మెరిసిన ‘మండువా లోగిలి’! | 125 years old house new model design | Sakshi
Sakshi News home page

మెరిసిన ‘మండువా లోగిలి’!

Published Thu, Sep 8 2016 4:22 PM | Last Updated on Mon, Sep 4 2017 12:41 PM

మెరిసిన ‘మండువా లోగిలి’!

మెరిసిన ‘మండువా లోగిలి’!

  • నామకరణ మహోత్సవానికి వేదికైన ఇళ్లు 
  •  
    రంగురంగుల గదులు, ఆల్‌టెక్, సీలింగ్‌ ఇలా ఇంటీరియర్‌ డెకరేషన్లతో అధునాతన భవనాలు అందుబాటులోకి వచ్చినా.. పాతతరం మండువాలోగిళ్లకు మాత్రం క్రేజ్‌ తగ్గడం లేదు. పి.గన్నవరం మండలం వాడ్రేవుపల్లి గ్రామంలో ఓ సంప్రదాయ కుటుంబం జరుపుకొన్న ఓ వేడుకకు సుమారు 125 ఏళ్ల చరిత్ర ఉన్న మండువాలోగిలి వేదికైంది. గ్రామానికి చెందిన నార్పిన వీరయ్య చౌదరి తమ మనుమరాలి నామకరణ మహోత్సవం సందర్భంగా ఈ మండువాలోగిలిని ప్రత్యేకంగా, సర్వాంగసుందరగా తీర్చిదిద్దించారు.
     
    ఎక్కడెక్కడో విద్య, ఉద్యోగ, వ్యాపారరీత్యా స్థిర పడిన వారంతా తమ సొంత ఊరిలో జరిగే ఈ కార్యక్రమానికి విచ్చేసి సందడి చేశారు. దీంతో అక్కడంతా పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమానికి ముంబయ్‌కి చెందిన వంటగాళ్లు, కెమెరామెన్లు రావడం విశేషం. ముంబయ్‌లోని ప్రముఖ హోటల్‌లో బాలీవుడ్‌ హీరోలకు వంటలు చేసే చెఫ్‌ జావేద్‌ అహ్మద్‌  ఇక్కడి వచ్చి తన చేతి రుచులు చూపించారు.
    – పి.గన్నవరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement