Veluru
-
అనంత: జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలక పరిణామం
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు వేలూరు రంగయ్య నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. నామినేషన్లో సరైన డాక్యూమెంట్లు సమర్పించకపోడంతో టీడీపీ నేత వేలూరు రంగయ్య నామినేషన్ తిరస్కరిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. దీంతో వైఎస్సార్సీపీ అభ్యర్థి వాల్మీకి మంగమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 1277 ఓట్లు ఉండగా.. వైఎస్సార్సీపీ కి 1200 పైగా ఆధిక్యత ఉంది. బలం లేకపోయినా బరిలో దిగేందుకు యత్నించి టీడీపీ నేతలు అభాసుపాలయ్యారు. పైగా ఎన్నికల అధికారులపై అభాండాలు వేయటం సరికాదని అనంతపురం సీనియర్ న్యాయవాది ఉమాపతి పేర్కొన్నారు. చదవండి: నా కుమారుడు రాఘవరెడ్డి ఏ తప్పు చేయలేదు: ఎంపీ మాగుంట -
ఇద్దరూ మైనర్లే.. పెళ్లి ఒప్పుకోలేదని పేమజంట ఆత్మహత్య
సాక్షి, చెన్నై: తమిళనాడులోని వేలూరు జిల్లా గుడియాత్తం సమీపంలోని సొన్నాంకుప్పం గ్రామానికి చెందిన సుధాకర్ కుమార్తె త్రిష(16) అదే ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్లస్‌వన్ చదువుతోంది. అలాగే కీల్ ఆలత్తూరు గ్రామానికి చెందిన పుణ్యకోటి కుమారుడు యశ్వంత్(18) గుడియాత్తంలో పాలిటెక్నిక్ చదువుతున్నాడు. వీరిద్దరూ గత కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడంతో మంగళవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. వేకువజామున ప్రేమికులు ఇద్దరు గుడియాత్తం సమీపంలోని కావనూరు రైల్వేస్టేషన్ సమీపంలో రైలు పట్టాలపైకి వెళ్లారు. ఆ సమయంలో చెన్నై నుంచి జోలార్‌పేట వైపు వస్తున్న ఎలగిరి ఎక్స్‌ప్రెస్ రైలు ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. గమనించిన లోకో పైలెట్ జోలార్‌పేట రైల్వే పోలీసులకు సమాచారం అందజేశారు. రైల్వే పోలీసులు మృతదేహాలను ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మైనర్‌పై 56 ఏళ్ల వ్యక్తి అఘాయిత్యం.. 7 నెలల గర్భిణి
సాక్షి, చెన్నై: వేలూరు జిల్లాలో బాలికను గర్భవతిని చేసిన మాజీ సైనికుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. వేలూరు జిల్లా గుడియాత్తం ఇందిరా నగర్‌కు చెందిన శేఖర్ (56). మాజీ సైనిక వీరుడైన అతను ప్రస్తుతం ఇంట్లో బియ్యపు పిండి రుబ్బు యంత్రం పెట్టుకొని వ్యాపారం చేస్తున్నాడు. ఇతని భార్య పంచాయతీ వార్డు సభ్యురాలుగా ఉన్నారు. ఈ క్రమంలో శేఖర్ తమ ఊరికి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలికపై ఏడు నెలల క్రితం లైంగిక దాడి చేశాడు. అనారోగ్యం ఏర్పడడంతో బాలికను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. డాక్టర్లు విద్యార్థిని 7 నెలల గర్భిణి అని తేల్చారు. తల్లిదండ్రులు విద్యార్థిని వద్ద విచారణ చేయగా శేఖర్ తనపై లైంగిక దాడి చేసినట్లు తెలిపింది. శేఖర్‌ను ప్రశ్నించగా.. బాలికకు గర్భస్రావం చేసేందుకు రూ. 10 లక్షలు ఇస్తానంటూ బెదిరించాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు గుడియాత్తం మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు శేఖర్‌ను అరెస్టు చేసి వేలూర్ జైలుకు తరలించారు. -
20 ఏళ్ల క్రితం ఇంటికి తాళం.. దెయ్యాలు ఉంటాయని పూజలు
వేలూరు: తాళం వేసిన ఇంట్లో దెయ్యాలు ఉంటాయేమోనన్న అవకాశంతో పూజలు చేసిన సంఘటన రాణిపేట జిల్లాలో కలకలం రేపింది. వివరాలు.. అరక్కోణం తాలుకా తనిగై పోలూరు గ్రామానికి చెందిన ఆశీర్వాదం 20 ఏళ్ల క్రితం ఇంటికి తాళం వేసి చెన్నైకి వెళ్లిపోయాడు. బుధవారం సాయంత్రం ఆశీర్వాదంతో పాటు ఒక చిన్నారి, కొందరు వ్యక్తులు గ్రామానికి వచ్చారు. అర్ధరాత్రి వేళ ఇంట్లో తవ్వకాలు జరిపి పూజలు చేశారు. స్థానికుల సమాచారంతో అరక్కోణం పోలీసులు ఆశీర్వాదంను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తన మూడో కుమార్తె భర్త ఇటీవల మృతి చెందాడని.. ఆమెను ఇక్కడ ఉంచేందుకు ఇంటిని శుభ్రం చేస్తున్నట్లు తెలిపాడు. ఏళ్ల తరబడి మూసివేసిన ఇంట్లో దెయ్యం ఉండవచ్చని పూజారి చెప్పడంతో పూజలు చేసినట్లు చెప్పాడు. -
బిడ్డకు ఉరివేసి తల్లి ఆత్మహత్య
వేలూరు: భర్త మద్యానికి బానిసై తరచూ గొడవ పడుతుండడంతో మనస్తాపానికి గురైన భార్య కుమార్తెతో కలిసి ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన రాణిపేట జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు.. కావేరిపాక్యం సమీపంలోని సిత్తంజి గ్రామానికి చెందిన దయాలన్‌కు భార్య వెన్నిల(35), కుమార్తెలు కీర్తి, హరిత(3) ఉన్నారు. కూలి పనులు చేసే దయాలన్ మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవపడేవాడు. శుక్రవారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన అతను మరోసారి భార్యతో గొడవపడ్డాడు. తీవ్ర మనస్తాపానికి గురైన వెన్నిల ఓ కుమార్తెను తీసుకుని ఇంటి వెనుక వైపు వచ్చింది. చీరతో హరితకు ఉరివేసి అదే చీరతో ఆత్మహత్య చేసుకుంది. శనివారం ఉదయం తల్లీకుమార్తెలు చెట్టుకు వేలాడుతుండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అవ్యలూరు పోలీసులు మృతదేహాలను వాలాజ ఆస్పత్రికి తరలించి విచారణ చేస్తున్నారు. -
మద్యం మత్తులో వదినను లైంగికంగా వేధించిన మరిది..
సాక్షి, వేలూరు(తమిళనాడు): లైంగికంగా వేధించిన మరిదిని వదిన హత్యచేసిన సంఘటన తిరువణ్ణామలై జిల్లా సెంగం సమీపంలోని పరమనందాల్ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన రాజ(48), సెల్వం అన్నదమ్ములు. వీరు ఒకే ఇంట్లో ఉంటున్నారు. మద్యానికి బానిస అయిన రాజ తరచూ భార్యతో గొడవ పడేవాడు. ఆమె పుట్టింటికి వెళ్లింది. రాజ అన్న సెల్వం బుధవారం ఉదయం లారీ డ్రైవర్ పనికి వెళ్లాడు. పరాశక్తి రాత్రి ఇంటిలో నిద్రించింది. రాత్రి మద్యం మత్తులో ఉన్న రాజ వదిన పరాశక్తిని లైంగికంగా వేధించాడు. దీంతో ఆగ్రహించిన పరాశక్తి ఇంటిలో ఉన్న కత్తితో రాజ తలపై నరికింది. రాజ అక్కడిక్కడే మృతి చెందాడు. సెంగం పోలీసులు అక్కడికి చేరుకుని పరాశక్తిని అరెస్ట్ చేశారు. చదవండి: బైక్ ఆపాడని ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై పిడిగుద్దులు -
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, చెన్నై: తమిళనాడులో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేలూరు జిల్లా ఆనకట్టు సమీపంలో జరిగిన ఈ దుర్ఘటనలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. ఆంధ్రా నుంచి తమిళనాడుకు రాతి బండల లోడ్‌తో వెళుతున్న మినీ లారీ అదుపు తప్పి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో వీ కోటకు చెందిన కార్మికులు సంఘటనా స్థలంలోనే చనిపోయారు. మృతులు గోవిందప్ప, రాముడు, వరదప్పగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు. -
లంచం డబ్బుతో సబ్‌కలెక్టర్ రాసలీలలు
వేలూరు : వ్యవసాయ భూమి పత్రాలు మంజూరు చేసేందుకు రూ.50 వేలు లంచం తీసుకొని పట్టుబడిన వేలూరు ప్రత్యేక సబ్ కలెక్టర్ దినకరన్ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా లంచం తీసుకున్న డబ్బుతో సదరు సబ్‌కలెక్టర్ పలువురు మహిళలతో రాసలీలలు జరిపిన సంఘటనలు ప్రస్తుతం వెలుగుచూశాయి. తిరువణ్ణామలై జిల్లా పోలూరు తాలుకా ఇరుంబులి గ్రామానికి చెందిన రంజిత్‌కుమార్ గత ఆగస్టులో తన పూర్వీకుల భూమిని అతని పేరుపై మార్చుకున్నాడు. ప్రభుత్వం విలువకన్నా తక్కువగా రిజిష్టర్ పత్రాలు తీసినట్లు సబ్ రిజిస్ట్రార్‌కు తెలియడంతో వీటిపై వేలూరు కలెక్టరేట్లోని ప్రత్యేక సబ్ కలెక్టర్ దినకరన్‌ను కలవమని తెలిపాడు. కాగా సబ్ కలెక్టర్ రూ.50 వేలు లంచంగా అడగడంతో రంజిత్‌కుమార్ వేలూరులోని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు పథకం ప్రకారం అతనిపై దాడి చేసి రెడ్ హ్యాండడ్‌గా పట్టుకున్నారు. అనంతరం అతని ఇంటిలోను, కార్యాలయంలోను మొత్తం రూ.80 లక్షల నగదు, పలు కీలక పత్రాలు, కంప్యూటర్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం ప్రత్యేక కోర్టులో హాజరు పరిచి వేలూరు సెంట్రల్ జైలుకు తరలించారు. విచారణలో దినకరన్ ప్రతిరోజూ ఎవరి వద్ద ఎంత నగదు రావాలి అనే జాబితాను తయారు చేసి కారు డ్రైవర్ రమేష్‌కుమార్ అందజేసి వసూళ్లకు పాల్పడేవాడని తెలిసింది. జల్లికట్టుకు అనుమతి ఇచ్చేందుకు ఉత్సవ కమిటీ సభ్యుల నుంచి కారు డ్రైవర్ ద్వారా వేల రూపాయలు తీసుకున్నట్లు తెలిసింది. ఈ డబ్బుతో పలువురి మహిళలతో రాసలీలలు జరిపినట్లు అధికారులు గుర్తించారు. ఇటీవల రూ 2 వేల నోట్లు మారదని ప్రకటించడంతో లంచంగా రూ.500, 200 నోట్లు మాత్రమే తీసుకునే వాడని తెలిసింది. ముఖ్యంగా ఆయన కార్యాలయంలో పనిచేసే మహిళా అధికారి ఒకరికి అవసరమైనప్పుడల్లా నగదును ఇచ్చేవాడని, దీంతో కార్యాలయానికి ఎవరు వచ్చినా మహిళా అధికారినే మాట్లాడి సర్దుబాటు చేయడంతో పాటు వారి వద్ద ఆమె నగదును తీసుకునేదని ఏసీబీ అధికారులు గుర్తించారు. కార్యాలయానికి సొంత పనులపై వచ్చే మహిళలను ఆకర్షించే విధంగా మాట్లాడి అనంతరం వారితో చనువుగా ఉండేవాడని తెలిసింది. వీటితో పాటు వేలూరులో పనిచేస్తున్న కాలంలోనే రాణిపేటలో రూ. కోటి విలువ చేసే బంగ్లాను కొనుగోలు చేసినట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించారు. -
భార్యభర్తలను కట్టేసి.. చోరికి తెగబడ్డారు
వేలూరు : ఒడుగత్తూరు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటిలోకి చొరబడి భార్య, భర్తలను కట్టి పెట్టి నగలు, నగదు చోరీ చేసిన సంఘటన సంచలనం రేపింది. వేలూరు జిల్లా ఒడుగత్తూరు సమీపంలోని ఓట్టేరిపాళ్యం గ్రామానికి చెందిన శ్రీనివాసన్ మేకలు పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతని భార్య కళ. శ్రీనివాసన్ శుక్రవారం ఏడు మేకలను రూ. 70 వేలకు విక్రయించి ఇంటికి వచ్చాడు. రాత్రి భార్య, భర్తలిద్దరూ నిద్రించారు. అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో మొకానికి మంకీ క్యాప్ ధరించిన ఆరుగురు శ్రీనివాసన్ ఇంటికి చేరుకుని ఇంటి ముందు తలుపులకు తాళం వేసి వెనుక వైపున ఉన్న దారిలో ఇంటిలోనికి చొరబడ్డారు. శబ్దం విన్న శ్రీనివాసన్ లేచి చూడగా ఆరుగురు మంకీ క్యాప్ ధరించి ఉండటంతో కేకలు వేసేందుకు ప్రయత్నించాడు. ముఠా సభ్యులు శ్రీనివాసన్‌పై దాడి చేశారు. వీటిని అడ్డుకునేందుకు భార్య కళ ప్రయత్నించడంతో ఆమెపై దాడి చేసి ఇంటిలోనే కట్టి పెట్టారు. అనంతరం కళ ధరించిన తాళిబొట్టు, కమ్మలు, మరో చైన్‌తో పాటు మేకలు విక్రయించగా వచ్చిన రూ. 70 వేలతో పరారయ్యారు. శనివారం ఉదయం శ్రీనివాసన్ ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో స్థానికులు ఇంటిలోకి వెళ్లి చూశారు. భార్య, భర్తలు ఇద్దరూ స్పృహ తప్పి పడి ఉండడాన్ని గమనించారు. వారిని వేలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వేపాక్కం పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ జరిపారు. -
23 రోజులుగా మృత్యువుతో పోరాడి.. చివరికి
టీ.నగర్ : తమిళనాడులో సెల్ఫీ మోజు సోమవారం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. వివరాల్లోకి వెళితే.. హర్యానా రాష్ట్రానికి చెందిన హరి ఓం సింగ్ వేలూరులోని ప్రైవేటు కళాశాలలో చదువుతున్నాడు. ఈ నెల 6వ తేదీన హరి ఓం సింగ్ కాట్పాడి సమీపంలోగల సేవూరు రైల్వేస్టేషన్లో ఆగి ఉన్న గూడ్సు రైలు పైకి ఎక్కి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. సెల్ఫీ దిగుతున్న సమయంలో ఒక్కసారిగా హై ఓల్టేజ్ విద్యుత్ తీగలు తగిలి హరిఓం సింగ్ షాకుకు గురై గాయపడ్డాడు. దీంతో హరి ఓం సింగ్‌ను వెంటనే వేలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని మిలటరీ ఆసుపత్రిలో చేర్పించగా 23రోజులుగా మృత్యవుతో పోరాడిన హరి ఓం సింగ్ మంగళవారం మృతిచెందాడు. మరో ఘటనలో వేలూరు జిల్లా వాణియంబాడి కలంద్ర గ్రామానికి చెందిన మురళి అనే వ్యక్తి మృతి చెందాడు. మురళి తన స్నేహితులైన మణికంఠన్, విజయ్‌కుమార్‌లతో కలిసి పోలూరు సమీపంలోని జమునామరత్తూరు కొండకు సోమవారం విహారయాత్రకు వెళ్లారు. ఆ సమయంలో మురళి, మణికంఠన్‌లు బండ పైకి ఎక్కి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించారు. ఇద్దరు సెల్ఫీ దిగుతుండగా జారి పడడంతో మురళికి బలమైన గాయాలు కావడంతో మృతి చెందాడు. -
వివాహమైన గంటకే విడిపోయారు!
వేలూరు: తమ ప్రేమకు ఇరు కుటుంబాలు వ్యతిరేకించడంతో ప్రేమికులు ఆలయంలో పెళ్లి చేసుకున్నా రు. అయితే గంటకే ప్రియురాలిని వదిలి ప్రియుడు కుటుంబసభ్యులతో వెళ్లాడు. ఈ ఘటన శుక్రవా రం గుడియాత్తంలో జరిగింది. చెన్నైకి చెందిన సెల్వ బాలాజి(32) వేలూరు జిల్లా గుడియాత్తం మున్సిప ల్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. సెదుకరై వినాయక వీధికి చెందిన రోజా (20) అదే కార్యాలయంలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తుంది. సెల్వ బాలాజి, రోజా ఆరు నెలలుగా ప్రేమించుకుంటున్నా రు. వీరి వ్యవహారం ఇరు కుటుంబాలకు తెలియడంతో వ్యతి రేకించారు. ఇదిలా ఉండగా శుక్రవారం యథావిధిగా సెల్వ బాలాజి కార్యాలయానికి చేరుకున్నాడు. కొద్ది సమయంలోనే ప్రియురాలు రోజాతో కలిసి బయటకు వెళ్లాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య ఘర్షణ ఏర్పడి రోజా బ్లేడుతో చేతిని కోసుకుంది. దీంతో రోజాను పళ్లిగొండలోని రంగనాథర్ ఆలయానికి తీసుకెళ్లి వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కమిషనర్ కుటుంబ సభ్యులు సెల్వ బాలాజీని కిడ్నాప్ చేసినట్లు గుడియాత్తం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రోజా కుటుంబసభ్యులు కూడా రోజాను కిడ్నాప్ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఇద్దరూ రోజా ఇంటికి వెళ్లారు. ఆగ్రహించిన కుటుంబసభ్యులు ఇద్దరినీ గుడియాత్తం మున్సిపల్ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఆ సమయంలో ఇరు కుటుంబాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. వెంటనే సెల్వబాలాజీని మాత్రం వారి కుటుంబసభ్యులు వెంటబెట్టుకొని వెళ్లిపోయారు. దీంతో తన భర్తను తనతో పంపాలని రోజా వాగ్వాదానికి దిగింది. విషయం తెలుసుకున్న గుడియాత్తం మహిళా పోలీసులు కమిషనర్ సెల్వ బాలాజీని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. ఇద్దరితో చర్చించి నిర్ణయం తీసుకోమన్నారు. రోజాను వదిలిపెట్టి కమిషనర్ కారులో చెన్నైకి కుటుంబసభ్యులతో కలిసి వెళ్లిపోయారు. అనంతరం రోజాను వారి కుటుంబసభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. పోలీసులు ఘటనపై విచారణ చేస్తున్నారు. -
అజిత్ ఫ్యాన్ అఘాయిత్యం.. సినిమాకోసం కన్నతండ్రిని..
సాక్షి, వేలూరు : సినిమా చూడటానికి డబ్బులివ్వలేదన్న కోపంతో దారుణానికి ఒడిగట్టాడో అజిత్ అభిమాని. కన్నతండ్రి అన్న ప్రేమ లేకండా పెట్రోల్‌పోసి తగుల బెట్టడానికి ప్రయత్నించాడు. ఈ సంఘటన తమిళనాడులోని వేలూరులో చోటుచేసుకుంది. పోలీసులు వివరాల మేరకు.. వేలూరుకు చెందిన అజిత్‌కుమార్ అనే వ్యక్తికి హీరో అజిత్ అంటే విపరీతమైన అభిమానం. అభిమాన నటుడి సినిమాను మొదటిరోజే చూడటం అతనికి అలవాటు. గురువారం అజిత్ ‘‘విశ్వాసం’’ సినిమా విడుదలైన సందర్భంగా మొదటిరోజే సినిమా చూడాలనుకున్న అజిత్‌కుమార్ తన తండ్రి పాండియరాజన్‌ను డబ్బులు ఇవ్వాల్సిందిగా కోరాడు. ఇందుకు పాండియరాజన్ ఒప్పుకోకపోవటంతో ఆగ్రహించిన అజిత్‌కుమార్ తండ్రిపై పెట్రోల్‌పోసి తగులబెట్టడానికి ప్రయత్నించాడు. ఈ ఘటనలో పాండియరాజన్ ముఖం కాలటంతో అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అజిత్‌కుమార్‌ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
ఆర్కాడులో బాలిక దారుణ హత్య
వేలూరు: ఆర్కాడు సమీపంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలిక దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన ఆర్కాడు సమీపంలో చోటుచేసుకుంది. వేలూరు జిల్లా ఆర్కాడు తాలుకా తాయనూర్ సత్రం గ్రామానికి చెందిన టీకారామన్. ఇతనికి, మొదటి భార్య కస్తూరికి ముగ్గురు కుమార్తెలు. టీకారామన్ రాధ అనే మహిళను రెండవ వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు నవీన్‌కుమార్, కుమార్తె సంగీత(16) ఉన్నారు. రాధ 15 సంవత్సరాల క్రితం ఇటుకల బట్టీలో పనిచేస్తున్న సమయంలో ఆర్కాడు మాసుపేటకు చెందిన పయణితో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో రాధ, భర్త టీకారామన్‌ను వదిలి ఇంటి నుంచి కుమార్తె సంగీతతో వెళ్లిపోయి పయణిని వివాహం చేసుకుంది. ఈ నేపథ్యంలో 2013వ సంవత్సరంలో పయణి మృతిచెందాడు. సంగీత కే వేలూరు గ్రామంలో ప్లస్‌ఒన్ చదువుతుంది. ఈ క్రమంలో అనారోగ్యం కారణంగా రాధ నాలుగు నెలల క్రితం మృతి చెందింది. దీంతో అగ్రవరంలో ఉంటున్న అన్న నవీన్‌కుమార్‌తో కలిసి ఉంటోంది. సోమవారం మధ్యాహ్నం బ్యాంకు పాసుపుస్తకం నకళ్లు అందజేసేందుకు అమ్మ రాధ నివశిస్తున్న గ్రామానికి వెళ్లింది. మధ్యాహ్నం అన్న ఫోన్‌చేస్తే పాసుపుస్తకం ఇచ్చి వస్తానని తెలిపింది. సాయంత్రం 4 గంటలకు ఫోన్‌చేస్తే ఫోన్ స్వీచ్ఆఫ్లో ఉండడంతో అనుమానం వచ్చిన అన్న నవీన్‌కుమార్ అగ్రవరంలోని పిన్ని రాణికి ఫోన్ చేసి సంగీత గురించి అడగడంతో అక్కడికి కూడా రాలేదని తెలిపింది. వెంటనే నవీన్‌కుమార్ ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో సంగీత బ్లైడుతో చేతులు, కాళ్లు, గొంతు భాగాల్లో కోసిన స్థితిలో రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గమనించి కేకలు వేశాడు. స్థానికులు వచ్చి చూడగా అప్పటికే సంగీత మృతి చెంది ఉండడాన్ని గమనించిన గ్రామస్తులు ఆర్కాడు పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వేలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్పీ పగలవన్, డీఎస్పీ కలైసెల్వం సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. సంగీత సెల్‌ఫోన్‌లోని నంబర్ ఆధారంగా ఓ యువకుడిని అదుపులోకి తీసుకుని కేసు విచారణ చేస్తున్నారు. -
ప్రియుడి కోసం కన్న బిడ్డలకు వాతలు
వేలూరు: ప్రియుడితో ఉల్లాస జీవితానికి అడ్డంకిగా ఉన్నారని కన్న బిడ్డలకు చిత్రహింసలు పెడుతూ నిత్యం నరకం చూపుతున్న తల్లి, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. తిరుత్తణికి చెందిన గణేశన్, కవిత(27) దంపతులు. వీరికి మహాలక్ష్మి, కార్తీక్ అనే ఇద్దరు పిల్లలున్నారు. గణేశన్ 7సంవత్సరాల కిందట మృతి చెందాడు. ఈ స్థితిలో రెండేళ్ల కిందట కవిత ఇద్దరు పిల్లలను తీసుకొని వేలూరు జిల్లా గుడియాత్తంకు చేరింది. అక్కడ రాజన్ ఆలయం ప్రాంతంలోని హౌసింగ్ బోర్డులో నివసిస్తోంది. పిల్లలు మహాలక్ష్మి 6వ తరగతి, కార్తీక్ ఐదవ తరగతి చదువుతున్నారు. ఇదిలా ఉండగా అదే ప్రాంతానికి చెందిన రామలింగం కుమారుడు గోపితో కవితకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో కవిత, గోపి వివాహం చేసుకొని ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. తమ ఉల్లాస జీవితానికి అడ్డుగా ఉన్న పిల్లలను వీరిద్దరూ చిత్రహింసలకు గురిచేసేవారు. కవిత రోజూ మహాలక్ష్మికి పాత్రలు కడగడం, దుస్తులు ఉతకడం వంటి పనులు చెప్పి పని చేయకుంటే శరీరంపై వాతలు పెట్టడం, వేడి నీళ్లు పోయడం వంటివి చేస్తూ తరచూ హింసించేది. ఈ నేపథ్యంలో తమ ఉల్లాస జీవితానికి పిల్లలు అడ్డంకిగా ఉన్నారని కవిత, గోపి మధ్య ఘర్షణ ఏర్పడింది. దీంతో ఆగ్రహంగా ఉన్న కవిత శనివారం ఉదయం పిల్లలపై వేడి నీళ్లను పోసింది. చిన్నారులు ఏడుస్తూ బయటకు పరుగులు తీయడంతో ఇరుగుపొరుగు వారిని దగ్గరకు తీసుకుని విషయం ఆరాతీశారు. అనంతరం దీనిపై గుడియాత్తం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ జరిపి కవితతో పాటు ఆమె ప్రియుడు గోపిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. తీవ్ర గాయాలైన చిన్నారులు మహాలక్ష్మి, కార్తీక్‌లను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. -
వామ్మో! 31 కిలోల కారం నీటితో అభిషేకం!!
వేలూరు(తమిళనాడు): వేలూరు సత్‌వచ్చారిలోని గంగమ్మ ఆలయం సమీపంలో ఒక స్వామీజీ 31 కిలోల కారంపొడి కలిపిన నీటితో అభిషేకం చేయించుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. సత్వచ్చారి గంగమ్మ ఆలయం వద్దకు 4 నెలల క్రితం ఈ స్వామీజీ వచ్చారు. అక్కడికి సమీపంలోని ఒక తోటలో ఉన్న ఇంట్లో నివసిస్తున్నారు. ఈ స్వామీజీ పేరు, ఊరు ఎవరికీ తెలియదు. ఈ స్వామీజీ తమిళం, హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ భాషల్లో మాట్లాడుతారు. ఈ స్వామీజీ ప్రత్యంగరా దేవిని ప్రతి రోజూ పూజిస్తుంటారు. మంగళవారం ఉదయం ప్రపంచ శాంతి కోసం ఆయన పూజించే ప్రత్యంగరా దేవికి ప్రత్యేక పూజలు చేశారు.తన ఇంట్లోనే కారంపొడి నీటితో అభిషేకం చేయించుకోబోతున్నట్లు రెండు రోజుల క్రితం ప్రకటించారు. విషయం తెలుసుకున్న భక్తులు అధిక సంఖ్యలో చేరుకొని తొలుత స్వామీజీ చేపట్టిన ప్రత్యంగరా దేవి ప్రత్యేక పూజలను తిలకించారు. అనంతరం స్వామీజీ ఒక అండా(పెద్దపాత్ర)లో కూర్చున్నారు. భక్తులు 31 కిలోల కారం పొడిని నీటిలో కలిపి వాటిని స్వామీజీపై పోసి అభిషేకం చేశారు. అనంతరం నీటితో కూడా స్వామివారికి అభిషేకం చేశారు. ** -
అనుమతిలేని ఏ ప్రాసిక్యూషన్ నిలబడదు
చెన్నై: నేరశిక్షా స్మృతిలో నిర్దేశించినట్లు తగిన అనుమతి తీసుకోకుండా, ప్రభుత్వ ఉద్యోగిపై ప్రారంభించే ఏ ప్రాసిక్యూషన్ చర్యా నిలబడదని మద్రాస్ హైకోర్టు శనివారం స్పష్టం చేసింది. తమిళనాడులోని వేలూరుకు చెందిన డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ కే మస్తాన్ రావు సహా, దక్షిణ రైల్వే అధికారులు కొందరిపై వేలూరుకే చెందిన ఫ్యాక్టరీల విభాగం ఇనస్పెక్టర్ దాఖలు చేసిన ఫిర్యాదును మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ శివజ్ఞానం కొట్టివేశారు. నేరశిక్షా స్మృతిలోని 197వ సెక్షన్ ప్రకారం తగిన అనుమతి తీసుకోకుండా ప్రభుత్వ ఉద్యోగులకు వ్యతిరేకంగా చేపట్టే ప్రాసిక్యూషన్ నిలువదని సుప్రీంకోర్టు పేర్కొందని, సుప్రీంకోర్టు నిర్ణయం మేరకు సదరు ప్రాసిక్యూషన్ ప్రక్రియను కొట్టివేయవలసి ఉంటుందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. తమిళనాడులోని అరక్కోణం రైల్వే ఇంజినీరింగ్ వర్క్‌షాప్‌లో, అగ్నిప్రమాద నిరోధక నిబంధనల ఉల్లంఘన జరిగిందంటూ అక్కడి అధికారులపై వేలూరు ఫ్యాక్టరీల విభాగం ఇనస్పెక్టర్ ఫిర్యాదు దాఖలు చేశారు. అయితే, చట్టప్రకారం ముందస్తు అనుమతి తీసుకోకుండా కేంద్రప్రభుత్వ ఉద్యోగులైన తమపై ఫిర్యాదు చేయడాన్ని ప్రశ్నిస్తూ రైల్వే అధికారులు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విషయంలో ఫిర్యాదీదారు వివేచనతో వ్యవహరించలేదని, లోపాలను సరిచేసుకునే అవకాశాన్ని అధికారులకు ఇవ్వలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. పైగా ప్రాసిక్యూషన్ తప్పదన్న బెదిరింపుతో వారికి నోటీసులు జారీ చేశారని, ఈ కారణంతోనే ఫిర్యాదును కొట్టివేయవచ్చని న్యాయమూర్తి స్పష్టంచేశారు. -
రూ.45 లక్షల విలువైన శ్రీగంధం పట్టివేత
వేలూరు, న్యూస్‌లైన్: ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలోని పొన్నై వద్ద ఉన్న మామిడి తోపులో రూ.45 లక్షల విలువ చేసే శ్రీగంధం దుంగలను పోలీసులు స్వాధీ నం చేసుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీ సుల కథనం మేరకు.. వేలూరు జిల్లా పొన్నై సమీపంలోని శ్రీనివాసపురం గ్రా మం వద్ద కాట్పాడి గాంధీనగర్‌కు చెం దిన టీకారామన్‌కు మామిడి తోపు ఉం ది. ఇక్కడ నుంచి శ్రీగంధం దుంగలను ఆంధ్రకు తరలిస్తున్నట్లు మంగళవారం రాత్రి పొన్నై పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఇన్స్పెక్టర్ గాండీబన్ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడకు చేరుకుని మామిడి తోపులో కాపలా ఉన్న వారిని విచారించారు. అనుమానం రావడంతో తనిఖీ చేశారు. అక్కడున్న ఓ ఇంట్లో శ్రీగంధం దుంగలను గుర్తించి జిల్లా ఫారెస్ట్ అధికారి రాజా మోహన్‌కు సమాచారం అందించారు. దీంతో డీఎఫ్‌వో, ఫారెస్ట్ రేంజ్ అధికారి విజయ్ సంఘటన స్థలానికి చేరుకుని దుంగలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.45లక్షల విలువైన 11 టన్నుల దుంగ లను స్వాధీనం చేసుకున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. దీనిపై మామిడి తోపు యజమాని టీకారామన్, వేలూరు వడక్కుపేటకు చెం దిన జ్యోతిలింగం, వూసూర్‌కు చెందిన రాజ్‌కుమార్, సోయవరానికి చెందిన అన్బును అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. ఈ శ్రీగంధాన్ని కారులో రాత్రి వేళల్లో ఆంధ్ర రాష్ట్రానికి తరలిం చేందుకు ఉంచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరితో పాటు ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి..? వీటిని ఎక్కడికి తరలిస్తున్నారు.? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.