Old house
-
చెక్కుచెదరని సౌధం
సొంతిల్లు.. ప్రతి ఒక్కరి కలలకు ప్రతి రూపం. పట్టణాల నుంచి పల్లెల వరకు అభివృద్ధి వేగవంతం అయింది. ఇళ్ల మధ్య సీసీ రోడ్లు ఎత్తు పెరగడంతో పూర్వం రోజుల్లో ఎంతో అపురూపంగా నిర్మించుకున్న ఇల్లు లోతట్టుగా మారింది. రూ.లక్షలు పెట్టి కట్టుకున్న ఇంటిని వాస్తు, ఇతర కారణాలతో కొన్ని పరిస్థితుల్లో ఆ ఇంటిని కూల్చేసి పునర్నిర్మించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఇంటికి ఎలాంటి నష్టం జరగకుండా లిఫ్టింగ్, షిఫ్టింగ్ జపాన్ టెక్నాలజీతో ఎన్నంతస్తుల భవనాలనైనా సునాయాసంగా అమాంతంగా ఎత్తేస్తున్నారు. ఈ టెక్నాలజీతో భవన యజమానులకు సమయంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుంది. పొదలకూరు: టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. పల్లెల నుంచి పట్టణాల వరకు జనావాసాలు పెరుగుతున్నాయి. అందుకునుగుణంగా రహదారులు అభివృద్ధి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్నల్ రహదారులు ఎత్తుగా మారడంతో కొన్నేళ్ల క్రితం ఎంతో ముచ్చటపడి నిర్మించుకున్న కలల సౌదాలు లోతట్టులోకి మారిపోతున్నాయి. వర్షాకాలంలో ముంపు సమస్యలు ఒక ఎత్తైతే.. వాస్తుకు ఇది విరుద్ధంగా మారి ఆ ఇంటి యజమానులు కష్ట, నష్టాలు పడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇలాంటి పరిణామాల్లో ఎన్నో ఏళ్ల క్రితం పాతతరం తీపి జ్ఞాపకాలతో ఉన్న ఇంటిని కూల్చేయాలంటే కొందరి మనస్సు అంగీకరించదు. మరి కొందరు తాత తండ్రులు నిర్మించిన ఇంటిని పదిలంగా చూసుకుంటారు. ప్రతి ఇటుక పెద్దల కష్టార్జితంతో పెట్టినట్టు భావించి పాత ఇంట్లోనే ఉండేందుకు ఇష్టపడతారు. ఉన్న ఇంటిని ధ్వంసం చేయాల్సి వస్తే తల్లడిల్లిపోతారు. మూడు అడుగులు ఎత్తుకు.. పట్టణంలోని తొగటవీధిలో మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన నర్ల చిన్నపరెడ్డి ఇంటిని లిఫ్టింగ్ టెక్నాలజీతో మూడు అడుగుల ఎత్తు లేపుతున్నారు. బిల్డింగ్ లిఫ్టింగ్ అండ్ షిఫ్టింగ్ మొత్తం జాకీల సహాయంతోనే ఉంటుంది. లిఫ్టింగ్‌కు సాధార జాకీలు, షిఫ్టింగ్‌కు రన్నింగ్ జాకీలను వినియోగిస్తున్నారు. ఈ ప్రక్రియను ఇంజినీర్ల పర్యవేక్షణలో శిక్షణ పొందిన బిహార్‌కు చెందిన కూలీలు చేపడుతున్నారు. నర్ల చిన్నపరెడ్డి కుమారుడు శ్రీనివాసులురెడ్డి లిఫ్టింగ్ కంపెనీ వివరాలు తెలుసుకుని 30 ఏళ్ల క్రితం నిర్మించిన తమ ఇంటి జ్ఞాపకాలను చెక్కు చెదరకుండా రోడ్డుకు మూడు అడుగుల ఎత్తులో ఉండేలా లిఫ్టింగ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకోసం కంపెనీకు రూ.3.80 లక్షలు చెల్లించేలా అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ కంపెనీ ఇంజినీరు పర్యవేక్షణలో పదిహేను రోజులుగా పనులు ప్రారంభించి ఇప్పటి వరకు 1.5 అడుగుల మేర భవనాన్ని ఎత్తు లేపారు. మరో 1.5 అడుగుల ఎత్తు లేపాల్సి ఉందని వెల్లడించారు. టెక్నాలజీ సాయం.. భవనం పదిలం లిఫ్టింగ్ అండ్ షిఫ్టింగ్ (భవనం ఎత్తు లేవపడం, పక్కకు జరపడం) టెక్నాలజీ ఇప్పుడు వారి కష్టాలను తొలగిస్తోంది. నగర, పట్టణ ప్రాంతాల్లో లిఫ్టింగ్ టెక్నాలజీ కొత్తమీ కాకున్నా గ్రామీణ ప్రాంతాల్లో సైతం అందుబాటులోకి రావడం విశేషం. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ సంస్థ పాత ఇళ్లను చెక్కు చెదరకుండా ఇంటి యజమాని జ్ఞాపకాలను వారితోనే ఉంచే విధంగా పనిచేస్తోంది. పొదలకూరులో ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానం ఆలోచనే లేని సమయంలో బిల్డింగ్ లిఫ్టింగ్ టెక్నాలజీని వినియోగించుకుని తమ పాత ఇంటిని ఎత్తు లేపుకుంటున్న వైనం పరిశీలిస్తే సాంకేతికత గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరిస్తుందని అర్థం అవుతుంది. లిఫ్టింగ్, షిఫ్టింగ్ సురక్షితం భవనాల లిఫ్టింగ్, షిఫ్టింగ్ సురక్షితమని పనులు చేయించుకుంటున్న ఇంటి యజమానులు అంటున్నారు. ఈ టెక్నాలజీతో ఇప్పటికే చాలా చోట్ల బిల్డింగ్స్‌ను పైకి లేపడం, వాస్తురీత్యా పక్కకు జరపడం చేపట్టారు. వెంకటగిరి–ఏర్పేడు మార్గమధ్యంలో మల్లాం వద్ద హైవే రోడ్డు నిర్మాణం కోసం సేకరించిన భవనాన్ని 104 అడుగులు జరిపి మరో ప్లాటులో ఏర్పాటు చేసినట్టు లిఫ్టింగ్ ఇంజినీరు వెల్లడించారు. సుమారు 14 అడుగుల వరకు టెక్నాలజీతో భవనాలను ఎత్తు లేపవచ్చునంటున్నారు. ఒంగోలు, గూడూరుల్లో చాలా ఇళ్లను ఎత్తులేపారు. తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో సైతం భవంతులు, దేవాలయాలను ఎత్తులేపడం, పక్కకు జరపడం పూర్తి చేశారు. షిఫ్టింగ్ టెక్నాలజీలో ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని తెలుస్తోంది. పాత జ్ఞాపకాలు.. తక్కువ ఖర్చు మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన ఇంటి జ్ఞాపకాలు చెదరకుండా తక్కువ ఖర్చుతో భవనాన్ని లిఫ్టింగ్ చేస్తున్నారు. ఇదే ఇంటిని కూలదోసి అదే స్థలంలో నిర్మించాలంటే సుమారు రూ.30 లక్షలు ఖర్చు అవుతుంది. లిఫ్టింగ్ టెక్నాలజీతో ఇంటిని ఎత్తు లేపడంతో పాటు ఇతర రీ మోడలింగ్‌కు మరో రూ.10 లక్షల ఖర్చుతోనే పాత భవనాన్ని చెక్కుచెదరకుండా ఉంచుకోవచ్చని లిఫ్టింగ్ ఇంజినీర్లు అంటున్నారు. గతేడాది శ్రీనివాసపురంలో చెన్నైకు చెందిన లిఫ్టింగ్ కంపెనీ పాత భవనాన్ని జాకీల సాయంతో ఎత్తు లేపింది. ఇంటిని కూల్చేందుకు ఇష్టం లేక మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన మా ఇల్లు రోడ్లు అభివృద్ధి చెందడంతో లోతట్టుగా మారింది. అప్పటి పరిస్థితుల్లో ఎత్తులోనే నిర్మించుకున్నా.. ఇల్లు లోతట్టుగా మారడంతో వాస్తుకు విరుద్ధంగా ఉండడంతో ఇళ్లు కూల్చి కట్టడం తప్పనిసరి. అయితే పాత ఇల్లు కూల్చేందుకు ఇష్టం లేక లిఫ్టింగ్ టెక్నాలజీతో భవనాన్ని ఎత్తు లేపుకుంటున్నాం. చాలా చోట్ల విచారించే ఈ సాహసానికి పూనుకున్నాం. ఈ ప్రాంతంలో కొత్త అయినప్పటికీ సలహాలు తీసుకుని పెద్దలను ఒప్పంచి పనులు చేయిస్తున్నాం. ఈ విధానం వల్ల చాలా డబ్బు, సమయం ఆదా అవుతుంది. – నర్ల శ్రీనివాసులురెడ్డి, ఇంటి యజమాని, పొదలకూరు ఖర్చు తక్కువతో సమస్యకు పరిష్కారం భవనాన్ని చెక్కు చెదరకుండా లిఫ్టింగ్ అండ్ షిఫ్టింగ్ పనులు చేపడతాం. ఏ డేళ్లుగా ఈ రంగంలో ఇంజినీరుగా కొనసాగుతూ సొంతంగా కంపెనీని ఏర్పాటు చేసుకున్నాం. కూలీలకు సైతం శిక్షణ ఇచ్చి జాగ్రత్తలు పాటిస్తూ లిఫ్టింగ్ పనులు చేస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో తీరిక లేనంతగా పనులు ఉన్నాయి. జనం నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు పెరుగుతున్న మెటీరియల్, కూలీల ఖర్చులతో కొత్తగా భవనం నిర్మించాలంటే చాలా ఖర్చుతో కూడుకుంది. ఈ టెక్నాలజీలతో చాలా తక్కువలో ఇంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. – ఎస్.అనిల్‌కుమార్, ఇంజినీరు -
దరిద్రపుగొట్టు ఇల్లు.. ఏకంగా రూ. 14 కోట్లకు అమ్ముడుపోయింది
అది పోష్ ఏరియా. ఎటు చూసినా విలాసవంతమైన బంగ్లాలు.. ఖరీదైన కార్లు. కానీ, ఆ మధ్యలో దిష్టి చుక్కలాంటి ఓ చిన్న కొంప కనిపిస్తుంది. పైగా ఆ ఇంట్లో ఉండేవాళ్లకు దరిద్రం చుట్టుకుంటుందని, నష్టాలు-జబ్బులు జీవితాంతం వెంటాడుతాయనే ప్రచారం ఉంది. దీంతో ఆ ఇంటి వైపు భయపడిపోయేవాళ్లు ఇంతకాలం. అలాంటి కొంప ఇప్పుడు ఏకంగా మన కరెన్సీలో రూ.14 కోట్లకుపైగా అమ్ముడుపోయి.. స్థానికులను నోళ్లు వెళ్లబెట్టేలా చేసింది. శాన్ ఫ్రాన్సిస్కోలోని(కాలిఫోర్నియా) నోయి వ్యాలీలో ఉంది రెండు వేల చదరపు ఫీట్ల విస్తీర్ణంలోని ఈ పాడుబడిన కొంప. దీనికి ఓనర్ ఎవరనేదానిపై క్లారిటీ లేదు. పైకి డొక్కు బిల్డింగ్‌లా.. లోపల మంచి ఫర్నీషింగ్, మోడ్రన్ సెటప్‌తో ఆశ్చర్యపరుస్తుంది. 122 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఇంట్లో.. రెండో ప్రపంచ యుద్ధ సమయం నుంచి కొందరు నివసించేవాళ్లట. బెడ్రూం లేకుండా ఒక బాత్రూం(అందులో బాత్‌టబ్), కిచెన్, చిన్న లివింగ్ రూం మాత్రమే ఉన్నాయి ఆ ఇంట్లో. మొత్తం చెక్కతో నిర్మించిన ఈ ఇంటిలో ఎవరైనా నివసిస్తే.. వాళ్లను దురదృష్టం వెంటాడేదని నమ్ముతుంటారు. అలా చాలాకాలం పాటు ఆ ఇల్లు ఖాళీగా ఉండిపోయింది. అంతెందుకు ఆ చుట్టుపక్కల కాస్ట్లీ ఇళ్లులు వెలిసినప్పటికీ.. ఆ ఇంటిని కూల్చే ధైర్యం మాత్రం ఎవరూ చేయలేకపోయారట. చివరికి ఓ పెద్దాయన ధైర్యం చేసి చాలాకాలం పాటు ఈ ఇంట్లో నివసించాడు. ఆయన నుంచి కన్జర్వేటర్‌షిప్ కింద టాడ్ వెలీ అనే వ్యక్తి ఈ ఇల్లును చేజిక్కించుకుని.. వేలం పాట నిర్వహించాడు. కంపాస్ అనే బ్రోకరేజ్ వెబ్సైట్ నుంచి జనవరి 7వ తేదీన.. ఆరు లక్షల డాలర్లపై చిలుకు విలువతో వేలం మొదలైంది. పాత కాలం నాటి ఇల్లు కావడం, పైగా దాని వెనుక ‘దరిద్రపుగొట్టు’ ప్రచారం ఈ పాత ఇంటికి మంచి డిమాండ్ తెచ్చిపెట్టింది. రెండువేల చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఆ పాత ఇంటిని ఏకంగా 1.97 మిలియన్ డాలర్లు(మన కరెన్సీలో 14 కోట్ల రూపాయలకు పైనే) అమ్ముడుపోయింది. ‘పార్కింగ్ ప్లేస్ అంత లేదు.. అంత పెట్టి ఎవరు దక్కించుకున్నారు?’ అనే అనుమానాలు చాలా మందికి కలిగాయి. కానీ, గోప్యత కారణాలతో వేలంలో దక్కించుకున్న వ్యక్తి పేరు చెప్పడం లేదు టాడ్ వెలీ. అన్నట్లు ఆ ఇంటిని కూలగొట్టే ఉద్దేశంగానీ, రిన్నొవేషన్ చేసే ఉద్దేశంగానీ వేలంలో దక్కించుకున్న వ్యక్తికి లేవట!. మరి ఏం చేస్తాడో?. చదవండి: 5జీతో విమానాలకు ప్రమాదం పొంచి ఉందా? -
70 ఏళ్ల నాటి పెంకుటిల్లు.. అయితేనేం.. నవ్విన వారే బాగుందని కితాబు
సాక్షి,సిద్దిపేట: కోట్లు వెచ్చించిన నిర్మించిన ఇల్లును కూడా చిన్న చిన్న కారణాలతో కూల్చివేస్తున్న ఈ రోజుల్లో వారసత్వంగ వచ్చిన మట్టిగోడల పెంకుటిల్లుపై మమకారం పెంచుకున్నాడు. ఆస్తుల పంపకాల్లో తన వాటాకు తాత, తండ్రుల నుంచి వచ్చిన ఇల్లు రావడంతో కూల్చడానికి మనసు రాలేదు. లక్షలు వెచ్చించి అత్యాధునిక హంగులతో నచ్చిన విధంగా మార్చుకున్నాడు. సిద్దిపేట జిల్లా రూరల్ మండలం చిన్నగుండవెల్లి గ్రామానికి చెందిన కోటగిరి యాదగిరిగౌడ్ అందంగా తీర్చిదిద్దిన ఆ అందమైన పొదరిల్లును చూడడానికి సందర్శకులు నిత్యం వస్తూ వావ్ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కుటుంబాలకు నిలువెత్తు నిదర్శనం మండువా ఇళ్లు. అటువంటి ఇల్లు కలిగిన యజమానికి సంఘంలోనూ గౌరవం ఉండేది. రానురాను ఉమ్మడి కుటుంబాలు విచ్చిన్నం కావడంతో మండువాలోగిళ్ల అవసరం లేపోయింది, తెలంగాణంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికీ ఈ రకమైన ఇళ్లు మనకు కనిపిస్తుంటాయి. ఈ ఇంటి ప్రత్యేకత గాలి, వెలుతురు చాలినంతగా ప్రసరించేలా నిర్మాణం ఉంటుంది. విశాలమైన గదులు అబ్బురపరుస్తాయి. పచ్చని పంటచేలు, కాల్వలతో కళకళలాడే పల్లెలకు ఈ మండువాలోగిళ్లు ప్రత్యేక ఆకర్షణగా ఉండేవి. ఆ తర్వాత పట్టణాలకు దీటుగా గ్రామాల్లోనూ కాంక్రీటు భవనాల నిర్మాణం పెరిగింది. చదవండి: ఓటు హక్కు లేదా.. ఇలా నమోదు చేసుకోండి.. 70 ఏళ్ల క్రితం నాటిది.. తల్లిదండ్రులు చేసిన ఆస్తుల పంపకాల్లో పెద్ద కుమారుడైన యాదగిరికి తన వాట కింద వారసత్వంగా వచ్చిన పెంకుటిల్లు వచ్చింది. ఆ ఇల్లు అంటే యాదగిరికి చాలా ఇష్టం. అది శిథిలావస్థలో ఉన్నా.. కూల్చడానికి మనసు రాలేదు. ఎంత ఖర్చు అయినా పర్వాలేదని రూ. 30 లక్షల వెచ్చించి తనకు కావాల్సిన విధంగా తీర్చిదిద్దాడు. ముందుగా ఆ మట్టి గోడలను పూర్తిగా చెక్కి ప్లాస్టింగ్ చేయించాడు. అనంతరం పుట్టి పెట్టించి రంగులు వేయించాడు. మరమ్మత్తులు చేస్తున్న కూలీలు పై కప్పు తొలగించి బెంగుళూర్ పెంకులు వేసి, టేకు కర్రతో అందమైన డిజైన్స్ చేయించాడు. దీనికి తోడు ఇంటి ముందు చూడడానికి అందమైన కళాకృతుల డిజైన్లు, ఆకృతులతో కూడిన తలపులు బిగించారు. లోపల అన్ని రకాల ఆధునిక సౌకర్యాలు ఉండేలా మరమ్మత్తులు చేయించారు. అది పెంకుటిల్లే అయినా భవనంలో ఉండే అన్ని వసతులున్నాయి. మొదట ఈ మరమ్మత్తులు చూసి చాలా మంది నవ్వినా పూర్తయిన తర్వాత బాగుందని కితాబిచ్చారు. 70 ఏళ్ల క్రితం నిర్మించిన ఆ ఇల్లు పెద్దపెద్ద దూలాలతో నాలుగు గదులను నిర్మించారు. ప్రస్తుతం అది పెంకుటిల్లా లేక భవంతా అనే విధంగా చూపరులను ఆకట్టుకుంటుంది. -
ఇంటి గోడల నుంచి వెండి నాణేల లభ్యం
జంగారెడ్డిగూడెం రూరల్ : జంగారెడ్డిగూడెం మండలంలోని ఎ.పోలవరంలో పాడుపడిన ఇంటిlగొడలను శుక్రవారం కూల్చివేస్తుండగా వెండి నాణేలు బయటపడ్డాయి. ఇంటి యజమాని ఇంటిని పొక్లైనర్తో పడగొడుతున్న సమయంలో గోడల్లో నుంచి కుండలు బయల్పడ్డాయి. కిందపడిన ఈ కుండలు పగలడంతో వెండి నాణేలు బయటకు వచ్చాయి. ఇంటి యజమాని వెంటనే పనులు నిలుపుదల చేయించి పొక్లైనర్‌ను పంపించి వేశారు. ఇంటి పరిసరాల్లో తవ్వకాలు చేస్తే మరిన్ని నాణేలు బయటపడే అవకాశాలు ఉన్నాయని కొందరు ఆశావహులు ఆ పరిసరాల్లో తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంటి యజమాని పడగొట్టిన ఇంటి ప్రాంతంలోనే జాగారం చేస్తున్నారు. ఈ వెండి నాణేలు 1907 సంవత్సరం కాలం నాటి రూపాయి నాణేలు, పులిబొమ్మ , బ్రిటిష్ రాజు, ఓంకారం ఉన్న నాణేలు లభ్యమైనట్టు స్థానికులు తెలిపారు. అయితే ఎన్ని నాణేలు ఉన్నాయో తెలియలేదు. దీనిపై అధికారులకు కూడా ఎటువంటి సమాచారం లేదు. కొందరు చిన్నారులు కొన్ని నాణేలను తీసుకెళ్లారని, కుండలో వెండి నాణేలతో పాటు బంగారు నాణేలు కూడా ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. -
మెరిసిన ‘మండువా లోగిలి’!
నామకరణ మహోత్సవానికి వేదికైన ఇళ్లు రంగురంగుల గదులు, ఆల్టెక్, సీలింగ్ ఇలా ఇంటీరియర్ డెకరేషన్లతో అధునాతన భవనాలు అందుబాటులోకి వచ్చినా.. పాతతరం మండువాలోగిళ్లకు మాత్రం క్రేజ్ తగ్గడం లేదు. పి.గన్నవరం మండలం వాడ్రేవుపల్లి గ్రామంలో ఓ సంప్రదాయ కుటుంబం జరుపుకొన్న ఓ వేడుకకు సుమారు 125 ఏళ్ల చరిత్ర ఉన్న మండువాలోగిలి వేదికైంది. గ్రామానికి చెందిన నార్పిన వీరయ్య చౌదరి తమ మనుమరాలి నామకరణ మహోత్సవం సందర్భంగా ఈ మండువాలోగిలిని ప్రత్యేకంగా, సర్వాంగసుందరగా తీర్చిదిద్దించారు. ఎక్కడెక్కడో విద్య, ఉద్యోగ, వ్యాపారరీత్యా స్థిర పడిన వారంతా తమ సొంత ఊరిలో జరిగే ఈ కార్యక్రమానికి విచ్చేసి సందడి చేశారు. దీంతో అక్కడంతా పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమానికి ముంబయ్‌కి చెందిన వంటగాళ్లు, కెమెరామెన్లు రావడం విశేషం. ముంబయ్‌లోని ప్రముఖ హోటల్లో బాలీవుడ్ హీరోలకు వంటలు చేసే చెఫ్ జావేద్ అహ్మద్ ఇక్కడి వచ్చి తన చేతి రుచులు చూపించారు. – పి.గన్నవరం -
కొత్త ఇంటికి నిద్రకొస్తే.. పాత ఇంట్లో చోరీ
సదాశివపేట(బచ్చన్నపేట) : కొత్తగా కొనుగోలు చేసిన ఇంట్లో రాత్రి నిద్ర చేద్దామని వస్తే వారి పాత ఇంట్లో దొంగలు పడిన సంఘటన మండలంలోని నక్కవానిగూడెం శివారు సదాశివపేటలో సోమవారం రాత్రి జరిగింది. బాధితుడి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఈదులకంటి మల్లారెడ్డి బచ్చన్నపేట గోపాల్‌నగర్‌లో కొత్త ఇల్లు కొనుగోలు చేశారు. రాత్రి నిద్ర చేద్దామని కుటుంబ సభ్యులంతా కొత్త ఇంటికి వచ్చారు. మంగళవారం ఉదయం లేచి ఇంటికి వెళ్లేసరికి తాళం పగులగొట్టి కింద పడేసి ఉంది. అనుమానంతో ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాను పగులగొట్టి అందులోని రూ.95 వేల విలువగల బంగారం కనిపించలేదు. చేర్యాల సీఐ చంద్రశేఖర్, ట్రైనీ ఎస్సై వీరేందర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.