Kia EV9 Spied With Production Lights - Sakshi
Sakshi News home page

సూపర్‌ ఉంది కార్‌! విడుదలకు ముందే రోడ్డెక్కిన కియా ఈవీ9

Published Mon, Feb 27 2023 6:57 PM | Last Updated on Mon, Feb 27 2023 7:43 PM

Kia Ev9 Spy Shot - Sakshi

కియా ఈవీ9 కార్‌ విడుదలకు ముందే రోడ్డెక్కింది. భారత్‌లో ఇటీవల జరిగిన ఆటోఎక్స్‌పో 2023లో ఈ కార్‌ కాన్సెప్ట్‌, మోడల్‌ను కియా ప్రదర్శించింది. వచ్చే ఏడాది ఇది విడుదల కావాల్సి ఉంది. అయితే ఉత్పత్తి దశలో ఉన్న ఈ కార్‌ ఇటీవల రోడ్డుపైకి వచ్చింది. కర్మాగారానికి సమీపంలో రోడ్డుపై కనిపించిన ఈ కార్‌ను ఓ వ్యక్తి  రహస్యంగా వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టారు.

(ఇదీ చదవండి: టాప్‌ లగ్జరీ కార్‌కు షావోమీ డిజిటల్‌ కీ... షేరింగ్‌ ఈజీ!)

ఇంతకు ముందు ప్రదర్శించిన మోడల్‌ లాగే ఈ కార్‌ క్రిస్టల్ బ్లూ కలర్‌లో ఉంది. అయితే ఇందులో కొన్ని ముఖ్యమైన అప్‌డేట్‌లు ఉన్నట్లుగా తెలుస్తోంది. నిలువు హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, మోనో-టోన్ అల్లాయ్ వీల్స్, కొత్త ఓఆర్‌వీఎంలు, వెనుక బంపర్-మౌంటెడ్ నంబర్ ప్లేట్ హోల్డర్ కన్పిస్తున్నాయి. సిగ్నేచర్ టైగర్-నోస్ గ్రిల్, గ్లోసీ బ్లాక్ క్లాడింగ్, కాంట్రాస్ట్-కలర్డ్ స్కిడ్ ప్లేట్లు, ఎల్‌ఈడీ టైల్‌లైట్లు, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ వంటివి కాన్సెప్ట్ కార్‌లో ప్రదర్శించినట్టుగా ఉన్నాయి. 

(ఇదీ చదవండి: వన్‌ ప్లస్‌ 11 కాన్సెప్ట్‌ ఫోన్‌ ఫస్ట్‌ లుక్‌.. లిక్విడ్‌ కూలింగ్‌ ఫీచర్‌ అదుర్స్‌!)

కియా ఈవీ9 కారుకు ఈ-జీఎంపీ (ఎలక్ట్రిక్‌ గ్లోబల్‌ మాడ్యులార్‌ ప్లాట్‌ఫాం) నిర్మాణాన్ని ఉపయోగిస్తోంది. ఈ కారు సాంకేతిక వివరాలపై కియా పెదవి విప్పడం లేదు. ఈ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ 77.4 కిలో వాట్ల బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. దీనికి కేవలం 20 నిమిషాలలోపు 80 శాతం చార్జ్‌ అయ్యేలా ఫాస్ట్ చార్జింగ్ సౌకర్యం ఉంటుందని కియా గతంలో తెలిపింది. ఈవీ9 కారును ఒక్కసారి చార్జ్‌​ చేస్తే 540 కిలో మీటర్ల వరకు నడపొచ్చని పేర్కొంది. కొత్త ఈవీ9 కారు 2024లో విడుదల కానుంది. అయితే ఇది భారత్‌లో కూడా లాంచ్‌ అవుతుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement