సాక్షి, అనంతపురం: అనంతపురం ఎంపీ తలారి రంగయ్యకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. లాక్‌డౌన్ కారణంగా నష్టపోయిన రంగాలను ఆదుకునేందుకు ప్రధాని నరేంద్రమోదీ రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించగా... రాష్ట్రంలో ఈ నిధుల సద్వినియోగం, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు.
ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా ఉన్న ఈ కమిటీలో వ్యవసాయశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, హౌసింగ్, ఇంజినీరింగ్, పురపాలక శాఖ, తదితర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శులతో పాటు ముగ్గురు ఎంపీలను గౌరవ సభ్యులుగా నియమించారు. అందులో అనంతపురం ఎంపీ తలారి రంగయ్యకు చోటు కల్పించారు. ఈ మేరకు జీఓ 1384ను ప్రభుత్వం విడుదల చేసింది. అత్యున్నత కమిటీలో చోటు కల్పించినందుకు ఈ సందర్భంగా ఎంపీ రంగయ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కరోనాతో నష్టపోయిన ప్రజలను అన్ని విధాలా ఆదుకునేందుకు కృషి చేస్తానన్నారు. చదవండి: 'కియా పరిశ్రమ తనదైన ముద్ర చూపిస్తుంది'
Comments
Please login to add a commentAdd a comment