సాక్షి, వేలూరు : సినిమా చూడటానికి డబ్బులివ్వలేదన్న కోపంతో దారుణానికి ఒడిగట్టాడో అజిత్ అభిమాని. కన్నతండ్రి అన్న ప్రేమ లేకండా పెట్రోల్‌పోసి తగుల బెట్టడానికి ప్రయత్నించాడు. ఈ సంఘటన తమిళనాడులోని వేలూరులో చోటుచేసుకుంది. పోలీసులు వివరాల మేరకు.. వేలూరుకు చెందిన అజిత్‌కుమార్ అనే వ్యక్తికి హీరో అజిత్ అంటే విపరీతమైన అభిమానం. అభిమాన నటుడి సినిమాను మొదటిరోజే చూడటం అతనికి అలవాటు.
గురువారం అజిత్ ‘‘విశ్వాసం’’ సినిమా విడుదలైన సందర్భంగా మొదటిరోజే సినిమా చూడాలనుకున్న అజిత్‌కుమార్ తన తండ్రి పాండియరాజన్‌ను డబ్బులు ఇవ్వాల్సిందిగా కోరాడు. ఇందుకు పాండియరాజన్ ఒప్పుకోకపోవటంతో ఆగ్రహించిన అజిత్‌కుమార్ తండ్రిపై పెట్రోల్‌పోసి తగులబెట్టడానికి ప్రయత్నించాడు. ఈ ఘటనలో పాండియరాజన్ ముఖం కాలటంతో అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అజిత్‌కుమార్‌ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment