అనంతపురం: రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద ప్రజా సభగా రాప్తాడు సిద్దం సభ నిలిచింది. వైఎస్ జగన్ వస్తే ప్రభంజనమేనని మరోసారి ప్రజలు చాటిచెప్పారు. రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాల్లో 175, 25 లోక్‌సభ స్థానాల్లో 25 గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడానికి ఆదివారం అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన ‘సిద్ధం’ సభకు విచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు లక్షలాది జనం బ్రహ్మరథం పట్టారు.
రాయలసీమలోని 52 అసెంబ్లీ స్థానాల నుంచి వేలాది వాహనాల్లో ప్రజలు తరలివచ్చారు. సభా వేదికపైకి సీఎం జగన్ చేరుకోకముందే ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఇంకా లక్షలాది మంది ప్రజలు హైదరాబాద్– బెంగళూరు, అనంతపురం–చెన్నై జాతీయ రహదారులపై ఎక్కడికక్కడే నిలిచిపోయారు.
అనంతపురం–చెన్నై జాతీయ రహదారిలో ఎస్కే యూనివర్సిటీ దాటి సంజీవపురం వరకు 12 కిలోమీటర్ల పొడవునా, ఇటు రాప్తాడు వైపు బెంగళూరు–హైదరాబాద్ జాతీయ రహదారిపై మరూరు టోల్‌గేట్, మరో వైపు రాప్తాడు నుంచి అనంతపురం వరకు వాహనాలు నిలిచిపోయాయి. సభా ప్రాంగణంలో ఎన్ని లక్షల మంది ఉంటారో.. ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన వారు అంతకు మించే ఉన్నారని అనంతపురం నగరం, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చెబుతున్నారు.
‘సిద్ధం’ అని నినదించిన లక్షలాది గొంతులు
దుష్ట చతుష్టయంపై యుద్ధానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా? అంటూ వైఎస్ జగన్ చేసిన రణ గర్జనకు ..‘సిద్ధం’ అంటూ లక్షలాది గొంతులు ప్రతిధ్వనించాయి. ఎండ తీవ్రత పెరిగినా జనం లెక్కచేయలేదు. సీఎం జగన్ ప్రసంగాన్ని ఆసక్తిగా వింటూ జై జగన్ అంటూ నినదించారు. పెత్తందారులతో యుద్ధానికి మీరు సిద్ధమేనా? విశ్వసనీయతకు, వంచనకు మధ్య యుద్ధం జరుగుతోంది.
పక్క రాష్ట్రాల్లో ఉంటూ ఇక్కడ రాజకీయాలు చేసే నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ అవసరమా? చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా? ప్రజల మంచి కోసం చంద్రబాబు చేసిన మంచి పని ఒక్కటైనా ఉందా? చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో రైతులకు గుర్తుకు వచ్చే పథకం ఒక్కటైనా ఉందా? మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 10 శాతమైనా అమలు చేశారా? అని అడిగిన ప్రశ్నలకు.. లక్షలాది మంది టార్చ్ ఆన్ చేసిన మొబైల్ ఫోన్లను చేత్తో పట్టుకుని చూపుతూ ప్రతిస్పందించారు.
‘రంగు రంగుల మేనిఫెస్టోతో మళ్లీ మోసం చేయడానికి బాబు వస్తున్నాడు. చంద్రబాబు చేసేవన్నీ మోసాలే, చెప్పేవన్నీ అబద్ధాలే. గత ఎన్నికల్లో అందరూ చొక్కాలు మడతపెట్టి చంద్రబాబు కుర్చీని మడతేసి వాళ్ల సీట్లను తగ్గించారు. ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లో ఉండాలి. సైకిల్ ఎప్పుడూ బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్‌లోనే ఉండాలి’ అన్నప్పుడు లక్షలాది గొంతులు ‘అవును.. అవును..’ అంటూ నినదించాయి.
పోటెత్తిన రైతన్నలు
రాప్తాడు సిద్ధం సభకు హాజరైన వారిలో అత్యధికులు అన్నదాతలే ఉండడం గమనార్హం. రాయలసీమ వ్యవసాయాధారిత ప్రాంతం. సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన వ్యవసాయ సంస్కరణలు, రైతు సంక్షేమ పథకాల వల్ల లబ్ధిపొందిన అన్నదాతలు వైఎస్సార్‌సీపీకి బ్రహ్మరథం పడుతున్నారు. అందుకే ఈ సభకు ఇంత భారీ స్థాయిలో తరలి వచ్చారు.
వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎం చేసుకుంటేనే రాష్ట్రం మరింతగా అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని, వర్షాలు సమృద్ధిగా పడతాయని ఆకాంక్షిస్తున్నారు. సీఎం జగన్ రైతు బాంధవుడిగా ఉంటారనే నమ్మకంతోనే అన్నదాతలు వైఎస్సార్‌సీపీ పక్షాన నిలబడుతున్నారు. ఈ సభకు యువతతో పాటు మహిళలు, వృద్ధులు సైతం తరలిరావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సభకు సీఎం వైఎస్ జగన్ మధ్యాహ్నం 3 గంటలకు వస్తారని తెలిసినా.. ఉదయం 11 గంటల నుంచే జనం తరలివచ్చారు.
మధ్యాహ్నం 2 గంటలకే సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. సభలో సీఎం జగన్ ప్రసంగిస్తున్నంత సేపు వాహనాల్లో జనం వస్తూనే ఉన్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో ప్రాంగణానికి చేరుకోలేక పెద్ద సంఖ్యలో మధ్యలో నిలిచి పోయిన వారు తమ సెల్ ఫోన్లలో లైవ్ చూస్తూ ఆనందించారు.
జగనన్నను గెలిపించేందుకు సిద్ధం
ఎన్నడూ చూడనివిధంగా జగనన్న సైనికులు ‘సిద్ధం’ సభకు తరలివచ్చారు. సీఎం జగన్‌కు అండగా ఉండేందుకు సిద్ధమని నినదించారు. ఆయన ముఖ్యమంత్రయ్యాక బడుగు, బలహీన వర్గాలకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. అణగారిన వర్గాలకు నేరుగా లబ్ధి కల్పించిన ఏకైక ప్రభుత్వం జగనన్నదే. రూ.2.55 లక్షల కోట్లు పేదల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. –అంజాద్ బాషా, ఉప ముఖ్యమంత్రి
ప్రభంజనం అంటే ఇదే
ప్రభంజనం అంటే ఇలాగే ఉంటుంది. ఎల్లో మీడియా కూటమి విషప్రచారం చేస్తున్నా.. గొప్ప నాయకుడిని మాత్రం చరిత్ర ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటుంది. టీడీపీ కంచుకోటలుగా చెప్పుకునే నియోజకవర్గాలన్నీ జగనన్న దెబ్బకు మంచుకొండల్లా కరిగిపోతాయి. రానున్న ఎన్నికల కోసం కౌరవులందరూ గుంపులుగా వస్తుంటే జగనన్న మాత్రం సింగిల్‌గా వస్తున్నారు. – ఉషశ్రీ చరణ్, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి
దేశానికి రోల్ మోడల్ జగన్
ప్రజావసరాలను గుర్తించి పరిష్కరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఆయన దేశానికి రోల్ మోడల్. రాబోయే కురుక్షేత్రంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. సిద్ధం సభలతో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం ఏంటో అందరికీ తెలిసింది. –కొరుముట్ల శ్రీనివాసులు, రైల్వేకోడూరు ఎమ్మెల్యే
మీ అడుగుజాడల్లో నడిచేందుకు సిద్ధం
బ్రిటీష్ వాళ్లపై తిరుగుబాటు చేసిన తొలి భారతీయుడు సీమబిడ్డ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎట్టా ఉంటాడో తెలుసా.. ఇట్టా ఉంటాడు! (సీఎంను చూపుతూ).. దాతృత్వంలో బుడ్డా వెంగల్‌రెడ్డి, రాజసంలో రాజశేఖరరెడ్డి, పౌరుషంలో సైరా నరసింహారెడ్డికి ప్రతీక మన జగన్‌మోహన్‌రెడ్డి. 21 ఏళ్ల టీడీపీ పాలనలో ఈ ప్రాంతం వందేళ్లకు సరిపడా విషాదం చూసింది. ఫ్యాక్షన్ హత్యలు, రైతుల ఆత్మహత్యలు, కరువు కాటకాలు, వలసలతో గ్రామాలు నిర్మానుష్యమయ్యాయి. జగన్ సీఎంగా వచ్చిన క్షణం నుంచి నేటి వరకు ఫ్యాక్షన్ హత్యలు లేవు.
రైతు ఆత్మహత్యలు, కరువు కాటకాలు, వలసలు అసలే లేవు. ఈ ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ హబ్‌గా మార్చిన జగన్‌కు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి. ‘పచ్చ’రాజ్యంలో కాళ్లు పట్టుకుంటే తప్ప పథకాలు వచ్చేవి కాదు. ఈ రోజు ఇంటికే పథకాలు వస్తున్నాయి, జగనన్న అండతో రాయలసీమ అభివృద్ధికి కేరాఫ్‌గా మారింది. నిన్నే నమ్ముకున్న రాయలసీమ బిడ్డలంతా నీ అడుగులో అడుగు వేసేందుకు సిద్ధం.
14 ఏళ్ల చంద్రబాబు పాలనలో ఈ ప్రాంతంలో తెగిన స్త్రీల తాళిబొట్లను, రైతులకు జరిగిన అన్యాయం, నిరుద్యోగులు, పొదుపు సంఘాల మహిళలకు జరిగిన మోసాన్ని గుర్తు చేసుకోవాలి. జగనన్న వచ్చిన తర్వాత ప్రతి ఇంటికీ మేలు చేశారు. అందుకే ధైర్యంగా జనాల్లో తిరుగుతున్నాం. వచ్చే ఎన్నికల్లో పెత్తందారులతో యుద్ధానికి కార్యకర్తలంతా సిద్ధమా? – తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్యే, రాప్తాడు
జగన్ సత్తా చాటిన సిద్ధం సభ
ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి ఇంత భారీగా సభ ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. పేదల జీవితాలను మార్చగలిగే కలియుగ బ్రహ్మ వైఎస్ జగన్. అంబేడ్కర్ కలలను ఆయన నిజం చేశారు. ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేర్చారు. ప్రజాభిమానంతో వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీ గెలిచితీరుతుంది. –బీవై రామయ్య, వైఎస్సార్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు
నిరుపేదలను గుండెల్లో పెట్టుకున్న జగన్
నిరుపేదలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుండెల్లో పెట్టుకున్నారు. బడుగు, బలహీన వర్గాలను అధికారంలో భాగస్వామ్యం చేశారు. రాజకీయంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు పెద్దపీట వేశారు. అలాంటి జగనన్నకు రెండు చేతులు పైకెత్తి దండం పెట్టడం తప్ప ఏమిచ్చి రుణం తీర్చుకోగలం.–పైలా నరసింహయ్య, వైఎస్సార్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు
2.30లక్షల మందికి ఉద్యోగాలిచ్చారు
గ్రామ సచివాలయాల ద్వారా 2.30 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిన ఏకైక సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. వైద్య, ఆరోగ్య శాఖలో కూడా వేలాది మందికి ఉద్యోగాలు కల్పించారు. వలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు ఇంటి వద్దకే అందిస్తున్నారు. కరోనా సమయంలో ప్రజలకు బాసటగా నిలిచారు. – అమర్‌నాథ్ రెడ్డి, తాడిపల్లి గ్రామం, వైఎస్సార్ జిల్లా
బాబు మళ్లీ వస్తే అవినీతి తప్పదు
ఇప్పుడున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగన్ మళ్లీ సీఎం కావాలి. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా నేరుగా మన ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. మధ్యవర్తులు లేని ప్రజా పాలన సాగిస్తున్నారు. లంచాలకు, అవినీతికి తావు లేదు. చంద్రబాబు పొరపాటున వస్తే అవినీతికి ద్వారాలు తెరిచినట్టే. – జయమ్మ, ఎర్రవంకపల్లి గ్రామం, శ్రీసత్యసాయి జిల్లా
చంద్రబాబు హామీలు ఎవరూ నమ్మరు
ఎన్నికల ముందు చంద్రబాబు ఓట్ల కోసం ఇచ్చే హామీలను ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. గతంలో 600 అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను నిలువునా మోసం చేశాడు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి అన్ని సామాజిక వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నారు. సమ సమాజ స్థాపనే ధ్యేయంగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పని చేస్తోంది. – అమరావతి, అనంతపురం
రుణమాఫీతో మహిళలకు చేయూత
ఎన్నికల సమయంలో ఇచి్చన హామీ మేరకు విడతల వారీగా స్వయం సహాయక సంఘాల మహిళల రుణాలను సీఎం వైఎస్ జగన్ మాఫీ చేశారు. ఒక్కో మహిళకు రూ.5వేల నుంచి రూ.లక్ష వరకు రుణమాఫీ జరిగింది. వైఎస్సార్ చేయూత ద్వారా ఏటా రూ.18,750 చొప్పున ఆరి్థకసాయం అందించి అండగా నిలిచారు. గతంలో చంద్రబాబు ‘పసుపు–కుంకుమ’ పేరుతో మహిళలను మోసం చేశారు. మళ్లీ ఆయన మాయలో పడేది లేదు. – జయమ్మ, రాంపురం, అనంతపురం జిల్లా
జగన్ సీఎం అయితేనే పథకాల అమలు
పేదలు ఆరి్థకంగా అభివృద్ధి చెందాలనే గొప్ప ఆశయంతో ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. ఆయన మళ్లీ సీఎం అయితేనే ఈ పథకాలన్నీ కొనసాగుతాయి. పేదల బ్యాంకు అకౌంట్లలో డబ్బులు పడతాయి. సంక్షేమ పథకాలు ఆగకూడదని సీఎం మాటగా గ్రామాల్లోకి వెళ్లి ప్రజలకు ఇదే చెబుతాం. – విశ్వనాథ్, వానవోలు, శ్రీసత్యసాయి జిల్లా
జగనే మళ్లీ ముఖ్యమంత్రి కావాలి
ఉదయించే సూర్యుడు లాంటివాడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. జన సంక్షేమం కోసం పాటుపడుతున్న ఆయనపై బురద చల్లాలనుకోవడం అవివేకమే. చంద్రబాబు, పవన్‌లను ఎన్నికల్లో ఓడించడం ద్వారా వారికి తగిన బుద్ధి చెబుతాం. జనరంజక పాలన సాగించే జగన్‌నే మళ్లీ సీఎంను చేసుకుంటాం. – శ్రీనివాసులు, గాజులపల్లి, నంద్యాల జిల్లా
కరువు, చంద్రబాబు కవలలు
కరువు, చంద్రబాబు ఇద్దరూ కవల పిల్లలు. ఆయనకు ఓటు వేసి గెలిపించుకుంటే కరువు విలయతాండవం చేస్తుంది. గ్రామాల్లో తాగేందుకు చుక్కనీరు కూడా దొరకదు. ఆయన కుమారుడు యువగళం పేరుతో పాదయాత్ర చేసినందుకు మా జిల్లాలో వర్షాలు కూడా రాకుండా అటే వెళ్లిపోయాయి. మళ్లీ చంద్రబాబును అధికారంలోకి తేవడమంటే కరువు తెచ్చుకున్నట్లే అవుతుంది. – రవీంద్రారెడ్డి, ధర్మవరం, శ్రీసత్యసాయి జిల్లా
మా పాలిట దేవుడు జగన్
మా లాంటి నిరుపేదలకు వలంటీర్‌గా ఉద్యోగం ఇచ్చి జగనన్న దేవుడయ్యాడు. ఉద్యోగాలు లేక ఇంటి పట్టున ఉండేవాళ్లం. వలంటీర్ ఉద్యోగం వచ్చాక సంక్షేమ పథకాలు లబ్ధిదారుల ఇంటి దగ్గరకు తీసుకెళ్లి అందిస్తున్నాం. ప్రజలు మమ్మల్ని దేవుళ్లలా భావిస్తున్నారు. జగనన్న మేలు మరచిపోలేం. – రామాంజనేయులు, కౌతాళం గ్రామం, కర్నూలు జిల్లా
అభివృద్ధి, సంక్షేమం జగన్‌తోనే సాధ్యం
విద్య, వైద్యం, ఉపాధి, పారిశ్రామిక తదితర రంగాల్లో అభివృద్ధితో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం కొనసాగాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రావడం ఎంతో అవసరం. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నేను మేలు చేశానని భావిస్తేనే ఓటు వేయండి అని అడుగుతున్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. – పార్వతి, రుద్రంపేట, అనంతపురం.
ఇంతటి అభివృద్ధి ఎప్పుడూ చూడలేదు
గతంలో ప్రభుత్వ ఆస్పత్రులకు రావాలంటే రోగులు భయపడేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నాలుగున్నరేళ్లలో ఆస్పత్రులు నాడు–నేడు ద్వారా అద్భుతంగా రూపుదిద్దుకున్నాయి. అన్ని రకాల మౌలిక సదుపాయాలతో ఆధునికంగా తయారయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలోనే ఈ మార్పు కనిపిస్తోంది. ఖరీదైన ఎంఆర్‌ఐ, సీటీస్కాన్‌లు సైతం ఏర్పాటు చేశారు. ఓపెన్ హార్ట్ సర్జరీ యూనిట్లను పునరుద్ధరించారు. వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలనలో రెండేళ్లు కోవిడ్‌తో సరిపోయింది. మిగిలిన తక్కువ సమయంలోనే ఈ రాష్ట్రాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారు. – శివకృష్ణ, వైద్యాధికారి, రాప్తాడు, అనంతపురం జిల్లా
పేదలంటే బాబు దృష్టిలో కూలీలు
పేదలంటే పెత్తందార్ల ఇళ్లలో పనిచేసే కూలీలుగా చంద్రబాబు భావించేవారు. 2014 ఎన్నికలకు ముందు రైతులకు రుణమాఫీ చేస్తానని ప్రకటించి.. గెలిచిన తర్వాత పక్కన పెట్టేశారు. 2019లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక రైతే రాజయ్యాడు. ఏటా పెట్టుబడి రాయితీ, విత్తనాలు, ఎరువులు రైతుల వద్దకే చేరుతున్నాయి. మనసున్న ముఖ్యమంత్రిగా అందరి మన్ననలు అందుకున్నారు. – మల్లిరెడ్డి, పత్తికోట, అన్నమయ్య జిల్లా
బాబు పాలనలో నరకం చూశాం
చంద్రబాబు పాలనలో నరకం చూశాం. వర్షాలు కురవక, పంటలు పండక తీవ్ర ఇబ్బందులు పడ్డాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు. తినేందుకు తిండి లేక వలసలు వెళ్లాల్సి వచ్చేది. మూగ జీవాలకు మేత దొరక్క వాటిని కూడా అమ్ముకున్నాం. జగన్ ముఖ్యమంత్రి కాగానే రాజన్న పాలన మళ్లీ ప్రారంభమైంది. రైతులకు మంచిరోజులు వచ్చాయి. కడుపునకు అన్నం తినే ఎవడూ చంద్రబాబుకు ఓటు వేయరు. – జయరామిరెడ్డి, రైతు, బుక్కచెర్ల, అనంతపురం జిల్లా
జిత్తులమారి పొత్తులను తిప్పికొడతాం
ప్రతిపక్షాలు నక్క జిత్తుల పొత్తులతో జగన్‌ను గద్దె దింపాలని చూస్తున్నాయి. సీఎం జగన్ తన ప్రసంగంతో ఇ చ్చిన స్ఫూర్తితో పనిచేస్తాం. వచ్చే ఎన్నికల్లో గ్రామాల్లో ప్రతిపక్షాల కుట్రలు, కుతంత్రాలను తిప్పి కొడతాం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జరిగిన మేలును అందరికీ అర్థమయ్యేలా వివరిస్తాం. జగనన్నను గెలిపించుకుంటాం. – సుప్రజ, అనంతపురం
నా తొలి ఓటు జగనన్నకే
నేను అనంతపురంలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. తొలిసారి ఓటు హక్కు పొందా. నా తొలి ఓటు జగనన్నకే వేస్తాను. జగన్‌మోహన్ రెడ్డిని చూడాలనే మా ఊరోళ్లతో కలిసి సభకు వచ్చాను. నాలాంటి వారి చదువులకు సీఎం జగన్ ఎంతో సాయం అందిస్తున్నారు. అందుకే మళ్లీ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నా. – మేఘనాథ్‌రెడ్డి, పైలబోయినపల్లి, శ్రీ సత్యసాయి జిల్లా
అర్హులందరికీ ఇళ్ల స్థలాలు
దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో సీఎం జగన్ రాష్ట్రంలో అర్హులైన 33 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. గత ప్రభుత్వం పేదలకు ఇంటి స్థలాలు అందించలేదు. – అబ్దుల్లా, బస్తిపాడు, కల్లూరు మండలం, కర్నూలు జిల్లా
జగనన్నపై నమ్మకం పెరిగింది
సీఎం వైఎస్ జగన్ ప్రసంగం విన్నాక రాష్ట్రంలో 175కు 175 స్థానాలు వైఎస్సార్ సీపీ సాధిస్తుందన్న నమ్మకం పెరిగింది. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలుపే లక్ష్యంగా దిశా నిర్దేశం చేశారు. పార్టీ విజయం కోసం మరింతగా పని చేయాలన్న సంకల్పం మా అందరికీ కలిగింది. మేమంతా ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపు కోసం సిద్ధంగా ఉన్నాం. – చంద్రకళాబాయి, కర్నూలు
మహిళలంతా జగనన్న వెంటే
సీఎం జగన్ వస్తున్నారంటే మా మహిళలంతా స్వచ్ఛందంగా తరలివచ్చాం. మహిళలను తన అక్క, చెల్లెమ్మల్లా భావించి ఎన్నో పథకాలు అందిస్తున్నారు. ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే సంక్షేమ పథకాలు అందరికీ అందుతాయి. ఇదే విషయాన్ని ఊరెళ్లాక అందరికీ చెబుతాను. – వై.హేమలత, రామినేపల్లి, అనంతపురం జిల్లా
ఈ యుద్ధంలో జగన్‌దే గెలుపు
విపక్షాలు ఎన్ని పన్నాగాలు పన్నినా అర్జునుడిలా పోరాడి రానున్న ఎన్నికల రణరంగంలో విజేతగా నిలుస్తానని వైఎస్ జగన్ చేసిన ప్రకటన కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది. ఎన్నికల రణరంగంలో జగన్ విజేతగా నిలుస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. – జగదీశ్వర్ రెడ్డి, చిన్నకులాల గ్రామం, వైఎస్సార్ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment