ఇది సీఎం జగన్‌ చరిష్మా.. ట్రెండింగ్‌లో ‘సిద్ధం’ | Raptadu Siddham Sabha Program Trending On Social Media | Sakshi
Sakshi News home page

ఇది సీఎం జగన్‌ చరిష్మా.. ట్రెండింగ్‌లో ‘సిద్ధం’

Published Sun, Feb 18 2024 2:42 PM | Last Updated on Sun, Feb 18 2024 5:59 PM

Raptadu Siddham Sabha Program Trending On Social Media - Sakshi

సాక్షి, అనంతపురం: సోషల్‌ మీడియాలో ‘సిద్ధం’ కార్యక్రమం ట్రెండింగ్‌లో నిలిచింది. ఎక్స్‌(ట్విట్టర్‌)లో దేశంలోనే మొదటిస్థానంలో సిద్ధం’ హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతోంది. సిద్ధం అప్‌డేట్స్‌ను వైఎస్సార్‌సీపీ అభిమానులు భారీగా షేర్‌ చేస్తున్నారు. ‘సిద్ధం’ సభా ప్రాంగణం ఫొటోలతో  ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ నిండిపోయింది.

ఎన్నికల కురుక్షేత్ర యుద్ధానికి గత నెల 27న భీమిలి వేదికగా శంఖం పూరించిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా క్షేత్రంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే నేడు రాయలసీమలోని రాప్తాడులో ఏపీలోనే కనివిని ఎరుగని రీతిలో సిద్ధం సభ జరిగింది. రాప్తాడు సభ సముద్రాన్ని తలపించింది. సభకు లాక్షలాదిగా సీఎం జగన్‌ సైన్యం తరలివచ్చింది. సీఎం జగన్‌ ప్రసంగం సింహనాదంలా కొనసాగింది. ఎంతమంది జత కట్టినా.. ఎన్ని పొత్తులు పెట్టుకున్నా ప్రజలతోనే తన పొత్తు అని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. ప్రజలే స్టార్‌ క్యాంపెనర్లుగా సీఎం జగన్‌ ప్రకటించారు. లబ్ధిదారులే తనకు ఓటు వేయిస్తారని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

చదవండి: రాప్తాడు సిద్ధం సభలో సీఎం జగన్ పంచ్‌లు
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement