హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విభిన్న వ్యాపారాల్లో ఉన్న ఎస్‌ఏఆర్ గ్రూప్‌నకు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీ లెక్ట్రిక్స్ ఈవీ.. కొత్త స్కూటర్‌ను రెండు వేరియంట్లలో ఎల్‌ఎక్స్‌ఎస్ జీ3.0, ఎల్‌ఎక్స్‌ఎస్ జీ2.0 ట్రిమ్స్‌లో ప్రవేశపెట్టింది. ప్రారంభ ధర రూ.97,999. తొలిసారిగా 12 రకాల ఫీచర్లతో కలుపుకుని మొత్తం 93 రకాల హంగులను జోడించినట్టు లెక్ట్రిక్స్ ప్రకటించింది. ఎమర్జెన్సీ ఎస్‌వోఎస్ అలర్ట్, నావేగిషన్ అసిస్ట్, ఓవర్ ద ఎయిర్ అప్‌డేట్స్ వంటివి ఇందులో ఉన్నాయి.
3 కిలోవాట్ బ్యాటరీతో రూపొందిన ఎల్‌ఎక్స్‌ఎస్ జీ3.0 ఒకసారి చార్జింగ్‌తో 105 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. గంటకు 40 కిలోమీటర్ల వేగాన్ని 9 సెకన్లలో అందుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 60 కిలోమీటర్లు. 2.3 కిలోవాట్ అవర్ బ్యాటరీతో ఎల్‌ఎక్స్‌ఎస్ జీ2.0 తయారైంది. ఒకసారి చార్జింగ్‌తో 80 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 10.2 సెకన్లలో గంటకు 40 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 55 కిలోమీటర్లు. హర్యానాలోని మనేసర్ వద్ద ఉన్న ప్లాంటు సామర్థ్యం ఏటా 1.5 లక్షల యూనిట్లు. ఇప్పటికే లెక్ట్రిక్స్ ఈవీ కోసంఎస్‌ఏఆర్ గ్రూప్ రూ.300 కోట్లు ఖర్చు చేసింది. లుమినస్, లివ్‌గార్డ్, లివ్‌ఫాస్ట్, లివ్‌ప్యూర్ బ్రాండ్లను సైతం ఈ గ్రూప్ ప్రమోట్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment