
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, వేలూరు(తమిళనాడు): లైంగికంగా వేధించిన మరిదిని వదిన హత్యచేసిన సంఘటన తిరువణ్ణామలై జిల్లా సెంగం సమీపంలోని పరమనందాల్ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన రాజ(48), సెల్వం అన్నదమ్ములు. వీరు ఒకే ఇంట్లో ఉంటున్నారు. మద్యానికి బానిస అయిన రాజ తరచూ భార్యతో గొడవ పడేవాడు. ఆమె పుట్టింటికి వెళ్లింది. రాజ అన్న సెల్వం బుధవారం ఉదయం లారీ డ్రైవర్ పనికి వెళ్లాడు. పరాశక్తి రాత్రి ఇంటిలో నిద్రించింది.
రాత్రి మద్యం మత్తులో ఉన్న రాజ వదిన పరాశక్తిని లైంగికంగా వేధించాడు. దీంతో ఆగ్రహించిన పరాశక్తి ఇంటిలో ఉన్న కత్తితో రాజ తలపై నరికింది. రాజ అక్కడిక్కడే మృతి చెందాడు. సెంగం పోలీసులు అక్కడికి చేరుకుని పరాశక్తిని అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment