hero ajith
-
కోలీవుడ్ స్టార్‌తో కార్తికేయ సినిమాపై కీలక అప్డేట్
Ajith, Karthikeyas Valimai Movie All Set To Release: తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లెటెస్ట్ మూవీ 'వాలిమై'. హెచ్ వినోద్ దర్శకత్వంతో వహిస్తున్న ఈ మూవీలో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ విలన్‌గా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం అటూ కోలీవుడ్ ప్రేక్షకులతో పాటు అజిత్ తెలుగు ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. తాజాగా ఈ చిత్రాన్ని మార్చి4న విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ సినిమాను తమిళం, తెలుగుతో పాటు హిందీలోనూ ఒకే రోజున విడుదల చేయనున్నారు. -
ప్రేమతో పాటు, వారి ద్వేషాన్ని కూడా స్వీకరిస్తా: అజిత్
తమిళ పరిశ్రమకు చెందిన స్టార్ హీరోల్లో అజిత్ ఒక్కడు. భిన్నమైన పాత్రలు, ఛాలెంజిగ్ క్యారెక్టర్స్ ఎంచుకుని విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు అజిత్. అందుకే ఆయనను అభిమానులు ముద్దుగా తల అని పిలుచుకుంటారు. తన సహజమైన నటన, సోషల్ యాక్టివిటిస్‌తో ఎంతోమంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్న ఈ టాలెంట్ హీరో ఇండస్ట్రీలో అడుగు పెట్టి ముప్పై ఏళ్లు. ఈ సందర్భంగా ఆయన అభిమానులకు, తనను ద్వేషించే వారికి ఓ మెసేజ్ ఇచ్చాడు. అయితే అజిత్ సామాజిక సేవలు చేస్తుంటాడనే విషయం తెలిసిందే. పలు ఫౌండేషన్స్‌కు విరాళాలు ఇవ్వడం, వరదలు, తుఫాన్ల వల్ల నష్టపోయిన వారికి చేయితను ఇచ్చే హీరోల్లో ఆయన ముందు వరుసలో ఉంటాడు. అలా రియల్ హీరోగా కూడా మంచి పేరు సంపాదించుకున్న అజిత్‌ను తమిళనాడులో అభిమానించే వారు ఎంతమంది ఉన్నారో, ద్వేషించే వారు సైతం అంతే ఉన్నారు. ఇతర హీరోల ఫ్యాన్స్, కొంతమంది నెటిజన్లు అజిత్‌పై తరచూ విమర్శలు చేస్తుంటారు. అంతేగాక ఆయనను ట్రోల్ చేస్తూ పోస్టులు పెడుతుంటారు. ఈ నేపథ్యంలో తన ముప్పై ఏళ్ల సినీ ప్రస్థానం సందర్భంగా అజిత్ అభిమానులకు, హేటర్స్‌కు, ఇతరులకు సోషల్ మీడియా వేదికగా సందేశం ఇచ్చాడు. అజిత్ తన పోస్ట్‌లో.. ‘ఫ్యాన్స్, హేటర్స్, న్యూట్రల్స్.. ఒకే నాణానికి ఉన్న మూడు ముఖాల్లాంటి వారు. ఫ్యాన్స్ పంచే ప్రేమ, పడని వారు పంచే ద్వేషాన్ని, న్యూట్రల్‌గా ఉండేవారి అభిప్రాయాలన్నింటిని నేను స్వీకరిస్తాను. లివ్ అండ్ లెట్ లివ్. ఆల్వేస్ అన్ కండిషనల్ లవ్’ అని ఉన్న మెసేజ్‌ను అజిత్ మేనేజర్ అజిత్ ఫ్యాన్స్ ట్విటర్ పేజీలో షేర్ చేశాడు. దీంతో ఈ మెసేజ్ ప్రస్తుతం సోషల్ మీడియా చర్చనీయాంశంగా మారింది. అభిమానులను మాత్రమే కాకుండా తనని ద్వేషించే వారిని కూడా యాక్సెప్ట్ చేయడం ఒకే అజిత్‌కే చెల్లిదంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అంతేగాక తమదైన శైలిలో తాలపై ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. కాగా అజిత్ ప్రస్తుతం వలిమై మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ మోషన్ పోస్టర్, ఫస్ట్‌లుక్‌కు విశేషన స్పందన వచ్చింది. Mr Ajith Kumar's message on his 30th year in the film industry Fans, Haters & Neutrals are 3 sides of the same coin. I graciously accept the Love from fans, the hate from the haters & the unbaised views of the Neutrals. Live & Let live! Unconditional Love Always!! Ajith Kumar pic.twitter.com/3SURCueBWs — Ajith | Valimai | (@ajithFC) August 5, 2021 -
కోవిడ్ బాధితుల కోసం సౌందర్య రజనీకాంత్ రూ. కోటి విరాళం
కరోనా బాధితులకు చేయూతనిచ్చేందుకు కోలీవుడ్ నడుంబిగించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజరోజుకు లక్షల్లో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో సమయానికి బాధితులకు వైద్య సదుపాయం, ఆక్సిజన్ అందక మృత్యువాత పడుతున్నారు. ఇక బాధితులను రక్షించేందుకు ప్రభుత్వాలు, వైద్య సంస్థలు కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వానికి అండగా పలువురు సినీ ప్రముఖులు తరలివస్తున్నారు. తమవంతు సాయంగా కరోనా బాధితుల కోసం సీఎం సహాయ నిధికి భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే హీరో సూర్య, కార్తీ, వారి తండ్రి, సీనియర్ నటుడు శివ కుమార్‌లు కలిసి సీఎం స్టాలిన్‌కు కోటి రూపాయల చెక్ విరాళంగా అందించిన సంగతి తెలిసిందే. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ రెండవ కూతురు సౌందర్య రజనీకాంత్ సైతం విరాళం ఇచ్చింది. ఆమె భర్త విశాగన్ వనంగముడి, మామ ఎస్ఎస్ వనంగముడితో కలిసి శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు కోటి రూపాయల చెక్‌ను అందించింది. తమ ఫార్మా కంపెనీ అపెక్స్ లాబోరేటరీ నుంచి ఈ విరాళం అందించినట్లు ఆమె తెలిపింది. అనంతరం ఆమె భర్త విశాగన్ రాష్ట్రానికి కొత్త సీఎంగా ఎన్నికైన ఎంకే స్టాలిన్‌కు పుష్ప గుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపాడు. అంతేగాక హీరో అజిత్ సైతం రూ. 25 లక్షలు విరాళం ఇవ్వగా.. ప్రముఖ దర్శకుడు మురుగదాస్, హీరో ఉదయనిధి స్టాలిన్లు చేరో 25 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. -
ఇది ప్రభుత్వంపై స్టార్ హీరోల నిరసన గళమా?
చెన్నె: ఎంతో ఉత్కంఠ రేపిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు మంగళవారం ముగిశాయి. ఓటేసేందుకు అగ్ర తారలు తరలివచ్చినప్పటికీ సాధారణ ఓటర్లు అంతగా ఆసక్తి కనబర్చలేదని పోలింగ్ శాతం చూస్తే అర్ధమవుతోంది. అయితే పోలింగ్ రోజు పలు ఆసక్తికర సంఘటనలు తమిళనాడులో చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా సినీ నటులు వినూత్నంగా ఓటేయడానికి ముందుకువచ్చారు. పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే సూపర్‌స్టార్ రజనీకాంత్ ఓటేయడానికి వచ్చారు. తదనంతరం నటీనటులు, సినీ పరిశ్రమకు చెందిన వారంతా ఓటేసేందుకు తరలివచ్చారు. ఈ క్రమంలో అగ్రనటులు అజిత్, విజయ్, విక్రమ్, శింబు తదితరులు కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. జయం రవి ముఖ్యంగా వారు వేసుకున్న మాస్క్‌లతో పరోక్షంగా డీఎంకే పార్టీకి మద్దతు తెలిపినట్లు సమాచారం. అజిత్, విజయ్, విక్రమ్, శింబు తదితరులు నలుపు రంగు మాస్క్ ధరించి ఓటేసేందుకు వచ్చారు. డీఎంకే పార్టీ జెండాలో నలుపు ఉంటుంది. అందుకే ఆ పార్టీకి ఓటేయాలని పరోక్షంగా పిలుపునిచ్చినట్లుగా తమిళనాడులో చర్చ నడుస్తోంది. దీంతోపాటు విజయ్ సైకిల్ మీద రావడం తమిళనాడే కాక తెలుగు రాష్ట్రాల్లోనూ ఆసక్తికర చర్చ సాగింది. అయితే విజయ్ పెట్రోల్, డీజిల్ ధరలు నిరంతరం పెరుగుతుండడానికి నిరసనగా సైకిల్‌పై వచ్చినట్లు తెలుస్తోంది. పోలింగ్ రోజున అభిమానులు, ఓటర్లకు ఆ విషయం గుర్తు చేసేందుకు విజయ్ సైకిల్ ఎంచుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక నటుడు విక్రమ్ కూడా పోలింగ్ కేంద్రానికి నడుచుకుంటూ వచ్చాడు. ఆయన కూడా ఇదే విషయం ప్రస్తావించేందుకు నడుచుకుంటూ వచ్చాడని సమాచారం. శింబు ఈ చర్యలతో పరోక్షంగా అధికారంలో ఉన్న అన్నాడీఎంకే, బీజేపీ కూటమికి వ్యతిరేకంగా ప్రచారం చేసినట్లు అందరూ భావిస్తున్నారు. దీనిపై తమిళనాడులో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ పరిణామం అధికార పార్టీకి ప్రతికూల ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. ఇక అగ్రనటుడు రజనీకాంత్, సూర్య, కార్తీ తెల్లటి మాస్క్ ధరించి వచ్చారు. ఓటేసే సమయంలో నటుడు అజిత్ ఓ అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓటేయడానికి వచ్చే సమయంలో ఓ అభిమాని సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించగా అతడి ఫోన్‌ను లాగేసుకున్నాడు. మరికొద్దిసేపటి తర్వాత వార్నింగ్ ఇచ్చేసి ఫోన్ తిరిగిచ్చేశాడు. చదవండి: బెంగాల్ మినహా పూర్తయిన ఎన్నికలు.. పోలింగ్ శాతం ఇలా.. -
అజిత్ ఫ్యాన్ అఘాయిత్యం.. సినిమాకోసం కన్నతండ్రిని..
సాక్షి, వేలూరు : సినిమా చూడటానికి డబ్బులివ్వలేదన్న కోపంతో దారుణానికి ఒడిగట్టాడో అజిత్ అభిమాని. కన్నతండ్రి అన్న ప్రేమ లేకండా పెట్రోల్‌పోసి తగుల బెట్టడానికి ప్రయత్నించాడు. ఈ సంఘటన తమిళనాడులోని వేలూరులో చోటుచేసుకుంది. పోలీసులు వివరాల మేరకు.. వేలూరుకు చెందిన అజిత్‌కుమార్ అనే వ్యక్తికి హీరో అజిత్ అంటే విపరీతమైన అభిమానం. అభిమాన నటుడి సినిమాను మొదటిరోజే చూడటం అతనికి అలవాటు. గురువారం అజిత్ ‘‘విశ్వాసం’’ సినిమా విడుదలైన సందర్భంగా మొదటిరోజే సినిమా చూడాలనుకున్న అజిత్‌కుమార్ తన తండ్రి పాండియరాజన్‌ను డబ్బులు ఇవ్వాల్సిందిగా కోరాడు. ఇందుకు పాండియరాజన్ ఒప్పుకోకపోవటంతో ఆగ్రహించిన అజిత్‌కుమార్ తండ్రిపై పెట్రోల్‌పోసి తగులబెట్టడానికి ప్రయత్నించాడు. ఈ ఘటనలో పాండియరాజన్ ముఖం కాలటంతో అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అజిత్‌కుమార్‌ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
హీరో అజిత్ రూటే సెపరేట్
చెన్నై : హీరో అజిత్ అండ్ కో తాజా చిత్రానికి రెడీ అవుతున్నారన్నది కోలీవుడ్ వర్గాల టాక్. అజిత్ రూటే సెపరేట్ అని చెప్పవచ్చు. సాధారణంగా వరుసగా ఒకే దర్శకుడితో చిత్రాలు చేయడానికి ఇష్టపడరు. అయితే ఇందుకు అజిత్ భిన్నం. కథ నచ్చితే ఒకే దర్శకుడితో ఎన్ని చిత్రాలు చేయడానికైనా రెడీ అనే తత్వం ఆయనది. అదేవిధంగా తనకు నచ్చితే నిర్మాతకు కూడా వరుసగా చిత్రాలు చేసేస్తారు. ఈ రెండు విషయాలు ఇప్పటికే రుజువయ్యాయి. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సంస్థలో ఆరంభం, వేదాళం చిత్రాలను వరుసగా చేశారు. ఇక దర్శకుడు శివతో కలిసి వీరం, వేదాళం, వివేగం చిత్రాలను వరుసగా చేశారు. ఈ చిత్రాలన్నీ కమర్షియల్‌గా మంచి విజయాలను సాధిం చాయి. ఇక అసలు విషయం ఏమిటంటే అజిత్ తాజా చిత్రం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. ఆయన రిస్కీ సన్నివేశాల్లో నటించడానికి ఏమాత్రం వెనుకాడరు. అలా పలుమార్లు గాయాలకు గురవడం పరిపాటే. ఇటీవల వివేగం చిత్ర షూటింగ్లో కూడా గాయాలకు గురై శస్త్ర చికిత్స చేయించుకుని ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్నారు. మళ్లీ శివ దర్శకత్వంలోనే నటించడానికి సిద్ధం అవుతున్నారు. అజిత్, శివ కాంబినేషన్లో తెరకెక్కనున్న తాజా చిత్రాన్ని ఎవరు నిర్మించనున్నారన్నది ఆసక్తిగా మారింది. అయితే అజిత్ అంగీకరిస్తే ఆయన తాజా చిత్రాన్ని నిర్మించడానికి తాము రెడీ అని ఇటీవల ఏఎం రత్నం కోడలు ఐశ్యర్య పేర్కొన్నారు. -
షూటింగ్లో హీరోకు గాయాలు, ఆపరేషన్
సాక్షి, చెన్నై: తమిళ ప్రముఖ హీరో అజిత్‌కు వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. ఆయనకు ఇంతకు ముందు కూడా పలు మార్లు శస్త్ర చికిత్సలు జరిగిన విషయం తెలిసిందే. హీరో అజిత్ యాక్షన్ సన్నివేశాల్లో డూప్ లేకుండా తనే నటించడానికి ప్రయత్నిస్తారు. ఇటీవల విడుదలైన ‘వివేగం’ చిత్రంలో భారీ యాక్షన్ సన్నివేశాలున్నాయి. ఈ చిత్రంలో నటించడానికి అజిత్ ముందుగానే చాలా కసరత్తులు చేశారు. తన బాడీని సిక్స్పాక్కు మలుచుకుని నటించారు. బల్గేరియాలో ఫైటింగ్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో స్టంట్ మాస్టర్‌తో పోరాడే సన్నివేశంలో నటిస్తుండగా అజిత్ భుజానికి బలమైన గాయం అయ్యింది. వెంటనే అక్కడ ప్రథమ చికిత్స చేయించుకుని వెంటనే షూటింగ్లో పాల్గొన్నారట. అయితే నెలలోపు శస్త్ర చికిత్స చేయించుకోవాలని అక్కడి వైద్యులు సూచించారట. చెన్నైకి తిరిగొచ్చిన అజిత్ ఇంటిలోనే చికిత్స చేయించుకుంటున్నారు. అలాంటిది ఈ నెల 7న ఆయన నగరంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేరారు. ఆయన భుజానికి వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. ఆపరేషన్ విజయవంతంగా జరిగిందని వైద్యులు వెల్లడించారు. రెండు నెలల పాటు అజిత్‌కు విశ్రాంతి అవసరం అని సలహా ఇవ్వడంతో ఆయన ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. కాగా అజిత్ ఆరోగ్యంగా ఉన్నారని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. -
హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు
ఆట ఆరంభం సినిమాలో హీరో అజిత్ బాంబు నిర్వీర్య దళం నిపుణుడు. అలాంటి అజిత్ ఇంటికే శనివారం నాడు ఓ బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. 'తాళ 55' షూటింగులో అజిత్ బిజీగా ఉండగా.. శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తి ఒకరు ఫోన్ చేసి, ఆ ఇంట్లో బాంబు ఉందని బెదిరించాడు. దాంతో బాంబుస్క్వాడ్ ఆయన ఇంటికి హుటాహుటిన చేరుకుని వెంటనే అక్కడ అణువణువూ గాలించింది. అయితే, ఎలాంటి బాంబు లేకపోవడంతో అది ఉత్తుత్త కాల్ మాత్రమేనని తేలింది. అయితే, ఈ బెదిరింపు రావడానికి కారణమేంటో ఇంతవరకు తెలియలేదు. పోలీసులు ఆ ఫోన్ చేసిందెవరో తేల్చేందుకు ప్రయత్నం మొదలుపెట్టారు. ఈ విషయాన్ని భరత్ అనే పాత్రికేయుడు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ''ఈసీఆర్‌లోని అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు వచ్చింది. తెల్లవారుజామున 4 గంటలకు బాంబుస్క్వాడ్ మొత్తం పరిసరాలను గాలించింది. అది ఉత్తుత్త కాల్ అని తేలింది'' అని భరత్ ట్వీట్ చేశారు.