rangaiah
-
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై ‘పచ్చ’మూక హత్యాయత్నం
కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలో టీడీపీ మూకలు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై హత్యాయత్నం చేశాయి. రెచ్చిపోయిన పచ్చమూకల దాడిలో నలుగురు గాయపడ్డారు. వీరిలో ముగ్గురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, ఎమ్మెల్యే అభ్యర్థి వాహన డ్రైవర్ ఉన్నారు. కళ్యాణదుర్గం పట్టణంలోని ఎర్రనేల వీధిలో గురువారం రోడ్‌షోకి బయలుదేరిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్య కాన్వాయ్కి ముందున్న ప్రచార వాహనాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకుని తాళాలు లాక్కున్నారు. తాళాలివ్వాలని వైఎస్సార్సీపీ కార్యకర్తలు కోరినా ససేమిరా అన్నారు. ‘తాళాలిచ్చేది లేదు. ఎవడికి చెప్పుకుంటారో చెప్పుకోండి..’ అంటూ టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అల్లుడు అవినాష్, వ్యాపార భాగస్వామి రాజగోపాల్ ఆ పార్టీ కార్యకర్తలను ఉసిగొల్పారు. దీంతో రెండుపార్టీల కార్యకర్తల మధ్య తోపులాటతో ఉద్రిక్తత మొదలైంది. ప్రచారరథం తాళాలివ్వాలని కోరిన కళ్యాణదుర్గం మార్కెట్ యార్డు మాజీ చైర్పర్సన్ బిక్కి నాగలక్ష్మి భర్త బిక్కి హరి, వైఎస్సార్సీపీ కార్యకర్తలు మంజునాథ్, అనిల్‌కుమార్‌లపై అవినాష్, రాజగోపాల్ దాడికి దిగారు. వీరితోపాటు అమిలినేని ప్రైవేట్ బౌన్సర్లు సుమారు 20 మంది మూకుమ్మడిగా దాడిచేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై పిడిగుద్దులు గుద్దుతూ, ఎదపై కాళ్లతో తన్నుతూ, రాళ్లతో కొడుతూ మురుగు కాలువలోకి పడేశారు. పదేపదే గుండెలపై దాడిచేసి చంపేసేందుకు ప్రయత్నించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్య వ్యక్తిగత వాహన డ్రైవర్ శివపైనా దాడి చేశారు. అతడి గొంతు నులిమారు. వారి దాడిలో శివ చేతికి గాయాలయ్యాయి. అడ్డుకునేందుకు యత్నించిన స్థానిక వాల్మీకి వర్గానికి చెందిన మహిళలను అమిలినేని వర్గీయులు, కుటుంబసభ్యులు నానా దుర్భాషలాడారు. గొడవ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రెండు వర్గాలను చెదరగొట్టారు. ఈ సందర్భంగా అక్కడికెళ్లిన కళ్యాణదుర్గం పట్టణ సీఐ హరినాథ్‌పైనా టీడీపీ నాయకులు చిందులు వేశారు. ముఖ్యంగా బ్రహ్మసముద్రం మండల టీడీపీ కన్వినర్ పాలబండ్ల శ్రీరాములు నానా దుర్భాషలాడారు. సీఐని ఏకవచనంతో మాట్లాడుతూ దౌర్జన్యానికి దిగారు. విషమంగా వైఎస్సార్సీపీ కార్యకర్తల పరిస్థితి టీడీపీ మూకల దాడిలో గాయపడిన బిక్కి హరి, మంజునాథ్, అనిల్కుమార్లను కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో గురువారం సాయంత్రం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. టీడీపీ మూకలు పిడిగుద్దులు, రాళ్లతో ఎదపై దాడిచేయడంతో వారు శ్వాస తీసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వారి కుటుంబసభ్యులు తెలిపారు. చికిత్స పొందుతున్న కార్యకర్తలను పలువురు నేతలు పరామర్శించి ధైర్యం చెప్పారు. కళ్యాణదుర్గంలో వైఎస్సార్సీపీకి వస్తున్న ప్రజాదరణను ఓర్వలేక టీడీపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్య చెప్పారు. శాంతికాముకులైన వాల్మీకులపై దాడిచేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు. వాల్మీకి కులానికి చెందిన వ్యక్తిననే చిన్నచూపుతోనే తనను బూతులు తిడుతూ, కులం పేరుతో దూషిస్తూ దాడిచేశారని బిక్కి హరి ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబానికి టీడీపీ నుంచి ప్రాణహాని ఉందని, తమకేదైనా జరిగితే టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబుదే బాధ్యత అని బిక్కి నాగలక్ష్మి చెప్పారు. రెండు పార్టీల ఫిర్యాదులపై కేసులు నమోదు ఈ విషయమై రెండుపక్షాల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘర్షణకు సంబంధించి రెండు పార్టీల ఫిర్యాదులపై కేసులు నమోదు చేస్తామని కళ్యాణదుర్గం డీఎస్పీ బి.శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఎర్రనేల వీధిలో ఎన్నికల ప్రచారం చేయడం, అదే ప్రాంతంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్య ఇల్లు, పార్టీ కార్యాలయం ఉన్నట్లు తెలిపారు. ముందస్తుగా ఎలాంటి గొడవలకు తావులేకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. రెండు పార్టీల కార్యకర్తలు ఎదురుపడటంతో తోపులాట జరిగిందని తెలిపారు. వివాదం తీవ్రం కాకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. -
అనంత: జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలక పరిణామం
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు వేలూరు రంగయ్య నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. నామినేషన్లో సరైన డాక్యూమెంట్లు సమర్పించకపోడంతో టీడీపీ నేత వేలూరు రంగయ్య నామినేషన్ తిరస్కరిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. దీంతో వైఎస్సార్సీపీ అభ్యర్థి వాల్మీకి మంగమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 1277 ఓట్లు ఉండగా.. వైఎస్సార్సీపీ కి 1200 పైగా ఆధిక్యత ఉంది. బలం లేకపోయినా బరిలో దిగేందుకు యత్నించి టీడీపీ నేతలు అభాసుపాలయ్యారు. పైగా ఎన్నికల అధికారులపై అభాండాలు వేయటం సరికాదని అనంతపురం సీనియర్ న్యాయవాది ఉమాపతి పేర్కొన్నారు. చదవండి: నా కుమారుడు రాఘవరెడ్డి ఏ తప్పు చేయలేదు: ఎంపీ మాగుంట -
సీఎం వైఎస్ జగన్‌తో ఎంపీ రంగయ్య, ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి భేటీ
సాక్షి, అనంతపురం: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని అనంతపురం ఎంపీ తలారి రంగయ్య మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో రాజకీయ, సామాజిక, అభివృద్ధి పనులపై చర్చించారు. సీఎం జగన్‌తో ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి భేటీ పుట్టపర్తి: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి నియోజకవర్గంలో అత్యధికంగా జాతీయ రహదారుల మంజూరు, రికార్డు స్థాయిలో 25 వేల పక్కా గృహ నిర్మాణాలకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ముదిగుబ్బ మండలం మలకవేముల క్రాస్ నుంచి నల్లమాడ, ఓడీచెరువు, అమడగూరు మీదుగా బాగేపల్లి వరకూ జాతీయ రహదారి ఏర్పాటుకు సహకరించాలని వినతపత్రం సమర్పించారు. చదవండి: (పెద్దిరెడ్డి కాన్వాయ్ ప్రమాదంలో కుట్రకోణం) -
ప్రాణం ఖరీదు రూ.లక్ష!.. సూది మందు వికటించి వ్యక్తి మృతి
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పరుగులు తీస్తున్న నేటి రోజుల్లో రాతియుగం నాటి అనాగరిక సంస్కృతికి తెరలేపారు కొందరు. వైద్యం వికటించి వ్యక్తి మృతి చెందితే... రూ.లక్ష పరిహారం చెల్లించేలా దుప్పటి పంచాయితీ చేశారు. పెద్దల పంచాయితీకి వైద్యాధికారులు, పోలీసులూ తలొగ్గారు. ఆదివారం నిశిరాత్రి జరిగిన ఈ దారుణం సోమవారం తెల్లారేసరికి గుట్టుచప్పుడు కాకుండా తొక్కేశారు. సాక్షి, గుత్తి రూరల్: సూది మందు వికటించి ఓ వ్యక్తి మృతి చెందాడు. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన మేరకు... గుత్తి మండలం తొండపాడుకు చెందిన నల్లబోతుల రంగయ్య (45), సునీత దంపతులు. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ రంగయ్య కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. జ్వరంతో బాధపడుతున్న రంగయ్య ఆదివారం రాత్రి కుమారుడు సాయంతో గుత్తిలో ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ కృష్ణప్రసాద్ నిర్వహిస్తున్న ప్రైవేట్ క్లినిక్‌కు వెళ్లి చికిత్స చేయించుకున్నాడు. డాక్టర్ సూది మందు వేసిన కాసేపటికి రంగయ్య అపస్మారకస్థితికి చేరుకున్నాడు. దీంతో వైద్యుడి సూచన మేరకు వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. అప్పటికే రంగయ్య మృతి చెందాడు. దీంతో డాక్టర్ కృష్ణప్రసాద్ వైద్యం సరిగా చేయకపోవడం వల్లనే రంగయ్య మృతి చెందాడంటూ బంధువులు, కుటుంబసభ్యులు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. అప్పటికే అక్కడకు చేరుకున్న డాక్టర్ కృష్ణప్రసాద్‌పై దాడికి యత్నించారు. సకాలంలో అక్కడకు చేరుకున్న సీఐ వెంకటరామిరెడ్డి, సిబ్బంది వెంటనే ఆందోళనకారులను చెదరగొట్టారు. చదవండి: (అందం చూసి అనుమానం.. నవ వివాహితను చంపిన సైకో భర్త) డ్యూటీ సమయంలోప్రైవేట్ క్లినిక్‌లో ఇటీవల బదిలీపై గుత్తి ప్రభుత్వాస్పత్రిలో వైద్యుడిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ కృష్ణప్రసాద్.. స్థానికంగానే ఓ ప్రైవేట్ క్లినిక్ నిర్వహిస్తూ అదనపు ఆదాయంపై దృష్టిసారించారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి కాల్ డ్యూటీలో ఉన్న ఆయన... తన సొంత క్లినిక్‌లో పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న రంగయ్య కుటుంబసభ్యులు నేరుగా ప్రైవేట్ క్లినిక్‌కు చేరుకున్నారు. పరీక్షించిన డాక్టర్ కృష్ణాప్రసాద్ సూది మందు వేసిన కాసేపటికి రంగయ్య అపస్మారక స్థితికి చేరుకున్నాడు. పరిస్థితి చేజారుతున్నట్లు గమనించిన డాక్టర్ వెంటనే... ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాలని రోగి కుటుంబసభ్యులకు సూచించినట్లు తెలిసింది. ఘటనపై డాక్టర్ కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. జ్వర తీవ్రత కారణంగానే రంగయ్య మృతి చెందాడని పేర్కొన్నారు. రోగి ప్రాణాలు కాపాడేందుకు తాను చేసిన ప్రయత్నాలు వివరించారు. పంచాయితీ పెద్దలు పోలీసులేనా? రంగయ్య మృతికి డాక్టర్ కృష్ణ ప్రసాద్‌నే కారణమంటూ పోలీసులకు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేయాల్సిన పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ దుప్పటి పంచాయితీకి తెరలేపినట్లు సమాచారం. వైద్యుడిని కాపాడే క్రమంలో బాధిత కుటుంబసభ్యులను రాజీ చేసి రూ.లక్ష పరిహారాన్ని డాక్టర్ కృష్ణప్రసాద్ చెల్లించేలా ఒప్పందం చేసినట్లు తెలిసింది. దీంతో వివాదం సద్దుమణిగినట్లు సమాచారం. -
శ్రీలంకతో ఏపీని ఎలా పోలుస్తారు?: వైఎస్సార్సీపీ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: శ్రీలంకతో పోలికలెందుకు? కేంద్రం తన ఆర్థిక పరిస్థితి చూసుకుంటే మంచిదని వైఎస్సార్సీపీ ఎంపీల హితవు పలికారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో గురజాడ హాల్లో వైఎస్సార్సీపీ ఎంపీలు డాక్టర్ తలారి రంగయ్య, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఎన్.రెడ్డప్ప మీడియా సమావేశంలో మాట్లాడుతూ, శ్రీలంకతో రాష్ట్రాలను ఎలా పోలుస్తారు? ఆర్థిక క్రమశిక్షణ కేంద్రానికీ అవసరమే కదా? అంటూ ప్రశ్నించారు. చదవండి: ఒక్కసారిగా మారిపోయిన సీన్.. అక్కడ ఎకరం కోటి రూపాయలపైనే.. కేంద్రంతో పోలిస్తే రాష్ట్రం అప్పులు తక్కువ. శ్రీలంక జీడీపీ కన్నా, రాష్ట్ర జీఎస్డీపీ ఎక్కువ. వాణిజ్య ఎగుమతుల్లోనూ చాలా ముందున్నాం. ఏటేటా వాణిజ్య ఎగుమతులు పెరుగుతున్నాయన్నారు. రాష్ట్ర అప్పుల్లో ప్రతి రూపాయి సద్వినియోగమవుతోంది. ఎక్కడా అవినీతికి తావు లేకుండా నేరుగా పంపిణీ అవుతుందన్నారు. మూడేళ్లలో డీబీటీ ద్వారా రూ.1.65 లక్షల కోట్లు. టీడీపీ ప్రభుత్వం మాదిరిగా వ్యయం చేయలేదు. అనుత్పాదక రంగాల్లోనే ఆ ప్రభుత్వం నిధుల వ్యయం. మా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించిందని వైఎస్సార్సీపీ ఎంపీలు గుర్తు చేశారు. ఇకనైనా వాస్తవాలు గుర్తించి దుష్ప్రచారాలు మానాలని, శ్రీలంకతో రాష్ట్రాన్ని అస్సలు పోల్చవద్దు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు వద్దు’’ అని ఎంపీలు స్పష్టీకరించారు. వైఎస్సార్సీపీ ఎంపీలు ఏం మాట్లాడారంటే..: శ్రీలంకతో పోల్చడం సరికాదు: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని శ్రీలంకతో పోల్చడం ఏ మాత్రం సరికాదు. మనది ఒక రాష్టం. శ్రీలంక ఒక దేశం. ఆ దేశ ఆర్ధిక వ్యవస్థ పతనం కావడానికి వేర్వేరు కారణాలున్నాయి. అందువల్ల ఏ విధంగా కూడా రాష్ట్రాన్ని శ్రీలంకతో పోల్చలేం. అక్కడి పరిస్థితులు పూర్తిగా వేరు. ఉదాహరణకు కొన్ని అంశాలు చూస్తే.. గణనీయంగా వాణిజ్య ఎగుమతులు: శ్రీలంకలో వాణిజ్య ఎగుమతులు గత మూడేళ్లలో చూస్తే తగ్గాయి. అదే సమయంలో రాష్ట్రంలో వాణిజ్య ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. శ్రీలంకలో వాణిజ్య ఎగుమతులు 2019-20లో 19 బిలియన్ డాలర్లు కాగా, ఆ తర్వాత ఏడాది 2020-21లో అవి 13 బిలియన్ డాలర్లకు తగ్గాయి. 2021-22లో 14 బిలియన్ డాలర్ల వాణిజ్య ఎగుమతులు నమోదయ్యాయి. అదే ఆంధ్రప్రదేశ్‌లో మూడేళ్లలో వాణిజ్య ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. 2019-20లో ఇక్కడి నుంచి వాణిజ్య ఎగుమతుల మొత్తం 11 బిలియన్ డాలర్లు కాగా, అవి 2020-21లో 15 బిలియన్ డాలర్లకు చేరాయి. ఆ తర్వాత ఏడాది 2021-22లో వాణిజ్య ఎగుమతుల మొత్తం ఏకంగా 25 బిలియన్ డాలర్లు. అంటే మూడేళ్లలో వాణిజ్య ఎగుమతులు 14 బిలియన్ డాలర్లు పెరిగాయి. ఇక దేశ పరిస్థితి చూస్తే 2019-20లో 535 బిలియన్ డాలర్ల వాణిజ్య ఎగుమతులు జరగ్గా, 2020–21లో 500 బిలియన్ డాలర్లు, 2021–22లో దాదాపు 600 బిలియన్ డాలర్ల వాణిజ్య ఎగుమతులు జరిగాయి. మన జీఎస్డీపీ బాగా మెరుగు: అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందన్నది వాస్తవం. రాష్ట్ర జీఎస్డీపీని శ్రీలంక జీడీపీతో పోల్చితే మన జీఎస్డీపీ చాలా బాగుంది. శ్రీలంక జీడీపీ 81 బిలియన్ డాలర్లు కాగా, మన జీఎస్డీపీ 160 బిలియన్ డాలర్లు. అంటే ఒక దేశం కంటే మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చాలా బాగుంది. కేంద్రం అప్పులు ఎక్కువ: అప్పుల్లో కూడా మన రాష్ట్రానికి, శ్రీలంకకు ఎక్కడా పోలిక లేదు. నిజం చెప్పాలంటే మన రాష్ట్ర అప్పుల కంటే ఇవాళ కేంద్రం చేసిన అప్పులే ఎక్కువ. జీడీపీలో అప్పులు (డెట్ టు జీడీపీ) శ్రీలంకలో 101 శాతం ఉంటే, మన రాష్ట్రంలో చూస్తే అది 32.4 శాతం మాత్రమే. అదే కేంద్రంలో చూస్తే.. డెట్ టు జీడీపీ 59 శాతంగా ఉంది. దీనికి కేంద్రం ఏం సమాధానం చెబుతుంది?. ఇవాళ కేంద్రం అప్పులు ఏకంగా 133 లక్షల కోట్లకు చేరుకున్నాయి. కాబట్టి కేంద్రం తన ఆర్థిక పరిస్థితి చూసుకుంటే మంచిది. అందుకే ఇంకా ప్రజలను మభ్య పెట్టొద్దు. వారిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయొద్దు. వాస్తవం ఇలా ఉంది కాబట్టే కేంద్ర మంత్రి వ్యాఖ్యలను మిగతా రాష్ట్రాలు కూడా ఖండించాయి. ప్రతి రూపాయికి లెక్క ఉంది: రాష్ట్ర అప్పుల్లో ప్రతి రూపాయికి లెక్క ఉంది. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మూడేళ్లలో రూ.1.65 లక్షల కోట్లు నగదు బదిలీ (డీబీటీ) ద్వారా నేరుగా ప్రజలకు చేరాయి. ఎక్కడా అవినీతికి తావు లేకుండా, పూర్తి పారదర్శకంగా అది జరిగింది. అదే గత ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పులు చేసి అనుత్పాదక రంగాలపై ఖర్చు చేసింది. కరోనా కష్టకాలంలో నిరుపేద కుటుంబాలను అనేక పథకాల ద్వారా ఆదుకున్నాం. నగదు బదిలీ ద్వారా వారు నిలదొక్కకోగలిగారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడింది. ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగింది. ఒక్కో కుటుంబానికి కనీసం లక్ష నుంచి దాదాపు రూ.10 లక్షల వరకు అందింది. అభివృద్ధి -సంక్షేమం: ప్రభుత్వం ఇస్తున్న ప్రతి రూపాయి నిరుపేదల ఖాతాల్లో చేరుతోంది. ఇంక నాడు–నేడు కార్యక్రమంతో స్కూళ్లు, ఆస్పత్రుల రూపురేఖలు పూర్తిగా మారుతున్నాయి. ఆ విధంగా ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో జరుగుతున్నాయి. అందుకే శ్రీలంకతో రాష్ట్రాన్ని అస్సలు పోల్చవద్దు. విపక్షం ఇకనైనా విమర్శలు విడనాడాలి పోలవరం బాధ్యత కేంద్రానిదే: పోలవరం ప్రాజెక్టును కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించింది. అందుకే ఆ ప్రాజెక్టు బాధ్యత పూర్తిగా కేంద్రానిదే. అయితే నిర్మాణ బాధ్యతను గత ప్రభుత్వం తీసుకుంది. అందుకే ఇప్పుడు కూడా నిర్మాణం పనులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ప్లానింగ్, డిజైన్ బాధ్యతలు పూర్తిగా కేంద్రానివే. -
స్టాలిన్‌తో ఎంపీ తలారి రంగయ్య
సాక్షి, అనంతపురం: అనంతపురం పార్లమెంటు సభ్యుడు తలారి రంగయ్య గురువారం ఢిలీల్లోని పార్లమెంటు సెంట్రల్ హాల్లో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయనతో కాసేపు మాట్లాడారు. ప్రధానంగా బీసీ కుల గణనపై చర్చించారు. -
గురువులకు జాతీయ గుర్తింపు
-
అడ్డుకున్నది ఎవరో సమాధానం చెప్పాలి!
న్యూఢిల్లీ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక నిధులు ఇవ్వొద్దని ప్రతిపక్ష పార్టీ టీడీపీ కేంద్రానికి లేఖలు రాస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు విమర్శించారు. నిర్మాణాత్మకంగా ఉండాల్సిన ప్రతిపక్షం అడ్డంకులు సృష్టిస్తూ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. నీరు-చెట్టు పథకం పనులను టీడీపీ కార్యకర్తలకు ఇచ్చి అక్రమాలకు పాల్పడ్డారని చంద్రబాబును ఉద్దేశిస్తూ దుయ్యబట్టారు. ఎన్ఆర్ఈజీఎస్ పనిదినాలు పెంచాలని కేంద్రాన్ని గట్టిగానే అడుగుతున్నామని, ఇచ్చిన 21 కోట్ల పనిదినాల్లో 19 కోట్ల పనిదినాలు వినియోగించామని చెప్పారు. (ప్రభుత్వ భూములపై టీడీపీ నేతల కన్ను) టీడీపీ నేతలు మెటీరియల్ కాంపోనెంట్ ఇచ్చే వరకు నిధులివ్వొద్దు అని కేంద్రానికి లేఖ రాయడంపై వైఎస్సార్సీపీ ఎంపీ తలారి రంగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. పనికి ఆహార పథకం కింద చేసిన అక్రమాల్లో మెటీరియల్ కాంపోనెంట్ నిధులు కాంట్రాక్టర్లకు ఇవ్వడం కోసం అడుగుతున్నారన్నారు. టీడీపీకి చివరి 6 నెలల పనికి నిధులు అడగడం, అవిచ్చే వరకు కొత్తగా నిధులివ్వొద్దని కోరడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అంగన్వాడీ సెంటర్లను విలేజ్ వెల్నెస్ సెంటర్లుగా మార్చిన క్రమంలో ఒక్కో సెంటర్ కి రూ.15 లక్షలు ఇవ్వాల్సిందిగా కోరినట్లుగా తెలిపారు. (ఆ దాడులు కుట్రలో భాగమే: సుచరిత) ‘స్మశానాలకు కాంపౌండ్ వాల్ నిర్మాణం గురించి కూడా అడిగాం. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు జరుగుతున్నాయి. వారం నుంచి 10 రోజుల్లోపే కూలీలకు డబ్బు అందుతోంది. లక్షన్నర ఇళ్లు రెడీగా ఉంటే అడ్డుకుంటున్నామని టీడీపీ అంటున్నారు. అవెక్కడ ఉన్నాయో చెప్పాలి. 30 లక్షల ఇళ్లస్థలాలు పంపకానికి సిద్ధంగా ఉంటే అడ్డుకున్నది ఎవరు?’ అని ఎంపీ తలారి రంగయ్య ప్రశ్నించారు. -
ఎంపీ తలారి లేఖకు స్పందించిన కేంద్రం
సాక్షి, అమరావతి: రాయలసీమకు ప్రత్యేకించి అనంతపురం నుంచి పండ్లు, కూరగాయల ఎగుమతికి కిసాన్ రైలు నడపాలన్న పార్లమెంట్ సభ్యుడు తలారి రంగయ్య వినతికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. తలారి వినతిని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని రైల్వే బోర్డు.. దక్షిణ మధ్య రైల్వే వాణిజ్య విభాగం ముఖ్య అధికారిని ఆదేశించింది. రైల్వే అధికారులు సోమవారం అనంతపురం వెళ్లి ఉద్యాన శాఖాధికారులతో చర్చలు జరిపి సానుకూలత వ్యక్తం చేశారు. వచ్చే అక్టోబర్ లేదా నవంబర్ నుంచి కిసాన్ రైలు అనంతపురం–ఢిల్లీ మధ్య నడవనుంది. (టీడీపీ ఇన్చార్జ్పై కలెక్టర్ సీరియస్) ► అనంతపురం జిల్లా నుంచి పండ్లు, కూరగాయలు ఢిల్లీ సహా ఉత్తర భారతంలోని మార్కెట్లకు రవాణా అవుతుంటాయి. ► రోడ్డు మార్గం ద్వారా ఢిల్లీ చేరాలంటే ఐదారు రోజులు పడుతుంది. దీంతో చాలా ఉత్పత్తులు చెడిపోతున్నాయి. ► అనంత ఎంపీ రంగయ్య.. సీఎం జగన్ సూచనతో కిసాన్ రైలును కేటాయించాలని ఇటీవల ప్రధాని, రైల్వే మంత్రికి లేఖ రాశారు. -
'కరోనా వైద్యం ఫ్రీగా అందిస్తున్న ఏకైక సీఎం జగన్'
సాక్షి, అనంతపురం: కోవిడ్ నిర్ధారణ పరీక్షలు మరింత వేగవంతం చేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మొబైల్ సంజీవిని బస్సులను శుక్రవారం ఉదయం ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డితో కలిసి ప్రారంభించారు. కరోనా నివారణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అత్యంత పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారని అనంతపురం ఎంపీ తలారి రంగయ్య అన్నారు. ఏపీలో కరోనా టెస్టింగ్ కెపాసిటీ మరింత పెరిగింది. కరోనా పరీక్షలను ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తెచ్చిన ఘనత సీఎం జగన్‌దే. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా కరోనా వైద్యం అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటూ రంగయ్య పేర్కొన్నారు. చదవండి: సైకిళ్ల గంటలు ఎందుకు మూగబోయాయో..! హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ విమర్శలు అర్థరహితం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. దీనిని జీర్ణించుకోలేని టీడీపీ నేతలు అభాండాలు వేస్తున్నారు' అని తెలిపారు. కరోనా కట్టడి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేయింబవళ్లు శ్రమిస్తున్నారని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. కరోనా పరీక్షల్లో దేశంలోనే ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉంది. అనేక విషయాల్లో మిగతా రాష్ట్రాలు సీఎం జగన్‌ను ఫాలో అవుతున్నాయి. సీఎం జగన్‌పై ప్రజలకు విశ్వాసం పెరిగింది అని అనంత వెంకటరామి రెడ్డి పేర్కొన్నారు. చదవండి: తాగి పడుకున్న దద్దమ్మలా మాట్లాడేది.. -
ఎంపీ రంగయ్యకు ప్రధాని మోదీ లేఖ
సాక్షి, అనంతపురం : అనంతపురం పార్లమెంట్ సభ్యులు తలారి రంగయ్య జన్మదినం సందర్భంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎంపీకి లేఖను పంపారు. ‘సమాజహితం కోసం మీరు చేసే పనివలన మీ జీవితం కీర్తిమయం కావాలని, అనుభవం, నాయకత్వ పటిమతో దేశాన్ని కొత్త శిఖరాలను అధిరోహించేలా చేయాలని ఈశ్వరుడిని ప్రార్థిస్తున్నా’ అని లేఖలో ప్రధాని పేర్కొన్నారు. (అమ్మా.. ఇక్కడ ఉండలేకపోతున్నా! ) ప్రధానమంత్రి పంపిన లేఖ -
కార్యాలయమా.. పశువుల పాకా?
అనంతపురం, బ్రహ్మసముద్రం/కళ్యాణదుర్గం రూరల్: ‘‘ఇదేమన్నా కార్యాలయమా...? లేక పశువుల పాకా.. ఇంత అధ్వానంగా ఉన్నా పట్టిచుకోరా..? మీ కార్యాలయ ఆవరణే ఇలా ఉంచుకున్నారంటే.. మీరు ఏ విధంగా విధులు నిర్వర్తిస్తున్నారో అర్థమవుతోంది’’ అంటూ ఎంపీ తలారి రంగయ్య బ్రహ్మసముద్రం ఎంపీడీఓ కార్యాలయ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన బ్రహ్మసముద్రం, కళ్యాణదుర్గంలలో పర్యటించారు. తొలుతబ్రహ్మసముద్రం ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాల వెళ్లారు. ఎంపీడీఓ కార్యాలయ అధికారులు ఉదయం 10.30 గంటలు దాటినా విధులకు రాకపోవడంపై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. సబ్సిడీ విత్తన వేరుశనగ పంపిణీ, ఇళ్ల పట్టాలు, రైతు భరోసా, రేషన్‌కార్డుల గురించి తహసీల్దార్ రమేష్‌బాబును అడిగి తెలుసుకున్నారు. ఉపాధి పనులపై ఆరా తీశారు. వేతనాలు చెల్లించాలని తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన పారిశుద్ధ్య కార్మికుల మాట్లాడారు. వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన కళ్యాణదుర్గం ఎంపీడీఓ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఎంపీడీఓ అందుబాటులో లేకపోవడంతో మండిపడ్డాడు. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో మూడు చోట్ల ఎంపీడీఓలు విధులకు గైరహాజరయ్యారని, ఇలా అయితే ప్రభుత్వ పథకాలు పేదలకు ఎలా అందుతాయని ప్రశ్నించారు. లాక్‌డౌన్‌తో సొంతూళ్లకు తిరిగి వస్తున్న కూలీలకు ఉపాధి హామీ పనులు విరివిగా కల్పించాలన్నారు. అనంతరం వ్యవసాయ శాఖ ఏడీఓ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. -
ఎంపీ రంగయ్యకు కీలక బాధ్యతలు ఇచ్చిన వైఎస్ జగన్
సాక్షి, అనంతపురం: అనంతపురం ఎంపీ తలారి రంగయ్యకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. లాక్డౌన్ కారణంగా నష్టపోయిన రంగాలను ఆదుకునేందుకు ప్రధాని నరేంద్రమోదీ రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించగా... రాష్ట్రంలో ఈ నిధుల సద్వినియోగం, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా ఉన్న ఈ కమిటీలో వ్యవసాయశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, హౌసింగ్, ఇంజినీరింగ్, పురపాలక శాఖ, తదితర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శులతో పాటు ముగ్గురు ఎంపీలను గౌరవ సభ్యులుగా నియమించారు. అందులో అనంతపురం ఎంపీ తలారి రంగయ్యకు చోటు కల్పించారు. ఈ మేరకు జీఓ 1384ను ప్రభుత్వం విడుదల చేసింది. అత్యున్నత కమిటీలో చోటు కల్పించినందుకు ఈ సందర్భంగా ఎంపీ రంగయ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కరోనాతో నష్టపోయిన ప్రజలను అన్ని విధాలా ఆదుకునేందుకు కృషి చేస్తానన్నారు. చదవండి: 'కియా పరిశ్రమ తనదైన ముద్ర చూపిస్తుంది' -
బాబు అవినీతిపై పార్లమెంటులో ప్రశ్నిస్తా
సాక్షి, అనంతపురం: చంద్రబాబు అవినీతిపై పార్లమెంట్లో ప్రశ్నిస్తామని అనంతపురం ఎంపీ తలారి రంగయ్య అన్నారు. ఆయన అవినీతిపై సమగ్ర విచారణ జరపాలని కేంద్రాన్ని కోరతామని పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ పాలనలో జరిగిన అవినీతి ఐటీ దాడుల్లో బట్టబయలైందన్నారు. చంద్రబాబు అండ్ కో జరిపిన రూ.2వేల కోట్లు అక్రమ లావాదేవీలు బయటపడ్డాయని విమర్శించారు. ఈ మేరకు బాబు పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో వేల కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించిన డైరీ, కీలక పత్రాలు లభ్యమయ్యాయని తెలిపారు. దీనిపై టీడీపీ నేతలు, ఎల్లో మీడియా రాస్తున్న వార్తలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. చంద్రబాబును రక్షించేందుకు ఎల్లో గ్యాంగ్ చేస్తున్న డ్రామాలను ప్రజలు నమ్మరని పేర్కొన్నారు. చదవండి: బిగ్‌బాస్ దొరికాడు! ఐటీ ఉచ్చులో అవినీతి చక్రవర్తి -
కియాపై టీడీపీ కుట్రలు చేస్తోంది
సాక్షి, అనంతపురం: కియా ఫ్యాక్టరీ ఎక్కడికి తరలిపోదని ఎంపీ తలారి రంగయ్య స్పష్టతనిచ్చారు. రూ.13,500 కోట్లతో ఫ్యాక్టరీ స్థాపించాక మరో ప్రాంతానికి ఎలా పోతుందని ప్రశ్నించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. కియా ఫ్యాక్టరీపై టీడీపీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. అసత్య కథనం ఆధారంగా గోబెల్స్ ప్రచారం(లేని దాన్ని ఉన్నట్టుగా చూపించడం) చేస్తోందని విమర్శించారు. ఏదో జరిగిపోతుందంటూ ఎల్లో మీడియా కథనాలను ఇవ్వడం దారుణమన్నారు. ఫ్యాక్టరీ తరలించే యోచనే లేదని యజమాన్యం ప్రకటించిన తర్వాత చర్చ అనవసరమని పేర్కొన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో 1.1 బిలియన్ డాలర్లతో ఏర్పాటైన కియా కార్ల కంపెనీ తన యూనిట్ ప్రారంభించి రెండు నెలలు కాకముందే తమిళనాడుకు తరలిపోతోందంటూ అంతర్జాతీయ మీడియా అసత్య కథనం వెలువడించిం. వెంటన్నీ దీన్ని పసిగట్టిన ఎల్లో మీడియా కియా పరిశ్రమ వెళ్లిపోతుందంటూ శోకాలు మొదలెట్టింది. అయితే ఆ వార్తలు వట్టి పుకార్లేనని తేటతెల్లమవడంతో దుషష్ప్రచారానికి ఒడిగట్టిన వాళ్లందరూ తెల్లమొహం వేసుకున్నారు చదవండి: కియాపై మాయాజాలం కియా తరలింపు వార్తలపై సంస్థ కీలక ప్రకటన -
విశ్వసనీయతకు ప్రతిరూపం జగన్
సాక్షి, అనంతతపురం : గ్రూప్–1 అధికారిగా పనిచేస్తున్న ఆయనకు జీవితం సాఫీగా సాగిపోయేది. రూ.1.80 లక్షల దాకా జీతం. తనకు ఇంతటి అవకాశమిచ్చిన సమాజానికి ఏదైనా చేయాలనే లక్ష్యంతో అప్పుడప్పుడు ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో సేవాతత్పరతను చాటుకునేవారు. అయితే ఏదో అసంతృప్తి. సమాజానికి ఇంకా ఏదో చేయాలనే ఆకాంక్ష ఆయనను కుదురుగా ఉండనీయలేదు. రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు మరింత దగ్గరగా ఉండి సేవచేయొచ్చని భావించారు. కుటుంబసభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులతో చర్చించి ఉద్యోగానికి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనే గ్రూప్–1 అధికారి తలారి రంగయ్య. అనంతపురం పార్లమెంటు వైఎస్సార్సీపీ అభ్యర్థి. జిల్లావాసులకు ఆయన పీడీ రంగయ్యగా సుపరిచితుడు. పీడీ ఇంటిపేరు కాకపోయినా జిల్లాలో డీఆర్డీఏ పీడీగా పని చేసినంత కాలం బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి విశేషకృషి చేశారు. దీంతో ఆయన పీడీ రంగయ్యగానే ఎక్కువ గుర్తింపు పొందారు. ఇంకా 13 ఏళ్ల సర్వీస్ ఉన్నా గ్రూప్–1 ఉద్యోగాన్ని వదులుకుని రాజకీయాల్లోకి రావడానికి కారణాలేంటి? ఆయనకు స్ఫూర్తిగా నిలిచిందెవరు? అన్న అంశాల్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. తలారి రంగయ్య అంతరంగం ఆయన మాటల్లోనే.. ప్రజాసేవ చేయాలనే ఆకాంక్ష జగన్‌తోనే సాధించగలను ‘‘వైఎస్ జగన్మోహన్రెడ్డి మనసు చూశా. వయసు చూశా. ఆయనకు పొద్దు వస్తోంది. చంద్రబాబుకు పొద్దు తిరిగింది. వైఎస్ జగన్ వెంట నడిస్తే మరో 40 ఏళ్ల భవిష్యత్తు ఉంటుంది. ఇన్నేళ్లుగా నేను అనుకున్నది సాధించే వీలుంటుంది. అదే చంద్రబాబు కీలకమైన ఈ ఐదేళ్లలో రాష్ట్రానికి సాధించిందేమీ లేదు. రాజధాని నిర్మించలేదు. పోలవరం పూర్తిచేయలేదు. ప్రత్యేకహోదా తీసుకురాలేకపోయారు. ఆంధ్రపదేశ్ ఏర్పడినప్పటి నుంచి విడిపోయే దాకా రూ.96 వేల కోట్ల అప్పులుంటే ఈరోజు రూ. 2.50 లక్షల కోట్లకు చేరింది. ఈ నాలుగున్నరేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారు. అదంతా అభివృద్ధి కోసమే ఖర్చుపెట్టామని ఆర్థికమంత్రి చెపుతున్నారు. మరి ఎక్కడ అభివృద్ధి చేశారో అర్థంకావడం లేదు. ఇవి ప్రమాదకరమైన ధోరణులు. వీటిని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. సమాజం గురించి బాధ్యతగా ఆలోచించేవారు ఈ ప్రమాదకర ధోరణుల్ని గుర్తించి ప్రశ్నించాలి. వారిలో నేనొకడిని. కష్టాలతో కాపురం చేశా.. నేను చిన్నప్పటి నుంచి కష్టాలు, ఇబ్బందులతో కలిసి కాపురం చేశాను. బడుగు, బలహీన వర్గాల కష్టాలు ఎలాగుంటాయో తెలుసు. ఆర్థికంగా టీడీపీ అభ్యర్థి జేసీ కుటుంబంతో నేను సరితూగకపోయినా జగనన్న వెంట ఉన్న జనబలం నాకుంది. కరవుతో అల్లాడుతున్న అనంతపురం జిల్లా ఇక్కట్లపై పార్టీతో కలిసి నా శక్తివంచన లేకుండా జాతీయ స్థాయిలో పోరాడతాను. ఎంపీగా గెలిస్తే జిల్లాను సస్యశ్యామలంగా మార్చేందుకు నా శాయశక్తులా కృషిచేస్తాను. జిల్లాలోని బడుగు, బలహీన వర్గాల సమస్యల్ని అతి దగ్గర నుంచి చూసిన నేను వారికి అన్ని విధాలా సాయపడాలనే దృఢసంకల్పంతో ఉన్నాను. వారి సంక్షేమం కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చాను. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ తరఫున పార్లమెంటులో పోరాడతాను. ఇది మార్పునకు నాంది విశ్వసనీయత, విలువలు, వ్యవస్థలో మార్పు అనే పదాలు వైఎస్ జగన్ నోట ఎçప్పుడూ వస్తుంటాయి. అందులో భాగంగానే రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ అట్టడుగు వర్గాల వారిని ఆదరించారు. ఎంపీ టికెట్లు రావాలంటే చిన్న విషయమా.? అందులోనూ ఇలాంటి జిల్లాల్లో బీసీ కులాలకు ఇంత ప్రాధాన్యత ఇవ్వాలంటే మాటలా.? ఇతర పార్టీలు ఎప్పుడైనా ఈ విధంగా ఇచ్చాయా.? కనీసం ఆలోచనైనా చేశాయా.? వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్పునకు నాంది పలుకుతున్నారనేందుకు ఎంపీ, ఎమ్మెల్యేల సీట్లు కేటాయింపే నిదర్శనం. బీసీలంతా జగన్‌కు మద్దతుగా ఉన్నారు అత్యంత సామాన్యుడిని, బలహీన వర్గానికి చెందిన నాకు వైఎస్ జగన్మోహన్రెడ్డి టిక్కెట్ ఇచ్చారు. బడుగు, బలహీన, అట్టడుగు వర్గాలంతా వైఎస్ జగన్‌కు మద్దతు చెబుతున్నారు. కచ్చితంగా విజయం సాధించి వైఎస్ జగన్‌కు గిఫ్ట్‌గా ఇస్తాం. బీసీ డిక్లరేషన్‌తో తన చిత్తశుద్ధి చాటుకున్నారు పార్లమెంటు, అసెంబ్లీ సీట్ల కేటాయింపులో బడుగు, బలహీన, అట్టడుగు వర్గాలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాధాన్యతనిచ్చారు. ఆయన ఎప్పుడూ చెప్పే ‘విశ్వసనీయత’ అనే పదానికి సీట్ల కేటాయింపుతో విలువ పెంచారు. పాలన, పదవులు, రాజ్యాధికారంలో బడుగు, బలహీనులకు సమాన అవకాశాలు ఇవ్వాలని 150 ఏళ్ల కిందటే జ్యోతిరావు పూలే చెప్పారు. ఆయన ఆలోచనల్ని తర్వాతి తరాల్లో అంబేడ్కర్, జగ్జీవన్‌రామ్, పెరియార్ తదితరులు పునరుద్ఘాటించారు. ఆ సిద్ధాంతాలను ఇప్పటిదాకా ఏ రాజకీయ పార్టీలు అవలంభించలేదు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకటించి బీసీల పట్ల తన చిత్తశుద్ధి చాటుకున్నారు. తాము అధికారంలోకి వస్తే నామినేటెడ్ పదవులు, పనుల్లో సగం బడుగు, బలహీన వర్గాలకు ఇస్తానని ప్రకటించారు. అట్టడుగు వర్గాలు, బలహీన వర్గాలు పదవుల్లోకి రావాలని కోరుకున్నారు. 41 అసెంబ్లీ సీట్లు బీసీలకు ఇచ్చారు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఆరు ఎంపీ సీట్లు ఉంటే అందులో మూడు బీసీలకు కేటాయించారు. అంతకంటే ఏం కావాలి. బీసీలు చట్టసభల్లోకి రావాలనే లక్ష్యంతోనే మాలాంటి సామాన్యులకు సీట్లు కేటాయించారు. -
మీ వాడు కాదు.. ప్రజా నాయకుడు
అనంతపురం సప్తగిరి సర్కిల్: ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ప్రతీ సమావేశంలో తమ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డిని మా వాడు అని సంభోదిస్తున్నారని, ఆయన మా నాయకుడనే విషయాన్ని గుర్తుంచుకోవాలని వైఎస్సార్ సీపీ అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్త తలారి పీడీ రంగయ్య అన్నారు. బుధవారం అనంతపురంలో నిర్వహించిన ధర్మపోరాటం సభలో ఎంపీ జేసీ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ప్రజా సమస్యలపై అవిశ్రాంత పోరాటాలు చేస్తూ జనం గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న నేత వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్ర ప్రజలను నమ్మించి వంచించిన చంద్రబాబు స్వార్థ రాజకీయాలను ఎండగడుతూ, అధికార పార్టీ కుట్రలను దీటుగా ఎదుర్కొంటున్న యోధుడు తమ నేత అన్నారు. ప్రతీ సమావేశంలో చంద్రబాబు భజన చేయడం మానుకొని జిల్లా ప్రయోజనాలు, కరువు నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఆలోచిస్తే ప్రజలు హర్షిస్తారన్నారు. వయస్సుకు తగినట్లు నడుచుకోవాలని, ప్రజాభిమానం కలిగిన నేతలనుద్దేశించి మాట్లాడే సమయంలో నోరు అదుపులో పెట్టుకోకపోతే జనమే తగిన బుద్ధి చెబుతారన్నారు. సీనియర్ రాజకీయ నాయకునిగా హుందాతనం ప్రదర్శించాలే కానీ, సీఎం మెప్పు కోసం ఇష్టారీతిన మాట్లాడితే సహించేది లేదన్నారు. మీ మాట తీరును అన్నివర్గాల ప్రజలు అసహ్యించుకుంటున్నారనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. బీటీ ప్రాజెక్టును చూసి సంజీవరెడ్డి ఆత్మ సంతోషిస్తుందా? మీకు అక్కడ నీళ్లు కనిపించాయా? అని ప్రశ్నించారు. జిల్లాలో కరువు విళయతాండవం చేస్తుంటే బ్రహ్మాండం బద్దలైనట్లుగా చెప్పుకోవడాన్ని ప్రజలే ఛీ కొడుతున్నారన్నారు. మీ మాటలు పిచ్చికి పరాకాష్టగా ఉన్నాయన్నారు. -
బీసీల నమ్మక ద్రోహి చంద్రబాబు
అనంతపురం, గుంతకల్లు టౌన్: తన స్వార్థరాజకీయ ప్రయోజనాల కోసం బహుజనులను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుని వదిలేసిన సీఎం చంద్రబాబు దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడాలని వైఎస్సార్సీపీ అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్త తలారి పీడీ రంగయ్య పిలుపునిచ్చారు. మంగళవారం వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. పొదుపు సంఘాల బలోపేతం, సంఘదర్శనల పేరిట ప్రభుత్వం సరికొత్త డ్రామాకు తెరలేపిందన్నారు. సీఆర్పీలను టీడీపీ ఎన్నికల ప్రచారానికై వినియోగించుకుంటున్నారని మండిపడ్డారు. ఇన్నాళ్లు లేని సంఘాల బలోపేతం చంద్రబాబుకు ఇప్పుడే గుర్తుగా వచ్చిందా అని ప్రశ్నించారు. బీసీల నమ్మకద్రోహి చంద్రబాబు అని ఆయన నిప్పులు చెరిగారు. వాల్మీకులు, రజకులు, వడ్డెర్లు, కురుబ తదితర వెనుకబడిన కులాలను ఎస్సీ,ఎస్టీ జాబితాల్లో చేరుస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఆయావర్గాల వారిని వంచించారని విమర్శించారు. అనంతపురం పార్లమెంట్ పరిధిలో ఎంపీ నిధులను ఖర్చుపెట్టి ప్రజల అవసరాలను తీర్చలేని బద్దకస్తుడు ఎంపీ జేసి.దివాకర్‌రెడ్డి అని ఆయన దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో బీసీల ఐక్యతను చాటేందుకు ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటలకు అనంతపురం జడ్పీ బంగ్లా పూలే విగ్రహం నుండి కలెక్టరేట్ వరకు జరిగే బీసీల నిరసన ర్యాలీకి బీసీలు వేలాదిగా తరలిరావాలని వారు పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ బీసీ అధ్యయన కమిటీ సభ్యుడు మీసాల రంగన్న, బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.రామలింగప్ప, జిల్లా అధ్యక్షుడు పామిడి వీరాంజినేయులు, మహిళా విభాగం అనంతపురం పార్లమెంట్ అధ్యక్షురాలు బోయ గిరిజమ్మ, అనంతపురం మహిళా విభాగం సిటీ కన్వీనర్ క్రిష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. -
శిక్షణ పేరుతో ఎన్నికల ప్రచారమా..?
అనంతపురం సప్తగిరి సర్కిల్: స్వయం సహాయక సంఘాలకు శిక్షణ పేరుతో ఎన్నికల ప్రచారాలు చేయడం దారుణమని వైఎస్సార్ సీపీ అనంతపురం పార్లమెంటు సమన్వయకర్త తలారి పీడీ రంగయ్య ధ్వజమెత్తారు. సోమవారం ఆయన వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుశీలమ్మతో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల్లో 90 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉండగా... వీరందరికీ శిక్షణ పేరుతో ‘‘శతమానం భవతి’’ అనే డాక్యూమెంటరీని చూపిస్తున్నారన్నారు. ఇందులో చంద్రబాబు ద్వారానే సంఘాలు పూర్తి స్థాయిలో బలోపేతం అయ్యాయని చిత్రీకరించారన్నారు. వీటి ద్వారా ఓటర్లను ప్రభావితం చేయడం దారుణమన్నారు. ఇలాంటి కార్యక్రమాలను అడ్డుకోవాలని మహిళ సంఘాలను కోరుతున్నామన్నారు. చంద్రబాబు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు దిగజారుడు రాజకీయాలకు దిగుతున్నారన్నారు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలోనూ స్వయం సహాయక సంఘాలు, సెర్ప్, మెప్మా, డీఆర్డీఏ వంటి సంస్థలు ఇలాంటి చర్యల ద్వారా ఓటర్లను ప్రభావితం చేశారన్నారు. డాక్యుమెంటరీ చివర్లో ఈ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలుపుకునేందుకు అవకాశం వచ్చిందని... దీనికి అందరూ కట్టుబడి ఉండాలని చూపుతునానరన్నారు. ట్రైనింగ్ ముసుగులో ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని తెలిపారు. గ్రామైక్య సంఘాలకు, ఉద్యోగులకు ప్రభుత్వానికి కొమ్ముకాయొద్దని హితవు పలికారు. గ్రామైక్య సంఘాలను బలోపేతం చేసిన ఘనత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిదని గుర్తుచేశారు. ఆనాడు మహిళ సంఘాలకు 0.25 వడ్డీ రుణాలను అందించి వాటిని బలోపేతం చేశారన్నారు. డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని మహిళలను మోసం చేసిన ఘనత చంద్రబాబుది అన్న విషయం ప్రతి మహిళా గుర్తుంచుకోవాలన్నారు. ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి, ఎన్నికల నియమావళికి విరుద్ధంగా టీడీపీ చేస్తున్న ప్రచారంపై కోర్టును ఆశ్రయిస్తామన్నారు. డాక్యూమెంటరీని నిలుపుదల చేయకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. అనంతరం సుశీలమ్మ మాట్లాడుతూ, తాను ఐదేళ్లు ప్రశాంతి జిల్లా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలిగా ఉన్నానన్నారు. గతంలో జిల్లాలో 55 వేల మహిళా సంఘాలు, 25 వేల గ్రామ సంఘాలు ఉండేవన్నారు. ప్రస్తుతం 35 వేల సంఘాలు మాత్రమే ఉన్నాయన్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం రాజకీయ రంగు పులిమేందుకు చూస్తోందన్నారు. సంఘాల బలోపేతం తన ద్వారానే సాధ్యమైందని ప్రలోభాలకు గురిచేసేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. డాక్యూమెంటరీ ప్రదర్శనను సంఘాల ప్రతినిధులు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గోగుల పుల్లయ్య పాల్గొన్నారు. -
బీజేపీ, టీడీపీలది కర్కశ పాలన
అనంతపురం: ‘‘కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ కర్కశ పాలన కొనసాగిస్తున్నాయి. స్వాతంత్య్రం రాకముందు బిట్రీష్ పాలనలో కూడా ఇలా వ్యవహరించలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవస్థలన్నీ గుప్పిట్లో పెట్టుకుని పాలిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలకు అండగా నిలిచేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి 2017 నవంబర్ 6న ఇడుపులపాయలో పాదయాత్ర ప్రారంభించారు. ఇప్పటికి ఏడాది పూర్తయింది. దీని వెనుక సంకల్పం, లక్ష్యం, ధ్యేయం ఉంది.’’ అని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాదయాత్ర ప్రారంభంలో టీడీపీ, బీజేపీ హేళన చేశాయన్నారు. జనాలను తరలిస్తున్నారంటూ మాట్లాడారన్నారు. ప్రజాశీస్సులతో తమ అధినేత ఇప్పటిదాకా 294 రోజులు 3211.5 కిలోమీటర్లు పాదయాత్ర చేశారన్నారు. 1739 గ్రామాలు, 8 కార్పొరేషన్లు, 45 మునిసిపాలిటీలు, 255 మండలాల్లో తిరిగారన్నారు. ఇది అపూర్వమైన ఘట్టం అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవినీతి, ఏకపక్ష పరిపాలన వల్ల విసిగిపోయిన అన్ని వర్గాల ప్రజలు జగన్ పాదయాత్రకు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. వారు పడుతున్న ఇబ్బందులను వైఎస్ జగన్‌కు వివరించారన్నారు. వచ్చే ఎన్నికల్లో మట్టి కరిపిస్తారనే భయంతోనే పాదయాత్రను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుటిల ప్రయత్నాలు చేసిందన్నారు. అయినా వైఎస్ జగన్ జడుసుకోలేదన్నారు. ప్రజాశీస్సులతో ఆయన ముందడుగు వేస్తున్నారన్నారు. దేశంలో ఎవరూ చేయని విధంగా సుదీర్ఘ యాత్ర చేయాల్సిన పరిస్థితులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాయన్నారు. నాలుగైదు రోజుల్లో ప్రారంభమయ్యే పాదయాత్ర దిగ్విజయంగా పూర్తవుతుందన్నారు. ఎదురించలేక హత్యాయత్నం పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి భయపడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు ఎన్నికలకు పోవాలని చూశాయన్నారు. కానీ జరగలేదన్నారు. వైఎస్ జగన్ ఉన్నంతవరకు ఎదురించలేమని తేలిపోవడంతో కడకు తుద ముట్టించాలని ఎత్తుగడ వేసి హత్యాప్రయత్నం చేయించారని ఆరోపించారు. కేంద్రం పరిధిలో ఉన్న ఎయిర్పోర్ట్ ఆవరణలో హత్యాయత్నం జరిగితే తమకేం సంబంధం అంటున్న చంద్రబాబు సీబీఐ విచారణకు ఎందుకు కోరలేదని మండిపడ్డారు. కోడికత్తి అని హేళనగా మాట్లాడుతున్న చంద్రబాబు ఆపరేషన్ గరుడ అని 8 నెలల కిందట మాట్లాడిన నటుడు శివాజీని ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు. చంద్రబాబు రాజకీయమే రక్తసిక్తం అన్నారు. కుట్రలు, కుతంత్రాలతో సీఎం అయ్యారని మండిపడ్డారు. బీజేపీతో కలిసి మోసం చేసి ఈ రోజు కొత్తపల్లవి ప్రత్యేకహోదా, విభజన చట్టంలోని హామీలు అమలులో బీజేపీతో కలిసి చంద్రబాబు మోసం చేశారన్నారు. ప్రత్యేకహోదా అంటే సంజీవనా? అని ఆ రోజు హేళనగా మాట్లాడిన చంద్రబాబు ఈ రోజు ప్రత్యేకహోదా, రైల్వేజోన్, హైకోర్టు కావాలంటూ కొత్తపల్లవి అందుకున్నారన్నారు. వెనుకబడిన 7 జిల్లాలకు బుందేల్‌ఖండ్ తరహా ప్రాజెక్ట్ అంటే దాదాపు రూ.7 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. కేంద్రం ముష్టి రూ.50 కోట్లు ఇస్తే మహాప్రసాదంలా తీసుకున్న చంద్రబాబు ఆరోజే ఎందుకు నిలదీయలేదన్నారు. నాలుగేళ్ల తర్వాత బీజేపీ మోసగించిందంటూ బయటకు వచ్చినట్లు నాటకాలు ఆడుతున్నారన్నారు. మహాసంకల్పం కోసమే పాదయాత్ర: తలారి పీడీ రంగయ్య వ్యవస్థల మార్పునకు, మహా సంకల్పం కోసమే వైఎస్ జగన్ పాదయాత్ర చేపడుతున్నారని అనంతపురం పార్లమెంటు సమన్వయకర్త తలారి పీడీ రంగయ్య అన్నారు. ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా ఈస్థాయిలో పాదయాత్ర చేసి ఉండరని గుర్తు చేశారు. వ్యవస్థలన్నింటినీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాశనం చేశాయన్నారు. ప్రజాస్వామ్యం పరిరక్షణకే కాంగ్రెస్‌తో కలిశానని చెబుతున్న చంద్రబాబు ఆయన హయాంలో ఏ ఒక్క వ్యవస్థ బాగుపడలేదన్నారు. జన్మభూమి కమిటీలు తీసుకొచ్చి పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారన్నారు. చట్టసభల్లో ఎమ్మెల్సీని కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయి హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చేశారన్నారు. దేశంలో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన వ్యక్తి సీఎం చంద్రబాబే అన్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఏకంగా మంత్రి పదవులు ఇచ్చిన ప్రభుత్వం చంద్రబాబుదేనన్నారు. కేవలం అధికారం కోసమో చంద్రబాబు కాంగ్రెస్‌తో జత కట్టారన్నారు. తాను ఏం చేసినా ప్రజలు నమ్ముతారనే భావన చంద్రబాబులో ఉందన్నారు. అది చాలా చెడ్డగుణం అన్నారు. వైఎస్ జగన్‌ను అంతమొందించేందుకే హత్యాప్రయత్నం జరిగిందన్నారు. పాదయాత్రలో ఏ నాయకుడికీ ఇంతభారీ స్థాయిలో ప్రజాదరణ లేదన్నారు. దీన్ని జీర్ణించుకోలేకే అధికార పార్టీ ఈ ఘాతుకానికి పాల్పడిందని ఆరోపించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి గౌస్‌బేగ్, సంయుక్త కార్యదర్శి ఆలుమూరు శ్రీనివాసరెడ్డి, నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్‌రెడ్డి, నాయకులు యూపీ నాగిరెడ్డి, గోగుల పుల్లయ్య, అనిల్‌కుమార్‌గౌడ్, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చరిత్ర మలచిన చరిత్రకారుడు
చారిత్రక ఘటనల వెంట నడిచి వెళ్లినవారే చరిత్రకారులైతే! ఇలాంటి ఘటనలు చరిత్రలో అరుదు. తెలుగు ప్రాంతాలలో మాత్రం ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య అలా చరిత్రకు సాక్షిగా నిలిచి, అదే చరిత్రను నమోదు చేసి, విద్యార్థులకు బోధించే సదవకాశం పొందారు. కేఏ నీలకంఠశాస్త్రి, నేలటూరి వెంకటరమణయ్య, మల్లంపల్లి సోమశేఖరశర్మ, పీవీ పరబ్రహ్మశాస్త్రి వంటివారు దక్షిణ భారతంలోనే ఖ్యాతికెక్కిన చరిత్రకారులు, లేదా చరిత్ర కోసం శ్రమించినవారు. మామిడిపూడి వెంకటరంగయ్య గారు (జనవరి 8, 1889–జనవరి 13, 1982) అలాంటి ఉన్నత శ్రేణి చరిత్రకారుడు. కానీ చారిత్రక ఘటనలతో ప్రేరణ పొంది, ప్రత్యక్ష సాక్షిగా ఉండి ఆ క్రమంలో చరిత్రకారునిగా తనను తాను తీర్చిదిద్దుకున్నప్పటికీ, చరిత్రను సశాస్త్రీయంగా ఆవిష్కరించిన ఘనత ఆచార్య మామిడిపూడికి దక్కుతుంది. వెంకటరంగయ్యగారు నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా పురిణి గ్రామంలో పుట్టారు. వీరి పూర్వీకులది మామిడిపూడి అగ్రహారం. దీనికీ ఓ చరిత్ర ఉంది. మామిడిపూడిని విజయనగర పాలకుడు సదాశివరాయలు నీలమేఘాచార్యులకు బహూకరించినది. ఆయనే మామిడిపూడి వారి పూర్వులు. నీలమేఘాచార్యుల వైదిక జ్ఞాన సంపత్తికి మెచ్చిను సదాశివరాయలు అలా సత్కరించాడు. వీరి ఇంటి పేరు దానితోనే స్థిరపడింది. వెంకటరంగయ్యగారి ప్రాథమిక విద్య పురిణిలోనే సాగింది. సంప్రదాయం మేరకు మొదటి తండ్రిగారి వద్దనే వెంకటరంగయ్య వేదాధ్యయనం, సంస్కృతాధ్యయనం చేశారు. కానీ ఆయనకి కొడుకును ఇంగ్లిష్ చదువులు చదివించాలని అనిపించింది. కొద్దికాలం ఇంటిదగ్గరే ప్రైవేటు చెప్పించి, 1899లో మద్రాసులోని పచ్చయప్ప కళాశాలకు అనుబంధంగా ఉన్న ఒక పాఠశాలలో రెండవ ఫారంలో చేర్చారు. 1907 నాటికి పచ్చయప్ప కళాశాలలోనే బీఏ చదువుతున్నారు. అప్పుడే వెంకటరంగయ్యగారి జీవితం మలుపు తిరిగింది. బెంగాల్ విభజన (1905) వ్యతిరేకోద్యమంలో భాగంగా బిపిన్‌చంద్ర పాల్ దక్షిణ భారతదేశంలో పర్యటించారు. ప్రస్తుత ఉత్తరాంధ్రలోని విజయనగరం మొదలుకొని, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, అక్కడ నుంచి మద్రాసు వరకు పాల్ పర్యటించారు. పాల్ ఉపన్యాసం అంటే దేశ ప్రజలు ఉరకలేసిన కాలం. రాజమండ్రి, కాకినాడలలో ఆయన ప్రసంగాలు మిగిల్చిన ప్రభావం కూడా పెద్ద చరిత్రకు కారణమైంది. కాకినాడలో అల్లర్లు జరిగాయి. రాజమండ్రిలో ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో అల్లర్లు జరిగాయి. పాల్ వెంట నడిచినందుకు గాడిచర్ల హరిసర్వోత్తమరావును ఆ కళాశాల నుంచి బహిష్కరించారు. అక్కడ నుంచి పాల్ మద్రాస్ వెళ్లారు. వందేమాతరం నినాదం దేశమంతటా ప్రతిధ్వనించిన కాలమది. మద్రాసు మహా నగరంలోకి ప్రవేశించే ముందు కనిపించే బేసిన్ బ్రిడ్జ్ స్టేషన్లోనే పాల్ దిగుతారని జనానికి తెలిసింది. మొత్తం నగరమే అక్కడికి కదిలి వచ్చిందా అన్నంతగా ప్రజలు వచ్చారు. రాయపురం ఆసుపత్రి మీదుగా, అశేష జనవాహిని వెంటరాగా తిరువల్లిక్కణి వరకు ఉరేగింపుగా వెళ్లారు. అయితే పాల్ ప్రసంగించడానికి ఎవరూ హాలు ఇవ్వలేదు. ‘‘సముద్రుడు ప్రసాదించిన స్థలమే ఉంది, దిగులెందుకు?’’ అన్నారట పాల్. మేరీనా బీచ్‌లో ఐదు రోజుల పాటు ప్రసంగాలు చేశారు. టీఎన్ వెంకటసుబ్బయ్యర్ అనే జాతీయవాది ఆ సభలకు అధ్యక్షత వహించారు. బెంగాల్ విభజన వెనుక కుట్ర, స్వదేశీ, జాతీయత వంటి అంశాల గురించి పాల్ అద్భుతంగా ప్రసంగించేవారు. ఈ ఐదు రోజులు కూడా ఆయన ప్రసంగాలు విన్నవారిలో వెంకటరంగయ్య కూడా ఉన్నారు. అదే ఆయనలో కొత్త చింతనకు శ్రీకారం చుట్టింది. శొంఠి రామమూర్తి మద్రాసులో వెంకటరంగయ్యగారి సహాధ్యాయులు. ఇంగ్లండ్ వెళ్లి ఐసీఎస్ చదవడానికి రామమూర్తిగారికి ఆఫీసర్స్ అసోసియేషన్ విద్యార్థి వేతనం ఏర్పాటు చేసింది. అలాంటి అవకాశం వెంకటరంగయ్య గారికి కూడా వచ్చింది. అప్పుడే బిపిన్పాల్గారి ఉపన్యాసం విన్నారాయన. ఆ ప్రభావంతోనే ఐసీఎస్‌కు వెళ్లరాదన్న నిర్ణయానికి వచ్చారు. పచ్చయప్ప కళాశాలలోనే చరిత్ర ట్యూటర్‌గా చేరారు. ఈ ఉద్యోగంలో ఉంటూనే ఆయన ఎంఏ విడిగా చదివి ఉత్తీర్ణులయ్యారు. అటు తరువాతి మలుపు కాకినాడకు తిప్పింది. మరో చరిత్ర పురుషుని సాంగత్యం ఇచ్చింది. బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడిగారి ఆహ్వానం మేరకు వెంకటరంగయ్య పీఆర్ విద్యా సంస్థలో 1910లో చరిత్రోపన్యాసకులుగా చేరారు. ఆ తరువాత విజయనగరం మహారాజా కళాశాలలో బీఏ తరగతులు ప్రారంభించారు. వారి ఆహ్వానం మేరకు అక్కడకు వెళ్లి 1927 వరకు పనిచేశారు. అక్కడ ఉండగానే మరొక ఘటన. 1921లో గాంధీజీ విజయనగరం వచ్చారు. అవి సహాయ నిరాకరణోద్యమం రోజులు. వెంకటరంగయ్య కుటుంబంతో సహా వెళ్లి గాంధీగారిని కలుసుకున్నారు. ఆయన సతీమణి వెంకమ్మగారు తన బంగారుగాజులు గాంధీజీ నిధికి ఇచ్చారు కూడా. దీనితో సంస్థానంలో ఆయన పట్ల కొంచెం వ్యతిరేకత వచ్చి, స్థానచలనం తప్పలేదు. 1925లో మహారాజా ఇంగ్లండ్ యాత్రకు వెళ్లారు. ఆ సమయంలో వెంకటరంగయ్య సెలవు పెట్టి మద్రాసు విశ్వవిద్యాలయంలో పరిశోధన ఆరంభించారు. 1928తో ఆయనకు విజయనగరం బంధం తెగిపోయింది. విజయనగరం సంస్థానం నుంచి వెంకటగిరి సంస్థానం చేరారు. అక్కడ వెంకటగిరి మహారాజా కళాశాల ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపట్టారు. ఖద్దరు దుస్తులలో, తలపాగతో వెంకటరంగయ్యగారు ఉండేవారు. అది దండి సత్యాగ్రహ ఉద్యమకాలం. స్వదేశీ పారిశ్రామిక ప్రదర్శన కూడా ఆయన ఏర్పాటు చేశారు. అక్కడ నుంచే వెంకటరంగయ్యగారికి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి పిలుపు వచ్చింది. ఎన్నో నిరసనల మధ్య వైస్‌చాన్స్‌లర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వెంకట రంగయ్యగారిని చరిత్ర, రాజనీతి శాఖలో రీడర్‌గా నియమించారు. ఆ తరువాత అక్కడే ఆయన ప్రొఫెసర్ కూడా అయ్యారు. మధ్యలో అంటే 1949లో బొంబాయి విశ్వవిద్యాలయంలో రాజనీతిశాస్త్ర విభాగం అధిపతిగా పనిచేశారు. మూడేళ్లే అయినా ఆచార్య వెంకటరంగయ్య గౌరవార్ధం ఆ విశ్వవిద్యాలయం ఒక ప్రత్యేక సంచికను ప్రచురించింది. 1908లో వెంకటరంగయ్య ‘శశిరేఖ’ అన్న పత్రికలో తొలి వ్యాసం ప్రచురించారు. అది ఇటలీ స్వాతంత్య్రోద్యమం గురించిన వ్యాసం. పదవీ విరమణ చేసిన తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచన మేరకు చరిత్ర రచన ప్రారంభించారు. అందుకు ఆయన సేకరించిన సమాచారమే పదివేల పుటలు. ఇంగ్లిష్తో పాటు, తెలుగులో కూడా చక్కని వచనం రాయగల శక్తి వెంకటరంగయ్యగారికి ఉంది. ఆంధ్రలో స్వాతంత్య్రోద్యమం పేరుతో వెలువరించిన నాలుగు సంపుటాలు చరిత్రకారునిగా ఆయన ప్రతిభను వెల్లడిస్తాయి. కౌటిల్యుని అర్థశాస్త్రాన్ని ఆయన తెలుగులోకి అనువదించారు. తెలుగులో ఆయన రాసిన పుస్తకాలే 25 వరకు ఉన్నాయి. 20కి పైగా పుస్తకాలు ఇంగ్లిష్‌లో రాశారు. భారత స్వాతంత్య్రం సమరగాథను మూడు సంపుటాలలో ఆయన తెలుగులో కూడా రచించారు. చరిత్ర రచనతో పాటు రాజ్యాంగం మీద విశ్లేషణ, పంచాయతీరాజ్ గురించి పుస్తకాలు రాశారు. విజ్ఞాన సర్వస్వం సంకలనాలకు కూడా ఆయన పనిచేశారు. ఆయన పుస్తకాల జాబితాయే విస్మయం గొలిపే రీతిలో ఉంటుంది. సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశం, ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీరాజ్, మన పరిపాలకులు, మన శాసనసభలు, పారిశ్రామిక విప్లవం, విద్యారంగం నాడు–నేడు – ఆయన రాసిన తెలుగు పుస్తకాలలో కొన్ని. ఆంగ్లంలో కూడా ది వెల్ఫేర్ స్టేట్ అండ్ సోషలిస్ట్ స్టేట్, సమ్ థియరీస్ ఆఫ్ ఫెడరలిజమ్, సమ్ యాస్పెక్ట్స్ ఆఫ్ డెమొక్రాటిక్ పాలిటిక్స్ ఇన్ ఇండియా, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ మ్యాన్ ఇన్ థియరీ అండ్ ప్రాక్టీస్, లోకల్ గవర్నమెంట్స్ ఇన్ ఇండియా వంటి వైవిధ్య భరితమైన రచనలు కనిపిస్తాయి. జీవితంలో ఎక్కువ భాగం విద్యా బోధనకీ, చరిత్ర రచనకీ అంకితం చేసిన వెంకటరంగయ్య గారికి ఆయన చివరి రోజుల నాటి విద్యా విధానం అంత సంతృప్తికరంగా కనిపించలేదు. అందుకే ఒక మాట అన్నారు. కానీ అది నేటికీ వర్తిస్తుంది. ‘ఇప్పుడు చదువులలో శిష్యులకు, గురువులకు శ్రద్ధ కనిపించదు. నేను (ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తప్ప) పన్నెండు విశ్వవిద్యాలయాలకు పరీక్షకుడిగా ఉన్నాను. విద్యా ప్రమాణం తగ్గిందనే నా నమ్మకం. ప్రభుత్వం బాధ్యత వహించాలి. మేమంతా ఈ దుస్థితి మారాలని అంటూనే ఉన్నాము. పూర్వం ఇప్పుడున్నన్ని వినోదాలు లేవు. కనుక అప్పటివారి దృష్టి ఏకాగ్రంగా ఉండేదనుకుంటాను.’ -
అనంతపురం, హిందూపురం..రంగయ్య, నదీమ్
సాక్షి ప్రతినిధి, అనంతపురం : అనంతపురం, హిందూపురం పార్లమెంట్లకు వేర్వేరుగా సమన్వయకర్తలను నియమిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన పేరుతో పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన జారీ చేసింది. అనంతపురం, హిందూపురం పార్లమెంట్ల సమన్వయకర్తగా ఇప్పటి వరకూ కొనసాగిన తలారి పీడీ రంగయ్యను అనంతపురం పార్లమెంట్మన్వయకర్తగా నియమించారు. అలాగే అనంతపురం అర్బన్ సమన్వయకర్తగా ఉన్న నదీమ్ అహ్మద్‌ను హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్తగా నియమించారు. అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడు అనంత వెంకట్రా మిరెడ్డిని అనంతపురం అర్బన్ నియోజకవర్గ సమన్వయకర్తగా కూడా నియమించారు. సముచిత నిర్ణయమే హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్తగా నదీమ్ అహ్మద్‌ను ఎంపిక చేయడం మంచి నిర్ణయమే. వైఎస్సార్ కుటుంబానికి ముందు నుంచి మైనార్టీలు అంటే చాలా ప్రేమ. 2004 ఎన్నికల్లో సైతం హిందూపురం పార్లమెంట్ స్థానానికి కదిరికి చెందిన కర్నల్ నిజాముద్దీన్‌కి టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. అలాగే 2009 ఎన్నికల్లో సైతం మళ్లీ మైనార్టీ అభ్యర్థి అయిన ఖాసీమ్ఖాన్కు టికెట్ ఇచ్చారు. అయితే ప్రజారాజ్యం పార్టీ తరపున కడపల శ్రీకాంత్‌రెడ్డి బరిలో ఉండడం వల్ల ఖాసీం ఖాన్ ఓటమి పాలయ్యేవాడు. లేకపోతే అప్పుడు కూడా మైనార్టీ అభ్యర్థే గెలుపొందేవారు. ఇప్పుడు మా అధినేత జగన్మోహన్రెడ్డి హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్తగా నదీమ్‌ను ఎంపిక చేయడం మంచి నిర్ణయం. మైనార్టీలకు సముచిత స్థానం కల్పించారు. నదీమ్ నియామకం మైనార్టీలకు ఇచ్చిన గౌరవం జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు ఉంటే గత ఎన్నికల్లో ఒక్క అసెంబ్లీ స్థానంలో కూడా టీడీపీ మైనార్టీ అభ్యర్థిని నిలపలేదు. ఏపీ కేబినెట్లో కూడా మైనార్టీకి అవకాశం లేదు. మేము కదిరి అసెంబ్లీకు మైనార్టీ అభ్యర్థిగా చాంద్‌బాషాకు అవకాశం ఇచ్చాం. అతను పార్టీని మోసం చేసి వెళ్లిపోయాడు. ఇప్పుడు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్తగా నదీమ్‌ను నియమించింది. ఈ నియామకం మైనార్టీలకు ఇచ్చిన గౌరవం. నదీమ్ మంచి వ్యక్తి, సౌమ్యుడు ఖచ్చితంగా అతనికి తామంతా సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నాం. అతని నియామకాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. నదీమ్‌కు పూర్తిస్థాయిలో సహకరిస్తాం. వైఎస్.జగన్మోహన్రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. -
అప్పుల బాధతో ఇద్దరు ఆత్మహత్య
తాడిపత్రి రూరల్: మండలంలోని అక్కన్నపల్లిలో గురువారం అప్పుల బాధతో మనస్థాపం చెంది తమ్మినేని రంగయ్య (60) అనే వృద్ధుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వివరాల మేరకు... రంగయ్య చెడు అలవాట్లకు బానిసై అప్పులు చేశాడు. అప్పుల వాళ్ల ఒత్తిళ్లు భరించలేక మనస్థాపం చెంది గ్రామ సమీపంలోని శివార్లలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ రామక్రిష్ణారెడ్డి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నామన్నారు. మృతునికి భార్య కాంతమ్మ, కుమారుడు నరేష్‌నాయుడు ఉన్నారు. చేనేత కార్మికుడు.. ధర్మవరం అర్బన్: ధర్మవరం పట్టణంలోని రాజేంద్రనగర్‌కు చెందిన చేనేత కార్మికుడు రంగనాయకులు (45) అప్పులబాధతో గురువారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల మేరకు రాజేంద్రనగర్‌కు చెందిన మద్దినేని రంగనాయకులు మగ్గం నేస్తూ జీవించేవాడు. అప్పులు ఎక్కువ కావడంతో కుటుంబ పోషణకు దాదాపు రూ.3 లక్షల వరకు అప్పులు చేశాడు. అప్పులు తీర్చలేక అవస్థలు పడుతున్న రంగనాయకులు చేనేత మగ్గాన్ని వదిలేసి బొలెరో వాహనాన్ని నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. అప్పుల వారి ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో మనోవేదనకు గురయ్యేవాడని బంధువులు తెలిపారు. దీంతో కాపురాన్ని ఆర్టీసీ బస్టాండ్ వద్దకు మార్చాడు. అక్కడి నుంచి రాజేంద్రనగర్‌లోని తండ్రి ఇంటి వద్దకు వచ్చి అప్పుడప్పుడు నిద్రపోయి వచ్చేవాడన్నారు. బుధవారం రాత్రి తండ్రి ఇంటివద్దకు వచ్చిన రంగనాయకులు ఇంటిముందున్న రేకులషెడ్డులో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువులు ఉదయాన్నే రేకులషెడ్డును తెరవగా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. పట్టణ పోలీసులకు సమాచారం అందించగా వారు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతునికి భార్య అరుణమ్మ, కుమార్తె సాయిప్రభ, కుమారుడు హరికృష్ణలు ఉన్నారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
మంత్రి సునీత అనుచరుడి ఘరానా మోసం
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ మంత్రి సునీత అనుచరుడు రంగయ్య ఘరానా మోసానికి పాల్పడ్డాడు. జిల్లాలోని సీకేపల్లిలో ఓ రైతు నుంచి భూమి కొనుగోలు చేసి డబ్బు ఎగ్గొట్టాడు. ఎకరా రూ. 2.50 లక్షలకు రైతుతో బేరమాడి.. ఇప్పుడేమో రూ.50 వేలే ఎక్కువ అంటూ రైతు సూర్యప్రకాష్‌ను బెదిరిస్తున్నాడు. దీంతో దిక్కుతోచని స్ధితిలో తనకు న్యాయం చేయాలంటూ జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించాడు. -
యువకుడి ఆత్మహత్యాయత్నం
గార్లదిన్నె : మర్తాడులో రంగయ్య అనే యువకుడు కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై గురువారం రాత్రి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అపస్మారకస్థితిలో ఉన్న అతడిని కుటుంబ సభ్యులు గమనించి 108 వాహనంలో అనంతపురం ఆస్పత్రికి తరలించారు.