హీరో అజిత్‌ రూటే సెపరేట్‌ | Hero Ajith to team up with director Siva again | Sakshi
Sakshi News home page

హీరో అజిత్‌ రూటే సెపరేట్‌

Published Mon, Oct 23 2017 12:42 PM | Last Updated on Mon, Oct 23 2017 12:42 PM

Hero Ajith to team up with director Siva again

చెన్నై : హీరో అజిత్‌ అండ్‌ కో తాజా చిత్రానికి రెడీ అవుతున్నారన్నది కోలీవుడ్‌ వర్గాల టాక్‌. అజిత్‌ రూటే సెపరేట్‌ అని చెప్పవచ్చు. సాధారణంగా వరుసగా ఒకే దర్శకుడితో చిత్రాలు చేయడానికి ఇష్టపడరు. అయితే ఇందుకు అజిత్‌ భిన్నం. కథ నచ్చితే ఒకే దర్శకుడితో ఎన్ని చిత్రాలు చేయడానికైనా రెడీ అనే తత్వం ఆయనది. అదేవిధంగా తనకు నచ్చితే నిర్మాతకు కూడా వరుసగా చిత్రాలు చేసేస్తారు. ఈ రెండు విషయాలు ఇప్పటికే రుజువయ్యాయి. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సంస్థలో ఆరంభం, వేదాళం చిత్రాలను వరుసగా చేశారు. ఇక దర్శకుడు శివతో కలిసి వీరం, వేదాళం, వివేగం చిత్రాలను వరుసగా చేశారు. ఈ చిత్రాలన్నీ కమర్షియల్‌గా మంచి విజయాలను సాధిం చాయి.

ఇక అసలు విషయం ఏమిటంటే అజిత్‌ తాజా చిత్రం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. ఆయన రిస్కీ సన్నివేశాల్లో నటించడానికి ఏమాత్రం వెనుకాడరు. అలా పలుమార్లు గాయాలకు గురవడం పరిపాటే. ఇటీవల వివేగం చిత్ర షూటింగ్‌లో కూడా గాయాలకు గురై శస్త్ర చికిత్స చేయించుకుని ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్నారు.  మళ్లీ శివ దర్శకత్వంలోనే నటించడానికి సిద్ధం అవుతున్నారు. అజిత్, శివ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న తాజా చిత్రాన్ని ఎవరు నిర్మించనున్నారన్నది ఆసక్తిగా మారింది. అయితే అజిత్‌ అంగీకరిస్తే ఆయన తాజా చిత్రాన్ని నిర్మించడానికి తాము రెడీ అని ఇటీవల ఏఎం రత్నం కోడలు ఐశ్యర్య పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement