సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు వేలూరు రంగయ్య నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. నామినేషన్‌లో సరైన డాక్యూమెంట్లు సమర్పించకపోడంతో టీడీపీ నేత వేలూరు రంగయ్య నామినేషన్ తిరస్కరిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. దీంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వాల్మీకి మంగమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 1277 ఓట్లు ఉండగా.. వైఎస్సార్‌సీపీ కి 1200 పైగా ఆధిక్యత ఉంది. బలం లేకపోయినా బరిలో దిగేందుకు యత్నించి టీడీపీ నేతలు అభాసుపాలయ్యారు. పైగా ఎన్నికల అధికారులపై అభాండాలు వేయటం సరికాదని అనంతపురం సీనియర్ న్యాయవాది ఉమాపతి పేర్కొన్నారు.
చదవండి: నా కుమారుడు రాఘవరెడ్డి ఏ తప్పు చేయలేదు: ఎంపీ మాగుంట
Comments
Please login to add a commentAdd a comment