![Kia ev9 global launch expected in this month - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/6/kia%20ev9%202.jpg.webp?itok=B6Hkg1Vb)
సౌత్ కొరియా వాహన తయారీ సంస్థ కియా మోటార్స్ త్వరలో తన ఆధునిక ఎలక్ట్రిక్ ఎస్యూవీ 'ఈవీ9'ని విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఈ ఎలక్ట్రిక్ కారుకి సంబంధించిన చాలా సమాచారం కొన్ని టీజర్ వీడియోల ద్వారా వెల్లడైంది.
నిజానికి ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ గతేడాది జరిగిన 2022 ఆటో ఎక్స్పో వేదిక మీద కనిపించింది. కంపెనీ ఈ కారుని అభివృద్ధి చేయడానికి 44 నెలల సమయం పట్టిందని వెల్లడించింది. మొదటి సారి 2021 లాస్ ఏంజెల్స్ మోటార్ షో కనిపించినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఉత్పత్తికి నోచుకోలేదు.
ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహన విభాగంలో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న కియా మోటార్స్, ఈ కొత్త మోడల్ విడుదలతో మరిన్ని అద్భుతమైన అమ్మకాలు పొందే అవకాశం ఉన్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఆటో ఎక్స్‌పోలోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ ఎలక్ట్రిక్ వెర్షన్ త్వరలోనే మార్కెట్లో విడుదలవుతుంది.
కియా ఈవీ9 మస్క్యులర్ క్లామ్‌షెల్ బానెట్, టైగర్ నోస్ గ్రిల్, ఆల్ ఎల్ఈడీ లైటింగ్ సెటప్, వైడ్ ఎయిర్ డ్యామ్, ఓఆర్వీఎమ్ స్థానంలో కెమెరాలు, సిల్వర్డ్ స్కిడ్ ప్లేట్స్ వంటి వాటిని పొందుతుంది. వెనుక భాగంలో వర్టికల్లీ స్టేక్డ్ టెయిల్‌ల్యాంప్స్, రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్ వంటివి చూడవచ్చు.
ఇక ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే, డాష్‌బోర్డ్ చాలా ఆకర్షణీయంగా కనిపించడమే కాకుండా, యోక్ స్టైల్ స్టీరింగ్ వీల్, పనారోమిక్ సన్ రూఫ్, మల్టీ కలర్ యాంబియెంట్ లైటింగ్, మల్టీ జోన్ క్లైమేట్ కంట్రోల్, రెండు పెద్ద స్క్రీన్స్ వంటివి ఇందులో అమర్చబడి ఉంటాయి.
కియా ఈవీ9 ఒక సింగిల్ ఛార్జ్‌తో గరిష్టంగా 450కిమీ రేంజ్ అందిస్తుంది సమాచారం, అయితే వాస్తవ ప్రపంచంలో రేంజ్ ఎలా ఉంటుందనేది తెలియాల్సి ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ నెలలో విడుదలవుతుంది. భారతీయ మార్కెట్లో 2024-2025 మధ్యలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment