దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం కియా భారత మార్కెట్లలోకి మరో కారును లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ‘కారెన్స్’ పేరుతో రిక్రియేషన్ వెహికిల్(ఆర్‌వీ)ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. సెవన్ సీటర్ కియా కారెన్స్‌ను డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా కంపెనీ ఆవిష్కరించనుంది. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో అమ్మకాలను జరిపేందుకు కంపెనీ సన్నాహాలను చేస్తోంది.
చదవండి: పిల్లల కోసం అదిరిపోయే టెస్లా వెహికల్.. ధర ఎంతో తెలుసా?
భారత్‌లోని న్యూ జనరేషన్ కుటుంబాలకు నచ్చే విధంగా కియా కారెన్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ‘మేడ్ ఇన్ ఇండియా..మేడ్ ఫర్ వరల్డ్..!’ అనే నినాదంతో కారెన్స్‌ను కియా లాంచ్ చేయనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని కియా తయారీ కేంద్రంలో కారెన్స్ ఉత్పత్తి కానుంది. భారత ఆటోమొబైల్ మార్కెట్లలో కియా కారెన్స్ గేమ్ ఛేంజర్‌గా నిలుస్తోందని కియా ఇండియా ఎండీ, సీఈవో తే-జిన్ పార్క్ అభిప్రాయపడ్డారు.
చదవండి: ఎలక్ట్రిక్ వాహన ధరలు భారీగా పెరగనున్నయా.. ఎంత వరకు నిజం?
Comments
Please login to add a commentAdd a comment