
జనవరి 3 నుంచి బుకింగ్స్
ఫిబ్రవరిలో డెలివరీలు షురూ
ధర రూ.10–15 లక్షలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ కియా ఇండియా సరికొత్త సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సిరోస్‌ను భారత్ వేదికగా అంతర్జాతీయంగా ఆవిష్కరించింది. 2025 జనవరి 3 నుంచి బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి మొదటి వారం నుంచి డెలివరీలు మొదలవుతాయి. ధర ఎక్స్‌షోరూంలో రూ.10–15 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.
118 బీహెచ్‌పీ, 172 ఎన్‌ఎం టార్క్‌తో పెట్రోల్ వేరియంట్ 1.0 లీటర్ త్రీ–సిలిండర్ టర్బోచార్జ్‌డ్ ఇంజిన్‌తో తయారైంది. 6 స్పీడ్ మాన్యువల్ లేదా 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ఎంచుకోవచ్చు. లెవెల్–2 అడాస్, 6 ఎయిర్‌బ్యాగ్స్, ఎల్రక్టానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి భద్రతా ఫీచర్లు జోడించారు. 30 అంగుళాల పనోరమిక్ డ్యూయల్ స్క్రీన్ సెటప్, 360 డిగ్రీ పార్కింగ్ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి హంగులు జోడించారు.
Comments
Please login to add a commentAdd a comment