది. ఈ కార్లలో సైడ్ ఎయిర్ బ్యాగ్స్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టం, బ్రేక్ అసిస్ట్, హిల్ అసిస్ట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్స్ స్టేబులిటీ కంట్రోల్ ఫీచర్లను అప్డేట్ చేసింది. ఇంపీరియల్ బ్లూ, స్పార్క్లింగ్ సిల్విర్ కలర్ ఆప్షన్‌తో న్యూ బ్రాండ్ లోగోను ఆవిష్కరించింది. ఇక ఈ కియా సోనెట్‌లో మొత్తం మూడు ఇంజిన్లు ఉన్నాయి. వాటిలో ఒకటి 1.2లీటర్ల నేచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్, 1.0లిటర్ల టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ సౌకర్యం ఉండగా.. ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్, సిక్స్ స్పీడ్ ఐఎంటీ, సిక్స్ స్పీడ్ మ్యాన్యువల్, సిక్స్ స్పీడ్ ఆటోమెటిక్ వంటి గేర్ బాక్స్ ఆప్షన్స్ ఉన్నాయి. -
అమ్మకాల్లో బీభత్సం సృష్టిస్తున్న కారు.. కేవలం రెండేళ్లలోనే..
కొరియన్ కార్ల తయారీ కంపెనీ ఇండియా మార్కెట్లో పాతుకు పోతుంది. ఒకదాని తర్వాత ఒకటిగా ఆ కంపెనీ నుంచి వస్తున్న కార్లు ఇక్కడి కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే సెల్టోస్ ఇక్కడ సక్సెస్ఫుల్ మోడల్‌గా పేరు తెచ్చుకుంది. సెల్టోస్ బాటలోనే పయణిస్తోంది సోనెట్ మోడల్. కరోనా కష్టకాలం తర్వాత ఇండియాలో కార్ల అమ్మకాలు మందగించాయి. ఏళ్ల తరబడి మార్కెట్లో ఉన్న కంపెనీల నుంచి రిలీజ్ అవుతున్న కార్లు కూడా కిందా మీదా అవుతున్నాయి. కానీ కియా నుంచి వచ్చిన సోనెట్ మోడల్ అమ్మకాల్లో ఒక్కో రికార్డు బ్రేక్ చేస్తూ శరవేగంగా దూసుకెళ్తోంది. కియా సంస్థ 2020 సెప్టెంబరులో సొనెట్ మోడల్‌ను ఇండియాలో రిలీజ్ చేసింది. రెండేళ్లు కూడా పూర్తి కాకముందే క్లిష్ట పరిస్థితుల నడుమ ఇండియాలో లక్షన్నర యూనిట్ల అమ్మకం రికార్డును సోనెట్ క్రాస్ చేసింది. కియో మొత్తం అమ్మకాల్లో కేవలం సోనెట్ వాటాయే 26 శాతానికి చేరుకుంది. అంతేకాదు కాంపాక్ట్ ఎస్యూవీ కేటగిరిలో సోనెట్ వాటా 15 శాతంగా ఉంది. కాంపాక్ట్ ఎస్యూవీ కేటగిరిలో సోనెట్ పవర్ ప్యాక్డ్ మోడల్‌గా నిలుస్తోంది. అధునాత ఇన్ఫోంటైన్మెంట్ సిస్టమ్, 16 ఇంచ్ ఎల్లాయ్ వీల్స్, మల్టీపుల్ ఎయిర్‌బ్యాగ్స్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, ఆండ్రాయిడ్/యాపిల్ కనెక్టివిటీ, ఏబీఎస్ విత్ ఈబీడీ వంటి ఫీచర్లు ఉన్నాయి. హైఎండ్ మోడల్ వేరియంట్ ధర రూ.16.88 లక్షలుగా ఉంది. చదవండి: గ్లోబల్ డ్రీమ్ క్రూయిజ్ షిప్.. టైటానిక్ కంటే దారుణంగా.. -
కియా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది, సింగిల్ ఛార్జ్‌తో 520 కి. మీ దూసుకెళ్తుంది!
న్యూఢిల్లీ: వాహనాల తయారీ సంస్థ కియా ఇండియా తాజాగా దేశీ ఎలక్ట్రిక్ కార్ల (ఈవీ) మార్కెట్లోకి ప్రవేశించింది. ఈవీ6 కారును ఆవిష్కరించింది. రెండు వేరియంట్స్‌లో ఇది లభిస్తుంది. ధర శ్రేణి రూ. 59.95 లక్షలు – రూ. 64.95 లక్షలుగా (ఎక్స్ షోరూం) ఉంటుంది. 12 నగరాల్లోని 15 డీలర్‌షిప్‌ల ద్వారా దీన్ని విక్రయించనున్నారు. డీలర్‌షిప్‌లలో 150 కిలోవాట్ల ఫాస్ట్ చార్జర్లు కూడా ఉంటాయి. ఈవీ6 మోడల్ కోసం ఇప్పటికే 355 పైచిలుకు బుకింగ్స్ వచ్చినట్లు కియా ఇండియా ఎండీ టే–జిన్ పార్క్ తెలిపారు. ఒకసారి చార్జి చేస్తే ఈ వాహనం 528 కి.మీ. వరకూ ప్రయాణించగలదు. 350 కేడబ్ల్యూహెచ్ (కిలోవాట్ పర్ అవర్) చార్జర్‌తో 18 నిమిషాల్లోనే 10 శాతం నుండి 80 శాతం మేర చార్జ్ కాగలదని పార్క్ వివరించారు. వేరియంట్‌ను బట్టి ఆల్–వీల్ డ్రైవ్, సన్‌రూఫ్, మల్టిపుల్ డ్రైవ్ మోడ్లు మొదలైన ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల విభాగంపై మరింతగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు టే–జిన్ పార్క్ తెలిపారు. వచ్చే ఐదేళ్లలో వ్యాపార కార్యకలాపాలపై 22.22 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ మాతృసంస్థ కియా కార్పొరేషన్ ఇప్పటికే ప్రకటించింది. భారత్‌లో ఇన్ఫ్రా ఏర్పాటుకు, స్థానికంగా అనువైన ఉత్పత్తులను తయారు చేసేందుకు ఇందులో కొంత భాగాన్ని వినియోగించనున్నట్లు పార్క్ తెలిపారు. ప్రత్యేకంగా భారత మార్కెట్ కోసమే తయారు చేసిన బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాన్ని (బీఈవీ) 2025 నాటికి ప్రవేశపెట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. చార్జింగ్ ఇన్ఫ్రా కీలకం.. ఈవీల వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటోందని పార్క్ పేర్కొన్నారు. అయితే, దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాలు మరింత ప్రాచుర్యంలోకి రావాలంటే చార్జింగ్ మౌలిక సదుపాయాలు మెరుగుపడటం, వ్యక్తిగత వాహనాలకు ప్రభుత్వం మరిన్ని ప్రోత్సాహకాలు అందించడం వంటి చర్యలు తోడ్పడగలవని అభిప్రాయపడ్డారు. స్థానికంగా బ్యాటరీ సెల్ తయారీ ప్రారంభమైతే ఈవీలకు మరింత ఊతం లభించగలదన్నారు. సానుకూల ప్రభుత్వ విధానాలు, వినియోగదారుల ఆలోచనా ధోరణుల్లో మార్పులు తదితర అంశాల తోడ్పాటుతో 2025 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం భారీగా పెరగవచ్చని పార్క్ తెలిపారు. -
భారత్‌లో తొలి కియా ఎలక్ట్రిక్ కార్, స్టైలిష్ లుక్‌తో రెడీ ఫర్ రైడ్!
కియా మోటార్స్‌కు చెందిన తొలి ఎలక్ట్రిక్ కార్ భారత్ మార్కెట్లో హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే కియా ఎంయూవీ, కియా కార్నివాల్ పాటు కాంపక్ట్ ఎస్యూవీ, సోనెట్ వెహికల్స్ కొనుగోలు దారుల్ని ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో తొలి ఎలక్ట్రిక్ కారును భారత్‌లో తయారు చేసింది. తాజాగా కారు టెస్ట్ డ్రైవ్ నిర్వహించగా..ఎలక్ట్రిక్ కార్కు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో చక్కెర్లు కొడుతున్నాయి. కియా ఈవీ6 పేరుతో విడుదల కానున్న ఎలక్ట్రిక్ కార్ బాడీ స్టైల్ హ్యాచ్ బ్యాక్‌తో వస్తుండగా..స్టైలింగ్‌లో ఎస్‌యూవీని పోలి ఉంటుంది. కారు ముందు భాగంలో క్లామ్‌షెల్ బానెట్, స్లిమ్ గ్రిల్స్ ఉన్నాయి. కార్ వెనుక లైట్ బార్ టెయిల్ లైట్లు,పెద్ద అల్లాయ్ రిమ్‌లు, రేక్డ్ ఫ్లోటింగ్ రూఫ్‌లైన్, వీల్ ఆర్చ్‌ల బాడీ క్లాడింగ్‌తో క్రాస్ఓవర్ డిజైన్ లుక్స్ అదరగొట్టేస్తున్నాయి. ఈ కారు 4695 ఎంఎం పొడవు, 1890ఎంఎం వెడల్పు,1545 ఎంఎం ఎత్తుతో వీల్‌బేస్ 2900 ఎంఎంగా ఉంటుంది. ఐదు వేరియంట్లు.. కియా మొత్తం ఐదు వేరియంట్లలో ఈవీ6ని అందిస్తోంది. మొదటిది 58 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ తో వస్తుండగా..వెనుక చక్రాలకు 170హెచ్‌పీ (హార్స్పవర్)తో సపోర్ట్ చేస్తుంది. అదే బ్యాటరీ ప్యాక్ నాలుగు చక్రాలకు 235హెచ్‌పిని పంపే డ్యూయల్ మోటార్ సెటప్‌కు ఉపయోగించవచ్చు. అందుకోసం అదనంగా పెద్ద 77.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఈ పవర్ ప్యాక్ 229హెచ్‌పీ ఉత్పత్తి చేసే ఆర్డబ్ల్యూడీ కాన్ఫిగరేషన్‌లో లేదా 325 హార్స్ పవర్ ను ఉత్పత్తి చేసే డ్యూయల్-మోటార్ ఏడబ్ల్యూడీ కాన్ఫిగరేషన్‌లో ఒకే మోటారుకు జత చేయబడుతుంది. చివరగా,జీటీ వేరియంట్ రెండు మోటార్లతో పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగిస్తుంది. దాని ఏడబ్ల్యూడీ వేరియంట్లో గరిష్టంగా 585హార్స్ పవర్, 740 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఛార్జింగ్ విషయానికొస్తే.. ఛార్జింగ్ విషయానికొస్తే, ఈవీ6 800 వోల్ట్ వేగవంతమైన ఛార్జింగ్ సిస్టమ్‌తో వస్తుంది. ఇది కేవలం 18 నిమిషాల్లో 10 శాతం నుండి 80 శాతానికి ఛార్జ్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. వాస్తవానికి, ఇది 11 గంటల్లో పూర్తి ఛార్జింగ్ ఎక్కేలా 7కేడబ్ల్యూ ఛార్జింగ్ సిస్టమ్‌తో వస్తుంది. ఇక కారు లోపల డిజైన్ మరింత ఆసక్తికరంగా ఉంటుంది. పనోరమిక్ టచ్‌స్క్రీన్ సిస్టమ్‌తో స్లిమ్ డ్యాష్‌బోర్డ్, స్క్రీన్‌లో రెండు డిస్ప్లేలు,ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే, డ్రైవర్ వైపు కొద్దిగా పివోట్ చేయబడింది. మరొకటి స్టీరింగ్ వీల్ వెనుక ఉంటుంది. స్టీరింగ్ వీల్ టూ స్పోక్ డిజైన్. ఇది మీరు సాధారణంగా టాప్ ఎండ్ కారులో చూసే అన్ని బటన్లను కలిగి ఉంటుంది. క్లైమేట్ కంట్రోల్ బటన్లు, ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ కింద డిజైన్ చేశారు. సెంటర్ కన్సోల్ గేర్ సెలెక్టర్‌గా పనిచేసే రోటరీ నాబ్, స్టార్ట్/స్టాప్ బటన్‌ను కలిగి ఉంటుంది. ఇది సంవత్సరంలో విడుదలయ్యే ఈ కారు ధర దాదాపు రూ. 60 లక్షలగా ఉంది. అయితే ఇటీవలే ప్రారంభించబడిన వోల్వో ఎక్స్‌సీ 40 రీఛార్జ్‌కు మినహా కియా ఈవీ6 పోటీ పెద్దగా లేదు. అయితే, హ్యుందాయ్ తన ఐనోకి5 దేశీయ మార్కెట్లో విడుదల తర్వాత కియా తొలి ఎలక్ట్రిక్ కారుకు పోటీ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంటుంది. చదవండి: అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కొత్త ఎలక్ట్రిక్ కార్..రేంజ్ దుమ్ము దులిపేస్తుంది! -
హాట్‌కేకుల్లా బుక్కైన కియా నయా కార్..! ఏకంగా 50 వేలకు పైగా..కేవలం..
దక్షిణ కొరియన్ ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్ భారత్‌లో రికార్డులు క్రియేట్ చేస్తూ అమ్మకాల్లో దూసుకుపోతుంది. భారత మార్కెట్లలో సరికొత్త మోడల్స్‌తో అదరగొడుతోంది.గత నెలలో కియా భారత్‌లోకి కియా ఎంపీవీ వెహికిల్ కియా కారెన్స్‌ను లాంచ్ చేసింది.జనవరి 14, 2022న కియా కారెన్స్ బుకింగ్స్ అధికారికంగా ప్రారంభమవ్వగా.. కేవలం రెండు నెలల్లోనే 50,000 బుకింగ్‌లను దాటినట్లు కియా ఇండియా ప్రకటించింది. ఈ బుకింగ్స్‌లో ఎక్కువగా టైర్-1, టైర్-2 నగరాల్లోనే 60 శాతం పైగా బుకింగ్స్ జరిగాయి. దేశ వ్యాప్తంగా లగ్జరీ కార్లను కొనేవారిలో 45 శాతం మంది కియా కారెన్స్ తొలి ఎంపికగా నిలుస్తోందని కంపెనీ ప్రకటించింది. సమానంగా డిమాండ్..! కియా కారెన్స్ పెట్రోల్, డీజిల్ రెండు వేరియంట్లకూ డిమాండ్ సమానంగా ఉందని కియా ఇండియా తెలియజేసింది. దాదాపు 50 శాతం మంది వినియోగదారులు డీజిల్ వేరియంట్లను బుక్ చేసుకున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉంటే, కియా కారెన్స్ ఆటోమేటిక్ వేరియంట్ కేవలం 30% మంది కస్టమర్లను మాత్రమే ఆకర్షించగలిగింది. కారెన్స్ మాన్యువల్ ట్రిమ్‌ల వేరియంట్స్ ఎక్కువ బుకింగ్స్ నమోదయ్యాయి. ఫిబ్రవరిలో, కియా ఇండియా ప్రారంభించిన 13 రోజుల్లోనే 5,300 కారెన్స్ కార్లను విక్రయించింది. కియా కారెన్స్ కేవలం రెండు నెలల కంటే తక్కువ సమయంలో అద్భుతమైన మైలురాయి సాధించడంపై కియా ఇండియా చీఫ్ సేల్స్ ఆఫీసర్ మ్యుంగ్-సిక్ సోహ్న్ మాట్లాడుతూ..‘ఫ్యామిలీ మూవర్ కార్ల సెగ్మెంట్లో మునుపెన్నడూ లేని విధంగా కియా కారెన్స్ రికార్డు సృష్టించింది. ఇది మా ఇతర ఎస్‌యూవీల వలే అతి తక్కువ కాలంలోనే భారీ బుకింగ్స్‌ను సాధించింది. కస్టమర్లు మా ఉత్పత్తుల మీద పెట్టుకున్న నమ్మకానికి ధన్యవాదాలు తెలిపారు. ఇంజిన్ విషయానికి వస్తే..! కియా కరెన్స్ 1.5-లీటర్ CRDi డీజిల్ ఇంజిన్ లేదా 1.4-లీటర్ GDi టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో రానుంది. ఈ రెండు వేరియంట్లలో ఆరు-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ప్రామాణికంగా ఉంది. డీజిల్ పవర్‌ట్రెయిన్‌తో 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్, టర్బో పెట్రోల్‌తో 7-స్పీడ్ DCT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను కొనుగోలుదారులు ఎంపిక చేసుకోవచ్చును. ధర ఎంతంటే..! కియా కరెన్స్‌ను కంపెనీ అధికారిక వెబ్సైట్ నుంచి ప్రి-బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. ఈ కారు ధర రూ. 8.99 లక్షల నుంచి రూ. 16.99 లక్షల వరకు ఉంది. ఈ కారు మొత్తం ప్రీమియం, ప్రెస్టిజ్, ప్రేస్టిజ్ప్లస్, లగ్జరీ, లగ్జరీ ప్లస్ అనే ఐదు రకాల వేరియంట్లలో రానుంది. చదవండి: వైరస్,బ్యాక్టిరియా ప్రూఫ్ ప్రొటెక్షన్‌తో కియా నుంచి అదిరిపోయే కారు లాంచ్..! -
KIA: తగ్గేదేలే ! జెడీ పవర్ స్టడీలో అరుదైన ఫీట్!
ఇండియన్ మార్కెట్లో జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది కియా. కియా నుంచి వచ్చే కార్లు హాట్‌కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. అయితే అమ్మకాల్లోనే కాదు మన్నికలోనూ తగ్గేదేలే అంటోంది. తాజాగా జేడీ పవర్ స్టడీలో అంతర్జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఆటోమొబైల్ ఇండస్ట్రీకి సంబంధించి రెగ్యులర్‌గా అనేక సర్వేలు జరుగుతుంటాయి. వీటిలో చాలా సర్వేలు టెక్నికల్ అంశాలతో ముడిపడి ఉంటాయి. వీటికి కొంత భిన్నంగా మూడేళ్లకు పైగా వాహనాలు వాడిన యజమానుల అభిప్రాయాలను సేకరించి క్రోడీకరించడం జేడీ పవర్ సర్వే ప్రత్యేకత. రిపేర్లు, కాంపోనెంట్స్ రిప్లేస్మెంట్, సాఫ్ట్వేర్ అప్డేట్స్, వెహికల్ అప్పీల్ తదితర అంశాలపై యజమానుల నుంచి వివరాలు సేకరిస్తుంది. తాజాగా చేపట్టిన సర్వేలో ప్రపంచ వ్యాప్తంగా మెయిన్‌స్ట్రీమ్, లగ్జరీ విభాగంలో 31 కంపెనీల కార్లకు పరిగణలోకి తీసుకుని సర్వే చేపట్టారు. ఈ సర్వేలో కియాకు చెందిన అప్పర్ మిడ్‌రేంజ్ ఎస్యూవీ సొరెంటో నంబర్ వన్‌గా నిలిచింది. ఈ కారుని జార్జియాలోని కియా ప్లాంటులో తయారు చేస్తున్నారు. జేడీ పవర్ సర్వేలో నంబర్ వన్ స్థానం దక్కించుకున్న కియా సొరెంటే ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్లో అందుబాటులో లేదు. త్వరలో మార్కెట్లో ప్రవేశపెట్టబోతున్న ఈ కారు ధర రూ. 25 లక్షల దగ్గర ఉండవచ్చని మార్కెట్ వర్గాల అంచనా. చదవండి: Kia India-AP: కియా అనంత ప్లాంట్ కొత్త రికార్డ్ -
కియా ఇండియా కీలక నిర్ణయం..ఆ మోడల్స్ పూర్తిగా నిలిపివేత..!
సౌత్ కొరియన్ ఆటోమొబైల్ దిగ్గజం కియా ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీకి చెందిన పలు కార్ల వేరియంట్లను భారత్‌లో నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆ వేరియంట్స్ కనిపించవ్...! ఇండియాలో ప్రజాదరణ పొందిన సెల్టోస్ SUV, కార్నివాల్ MPV కార్లకు చెందిన పలు వేరియంట్లను భారతదేశంలో నిలిపివేయాలని కియా నిర్ణయించుకుంది. సెల్టోస్ SUV రేంజ్ లోని మిడ్-రేంజ్ HTK+ డీజిల్-ఆటోమేటిక్ ట్రిమ్, ఏడు సీట్ల ప్రీమియం MPV కార్నివాల్ బేస్ వేరియంట్‌ను కంపెనీ ఉపసంహరించుకుందని ఒక ప్రకటనలో తెలిపింది. కాగా ఈ నిర్ణయం వెనుక నిర్దిష్ట కారణాలను కియా ఇండియా వెల్లడించలేదు. తక్కువ డిమాండ్... ఇండియాలో ఆయా వెరియంట్లకు తక్కువ డిమాండ్ ఉన్నందున కంపెనీ ఉపసంహరించుకోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ కార్ల కోసం డీలర్ల నుంచి బుకింగ్‌లు తీసుకోవడానికి కియా ఇండియా నిరాకరించినట్లుగా తెలుస్తోంది. వాటి బదులుగా.. కియా సెల్టోస్ HTK+ డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ.14.25 లక్షలు (ఎక్స్-షోరూమ్). కియా కార్నివాల్ బేస్ వేరియంట్ డీజిల్ ఆటోమేటిక్ రూ. 25.49 లక్షలకు (ఎక్స్-షోరూమ్) అందుబాటులో ఉంది. కాగా సెల్టోస్ డీజిల్ ఆటోమేటిక్ని కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు ఇప్పుడు GTX+ ఆటోమేటిక్ వేరియంట్‌ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది., దీని ధర రూ.17.95 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది HTK+ వేరియంట్ కంటే రూ. 3.7 లక్షలు ఎక్కువ. కార్నివాల్ MPV కొత్త బేస్ వేరియంట్ ఇప్పుడు ప్రెస్టీజ్ ట్రిమ్ సెవెన్-సీటర్ యూనిట్, దీని ధర రూ. 29.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది HTK+ డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్ల కంటే రూ.4.5 లక్షలు ఎక్కువ. -
వైరస్,బ్యాక్టిరియా ప్రూఫ్ ప్రొటెక్షన్‌తో కియా నుంచి అదిరిపోయే కారు లాంచ్..!
దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్ భారత మార్కెట్లలోకి సెవెన్-సీటర్ యుటిలిటీ వెహికల్ (ఎంపీవీ) కియా కరెన్స్‌ను లాంచ్ చేసింది. సెల్టోస్, కార్నివాల్, సోనెట్ తర్వాత భారతదేశ లైనప్‌లో కియాకు చెందిన నాల్గో వాహనంగా కరెన్స్ నిలవనుంది. ఈ వాహనం ఆంధ్రప్రదేశ్‌లోని కియా ప్లాంట్‌లో తయారుకానుంది. ఇక్కడి నుంచే ప్రపంచవ్యాప్తంగా కియా కరెన్స్ సప్లై కానున్నట్లు తెలుస్తోంది. డిజైన్ విషయానికి వస్తే..! కియా సెల్టోస్ మాదిరిగా కాకుండా, కియా కరెన్స్ సొగసైన గ్రిల్ డిజైన్, ఎల్ఈడీ డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్‌తో రానుంది. బోల్డ్ డిజైన్, హై-టెక్ ఫీచర్లు, ఇండస్ట్రీ-లీడింగ్ సేఫ్టీ సిస్టమ్స్‌తో కొత్త సెగ్మెంట్, ఇండస్ట్రీ బెంచ్ మార్క్‌గా కియా కరెన్స్ నిలవనుంది. ఎంపీవీ వెనుక భాగంలో టీ-ఆకారంలో ర్యాప్ రౌండ్ ఎల్ఈడీ క్లస్టర్స్‌ను కల్గి ఉంది. అంతేకాకుండా చిసెల్డ్ ఫ్రంట్ బంపర్, క్రోమ్ ఇన్సర్ట్లు, ఫాక్స్ స్కిడ్ ప్లేట్ , ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు కూడా ఉన్నాయి. ఇంటీరియర్స్‌లో క్రేజీ లుక్స్‌తో..! కియా కరెన్స్ ఇంటీరియర్స్ హై ఎండ్ డిజైన్‌ను పొందనుంది. ఈ కారులో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 12.5-అంగుళాల డిజటల్ క్లస్టర్, ఆపిల్ కార్ప్లే , ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్, యాంబియంట్ లైటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, 8 స్పీకర్ల బాస్ సౌండ్ సిస్టమ్ 360-డిగ్రీ కెమెరాలు అమర్చారు. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీతో కూడిన ఏబీఎస్, ఈఎస్ఈ, హిల్-స్టార్ట్ అసిస్ట్, ఫ్రంట్ , రియర్ పార్కింగ్ సెన్సార్ల ద్వారా కారులో ప్రయాణించే వారికి మరింత భద్రతను కరెన్స్ అందిస్తోంది. సెఫ్టీ విషయంలో రాజీ లేకుండా..! కియా కరెన్స్ కారులో భద్రత విషయంలో ఎక్కడ తగ్గకుండా పలు జాగ్రత్తలను కియా తీసుకుంది. సిక్స్ ఎయిర్‌బ్యాగ్స్, ఆల్ ఫోర్ డిస్క్ బ్రేక్, ఎలక్ట్రానిక్ స్టాబిలిటీ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్, రోల్ఓవర్ మిటిగేషన్, హిల్ అసిస్ట్ వంటి డ్రైవర్ అసిస్ట్ ఫీచర్స్‌తో రానుంది. జియోఫెన్సింగ్, లైవ్ వెహికిల్ స్టాటస్ అండ్ ట్రాకింగ్, క్లైమట్ కంట్రోల్ ఆపరేషన్‌తో రానుంది. దాంతోపాటుగా స్మార్ట్ ప్యూర్ ఎయిర్ ఫ్యూరిఫైయర్ సిస్టమ్‌ను కల్గి ఉంది. దీని సహాయంతో వైరస్, బాక్టీరియా నుంచి ప్రయాణికులను కాపాడుతుంది. ఇంజిన్ విషయానికి వస్తే..! కియా కరెన్స్ 1.5-లీటర్ CRDi డీజిల్ ఇంజిన్ లేదా 1.4-లీటర్ GDi టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో రానుంది. ఈ రెండు వేరియంట్లలో ఆరు-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ప్రామాణికంగా ఉంది. డీజిల్ పవర్‌ట్రెయిన్‌తో 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్, టర్బో పెట్రోల్‌తో 7-స్పీడ్ DCT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను కొనుగోలుదారులు ఎంపిక చేసుకోవచ్చును. వీటికి గట్టిపోటీ..! కియా మోటార్స్ ఆవిష్కరించిన కియా కరెన్స్ కొత్త వాహనం పలు దిగ్గజం కంపెనీల ఎస్‌యూవీలతో పోటీ పడనుంది. హ్యుందాయ్ అల్కాజార్, మారుతి ఎర్టిగా, ఎంజీ హెక్టర్ ప్లస్, మహీంద్రా మరాజో, మహీంద్రా XUV700 వంటి వాటితో సెవెన్-సీటర్ కరెన్స్ పోటీపడే అవకాశం ఉంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే...కియా కరెన్స్ సెగ్మెంట్లో పొడవైన వీల్‌బేస్‌ను కలిగి ఉంది. ఈ వాహనం సిక్స్-సీటర్, సెవెన్-సీటర్ వేరియంట్లలో కూడా లభ్యం కానుంది. ధర ఎంతంటే..! కియా కరెన్స్‌ను కంపెనీ అధికారిక వెబ్సైట్ నుంచి ప్రి-బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. ఈ కారు ధర రూ. 8.99 లక్షల నుంచి రూ. 16.99 లక్షల వరకు ఉంది. ఈ కారు మొత్తం ప్రీమియం, ప్రెస్టిజ్, ప్రేస్టిజ్ప్లస్, లగ్జరీ, లగ్జరీ ప్లస్ అనే ఐదు రకాల వేరియంట్లలో రానుంది. చదవండి: హోండా బంపరాఫర్..! ఆ బైక్‌పై ఏకంగా రూ. లక్ష తగ్గింపు..! -
కియా నుంచి మరో కొత్త మోడల్, కారు ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే!
కార్ల తయారీ సంస్థ కియా ఇండియా భారత్ నుంచి ఒక లక్ష కార్ల ఎగుమతి మార్క్‌ను క్రాస్ చేసి సరికొత్త రికార్డ్లను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే జోరులో కియా మరిన్ని కొత్త మోడళ్లను మార్కెట్‌కు పరిచయం చేయనుంది. ఈనెల 15న దేశీయ మార్కెట్లో కియా కారెన్స్‌ను లాంఛ్ చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఈ కారును కంపెనీ వెబ్‌సైట్‌తో పాటు డీలర్ల వద్ద రూ 25,000 చెల్లించి కియా కారెన్స్‌ను బుక్ చేసుకోవచ్చని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. కియా కారెన్స్ ఫీచర్లు 6,7 సీట్లలో లభించే కియా కారెన్స్ కారులో స్ల్పిట్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, డీఆర్ఎల్స్, వంటి ఫీచర్లతో ప్రీమియం, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ, లగ్జరీ ప్లస్ వంటి ఐదు ట్రిమ్స్లు ఈ కారులో అందుబాటులో ఉండనున్నాయి. వీటితో పాటు బాస్ స్పీకర్ సిస్టమ్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎయిర్ ప్యూరిఫైర్, డౌన్‌హిల్ బ్రేక్ కంట్రోల్, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్‌లు, 10.25 ఇంచ్ ఇన్ఫోటెయిన్మెంట్ స్క్రీన్, ఫుల్లీ డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ ప్యానెల్, సింగిల్ పేన్ సన్‌రూఫ్, 64 కలర్ యాంబియంట్ లైటింగ్, వంటి ఫీచర్లు ఉన్నాయి. కాగా ఈ ఇక కియా కారెన్స్ రూ 12 లక్షల నుంచి రూ 18 లక్షల వరకూ అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. -
అనంతపూర్‌లో తయారీ.. 80 దేశాలకు ఎగుమతి..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ కియా ఇండియా ప్లాంటు నుంచి కరెన్స్ మోడల్ తొలి కారు సోమవారం వెలువడింది. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపూర్ జిల్లాలో కియా అత్యాధునిక తయారీ కేంద్రం ఉన్న సంగతి తెలిసిందే. దక్షిణ కొరియాకు చెందిన కియా 2021 డిసెంబర్లో రిక్రియేషనల్ వెహికిల్ కరెన్స్‌ను భారత్ వేదికగా తొలిసారిగా ప్రదర్శించింది. ఫిబ్రవరిలో అధికారికంగా ఈ కారును ఆవిష్కరించనున్నారు. అనంతపూర్ ప్లాంట్ నుంచి 80కిపైగా దేశాలకు ఎగుమతి చేయనున్నారు. దేశీయ మార్కెట్లో కంపెనీ నుంచి ఇది నాల్గవ మోడల్. ఇప్పటికే సంస్థ సెల్టోస్, సోనెట్, కార్నివాల్ మోడళ్లను విక్రయిస్తోంది. ప్యాసింజర్ కార్ల విపణిలో కొత్త విభాగాన్ని కరెన్స్ సృష్టిస్తుందని కంపెనీ తెలిపింది. యువ కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఈ మోడల్‌కు రూపకల్పన చేసినట్టు కియా ఇండియా ఎండీ, సీఈవో టే జిన్ పార్క్ ఈ స ందర్భంగా తెలిపారు. ఆధునిక భారతీయ కుటుంబాలను ప్రతిబింబించే ఉత్పత్తిని తీసుకురావడానికి తమ బృందాలు అవిశ్రాంతంగా పనిచేశాయని అన్నారు. ఇవీ కరెన్స్ విశిష్టతలు.. 1.4 లీటర్, 1.5 లీటర్ పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో అయిదు రకాల ఇంజన్ గేర్‌బాక్స్ ఆప్షన్స్, అయిదు రకాల ట్రిమ్ లైన్స్.. మూడు వరుసల్లో 6, 7 సీట్లతో కరెన్స్ లభిస్తుంది. 4,540 మిల్లీమీటర్ల పొడవు ఉంది. డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్‌తో 7 స్పీడ్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో 6 స్పీడ్ పెట్రోల్, డీజిల్ పవర్‌ట్రైన్స్, 6 ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికిల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, హిల్ అసిస్ట్ కంట్రోల్, డౌన్‌హిల్ బ్రేక్ కంట్రోల్, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్స్, స్లైడింగ్ టైర్ సీట్ అండర్ట్రే, రిట్రాక్టేబుల్ సీట్‌బ్యాక్ టేబుల్, రేర్ డోర్ స్పాట్ ల్యాంప్, మూడవ వరుసలో బాటిల్, గ్యాడ్జెట్ హోల్డర్, 216 లీటర్ల లగేజ్ స్పేస్ వంటి హంగులు ఉన్నాయి. ధర ఎక్స్‌షోరూంలో రూ.14–19 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. చదవండి:AP: పెట్టుబడులకు పెట్టని కోట -
కియా నుంచి మరో కొత్త కారు...! ఇది వస్తే గేమ్ ఛేంజరే..!
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం కియా భారత మార్కెట్లలోకి మరో కారును లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ‘కారెన్స్’ పేరుతో రిక్రియేషన్ వెహికిల్(ఆర్వీ)ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. సెవన్ సీటర్ కియా కారెన్స్‌ను డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా కంపెనీ ఆవిష్కరించనుంది. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో అమ్మకాలను జరిపేందుకు కంపెనీ సన్నాహాలను చేస్తోంది. చదవండి: పిల్లల కోసం అదిరిపోయే టెస్లా వెహికల్.. ధర ఎంతో తెలుసా? భారత్‌లోని న్యూ జనరేషన్ కుటుంబాలకు నచ్చే విధంగా కియా కారెన్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ‘మేడ్ ఇన్ ఇండియా..మేడ్ ఫర్ వరల్డ్..!’ అనే నినాదంతో కారెన్స్‌ను కియా లాంచ్ చేయనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని కియా తయారీ కేంద్రంలో కారెన్స్ ఉత్పత్తి కానుంది. భారత ఆటోమొబైల్ మార్కెట్లలో కియా కారెన్స్ గేమ్ ఛేంజర్‌గా నిలుస్తోందని కియా ఇండియా ఎండీ, సీఈవో తే-జిన్ పార్క్ అభిప్రాయపడ్డారు. చదవండి: ఎలక్ట్రిక్ వాహన ధరలు భారీగా పెరగనున్నయా.. ఎంత వరకు నిజం? -
అదిరిపోయిన కియా ఎలక్ట్రిక్ ఎస్యువి కారు!
ప్రముఖ సౌత్ కొరియా కార్ల తయారీ సంస్థ కియా ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ ప్రపంచంలో తన సత్తా చాటేందుకు సిద్దం అయ్యింది. తన కొత్త తరం ఈవీ9ను నవంబర్ 17న లాస్ ఏంజిల్స్ లో జరిగే ఆటో షోలో ప్రారంభించనున్నారు. అయితే, అరంగేట్రానికి ముందు కియా అధికారికంగా తన కాన్సెప్ట్ ఈవీ9 టీజర్ చిత్రాన్ని విడుదల చేసింది. ఈ ఎస్యువి కారు విషయంలో ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉంది. కియా కొత్త ఈవీ9 డిజైన్ చూస్తే సరికొత్తగా ఉంది. ఈవీ కారు ఫ్లాట్ రూఫ్ లైన్, పెద్ద వీల్ ఆర్చ్, స్లిమ్ ఎల్ఈడి డిఆర్ఎల్ సెక్షన్, ప్రముఖ ఫ్రంట్ గ్రిల్ తో వస్తుంది. ఈ కియా కొత్త కాన్సెప్ట్ ఈవీ9 బ్రాండ్ కారు ఇతర ఈవి కంటే పెద్దదిగా ఉంది. అమెరికాలో బుకింగ్ ఓపెన్ చేసిన కొన్ని గంటల్లోనే ఈవి అమ్ముడైంది. ఈ ఎలక్ట్రిక్ కారు ఎస్యువి 400వీ, 800వీ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్యువి కారును. ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో చార్జ్ చేస్తే ఐదు నిమిషాల్లోనే ఈవీ6 112 కిలోమీటర్లు, 18 నిమిషాలు చార్జ్ చేస్తే 330 కిలోమీటర్ల వరకు వెళ్లగలదు అని కియా పేర్కొంది. దీనిని ఫుల్ ఛార్జ్ చేస్తే 500 కిమీ వెళ్లనుంది. ఇది 77.4కెడబ్ల్యుహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ కారు ధర రూ.44 లక్షలుగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనిని ఇండియాలోకి తీసుకొని వస్తారో లేదా అనే విషయంపై స్పస్టత లేదు. (చదవండి: ఎస్బీఐ వినియోగదారులకు అలర్ట్!) -
కళ్లు చెదిరే లుక్స్‌తో కియా నుంచి కొత్త ఎస్యూవీ..!
దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా తన వాహన శ్రేణిలో మరో కొత్త ఎస్యూవీను తీసుకురానుంది. అందుకు సంబంధించిన టీజర్‌ను కియా రిలీజ్ చేసింది. ఈ కొత్త ఎస్యూవీ పేరును కంపెనీ ఇంకా రివీల్ చేయలేదు. కాగా కియా కార్లలోని స్పోర్టేజ్ ఎస్యూవీ మోడల్‌కు కొత్త జనరేషన్ కారుగా ఈ కారు నిలుస్తోందని ఆటోమొబైల్ రంగ నిపుణులు భావిస్తున్నారు. తొలుత అమెరికన్ మార్కెట్లలో ఈ కారును అక్టోబర్ 27 న లాంచ్ చేయనున్నుట్లు తెలుస్తోంది. భారత మార్కెట్లలోకి కియా న్యూ ఎస్యూవీ మోడల్‌ను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కియా నుంచి వస్తోన్న ఈ కారు ఫ్రంట్ వీల్, ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్స్‌తో రానుంది. కారులో మల్టీపుల్ స్టాండర్డ్ అడ్వాన్స్డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్, హై టెక్ ఇన్ఫోటైన్‌మెంట్‌ను అమర్చారు. టీజర్లో భాగంగా ఈ కారులో టైగర్ నోస్ గ్రిల్ బోల్డ్ ఫ్రంట్ ఫేస్‌తో కారు ముందుభాగం ఉండనుంది. బూమ్‌ర్యాంగ్ ఆకారంలో ఫ్రంట్ ఎల్ఈడీ లైట్లను కల్గి ఉంది. ఫ్రంట్ వీల్ డ్రైవ్ అంటే..! ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఆప్షన్లో కారు ఇంజిన్ ముందు టైర్లకు శక్తినిస్తోంది. ఆల్ వీల్ డ్రైవ్ అంటే..! ఈ ఆప్షన్లో ఇంజిన్ కారు ముందు టైర్లకు, వెనుక టైర్లకు శక్తిని అందిస్తోంది ఇంజిన్ విషయానికి వస్తే..! కియా స్పోర్టేజ్ మోడల్ మాదిరిగానే 1.6 లీటర్ టర్బో ఫోర్ సిలిండర్ ఇంజిన్‌ను అమర్చారు. 177 బీహెచ్పీ సామర్థ్యంతో 265ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. చదవండి: టెస్లా కార్లపై నీతి ఆయోగ్ కీలక వ్యాఖ్యలు...! -
సరికొత్తగా కియా కార్నివాల్ మార్కెట్లలోకి లాంచ్...!
దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ కియా భారత మార్కెట్లలోకి సరికొత్త కియా కార్నివాల్‌ను ఎమ్‌పీవీను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అప్డేట్ చేసిన కార్నివాల్ ఇప్పుడు కియా న్యూలోగోతో రానుంది. కియా భారత మార్కెట్లలోకి సెల్టోస్, సొనెట్ ఎస్‌యూవీలను ప్రవేశపెట్టింది. కార్నివాల్ మల్టీపర్పస్ వెహికిల్(ఎమ్‌పీవీ) లిమోసిన్, లిమోసిన్+ వేరియంట్లను కూడా కియా మార్పులను చేసింది. చదవండి: టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ సెడాన్ రిఫ్రెష్ చేయబడిన కియా కార్నివాల్ శ్రేణి వాహనాలు సుమారు రూ. 24,95,000 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభకానున్నాయి. దేశవ్యాప్తంగా కియా డీలర్షిప్ నుంచి, కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను ఉపయోగించి కార్నివాల్‌ను బుక్ చేసుకోవచ్చు. కియా కార్నివాల్ నాలుగు వేరియంట్లో రానుంది. లిమోసిన్+, లిమోసిన్, ప్రెస్టీజ్, ప్రీమియం. అప్డేట్ చేసిన కార్నివాల్లో కియా ఇండియా అనేక కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. కారు రెండో వరుసలో లెగ్ సపోర్ట్, 20.32 సెంటీమీటర్లఇన్ఫోన్మెంట్తో ఓటీఐ మ్యాప్ అప్డేట్లతో, వీఐపీ ప్రీమియం లేథర్ సీట్లను అందించనుంది. లిమోసిన్ వేరియంట్లో వెరియల్లో వెనుకసీట్లో కూర్చున్న వారి కోసం కొత్తగా 10.1 "రియర్ సీట్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ యూనిట్, స్మార్ట్ ఎయిర్ప్యూరిఫైయర్ను అమర్చారు. హర్మన్ కార్డాన్ ప్రీమియం స్పీకర్ సౌండ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, 10 వే పవర్ డ్రైవర్ సీట్, డ్రైవర్ సీట్ వెంటిలేషన్, లెదర్ఢ్ స్టీరింగ్ వీల్, గేర్ నాబ్, ప్రీమియం వుడ్ గార్నిష్ వంటి ఫీచర్లతో టాప్-స్పెక్స్‌తో లిమోసిన్ ప్లస్ వేరియంట్లో అమర్చారు. చదవండి: బైక్ కొనుగోలుదారులకు హీరో మోటోకార్ప్ షాక్! -
కియా కా కమాల్... రికార్డు సృష్టిస్తోన్న ఆ మోడల్ కారు అమ్మకాలు
Kia Sub Compact SUV Car Sonet Sales: అతి తక్కువ కాలంలోనే ఆటోమొబైల్ మార్కెట్‌పై చెదరని ముద్ర వేసిన కియా.. తన ప్రయాణంలో మరో మైలురాయిని అందుకుంది. ఆ కంపెనీ నుంచి వస్తున్న ప్యాసింజర్ వెహికల్స్ ఒకదాని వెంట ఒకటిగా అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్నాయి. ఏడాదిలోనే కియా కంపెనీ కార్లు ఇండియన్ రోడ్లపై రివ్వుమని దూసుకుపోతున్నాయి. ఇప్పటికే కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో సెల్టోస్ అమ్మకాలు అదుర్స్ అనే విధంగా ఉండగా ఇప్పుడు సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లోనూ అవే ఫలితాలు రిపీట్ అవుతున్నాయి. గతేడాది సెప్టెంబరులో మార్కెట్లోకి వచ్చిన కియా సోనెట్ అమ్మకాల్లో అప్పుడే లక్ష మార్కును అధిగమించింది. ఈ మోడల్ రిలీజైన ఏడాదిలోగానే లక్షకు పైగా అమ్మకాలు జరుపుకుని రికార్డు సృష్టించింది. గడ్డు పరిస్థితులను ఎదుర్కొని వాస్తవానికి కరోనా ఫస్ట్ వేవ్ ముగిసన తర్వాత ఆటోమైబైల్ రంగం తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంది. మార్కెట్ ఇంకా గాడిన పడకముందే 2020 సెప్టెంబరు 20న సొనెట్ మోడల్ని మార్కెట్లోకి తెచ్చింది కియా. ఆ కంపెనీ అంచనాలను సైతం తారు మారు చేస్తూ 12 నెలల వ్యవధిలోనే లక్ష కార్లు అమ్ముడయ్యాయి. కియా అమ్మకాల్లో ఒక్క సోనెట్ వాటానే 32 శాతానికి చేరుకుందని ఆ కంపెనీ మార్కెటింగ్ అండ్ సేల్స్ చీఫ్ , ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టియో జిన్ పార్క్ తెలిపారు. టెక్నాలజీ అండతో.. సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో మారుతి బ్రెజా, హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యూవీ 300 వంటి ప్యాసింజర్ వెహికల్స్ నుంచి పోటీని తట్టుకుంటూ కియో సోనెట్ భారీగా అమ్మకాలు సాధించడం వెనుక టెక్నాలజీనే ప్రముఖ పాత్ర పోషించినట్టు మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఈ సెగ్మెంట్లో టెక్నాలజీలో సోనెట్ మెరుగ్గా ఉన్నట్టు చెబుతున్నారు. ఎలక్ట్రానిక్ స్టెబులిటీ కంట్రోల్ (ఈఎస్సీ), వెహికల్ స్టెబులిటీ మేనేజ్మెంట్ (వీఎస్ఎమ్), బ్రేక్ అసిస్ట్ (బీఏ), హిల్ అసిస్ట్ కంట్రోల్ (హెచ్ఏసీ), పెడల్ షిప్టర్స్, వాయిస్ కమాండ్ ఆపరేటెడ్ సన్ రూఫ్ తదితర ఫీచర్లు ఈ కారుకు అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రారంభ ధర రూ. 6.79 లక్షలు కియా సోనెట్‌లో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌తో వస్తోంది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్లు అందిస్తోంది. ఈ కారు ప్రారంభం ధర రూ. 6.79 లక్షల నుంచి గరిష్టంగా రూ. 8.75 లక్షలు(షోరూమ్)గా ఉంది. గత సెప్టెంబరులో తొలి మోడల్ రిలీజ్ అవగా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ 2021 మేలో మార్కెట్లోకి వచ్చింది. మొత్తంగా 17 రంగుల్లో ఈ కారు లభిస్తోంది. చదవండి: సెడాన్ అమ్మకాల్లో ఆ కారుదే అగ్రస్థానం -
బంపర్ ఆఫర్: ఆ కారుపై రూ.3.75 లక్షలు సూపర్ క్యాష్ డిస్కౌంట్
దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా భారత్ మార్కెట్ పై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఎంట్రీ లెవల్ ప్రీమియం వేరియంట్ కియా కార్నివాల్ ఎంపీవీ కారుపై రూ.3.75 లక్షల వరకు లబ్ధి చేకూరేలా బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ కారును కొనుగోలు చేసిన కష్టమర్లకు ఆఫర్ వర్తిస్తుందని కియో ప్రతినిధులు వెల్లడించారు. ఈ కారు అసలు ధర రూ.24.95 లక్షలు ఉండగా..షోరూమ్ లో దీని ధరపై రూ .2.50 లక్షల క్యాష్ డిస్కౌంట్‌తో పాటు వార్షిక నిర్వహణ ఖర్చులు, పొడిగించిన వారంటీ ప్యాకేజీలతో పాటు ఇతర ఖర్చుల కింద రూ.1.25లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. దీంతో ఈ కారును రూ .21.20లక్షలకే సొంతం చేసుకోవచ్చు. కాగా ,గతేడాది జరిగిన ఆటో ఎక్స్ పోలో 2020 కియా కార్నివాల్ ఎంపీవీ కారును ఇండియన్ మార్కెట్లో కియా విడుదల చేసింది. ఎస్‌యూవీని ప్రెస్టీజ్, ప్రీమియం, లిమోసిన్ అనే మూడు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంచారు. వీటితో పాటు ఈ కారు నాలుగు వరుసలు, తొమ్మిది సీట్లతో ఏర్పాటైంది. కారు లోపలి భాగం నప్పా లెదర్ అప్హోల్స్టరీతో డిజైన్ చేయడం అదనపు ఆకర్షణగా నిలుస్తోంది. 200హెచ్‌పీ పవర్ శక్తిని గరిష్టంగా 440 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 8 స్పీడ్ ఆటోమెటిక్ గేర్ బాక్స్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, క్యాబిన్లో అత్యాధునిక కార్ల టెక్నాలజీకి సపోర్ట్ చేసే సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. -
వాహన ఎగుమతులు పెరిగాయ్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా మహమ్మారి నుంచి పరిస్థితులు మెరుగుపడుతున్న నేపథ్యంలో.. భారత్ నుంచి వాహన ఎగుమతులు తిరిగి పుంజుకున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ కాలంలో 14,19,430 వాహనాలు పలు దేశాలకు సరఫరా అయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 4,36,500 మాత్రమే. ప్రయాణికుల వాహనాలు 43,619 నుంచి 1,27,115 యూనిట్లకు చేరాయి. వీటిలో కార్లు 79,376 కాగా, యుటిలిటీ వెహికిల్స్ 47,151 ఉన్నాయి. మారుతి సుజుకి 45,056, హ్యుండాయ్ మోటార్ 29,881, కియా 12,448, ఫోక్స్‌వ్యాగన్ 11,566 యూనిట్లను ఎగుమతి చేశాయి. ద్విచక్ర వాహనాలు గడిచిన మూడేళ్లతో పోలిస్తే మెరుగ్గా నమోదు అయ్యాయి. ఈ విభాగంలో 2021–22 తొలి త్రైమాసికంలో 11,37,102 యూనిట్లు సరఫరా అయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 3,37,983. వాణిజ్య వాహనాలు 3,870 నుంచి 16,006 యూనిట్లకు, త్రిచక్ర వాహనాలు 50,631 నుంచి 1,37,582కు ఎగిశాయి. కాగా విక్రయాలు కోవిడ్ ముందస్తు స్థాయికి రావాల్సి ఉంది. -
కియా నుంచి ఎస్యూవీ సోనెట్
సాక్షి, అమరావతి: కియా మోటార్స్ మేడిన్ ఆంధ్రా సరికొత్త స్మార్ట్ అర్బన్ కాంపాక్ట్ ఎస్యూవీ ‘సోనెట్’ను శుక్రవారం వర్చువల్‌గా ఆవిష్కరించింది. రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో సెల్టోస్ తర్వాత తయారైన రెండవ కారు ఇది. వచ్చే పండుగల సీజన్‌కు ఈ కారును వాణిజ్యపరంగా మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. ఈ కారును వర్చువల్‌గా ఆవిష్కరిస్తూ కియా మోటార్ కార్పొరేషన్ సీఈవో హూ సంగ్ సాంగ్ మాట్లాడుతూ ప్రపంచ శ్రేణి నాణ్యతతో రూపొందించిన ఈ కారుడ్రైవర్‌తో పాటు ప్రయాణికులకు విన్నూతనమైన ఆనందాన్ని అందిస్తుందన్నారు. భారతదేశంలో వృద్ధి చెందుతున్న ఎస్యూవీ మార్కెట్ అవసరాలను సోనెట్ తీర్చడమే కాకుండా విస్తృత శ్రేణి వినియోగదారులు కియా బ్రాండ్ పట్ల మరింతగా ఆకర్షితులవుతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కియా మోటర్స్ ఇండియా ఎండీ, సీఈవో కూఖ్యున్ షిమ్ మాట్లాడుతూ ప్రపంచం కోసం ఇక్కడ తయారైన కారుగా సోనెట్‌ను అభివర్ణించారు.సెల్టోస్, కార్నివాల్ తర్వాత మరో విభాగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకువస్తుందన్నారు. డ్రైవర్‌కు అలసట లేకుండా సుదీర్ఘ ప్రయాణం చేసే విధంగా క్లచ్ పెడల్ లేకుండా మాన్యువల్ ట్రాన్స్మిషన్స్, సిక్స్ స్పీడ్ స్మార్ట్ స్ట్రీమ్ ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రిన్స్‌మిషన్ వంటి 30కిపైగా ప్రత్యేకతలు ఈ సోనెట్ సొంతం. ఈ ఎస్యూవీ ధరను కియా ఇంకా ప్రకటించలేదు. -
కియాపై టీడీపీ కుట్రలు చేస్తోంది
సాక్షి, అనంతపురం: కియా ఫ్యాక్టరీ ఎక్కడికి తరలిపోదని ఎంపీ తలారి రంగయ్య స్పష్టతనిచ్చారు. రూ.13,500 కోట్లతో ఫ్యాక్టరీ స్థాపించాక మరో ప్రాంతానికి ఎలా పోతుందని ప్రశ్నించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. కియా ఫ్యాక్టరీపై టీడీపీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. అసత్య కథనం ఆధారంగా గోబెల్స్ ప్రచారం(లేని దాన్ని ఉన్నట్టుగా చూపించడం) చేస్తోందని విమర్శించారు. ఏదో జరిగిపోతుందంటూ ఎల్లో మీడియా కథనాలను ఇవ్వడం దారుణమన్నారు. ఫ్యాక్టరీ తరలించే యోచనే లేదని యజమాన్యం ప్రకటించిన తర్వాత చర్చ అనవసరమని పేర్కొన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో 1.1 బిలియన్ డాలర్లతో ఏర్పాటైన కియా కార్ల కంపెనీ తన యూనిట్ ప్రారంభించి రెండు నెలలు కాకముందే తమిళనాడుకు తరలిపోతోందంటూ అంతర్జాతీయ మీడియా అసత్య కథనం వెలువడించిం. వెంటన్నీ దీన్ని పసిగట్టిన ఎల్లో మీడియా కియా పరిశ్రమ వెళ్లిపోతుందంటూ శోకాలు మొదలెట్టింది. అయితే ఆ వార్తలు వట్టి పుకార్లేనని తేటతెల్లమవడంతో దుషష్ప్రచారానికి ఒడిగట్టిన వాళ్లందరూ తెల్లమొహం వేసుకున్నారు చదవండి: కియాపై మాయాజాలం కియా తరలింపు వార్తలపై సంస్థ కీలక ప్రకటన -
ఆటో ఎక్స్పో: టాప్ ఎలక్ట్రిక్ వాహనాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆటో ఎక్స్పో 2020లో దేశ, విదేశాల కార్లు సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా దేశంలో త్వరలో అమల్లోకి రానున్న బీఎస్-6 నిబంధనల నేపథ్యంలో బీఎస్-6 ఆధారిత బైక్‌లు, ఎలక్ట్రిక్ కార్లపై ఆయా కంపెనీలు ఎక్కువగా దృష్టి పెట్టాయి. టాటా మోటార్స్, మహీంద్రా వంటి స్వదేశీ వాహన తయారీదారుల నుంచి మొదలు గ్లోబల్ బ్రాండ్లు రెనాల్ట్ , కియా మోటార్స్ వరకు, అనేక మంది తయారీదారులు తమ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రదర్శించాయి. కొత్త లాంచింగ్ దగ్గర నుంచి తొలిసారి ప్రదర్శన వరకు, 2020 ఆటో ఎక్స్‌పోలో ఎలక్ట్రిక్ వాహనాల సందడే సందడి. ఈ సందర్భంగా ఇప్పటివరకు ప్రదర్శించిన ఈ వాహనాల్లో ప్రముఖంగా నిలిచిన అయిదుకార్లపై ఓ లుక్కేద్దాం. టాటా ఆల్ట్రోజ్ ఈవీ ( ఎలక్ట్రిక్ వాహనం) 2019 జెనీవా మోటార్ షోలో తొలిసారిగా ప్రపంచానికి ఆవిష్కరించిన టాటా ఆల్ట్రోజ్ ఈవీ ఎట్టకేలకు ఈ ఏడాది ఆటో ఎక్స్‌పోలో భారత్‌లోకి అడుగుపెట్టింది. టైగర్ ఇ.వి . నెక్సాన్ ఈవీ, ఆల్ట్రోజ్ ఈవీ తరువాత ఇది మూడవ ఎలక్ట్రిక్ కారు.అంతేకాదు భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కానుంది. ఈ ఏడాది చివర్లో లాంచ్ కానున్న టాటా ఆల్ట్రోజ్ ఈవీ .. జిప్ట్రాన్ ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ టెక్నాలజీతో రానుంది, అంటే ఈ కారు ఒక ఛార్జీతో 250 కిలోమీటర్లు దూసుకుపోతుంది. ఫీచర్లపై పూర్తి స్పష్టత రావాల్సి వుంది. రెనాల్ట్ సీటీ కే-జెడ్ఈ ఈ సంవత్సరం ఆటో ఎక్స్‌పోలో రెనాల్ట్ ఆవిష్కరించిన కారు. సిటీ కె-జెడ్ఈ . ఇది భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్విడ్ కారు ఎలక్ట్రిక్ వెర్షన్ . చైనాలో జరిగిన 2019 షాంఘై మోటార్ షోలో మొదటిసారి ప్రదర్శించిన ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కే-జెడ్ఈ కాన్సెప్ట్‌పై రూపొందించి, రెనాల్ట్కు చెందిన అతిచిన్న ఈవీ అనిచెప్పవచ్చు. క్విడ్ మాదిరిగా, రెనాల్ట్ సిటీ కే-జెడ్ఈ కూడా సీఎంఎఫ్ ప్లాట్‌ఫాం ఆధారితమే. అయితే ఎలక్ట్రిక్ మోడల్ ప్రస్తుతం చైనాలో మాత్రమే అమ్ముడవుతోంది. మహీంద్రా ఇకేయూవి 100 మహీంద్ర నుంచి అనూహ్యంగా దూసుకొచ్చిన వాహనం ఈకేయూవి 100ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ ప్రీ-ప్రొడక్షన్ మోడల్‌ను 2018 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది కంపెనీ. అయితే కంపెనీ దీనిని విడుదల చేసింది, దీని ధర రూ. 8.25 లక్షలు (ఎక్స్-షోరూమ్), ఇది భారతదేశంలో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ వాహనంగా నిలిచింది. కొత్త స్టైలింగ్‌తో, కొత్త గ్రిల్ బ్లూ ఎలిమెంట్స్‌తో విడుదలైంది. ఎంజీ మార్వెల్ ఎక్స్ ఇది చైనాలోని సాయిక్ గ్రూప్ బ్రాండ్ క్రింద విక్రయించే పూర్తి ఎలక్ట్రిక్ ఎస్యూవీ. దీనిని మోరిస్ గ్యారేజ్ ఇండియా ఇండియాకు తీసుకువచ్చింది. 2017 షాంఘై ఆటో షోలో ప్రదర్శించిన విజన్ ఇ కాన్సెప్ట్ ఆధారంగా మార్వెల్ ఎక్స్ ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడీ డీఆర్ఎల్లతో పాటు హెవీ క్రోమ్ ఎలిమెంట్స్‌ను జోడించుకుని ఎగ్రెసివ్ లుక్‌లో విడుదలైంది. సిల్వర్ స్కిడ్ ప్లేట్, స్పోర్టి అల్లాయ్ వీల్స్, ,వెనుక ఎల్ఈడీ టైలాంప్స్‌తో వస్తుంది. కియా సోల్ ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీతో కియా మోటార్స్ తీసుకొచ్చిన వాహనం కియా సోల్ వీవీ. ప్రస్తుతం, దక్షిణ కొరియా మరియు ఇతర గ్లోబల్ మార్కెట్లలో అమ్మకానికి ఉన్న కియా సోల్ లిక్విడ్-కూల్డ్ లిథియం-అయాన్ పాలిమర్ 64 కిలోవాట్ల బ్యాటరీతో 450 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.. 2025 నాటికి భారతదేశంలో 16 ఎలక్ట్రిక్ వాహనాలను అందించాలని యోచిస్తున్నట్లు కియా ఇంతకుముందే ప్రకటించింది. ఇందులో భాగమే సోల్ ఈవీ. 17 అంగుళాల అల్లాయ్ వీల్స్, క్వాడ్-ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడి డీఆర్ఎల్లు, ఎల్ఇడి ఫాగ్ లాంప్స్ , ఎల్ఇడి టైల్ లాంప్‌లతో పాటు, హాట్ అండ్ వెంటిలేటెడ్ సీట్లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్‌లు, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ స్టార్ట్-స్టాప్ స్విచ్ ప్రధాన ఫీచర్లు. చదవండి : మారుతి విటారా బ్రెజ్జా సరికొత్తగా , అదరగొడుతున్న పియాజియో స్కూటీలు -
కథనం వెనుక రాజకీయం
-
ఆటో ఎక్స్పో: కార్ల జిగేల్.. జిగేల్
సాక్షి, న్యూఢిల్లీ: న్యూఢిల్లీ శివార్లలోని గ్రేటర్ నోయిడాలో ఆటో ఎక్స్పో 2020 సంరంభానికి తెరలేచింది. ఫిబ్రవరి 7 నుంచి 12వ తేదీవరకు జరగనున్న ఈ వేడుకనలో ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ కంపెనీలు తమ తమ వాహనాలను ప్రదర్శనకు ఉంచుతాయి. ఈ వేడుకకు ప్రారంభ సన్నాహకం గా ఫిబ్రవరి 5, 6 తేదీల్లో మీడియాకోసం పలు వాహనాలు కొలువు దీరాయి. ముఖ్యంగా మహీంద్ర, మారుతి సుజుకి, టాటా మోటార్స్, హ్యుందాయ్తో పాటో, ఫ్రెంచ్ తయారీ దారు రెనాల్ట్ తమ వాహనాలను ఆవిష్కరించాయి. మిషన్ గ్రీన్ మిలియన్ లో భాగంగా రానున్న సంవత్సరాల్లో 10 లక్షల గ్రీన్ కార్లను ( సీఎన్జీ, హైబ్రిడ్, ఎలక్ట్రిక్) విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు మారుతి వెల్లడించింది. ఈ రోజు మారుతి సుజుకి ఇండియా ఈ రోజు ఆటో ఎక్స్పో 2020 లో ఫ్యూటురో-ఇ కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది. టాటామోటార్స్ ఫ్రీడం ఇన్‌ప్యూచర్ మొబిలిటీ అనే కాన్సెప్ట్‌తో 13 కార్లను ప్రదర్శించింది. దక్షిణకొరియా దిగ్గజం కియా మోటార్స్ ప్రీమియం సెగ్మెంట్లో మల్టీ పర్పస్ వెహికల్ కార్నివాల్‌ని ఆటోఎక్స్‌పో 2020లో లాంచ్ చేసింది. దీంతోపాటు గ్లోబల్ ఎస్యూవీ ‘సోనెట్’ ను కూడా ప్రదర్శించింది. 2020 ఆటో ఎక్స్‌పోలో హ్యుందాయ్ ఇండియా లే ఫిల్ రూజ్ కాన్సెప్ట్‌ను ప్రదర్శించింది. -
కార్ల సందడి రెడీ!!
రెండేళ్లకొకసారి జరిగే వాహన పండుగకు రంగం సిద్ధమైంది. పర్యావరణ స్పృహ బాగా పెరిగిన నేపథ్యంలో ఈసారి ఈ ఆటో ఎక్స్‌పోలో ఎలక్ట్రిక్ వాహనాల జోరు బాగా ఉండగలదని నిపుణులు భావిస్తున్నారు. మందగమనం కారణంగా వాహన విక్రయాలు కుదేలయ్యాయని, ఆ ఆటో ఎక్స్పో వినియోగదారుల సెంటిమెంట్‌కు జోష్నివ్వగలదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ శుక్రవారం (ఈ నెల 7వ తేదీ) నుంచి ఆరంభం కానున్న ఆటో ఎక్స్‌పోకు సంబంధించిన వివరాలు, పాల్గొనే కంపెనీలు, అవి ఆవిష్కరించే మోడళ్లు తదితర అంశాల సమాహారం సాక్షి పాఠకుల కోసం ప్రత్యేకం... ఆర్థిక మందగమనం వాహన రంగాన్ని బాగా దెబ్బతీస్తోంది. గత ఏడాది అమ్మకాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. వాహన రంగ రికవరీ ఆటో ఎక్స్‌పోతో ఆరంభం కాగలదని వాహన కంపెనీలు ఆశిస్తున్నాయి. 1986లో మొదలై ప్రతి రెండేళ్లకొకసారి జరిగే ఈ ఆటో ఎక్స్‌పోలో దేశీ, విదేశీ కంపెనీలు తమ వాహనాలను డిస్ప్లే చేయనున్నాయి. కొత్త మోడళ్ల ఆవిష్కరణలకు, మార్కెట్లో ప్రవేశపెట్టడానికి ఆటో ఎక్స్పో వేదికగా పలు వాహన కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి బీఎస్ 6 ప్రమాణాలు అమల్లోకి రానుండటంతో ఈ ఆటో షో ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే అమ్మకాలు తగ్గుతుండటం, బీఎస్ 6 నిబంధనలు అమల్లోకి రానుండటం తదితర కారణాల వల్ల పలు కంపెనీలు ఈ ఆటో ఎక్స్‌పోలో పాల్గొనడం లేదు. కాగా, చైనాకు చెందిన గ్రేట్ వాల్మోటార్స్, ఫా హైమ ఆటోమొబైల్ కంపెనీలు ఈ ఆటో ఎక్స్పో ద్వారా భారత మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయి. 2018లో జరిగిన ఆటో ఎక్స్‌పోకు సుమారుగా 6 లక్షల మంది సందర్శకులు వచ్చారు. ఈ ఏడాది ఆటో ఎక్స్‌పోకు కూడా ఇదే స్థాయిలో సందర్శకులు వస్తారనేది నిర్వాహకుల అంచనా. మారుతీ సుజుకీ.... ఈ ఆటో ఎక్స్‌పోలో మారుతీ సుజుకీ కూపే స్టైల్ ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ కారు ‘ఫ్యూచరో–ఈ’ ను ఆవిష్కరించనుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన భారత కారుగా ఈ కాన్సెప్ట్ కారు నేటి యువత ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఉంటుందని మారుతీ పేర్కొంది. దీంతో బీఎస్–6 పెట్రోల్ విటారా బ్రెజా, ఇగ్నిస్ మోడల్లో అప్‌గ్రేడెడ్ వేరియంట్‌ను, స్విఫ్ట్ హైబ్రిడ్ వేరియంట్‌ను, మరో 14 ఇతర మోడళ్లను ప్రదర్శించనున్నది. టాటా మోటార్స్ పలు ఎస్యూవీ మోడళ్లను టాటా మోటార్స్ కంపెనీ ఈ ఆటో ఎక్స్‌పోలో డిస్ప్లే చేయనున్నది. ఏడు సీట్ల ఎస్యూవీ గ్రావిటాస్ మోడల్‌ను ఇక్కడే ఆవిష్కరించనున్నది. ఆల్ట్రోజ్ ఎలక్ట్రిక్ వాహనాన్ని, హెచ్2ఎక్స్ కాన్సెప్ట్ కారును, హారియర్ మోడల్లో కొత్త వేరియంట్‌ను ప్రదర్శించడానికి సిద్ధమవుతోంది. స్కోడా, ఫోక్స్‌వ్యాగన్ స్కోడా, ఫోక్స్‌వ్యాగన్‌లు విలీనమై ఏర్పాటైన స్కోడా ఆటో ఫోక్స్ వ్యాగన్ ఇండియా పలు మోడళ్లను ఈ ఆటో ఎక్స్పో కోసం సిద్ధం చేస్తోంది. టిగుయాన్ ఆల్స్పేస్, టీ–రోక్ ఎస్యూవీ, విజన్ ఇన్, ఆక్టేవియా ఆర్ఎస్245, సూపర్బ్‌లో కొత్త వేరియంట్, కోడియాక్ టీఎస్ఐ, కరోక్ ఎస్‌యూవీలను తెస్తోంది. మహీంద్రా అండ్ మహీంద్రా ఎస్‌యూవీల్లో కొత్త వేరియంట్లతో పాటు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను కూడా డిస్ప్లే చేయనున్నది. ఎక్స్‌యూవీ300, కేయూవీ100 మోడళ్లలో ఎలక్ట్రిక్ వేరియంట్లను కలుపుకొని మొత్తం నాలుగు ఎస్యూవీ ఈవీలను సిద్ధం చేస్తోంది. బీఎస్–6 ప్రమాణాలతో కూడిన అల్టురాస్, ఎక్స్‌యూవీ300, మారాజో వేరియంట్లను ప్రదర్శించనున్నది. వందకు పైగా ఆవిష్కరణలు... దాదాపు 31 కంపెనీలు ఈ ఆటో ఎక్స్‌పోలో పాలుపంచుకోనున్నాయి. దాదాపు వందకు పైగా కొత్త మోడళ్లు, వేరియంట్ల ఆవిష్కరణ జరగనున్నది. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన 30కి పైగా స్టార్టప్‌లు కూడా తమ తమ టెక్నాలజీలను, ఉత్పత్తులను డిస్ప్లే చేయనున్నాయి. కాగా కరోనా వైరస్ కారణంగా చైనా ప్రతినిధులు తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. చైనా కంపెనీలు ఆ ఆటో ఎక్స్‌పోలో పాల్గొంటాయని, ఇక్కడి ఉన్నతాధికారులే వస్తారని, చైనా నుంచి పెద్ద అధికారులెవరూ రారని సమాచారం. కాగా, ఈ ఆటో ఎక్స్పో వినియోగదారుల సెంటిమెంట్‌కు జోష్నివ్వగలదని సియామ్ (సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్) డైరెక్టర్ జనరల్ రాజీవ్ మీనన్ ఆశాభావం వ్యక్తంచేశారు. హ్యుందాయ్.... క్రెటా మోడల్లో కొత్త వేరియంట్‌ను ఆవిష్కరించనున్నది. ఎలంత్ర, ట్యూసన్, ఐ30ఎన్ హ్యాచ్బాక్లతో పాటు నెక్సో ఫ్యూయల్ సెల్ ఎస్‌యూవీని కూడా ప్రదర్శించనున్నది. ఎమ్జీ మోటార్స్ చైనాకు చెందిన ఈ కంపెనీ పలు ఎస్‌యూవీలను ఆ ఆటో ఎక్స్‌పోలో డిస్ప్లే చేయనున్నది. ఐ–విజన్ కాన్సెప్ట్, మాక్సస్ డి90, 6 సీట్ల హెక్టర్, ఎమ్జీ 6 హ్యాచ్‌బ్యాక్, ఎమ్జీ 360 సెడాన్లను సిద్ధం చేస్తోంది. కియా మోటార్స్ ఈ కంపెనీ కార్నివాల్ ఎమ్‌పీవీ(మల్టీ పర్పస్ వెహికల్)ను, క్యూవైఐ ఎస్‌యూవీని, సోల్ ఈవీ, స్ట్రింజర్ జీటీ, స్పోర్టేజ్ క్రాసోవర్, నిరో హ్యాచ్‌బ్యాక్ తదితర కార్లను ప్రదర్శించనున్నది. రెనో ఈ కంపెనీ మొత్తం 12 కార్లను డిస్ప్లే చేయనున్నది. హెచ్‌బీసీ ఎస్యూవీ, జో ఈవీ హ్యాచ్‌బాక్, ట్రైబర్ ఏఎమ్‌టీ, ట్రైబర్ పెట్రోల్ కార్లను ఆవిష్కరించనున్నది. గ్రేట్ వాల్ మోటార్స్ చైనాకు చెందిన ఈ కంపెనీ హావల్, ఓరా బ్రాండ్ ఎస్యూవీ, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రదర్శించనున్నది. హెచ్9, హెచ్6, హెచ్1 ఎస్‌యూవీలతో పాటు హెచ్, విజన్ 2025 కాన్సెప్ట్ కార్లను డిస్ప్లే చేయనుంది. మెర్సిడెస్ బెంజ్ కొత్త ఏ–క్లాస్ లిమోసిన్, 2020 జీఎల్ఏ, ఈక్యూసీ ఎడిషన్ 1886– ఈ మూడు కార్లను ఆవిష్కరించనుంది. ఏఎమ్‌జీ జీటీ 63 ఎస్ 4మ్యాటిక్ 4 డోర్ల కూపే కారుతో పాటు వి–క్లాప్ మార్కోపోలో కార్లను తీసుకొస్తోంది. ఎప్పుడు: ఈ నెల 7–12 తేదీల్లో ఎక్కడ: ఢిల్లీ సమీపంలోని గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో మార్ట్‌లో ఇది ఎన్నవ సారి: 15వ సారి పాల్గొనే కంపెనీల సంఖ్య: 30కి పైగా ఆవిష్కరణలు: కొత్త మోడళ్లు, వేరియంట్లు కలుపుకొని 100కు పైగా సందర్శకుల సంఖ్య: 6 లక్షలకు పైగా (అంచనా) ఎవరు నిర్వహిస్తున్నారు: ఏసీఎమ్ఏ (ఆటోమోటివ్ కాంపొనెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్) సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్); కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ) -
కియా ‘సెల్టోస్’ విడుదల ఈ నెల 8న
సాక్షి, అమరావతి: దక్షిణకొరియా కార్ల దిగ్గజం కియా కంపెనీ తన కొత్తకారు ‘సెల్టోస్’ను ఈ నెల 8న మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డిని కియా కంపెనీ ప్రతినిధులు ఆహ్వానించారు. కియా కంపెనీ ఎండీ కూక్ హున్ షిమ్, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ థామస్ కిమ్ సోమవారం ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో కలిసి అనంతపురం జిల్లా పెనుగొండలో నిర్వహించే కొత్త కారు విడుదల కార్యక్రమానికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఏడాదికి 3 లక్షలకార్లను పెనుగొండ ప్లాంటు ద్వారా ఉత్పత్తి చేయగలమని కంపెనీ ప్రతినిధులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. భవిష్యత్‌లో 7 లక్షల కార్లను తయారు చేసే సామర్థ్యానికి చేరుకుంటామని సీఎంకు వెల్లడించారు. సెల్టోస్ విడుదల కార్యక్రమానికి సీఎం జగన్ హాజరుకానున్నారు. -
కారు బోల్తా.. కియా ఉద్యోగి మృతి
అనంతపురం , చిలమత్తూరు: కొడికొండ చెక్‌పోస్టు రక్షా అకాడమీ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున కారు బోల్తా పడిన ఘటనలో కియా ఉద్యోగి అయిన కొరియా దేశస్తుడు మృతి చెందాడు. ఎస్ఐ ధరణీబాబు తెలిపిన వివరాల మేరకు... పెనుకొండ సమీపంలోని కియా కార్ల ఉత్పత్తి పరిశ్రమలో కొరియా దేశానికి చెందిన మిన్ కియోంగ్ జిన్ (40), జేహిలీ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. బుధవారం బెంగుళూర్ విమానశ్రయం నుంచి అద్దె కారులో (ఏపీ02సీసీ 7233) పెనుకొండ వైపు వస్తున్నారు. రక్షా అకాడమీకి సమీపంలోకి రాగానే అధిక వేగంతో వస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడడంతో డ్రైవర్ కేశవ్‌నాయక్, జేహిలీ, మిన్ కియోంగ్ జిన్(41)లు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను బాగేపల్లి ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం బెంగుళూర్లోని కొలంబియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మిన్ కియోంగ్ జిన్ మృతి చెందాడన్నారు. కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. -
ఓలాలో హ్యుందాయ్, కియా పెట్టుబడులు
న్యూఢిల్లీ: విద్యుత్ వాహనాల వ్యవస్థను మరింత అభివృద్ధి చేసే దిశగా ట్యాక్సీ సేవల సంస్థ ఓలాలో దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజాలు హ్యుందాయ్ మోటార్స్, కియా మోటార్స్ దాదాపు 300 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా మూడు సంస్థలూ కలిసి భారత మార్కెట్‌కు అనువైన ఎలక్ట్రిక్ వాహనాలు, చార్జింగ్ సదుపాయాలను అభివృద్ధి చేయనున్నాయి. ఈ భాగస్వామ్యంతో ఓలా డ్రైవర్లకు వివిధ రకాల ఆర్థిక సేవలు (లీజు, ఇన్స్టాల్మెంట్స్ వంటివి) లభించనుండగా, ప్రయాణికులకు మెరుగైన సేవలు లభిస్తాయని మూడు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. హ్యుందాయ్ ఇప్పటికే కార్ షేరింగ్ సంస్థ రెవ్లో కూడా పెట్టుబడులు పెట్టింది. దాదాపు రూ. 100 కోట్లు సమీకరించిన రెవ్.. దేశీయంగా 30 నగరాలకు కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది. ప్రస్తుతం రెవ్ 11 నగరాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. -
నీళ్లిచ్చానని వరి జోలికెళ్లొద్దు
అనంతపురం , కదిరి: ‘హంద్రీనీవా జలాలు వచ్చాయని రైతులెవరూ వరి పంట జోలికెళ్లద్దు. వరి సాగు లాభం కన్నా... నష్టమే ఎక్కువ. పండ్లతోటలు, కూరగాయలు సాగుచేసుకోండి. వీటికి తక్కువ నీరు సరిపోతుంది. బిందు, తుంపర్ల ద్వారా సాగుచేస్తే నీరు మరింత ఆదా అవుతుంది. పొరపాటున కూడా వరి సాగుచేయద్దు..’ అనిముఖ్యమంత్రి చంద్రబాబు రైతులను హెచ్చరించారు. మంగళవారం ఆయన కదిరి మండలంలోని చెర్లోపల్లి రిజర్వాయర్ నుంచి పుంగనూరు బ్రాంచ్ కెనాల్ ద్వారా కుప్పంకు నీటిని విడుదల చేశారు. అంతకుముందు జలహారతి ఇచ్చి, పైలాన్‌ను ఆవిష్కరించారు. తర్వాత ఆదరణ–2 పథకం కింద పలువురికి పనిముట్లు, వ్యవసాయ పరికరాలు పంపిణీ చేశారు. అనంతరం బహిరంగ సభలో గంటకు పైగా ప్రసంగించారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తానన్నారు. 1.5 టీఎంసీల కెపాసిటీతో నిర్మించిన చెర్లోపల్లి రిజర్వాయర్ సామర్థ్యాన్ని భవిష్యత్‌లో పెంచడమే కాకుండా ఈ జలాశయం ద్వారా ఈ ప్రాంతంలోని అన్ని చెరువులను నింపుతామని హామీ ఇచ్చారు. అనంతపురం అనగానే కరువు జిల్లాగా పేరుందని, ఇక్కడి ప్రజలు ఇతర ప్రాంతాలకు వలసలు కూడా వెళ్తున్నారన్నారు. అయితే రానున్న రోజుల్లో ఇతర ప్రాంతాల వారే ‘అనంత’కు వలసలు రావడం ఖాయమన్నారు. చిత్రావతి రిజర్వాయర్‌తో అనుసంధానం చేస్తాం హంద్రీనీవా ప్రాజెక్టును చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌తో అనుసంధానం చేస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నదుల అనుసంధానంతో రాయలసీమకు సరిపడ నీటిని అందిస్తామని తెలిపారు. ప్రధాని మోదీ రాష్ట్రాభివృద్ధికి సహకరించడం లేదని, అయినా సంక్షోభంలో అవకాశాలను వెదక్కోవడం తనకు బాగా తెలుసన్నారు. ఏపీ నుంచి భారీగా పన్నులు కడుతున్నా...నిధులిచ్చేందుకు ఆయన మనసు రావడం లేదన్నారు. పోస్టుడేటెడ్ చెక్కులు ఇస్తున్నాం డ్వాక్రా గ్రూపులను ప్రారంభించిదే టీడీపీ అని, డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు ఫిబ్రవరి 2, 3, 4వ తేదీల్లో ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున 3 పోస్టుడేటెడ్ చెక్కులు పంపిణీ చేస్తామన్నారు. వీటిని మార్చి, ఏప్రిల్ నెలల్లో డ్రా చేసుకోవచ్చాన్నారు. దీని ద్వారా 95 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరుతుందన్నారు. ‘జయహో బీసీ’ సభ ద్వారా 22 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపామనీ, ఆయా వర్గాలకు వాటి ద్వారా నిధులిచ్చి ఆదుకుంటామన్నారు. ‘‘నేను మీ కోసం ఐదేళ్లుగా కష్టపడుతున్నాను..మీరు నాకోసం 75 రోజులు కష్టపడి గెలిపించండి’’ అని కోరారు. కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమ, పరిటాల సునీత, కాలువ శ్రీనివాసులు, ప్రభుత్వ చీఫ్‌విప్ పల్లె రఘునాథరెడ్డి, ఎమ్మెల్యే వరదాపురం సూరి, విప్ చాంద్‌బాషా, టీడీపీ కదిరి నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకట ప్రసాద్ పాల్గొన్నారు. -
నిలదీస్తే.. వేధింపులా?
కియా కార్ల తయారీ పరిశ్రమ కోసం భూములు ఇచ్చిన వారి కుటుంబాల్లో పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తామని పాలకులు హామీ ఇచ్చారు. స్థానికులకు, నిర్వాసిత కుటుంబాల వారికి కాకుండా స్థానికేతరులకు ప్రాధాన్యత ఇస్తూ ఉద్యోగాలు కట్టబెట్టారు. ‘కియా’లో ఉద్యోగం మిథ్యగా మారిన నేపథ్యంలో సహనం కోల్పోయిన ఓ రైతు బిడ్డ ఉద్యోగం కోసం ఎమ్మెల్యేను నిలదీశాడు. అంతే ఆయన ఆగ్రహిస్తూ చిందులేశారు. వారం తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకుని వేధింపులకు గురి చేశారు. అనంతపురం , పెనుకొండ రూరల్: పెనుకొండ మండలం అమ్మవారిపల్లికి చెందిన అంజనరెడ్డి కియా పరిశ్రమకు రెండు ఎకరాల పొలాన్ని ఇచ్చాడు. సేకరణ సమయంలో భూ నిర్వాసిత కుటుంబంలో పిల్లలకు అర్హతను బట్టి కియాలోనే ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. సరే తమ పొలం పోయినా ఎంసీఏ వరకు చదువుకున్న కుమారుడ వెంకటరెడ్డికి స్థానికంగానే ఉపాధి దొరుకుతుందని రైతు ఆనంద పడ్డాడు. నెలలు గడిచిపోతున్నా ఎటువంటి సమాచారమూ లేకపోవడంతో క్రమక్రమంగా వారిలో ఆందోళన మొదలైంది. ఈ క్రమంలో వారం రోజుల క్రితం పెనుకొండ మండలం మోటువారిపల్లి నుంచి అనంతపురం వెళ్తూ అమ్మవారుపల్లిలోకి వచ్చిన ఎమ్మెల్యే బీకే పార్థసారథిని గ్రామస్తులు, భూ నిర్వాసితుల కుటుంబాలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా భూమి కోల్పోయిన రైతు అంజనరెడ్డి కుమారుడు వెంకటరెడ్డి తమకు కియా పరిశ్రమలో ఉద్యోగాలు ఎప్పుడిస్తారంటూ ఎమ్మెల్యేతో వాగ్వాదం చేశాడు. ఈ సమయంలో ‘నువ్వు రెడ్డివి కాబట్టే ప్రశ్నిస్తున్నావ్’ అంటూ ఎమ్మెల్యే ఎదురుదాడికి దిగి దూషించాడు. దీన్ని ఆసరాగా తీసుకున్న పోలీసులు మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో అమ్మవారుపల్లికెళ్లి వెంకటరెడ్డిని, అతని తండ్రి అంజనరెడ్డిని అదుపులోకి తీసుకుని పెనుకొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. బాధితులకు శంకరనారాయణ బాసట పోలీసుల అదుపులో ఉన్న రైతు అంజనరెడ్డి, కుమారుడు వెంకటరెడ్డిని మంగళవారం ఉదయం వైఎస్సార్సీపీ సమన్వయకర్త మాలగుండ్ల శంకరనారాయణ, వైఎస్సార్సీపీ నాయకులు పరామర్శించారు. అక్కడ ఉన్న ఏఎస్ఐ సిద్దయ్యతో బాధితుల విషయంపై చర్చించారు. కియా పరిశ్రమకు భూములిచ్చిన రైతుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వకపోగా.. ఇలా స్టేషన్ల చుట్టూ తిప్పుకోవడం, వారిని వేధించడం ఏమిటని వాగ్వాదం చేశారు. అనంతరం పోలీసుల అదుపులో ఉన్న రైతు, ఆయన తనయుడిని విడిపించారు. రైతు కుటుంబాలను వేధించడం తగదు కియా పరిశ్రమ కోసం దాదాపు 400 మంది రైతులు అతి తక్కువ రేటుకు భూములు ఇచ్చారని, అయితే చదును పేరుతో ఎకరాకు రూ.30 లక్షల మేర ఖర్చు పెట్టిన ప్రభుత్వం నిర్వాసిత రైతు కుటుంబాలను వేధించడం ఎంతవరకు సమంజసమని శంకరనారాయణ విలేకరుల సమావేశంలో అన్నారు. కియా పరిశ్రమ ప్రారంభమైనప్పటి నుంచి ఇతర ప్రాంతాల వారికి ప్రత్యేకించి చెన్నై వారికి అధిక సంఖ్యలో ఉద్యోగాలు కేటాయిస్తున్నారన్నారు. స్థానిక రైతు పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకపోగా అడిగిన పాపానికి ఎమ్మెల్యే బెదిరింపులకు దిగి, అరెస్టులు చేయించడం పద్ధతి కాదన్నారు. ఎంతమందికి ఉద్యోగాలిచ్చారు? స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ అభ్యర్థులకు శిక్షణ ఇచ్చామంటున్న రాష్ట్ర ప్రభుత్వం కియా పరిశ్రమలో ఎంత మందికి ఉద్యోగాలు కల్పించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం భూమి కోల్పోయిన కుటుంబాలు కానీ, స్థానికులు కానీ కియా పరిశ్రమలో దిన కూలీలుగా కార్మికులుగా, మహిళలైతే హౌస్‌కీపింగ్ లాంటి చిన్నచిన్న ఉద్యోగాలే కేటాయిస్తున్నారు. వారం రోజుల్లోపు కియా పరిశ్రమకు భూములిచ్చిన రైతు కుటుంబాలకు, స్థానిక యువతకు కియా పరిశ్రమలో ఉద్యోగాలు కల్పించాలని, లేనిపక్షంలో వైఎస్సార్సీపీ తరఫున పరిశ్రమ ఎదుట భూ నిర్వాసిత కుటుంబాలతో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు మాజీ సర్పంచ్ మునిమడుగు శ్రీనివాసులు, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ నాగలూరు బాబు పాల్గొన్నారు. శంకరనారాయణపై నిఘా పెనుకొండ: ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో వైఎస్సార్ సీపీ హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. ఆయన ఇంటి చుట్టూ మఫ్టీలో ఉన్న పోలీసులు మొహరించారు. అంతేకాకుండా ఆయన్ను అనుసరించేందుకు ఇద్దరు కానిస్టేబుళ్లను ప్రత్యేకంగా నియమించారు. మంగళవారం శంకర్‌నారాయణ మండలంలోని శెట్టిపల్లి గ్రామంలో ‘‘రావాలి జగన్..కావాలి జగన్’’, ‘‘నిన్ను నమ్మం బాబూ’’ కార్యక్రమాల్లో పాల్గొనగా ఆ ఇద్దరు పోలీసులు ఆయన్ను అనుసరించారు. ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్లారు. సీఎం రాక నేపథ్యంలో ఏవైనా ఆందోళనలు, నిరసనలు చేసే అవకాశం ఉంటుందన్న ఆలోచనతోనే పోలీసులు నిఘా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. -
‘కారు’మబ్బులు!
కియా పరిశ్రమతో బతుకులు మారుతాయనుకుంటే.. ఆశల చుట్టూ ‘కారు’ చీకటి కమ్ముకుంటోంది. పిల్లల జీవితాలు బాగుపడతాయని భూములు ఇచ్చిన రైతులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. రెండేళ్లు గడిచినా ఇప్పటికీ 20 మందికి పైగా రైతులకు పరిహారం అందని పరిస్థితి. అన్ని అర్హతలున్నా రైతు కుటుంబాలను ఉద్యోగాలు ఊరిస్తూనే ఉన్నాయి. జిల్లా అధికార యంత్రాంగం అదిగో.. ఇదిగో.. అనే ప్రకటనలకే పరిమితం కాగా.. కియా పరిశ్రమ ‘తమిళ తంబీ’లకు అడ్డాగా మారుతోంది. పెనుకొండ/పెనుకొండ రూరల్: పెనుకొండ సమీపంలోని అమ్మవారుపల్లి వద్ద కియా కార్ల పరిశ్రమ నిర్మితమైంది. జిల్లాలోని దాదాపు 5వేల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇప్పటి వరకు కూలీ పనులు తప్పిస్తే ఒక్కరికీ ఉద్యోగి కల్పించలేకపోయారు. భూములు కోల్పోయిన రైతుల కుటుంబాల్లో అర్హులుంటే ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీ కూడా అమలుకు నోచుకోని పరిస్థితి. ఇదిలాఉంటే స్కిల్ పేరిట చెన్నై, జార్కండ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాల వారికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు. జిల్లా కలెక్టర్ మొదలుకొని కనిపించిన ప్రతీ అధికారికి ఇక్కడి ప్రజలు చేతులెత్తి మొక్కుతున్నా ఫలితం లేకపోతోంది. కియా అంటేనే ఓ మాయా ప్రపంచంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కియా కోసం రైతుల నుంచి భూములు సేకరించి దాదాపు రెండేళ్లవుతోంది. అమ్మవారుపల్లికి చెందిన రైతులు వడ్డె సుబ్బరాయుడు, చిన్న సుబ్బరాయుడు, నాగభూషణం, చలపతి, నాగరాజులకు ఎర్రమంచి పొలం సర్వే నంబర్ 193/10లో సుమారు 5 ఎకరాల భూమి ఉంది. ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా ఈ భూమి సేకరించింది. అయితేఇప్పటికీ వీరికి పరిహారం అందివ్వలేదు. ప్రస్తుతం వీరు జీవనాధారం కోల్పోయి కూలీ పనులకు వెళ్తున్నారు. వీరి పిల్లలు ఎంసీఏ, బీటెక్ చదివినా కనీసం ఉద్యోగ అవకాశం కూడా కల్పించకపోవడం విమర్శలకు తావిస్తోంది. కియాలో ఉద్యోగాలు ఏవీ.. ప్రతి సమావేశంలో స్థానికులకే ఉపాధి కల్పిస్తాం.. కియా పరిశ్రమకు భూములిచ్చిన వారి పిల్లలందరికీ వందశాతం ఉద్యోగాలు కల్పిస్తామని స్థానిక ఎమ్మెల్యే బీకే పార్థసారధి, జిల్లా కలెక్టర్ వీరపాండియన్ చెబుతున్నా ఆ దిశగా చర్యలు కరువయ్యాయి. గత డిసెంబర్ 12న కియా పరిశ్రమలో ఇతర ప్రాంతాల వారికే ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పిస్తున్నారని ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఇందుకు స్పందిస్తూ డిసెంబర్ 15న కియా పరిశ్రమ సమీపంలోని టూరిజం శాఖ కార్యాలయంలో భూనిర్వాసితుల కుటుంబాల పిల్లలతో తహసీల్దార్ హసీనాసుల్తానా దరఖాస్తులు స్వీకరించారు. ఇప్పటికి 45 రోజులు గడిచినా ఉద్యోగాల ఊసే లేకపోయింది. పది రోజులుగా భూనిర్వాసితుల పిల్లల చదువును బట్టి వారికి కియా పరిశ్రమలో నేరుగా కాకుండా కియా అనుబంధ పరిశ్రమలైన హుందాయ్, మొబిస్, గ్లోవిస్, డైమోస్ అనే కంపెనీల్లో ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు చేస్తామని ఫోన్లు చేశారు. కానీ ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది. సాధారణంగా కియా అనుబంధ పరిశ్రమల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి నేరుగా ఇంటర్వ్యూలు ఏడాది పొడవునా నిర్వహిస్తుండటం గమనార్హం. ప్లేట్లు, గ్లాసులతో సరి గత ఏడాది ఫిబ్రవరి మాసంలో కియా పరిశ్రమను సందర్శించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిశ్రమకు భూములిచ్చిన రైతులకు ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేశాడే కానీ వీరి కుటుంబాల్లో పిల్లలకు ఉద్యోగాలు కల్పించలేకపోయారు. ముఖ్యమంత్రి పర్యటన సమయంలో భూనిర్వాసితుల పిల్లలు సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్తారని భావించి అధికారులు, పోలీసులు బుజ్జగించి అడ్డుకున్నారు. తాజాగా సీఎం పర్యటన నేపథ్యంలో భూ నిర్వాసితుల పిల్లలు చంద్రబాబును నిలదీయకుండా పోలీసులు స్టేషన్ చుట్టూ తిప్పుకుంటున్నారు. మొత్తంగా భూములు కోల్పోయి, ఉద్యోగాలు దక్కక రైతుల కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. కలగానే పరిశ్రమలు 2015 సెప్టెంబర్ 30న గోరంట్ల మండలంలోని పాలసముద్రం వద్ద 44వ జాతీయ రహదారి పక్కన రూ.750 కోట్లతో 953 ఎకరాల్లో బెల్, నాసన్ల పరిశ్రమ నిర్మాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, బీజేపీకి చెందిన అప్పటి రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్, అప్పటి కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సుజనాచౌదరిలు శంకుస్థాపన చేశారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు పరిశ్రమల నిర్మాణమే చేపట్టలేదు. అదేవిధంగా సోమందేపల్లి మండలం గుడిపల్లి వద్ద ఎయిర్‌బస్ నిర్మాణంతో పాటు ఫైవ్‌స్టార్ హోటల్ కడుతామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన ప్రకటనకు ఇప్పటికీ దిక్కు లేకుండా పోయింది. ఆచరణ లేని హామీలతో నిరుద్యోగులను ఒక పథకం ప్రకారం మోసగిస్తున్న ప్రభుత్వ తీరుపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాలకు పయనం.. 2020 నాటికి ఏపీని ఇండస్ట్రియల్ హబ్‌గా తీర్చిదిద్ది దేశంలోని మూడు అగ్ర రాష్ట్రాల సరసన నిలుపుతామని సీఎం చేసిన ప్రకటన నవ్వులపాలవుతోంది. ఈ నేపథ్యంలో అనేక మంది నిరుద్యోగులు తమ కుటుంబాలను వీడి బెంగళూరు, చెనై, హైదరాబాద్, ముంబయి తదితర ప్రాంతాల్లో ఉద్యోగాల వేటకు వెళ్తున్నారు. పరిశ్రమల పేరుతో పెనుకొండ, సోమందేపల్లి, గోరంట్ల మండలాల్లో వేల ఎకరాలు సేకరించిన ప్రభుత్వం బడా బాబులకు కట్టబెట్టింది. జాతీయ రహదారి పక్కన ఏ భూమి కనిపించినా లాగేసుకుంది. ప్రభుత్వం భూములు సేకరించే ప్రాంతంలో ముందుగానే తక్కువ ధరకు సమీప పొలాను కొనుగోలు చేసిన టీడీపీ నేతలు కోట్లకు పడగెత్తారు. అయితే పరిశ్రమలకు భూములు ఇచ్చిన రైతుల కుటుంబాల్లో మాత్రం నైరాశ్యం అలుముకుంది. -
మోస'కార్లు'
కియాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఏకంగా బోర్డులు పెట్టేస్తున్నారు. భర్తీ ప్రక్రియ మాకే అప్పగించారంటూ ఏజెన్సీలు ప్రచారం చేసుకుంటున్నాయి. కొరియా భాష నేర్పిస్తామనే ముసుగులో శిక్షణ కేంద్రాల్లోనూ ఉద్యోగాల దందా సాగుతోంది. పీజీలు.. డిగ్రీలు చదివి ఉపాధి వేటలో విసిగిపోయిన నిరుద్యోగ యువత కియా మాయలో ఉన్నదంతా ఊడ్చిపెట్టి ఇప్పుడు దిక్కులు చూడాల్సిన పరిస్థితి. ఎలక్ట్రికల్.. ఫిట్టింగ్.. సూపర్వైజర్లు.. అటెండర్లు.. క్లర్క్ పోస్టుల పేరుతో సాగుతున్న దందా యువకుల జీవితాల్లో చీకట్లు నింపుతోంది. నాకు ‘కియా’లో ఎలక్ట్రికల్ విభాగంలో ఉద్యోగం ఇప్పిస్తామన్నారు. నెలకు జీతం రూ.20వేలు అన్నారు. తర్వాత జీతం పెరుగుతుందన్నారు. ఉద్యోగం ఇప్పించేందుకు రూ.లక్ష తీసుకున్నారు. సీఎం భూమి పూజ చేసిన తర్వాత ఉద్యోగాలు భర్తీ చేస్తారని చెబుతున్నారు. ఆరా తీస్తే ఉద్యోగాల భర్తీ పూర్తిగా కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుందని.. ప్రైవేటు వ్యక్తులకు సంబంధం లేదని తెలిసింది. మధ్యవర్తులను నిలదీస్తే ఉద్యోగం ఇప్పిస్తామని, గొడవ చేస్తే పైసా కూడా వెనక్కు ఇవ్వమని బెదిరిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: కొరియాకు చెందిన ‘కియా’ కార్ల పరిశ్రమ పెనుకొండ వద్దనున్న అమ్మవారిపల్లి సమీపంలో ఏర్పాటవుతోంది. దీని కోసం 600 ఎకరాల భూమిని ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా సేకరించి ‘కియా’కు అప్పగించింది. ఈ భూమిని చదును చేసేందుకు రూ.178 కోట్లతో ఏపీఐఐసీ టెండర్లు ఆహ్వానించగా.. ఎల్అండ్టీ సంస్థ దక్కించుకుని పనులు చేస్తోంది. ఇప్పటి వరకు ఏపీఐఐసీకి సంబంధించిన నిధులతోనే పనులు చేపడుతున్నారు. కియాకు సంబంధించి పూర్తిస్థాయిలో పనులు వేగం పుంజుకోని పరిస్థితి. ఈనెల 22న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కియాకు భూమిపూజ చేయించి పనులు ప్రారంభించాలని కియా యాజమాన్యం భావిస్తోంది. ఆ తర్వాత పనులు మొదలవుతాయి. అప్పుడు వాచ్మన్లు, కూలీల నియామకానికి మాత్రమే అవకాశం ఉంటుంది. కర్మాగారం నిర్మాణానికి సంబంధించి పూర్తిస్థాయిలో కొరియా నుంచి ఇంజనీర్లు, వర్కర్లు చేరుకున్నారు. భూమి పూజ తర్వాత.. ఫ్యాక్టరీ పూర్తయ్యే దాకా కొరియన్లే పనులు చేసే అవకాశం ఉంది. ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి కావాలంటే వేగంగా చేసినా రెండేళ్లకు పైగా సమయం పడుతుంది. ఫ్యాక్టరీ నిర్మాణం తర్వాత కూడా ప్రాధాన్య విభాగాల్లోని ‘స్కిల్డ్ లేబర్’లో అధికశాతం కొరియన్లు ఉండే అవకాశం ఉంది. ఇక్కడి వారికి అతి తక్కువగా ఉద్యోగాలు దక్కే అవకాశం ఉంటుంది. అసలు ఇప్పటి వరకు కియా ఎలాంటి ఉద్యోగ నియామక ప్రకటనా ఇవ్వలేదు. భర్తీకి ఉపక్రమించలేదు. కేవలం కియా పేరు చెప్పుకుని కొందరు దందాకు పాల్పడుతున్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ఉద్యోగాల భర్తీ కియా కార్ల పరిశ్రమలో ఉద్యోగాల భర్తీ మొదలైన తర్వాత యాజమాన్యం తమకు అవసరమైన ఉద్యోగులను కలెక్టర్ ద్వారా భర్తీ చేయాలని భావిస్తోంది. విభాగాల వారీగా ఏ శాఖకు ఎంతమంది అవసరమవుతారు? విద్యార్హత? అనుభవాలను బట్టి నియామక ప్రక్రియ చేపట్టనున్నారు. ఇందులో కూడా మొదటి ప్రాధాన్యత పరిశ్రమ కోసం భూములు కోల్పోయిన వారికి ఇవ్వనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత వృతి నైపుణ్యాల ఆధారంగా కంపెనీ విధివిధానాల ప్రకారం భర్తీ జరుగనుంది. ఇదంతా తెలియని కొందరు నిరుద్యోగులు ఉద్యోగంపై ఆశతో దళారులను నమ్మి మోసపోతున్నారు. పీజీ చేసి ఖాళీగా ఉన్నా. నాకు సూపర్వైజర్ ఉద్యోగం ఇప్పిస్తామన్నారు. రూ.2లక్షలు ఇవ్వాలరు. ఇందులో అక్కడ ఉద్యోగాల భర్తీ పర్యవేక్షించే అధికారికి రూ.1.50లక్షలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అడ్వాన్స్‌గా రూ.70వేలు ఇచ్చినా. ఉద్యోగం అంటే ఆశతో డబ్బులు ఇచ్చాం. అయితే కియా కార్ల పరిశ్రమలో ఉద్యోగాల భర్తీ మొదలు కాలేదని తెలిసింది. రాద్ధాంతం చేస్తే ఇచ్చిన డబ్బులు రావేమోనని భయమేస్తోంది. – రాకేశ్, రాప్తాడు -
ఉద్యోగాల కల్పన పేరుతో టీడీపీ నయాదందా
నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న వైనం అర్హులకు అన్యాయం జరిగితే ఆందోళన తప్పదన్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ఆర్డీవోతో చర్చించిన మాలగుండ్ల శంకరనారాయణ పెనుకొండ : ‘మండలంలో ఏర్పాటు కానున్న కియా కార్ల పరిశ్రమలో ఉద్యోగాలు కల్పిస్తామంటూ టీడీపీ నేతలు మభ్య పెడుతున్నారు. నిరుద్యోగులకు ఆశ చూపి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దీని వల్ల అర్హులకు అన్యాయం జరిగితే సహించబోం’ అంటూ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ హెచ్చరించారు. టీడీపీ నేతలు సాగిస్తున్న నయా దందాపై ఆయన ఆర్డీవో రామ్మూర్తికి సోమవారం ఫిర్యాదు చేసి, మాట్లాడారు. ఉద్యోగాలు కల్పిస్తామంటూ నిరుద్యోగులను స్థానిక ఎమ్మెల్యే పార్థసారథి అనుచరులు కొందరు మభ్యపెట్టి దరఖాస్తులు స్వీకరిస్తున్నారని అన్నారు. ఈ రూపేనా పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారి, అర్హులకు అన్యాయం జరిగే అవకాశముందన్నారు. ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు, భూములు స్వాధీనం చేసిన రైతుల కుటుంబాలకు తొలి ప్రాధాన్యతనివ్వాలని కోరారు. ఎలాంటి అవకతవకలకు పాల్పడినా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన వెంట పార్టీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గుట్టూరు శ్రీరాములు, లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి భాస్కరరెడ్డి, మండల కన్వీనర్ శ్రీకాంత్‌రెడ్డి, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ నాగలూరు బాబు, టౌన్ కన్వీనర్ ఏనుగుల ఇలియాజ్, ఎంపీటీసీ సభ్యుడు రామ్మోహన్‌రెడ్డి, సర్పంచ్‌లు సుధాకరరెడ్డి, సరస్వతమ్మ చంద్రారెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, స్థానిక నేతలు పాల్గొన్నారు. స్పందించిన ఆర్డీఓ శంకర్‌నారాయణ అభ్యర్థనపై ఆర్డీఓ రామ్మూర్తి సానుకూలంగా స్పందించారు. నిరుద్యోగుల రాజకీయ నాయకులెవ్వరూ దరఖాస్తులు స్వీకరించరాదని స్పష్టం చేశారు. ఆశలు రేకెత్తించడం నేరమని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఉద్యోగావకాశాలు కల్పిస్తామని భరోసానిచ్చారు.