సాక్షి, అనంతపురం: కియా ఫ్యాక్టరీ ఎక్కడికి తరలిపోదని ఎంపీ తలారి రంగయ్య స్పష్టతనిచ్చారు. రూ.13,500 కోట్లతో ఫ్యాక్టరీ స్థాపించాక మరో ప్రాంతానికి ఎలా పోతుందని ప్రశ్నించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. కియా ఫ్యాక్టరీపై టీడీపీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. అసత్య కథనం ఆధారంగా గోబెల్స్ ప్రచారం(లేని దాన్ని ఉన్నట్టుగా చూపించడం) చేస్తోందని విమర్శించారు. ఏదో జరిగిపోతుందంటూ ఎల్లో మీడియా కథనాలను ఇవ్వడం దారుణమన్నారు. ఫ్యాక్టరీ తరలించే యోచనే లేదని యజమాన్యం ప్రకటించిన తర్వాత చర్చ అనవసరమని పేర్కొన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో 1.1 బిలియన్ డాలర్లతో ఏర్పాటైన కియా కార్ల కంపెనీ తన యూనిట్ ప్రారంభించి రెండు నెలలు కాకముందే తమిళనాడుకు తరలిపోతోందంటూ అంతర్జాతీయ మీడియా అసత్య కథనం వెలువడించిం. వెంటన్నీ దీన్ని పసిగట్టిన ఎల్లో మీడియా కియా పరిశ్రమ వెళ్లిపోతుందంటూ శోకాలు మొదలెట్టింది. అయితే ఆ వార్తలు వట్టి పుకార్లేనని తేటతెల్లమవడంతో దుషష్ప్రచారానికి ఒడిగట్టిన వాళ్లందరూ తెల్లమొహం వేసుకున్నారు
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment