
సాక్షి, అనంతపురం: చంద్రబాబు అవినీతిపై పార్లమెంట్‌లో ప్రశ్నిస్తామని అనంతపురం ఎంపీ తలారి రంగయ్య అన్నారు. ఆయన అవినీతిపై సమగ్ర విచారణ జరపాలని కేంద్రాన్ని కోరతామని పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ పాలనలో జరిగిన అవినీతి ఐటీ దాడుల్లో బట్టబయలైందన్నారు. చంద్రబాబు అండ్ కో జరిపిన రూ.2వేల కోట్లు అక్రమ లావాదేవీలు బయటపడ్డాయని విమర్శించారు. ఈ మేరకు బాబు పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో వేల కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించిన డైరీ, కీలక పత్రాలు లభ్యమయ్యాయని తెలిపారు. దీనిపై టీడీపీ నేతలు, ఎల్లో మీడియా రాస్తున్న వార్తలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. చంద్రబాబును రక్షించేందుకు ఎల్లో గ్యాంగ్ చేస్తున్న డ్రామాలను ప్రజలు నమ్మరని పేర్కొన్నారు.
చదవండి: బిగ్‌బాస్ దొరికాడు!