new model design
-
ఆభరణాల డిన్నర్ సెట్
కంఠహారం, చెవి జూకాలు, ఉంగరాలు.. ఇలా ఆభరణాలను ఒక సెట్‌గా తీసుకోవడం మనకు తెలిసిందే! ఇప్పుడు డిన్నర్ సెట్ ఆభరణాల అలంకరణ కొత్త ట్రెండ్‌గా మారింది. డిన్నర్‌సెట్ ఆభరణాలు ఇంటికి మరింత కళను తీసుకువస్తున్నాయి. పింగాణీ కప్పులు, ప్లేట్ల మీద ఇంపైన ఆభరణాల డిజైన్లు భలే మెరుస్తున్నాయి. డిజైన్‌ను బట్టి, వాటికి వాడిన రంగుల నాణ్యతను బట్టి వీటి ధరలు ఉంటున్నాయి. వీటిలో పూసలు, ముత్యాలు, స్టోన్స్, ఎనామిల్ పెయింట్స్‌ను కూడా వాడుతున్నారు. ఈ డిజైన్లలో బంగారు పూత, నిజమైన రత్నాలు వాడినవీ ఉంటున్నాయి. ప్లెయిన్‌గా ఉండే పింగాణీ కప్పుల మీద అందమైన ఆభరణాల డిజైన్లను తీర్చిదిద్దేతే అవి కొత్త అందాన్ని సంతరించుకుంటాయి. ప్లెయిన్ పింగాణీ వస్తువులను కొనుక్కుని, వాటిపై స్వయంగా రంగులు వేసుకోవచ్చు. ఆభరణాల డిజైన్‌నూ దిద్దుకోవచ్చు. అతిథులను ఆకట్టుకునేలా వీటిని వేడుకలలో ఉపయోగిం చవచ్చు. -
లెక్ట్రిక్స్ కొత్త స్కూటర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విభిన్న వ్యాపారాల్లో ఉన్న ఎస్ఏఆర్ గ్రూప్‌నకు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీ లెక్ట్రిక్స్ ఈవీ.. కొత్త స్కూటర్‌ను రెండు వేరియంట్లలో ఎల్ఎక్స్ఎస్ జీ3.0, ఎల్ఎక్స్ఎస్ జీ2.0 ట్రిమ్స్‌లో ప్రవేశపెట్టింది. ప్రారంభ ధర రూ.97,999. తొలిసారిగా 12 రకాల ఫీచర్లతో కలుపుకుని మొత్తం 93 రకాల హంగులను జోడించినట్టు లెక్ట్రిక్స్ ప్రకటించింది. ఎమర్జెన్సీ ఎస్‌వోఎస్ అలర్ట్, నావేగిషన్ అసిస్ట్, ఓవర్ ద ఎయిర్ అప్డేట్స్ వంటివి ఇందులో ఉన్నాయి. 3 కిలోవాట్ బ్యాటరీతో రూపొందిన ఎల్ఎక్స్ఎస్ జీ3.0 ఒకసారి చార్జింగ్‌తో 105 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. గంటకు 40 కిలోమీటర్ల వేగాన్ని 9 సెకన్లలో అందుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 60 కిలోమీటర్లు. 2.3 కిలోవాట్ అవర్ బ్యాటరీతో ఎల్ఎక్స్ఎస్ జీ2.0 తయారైంది. ఒకసారి చార్జింగ్‌తో 80 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 10.2 సెకన్లలో గంటకు 40 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 55 కిలోమీటర్లు. హర్యానాలోని మనేసర్ వద్ద ఉన్న ప్లాంటు సామర్థ్యం ఏటా 1.5 లక్షల యూనిట్లు. ఇప్పటికే లెక్ట్రిక్స్ ఈవీ కోసంఎస్ఏఆర్ గ్రూప్ రూ.300 కోట్లు ఖర్చు చేసింది. లుమినస్, లివ్‌గార్డ్, లివ్‌ఫాస్ట్, లివ్‌ప్యూర్ బ్రాండ్లను సైతం ఈ గ్రూప్ ప్రమోట్ చేస్తోంది. -
హోండా నుంచి న్యూ మోడల్ కారు
సాక్షి, హైదరాబాద్: హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ కొత్త మోడల్ కారును లాంచ్ చేసింది. నాగోల్ గ్రీన్ హోండా షోరూమ్ వద్ద బుధవారం ‘ఈ–హెవ్’ మోడల్ కారును హైదరాబాద్ మెట్రోవాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు (హెచ్ఎమ్ఎస్ఎస్) ఎండీ ఎం.దానకిశోర్ లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో సీఈఓ వివేకానంద ఆర్యశ్రీ, సేల్స్ హెడ్ శ్రీధర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హోండా ‘న్యూ సిటీ ఈ–హెవ్’ దేశంలో మొదటి బలమైన హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనమని చెప్పారు. మెయిన్ స్ట్రీమ్ సెగ్మెంట్లో విప్లవాత్మక స్వీయ–ఛార్జింగ్‌తో అత్యంత సమర్థవంతంగా పని చేస్తోందన్నారు. గత నెల 14 నుంచి బుకింగ్ మొదలు కాగా, ఈ నెలలో అమ్మకాలను ప్రారంభించినట్లు వారు పేర్కొన్నారు. దీని పనితీరు, సామర్ధ్యం ప్రాముఖ్యంగా ఉంటుందని పేర్కొన్నారు. (చదవండి: యూట్యూబ్ క్రియేటర్లకు గూగుల్ భారీ షాక్!) -
మెరిసిన ‘మండువా లోగిలి’!
నామకరణ మహోత్సవానికి వేదికైన ఇళ్లు రంగురంగుల గదులు, ఆల్టెక్, సీలింగ్ ఇలా ఇంటీరియర్ డెకరేషన్లతో అధునాతన భవనాలు అందుబాటులోకి వచ్చినా.. పాతతరం మండువాలోగిళ్లకు మాత్రం క్రేజ్ తగ్గడం లేదు. పి.గన్నవరం మండలం వాడ్రేవుపల్లి గ్రామంలో ఓ సంప్రదాయ కుటుంబం జరుపుకొన్న ఓ వేడుకకు సుమారు 125 ఏళ్ల చరిత్ర ఉన్న మండువాలోగిలి వేదికైంది. గ్రామానికి చెందిన నార్పిన వీరయ్య చౌదరి తమ మనుమరాలి నామకరణ మహోత్సవం సందర్భంగా ఈ మండువాలోగిలిని ప్రత్యేకంగా, సర్వాంగసుందరగా తీర్చిదిద్దించారు. ఎక్కడెక్కడో విద్య, ఉద్యోగ, వ్యాపారరీత్యా స్థిర పడిన వారంతా తమ సొంత ఊరిలో జరిగే ఈ కార్యక్రమానికి విచ్చేసి సందడి చేశారు. దీంతో అక్కడంతా పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమానికి ముంబయ్‌కి చెందిన వంటగాళ్లు, కెమెరామెన్లు రావడం విశేషం. ముంబయ్‌లోని ప్రముఖ హోటల్లో బాలీవుడ్ హీరోలకు వంటలు చేసే చెఫ్ జావేద్ అహ్మద్ ఇక్కడి వచ్చి తన చేతి రుచులు చూపించారు. – పి.గన్నవరం