Director Shiva
-
విజయ్ దేవరకొండ, సమంతల ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ..!
-
ఒక్క సాంగ్‌తోనే వరల్డ్ వైడ్ ట్రెండింగ్‌గా విజయ్...
-
గ్యాంగ్ స్టర్ గా పాన్ ఇండియా సినిమా?
-
సూర్య కొత్త సినిమాకు శ్రీకారం.. దర్శకుడిగా ఆ మాస్ డైరెక్టర్
సూర్య హీరోగా నటించనున్న 42వ సినిమాకి శ్రీకారం జరిగింది. తమిళంలో మాస్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. స్టూడియో గ్రీన్ బేనర్‌తో కలిసి టాలీవుడ్లో అగ్ర బేనర్లలో ఒకటైన యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ చిత్రం ప్రారంభోత్సవం పలువురు ప్రముఖుల సమక్షంలో జరిగింది. త్వరలో పూర్తి వివరాలు తెలియజేస్తామని దర్శక-నిర్మాతలు పేర్కొన్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్, జ్ఞానవేల్ రాజా, విక్రమ్ నిర్మించున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. -
నయన్ ఇన్
‘చంద్రముఖి’ (2005), ‘దర్బార్’ (2020) చిత్రాల్లో రజనీకాంత్, నయనతార జంటగా నటించారు. రజనీ శివాజీ (2007), ‘కుశేలన్ ’ (2008) (తెలుగులో ‘కథానాయకుడు’) చిత్రాలలో ఆయనతో కాలు కదిపారు నయనతార. ఇప్పుడు రజనీ, నయనతార మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఖుష్బూ, మీనా, కీర్తీ సురేష్, ప్రకాష్ రాజ్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోకి నయనతారను తీసుకున్నారు. అయితే నయనతార రజనీకాంత్‌కు జోడిగా నటించనున్నారా? లేక ఏదైనా కీలక పాత్ర చేయబోతున్నారా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ సినిమా తొలి షెడ్యూల్ హైదరాబాద్‌లో ముగిసింది. తర్వాతి షెడ్యూల్ చెన్నైలో ఈ నెల ప్రారంభం కానుందట. ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే విడుదల చేయాలనుకుంటున్నారు. -
కొబ్బరికాయ కొట్టారు
కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టారు రజనీకాంత్. శివ దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో రజనీ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. మీనా, ఖుష్బూ కీలక పాత్రల్లో నటించనున్నారు. కీర్తీ సురేశ్ హీరోయిన్గా నటించనున్నారు. ఈ సినిమా ముహూర్తం బుధవారం జరిగింది. 28 ఏళ్ల తర్వాత రజనీకాంత్ సినిమాలో ఖుష్బూ నటించనుండటం విశేషం. అలాగే ఖుష్భూ తమిళ సినిమాలో కనిపించి దాదాపు పదేళ్లు కావస్తోంది. ఈ నెల రెండోవారంలో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందని సమాచారం. -
మీనా.. ఆ సినిమాలో విలనా !
రజనీకాంత్, మీనా అనగానే ఠక్కున గుర్తొచ్చే జ్ఞాపకం ‘థిల్లానా థిల్లానా.. నా కసి కళ్ల కూనా’ పాటే. ముత్తు సినిమాలోని ఈ పాట అంత పాపులర్. ‘వీరా, యజమాన్, ముత్తు’ సినిమాల్లో రజనీకాంత్ సరసన కథానాయికగా నటించారు మీనా. ఇప్పుడు మరోసారి కలసి నటించబోతున్నారని తెలిసింది. అయితే ఈసారి జంటగా కాదని సమాచారం. శివ దర్శకత్వంలో రజనీకాంత్ ఓ ఫ్యామిలీ డ్రామా చిత్రం చేయనున్న విషయం తెలిసిందే. సన్ పిక్చర్స్ ఈ సినిమా నిర్మించనుంది. ఇందులో మీనా కీలక పాత్రలో కనిపిస్తారని తెలిసింది. విలన్ పాత్రలో అని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. రజనీకాంత్ సరసన ఖుష్భూ, ఆయన కుమార్తెగా కీర్తీ సురేశ్ నటిస్తారన్నది మరో వార్త. ఈ నెల రెండోవారంలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇదిలా ఉంటే ‘ఎంగేయో కేట్ట కురళ్’ సినిమాలో రజనీ కుమార్తెగా నటించారు మీనా. అలాగే రజనీ హీరోగా నటించిన ‘అన్బుళ్ల రజనీకాంత్’లో బాలనటిగా నటించారు మీనా. అలా బాలనటిగా ఒక హీరో సినిమాలో నటించి, ఆ తర్వాత అతని సరసనే హీరోయిన్గా నటించడం అంటే విశేషమే. ఇప్పుడు అదే హీరోకి విలన్‌గా అంటే ఇంకా విశేషం. -
ఇక షురూ!
‘ఇక సెట్స్‌కు వెళ్లడమే మిగిలింది. అంతా రెడీ చేసుకున్నారు’.. ఇదీ రజనీకాంత్ కొత్త సినిమా గురించి కోలీవుడ్‌లో వినిపిస్తున్న మాట. రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో స¯Œ పిక్చర్స్ పతాకంపై ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ వచ్చే నెల 5న మొదలవుతుందట. కథానాయికగా జ్యోతిక, కీర్తీ సురేష్‌ల పేర్లు వినిపించాయి. టైటిల్ ‘వ్యూహం’ అని టాక్. ఈ సినిమాకు డి. ఇమ్మాన్ సంగీతం అందించనున్నారు. ‘దర్బార్’ పాట రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దర్బార్’. ఇందులో నయనతార కథానాయికగా నటించారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. పోలీసాఫీసర్ ఆదిత్య అరుణాచలం పాత్రలో నటించారు రజనీకాంత్. దాదాపు పాతికేళ్ల తర్వాత ఆయన పోలీసాఫీసర్‌గా నటిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమాలోని ‘చుమ్మక్కళై’ పాటను ఈ నెల 27న విడుదల చేయనున్నారు. ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాటకు వివేక్ లిరిక్స్ అందించారు. ఈ సినిమాకు అనిరు«ద్ రవిచంద్రన్ స్వరకర్త. ‘దర్బార్’ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9న విడుదల కానుందని తెలిసింది. -
రజనీ వ్యూహం?
సూపర్ స్టార్ రజనీకాంత్ కోసం మాస్ డైరెక్టర్ శివ సరికొత్త వ్యూహం సిద్ధం చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో సన్ పిక్చర్స్ సంస్థ ఓ సినిమాను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఇది రజనీకాంత్ కెరీర్లో 168వ చిత్రం. ఈ సినిమాకు ‘వ్యూహం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట చిత్రబృందం. అలాగే సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం జ్యోతిక, కీర్తీ సురేశ్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. మరోవైపు డైరెక్టర్ శివ దర్శకత్వంలో వచ్చిన హిట్ చిత్రాలు ‘వీరమ్, వేదాలం, వివేగమ్, విశ్వా సం’ తర్వాత మరోసారి ‘వి’ సెంటిమెంట్‌తో ఆయన సినిమా టైటిల్ తెరపైకి రావడం విశేషం. ఇంతకుముందు డైరెక్టర్ శివ తెలుగులో ‘శౌర్యం, శంఖం, దరువు’ చిత్రాలకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. -
రజనీకాంత్ ‘వ్యూహం’ ఫలించేనా!?
తమిళసినిమా: రజనీకాంత్ ఈ ఐదక్షరాల పేరు ఆలిండియా లెవల్లోనే ఒక అద్భుతం. రజనీ సినిమాలు వస్తున్నాయంటే బాక్సాఫీస్ షేక్ అవుతోంది. ఫ్యాన్స్ సెలబ్రేషన్ మూడ్‌లోకి వెళ్లిపోతారు. అలాంటి రజనీ త్వరలోనే మరో కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. చాలాకాలం తరువాత ఆయన పోలీసు ఆఫీసర్‌గా పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్న చిత్రం దర్బార్.. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ అదుర్స్ అనిపించింది. నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తనదైన స్టైల్లో చెక్కుతున్నారు. ఇప్పటికే చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక, రజనీకాంత్ నటించబోయే మరో కొత్త సినిమాకు కూడా రంగం సిద్ధమైంది. దర్శకుడు శివ డైరెక్షన్లో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మింస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి ప్రస్తుతం పలు ఊహాగానాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సూపర్‌స్టార్ రజనీ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12న ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభం కానుందని, ఈ సినిమా కోసం ఒక టైటిల్ కూడా పరిశీలనలో ఉందని టాక్ స్ప్రెడ్ అయ్యింది. దర్శకుడు శివకు ‘వీ’ సెంటిమెంట్ ఉన్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు అజిత్ హీరోగా చేసిన నాలుగు చిత్రాల టైటిల్స్ వీతోనే మొదలయ్యాయి. వీరం, వేదాళం, వివేగం, విశ్వాసం ఇలా శివ ‘వీ’ టైటిల్ చిత్రాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో రజనీకాంత్‌తో చేసే చిత్రానికి ‘వీ’ సెంటిమెంట్ కలిసివచ్చేలా.. ‘వ్యూహం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ ‘వ్యూహం’ సినిమా రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీకి కూడా పనికొచ్చేలా ఉంటుందని అంటున్నారు. ఇందులో నటి జ్యోతిక, కీర్తీసురేశ్ హీరోయిన్లుగా నటించనున్నట్లు తెలుస్తోంది. నటుడు సూరి, వివేక్ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. రజనీకాంత్ 168వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేసి 2020లో సమ్మర్స్పెషల్గా తెరపైకి తీసుకురావాలని భావిస్తున్నారు. -
పండగే పండగ
రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘దర్బార్’ చిత్రీకరణ పూర్తి కావొస్తోంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. దీంతో రజనీ తర్వాతి చిత్రం ఏంటీ? అనే చర్చ మొదలైంది. రజనీకాంత్ తర్వాతి సినిమాకు శివ దర్శకత్వం వహించనున్నారట. ఇంతకుముందు అజిత్‌తో ‘వేదాలం, వీరమ్, వివేగమ్, విశ్వాసం’ వంటి మాస్ సినిమాలు తీశారు శివ. రజనీకాంత్‌కు కూడా ఆయన ఓ మాస్ స్టోరీని చెప్పారని, వీరి కాంబినేషన్లో సినిమా ఆల్మోస్ట్ ఒకే అయిపోయిందని చెన్నై టాక్. వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం ఇప్పుడు కోడంబాక్కమ్ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ ప్రచారమే నిజమైతే.. రజనీ అభిమానులకు వచ్చే ఏడాది డబుల్ ధమాకాయే. సంక్రాంతికి ఒక సినిమా, దీపావళికి ఒక సినిమా అంటే అభిమానులకు పండగే కదా. -
విశ్వసించవచ్చా?
అజిత్ హీరోగా దర్శకుడు శివ ‘విశ్వాసం’ అనే చిత్రాన్ని రూపొందించారు. ఆ సినిమా పొంగల్‌కు రిలీజ్ అయి మంచి హిట్ అయింది. ఈ సినిమాకు పోటీగా రజనీకాంత్ ‘పేట్టా’ కూడా రిలీజ్ అయింది. అది మంచి విజయం సాధించింది. తాజాగా ‘విశ్వాసం’ సినిమా చూసిన రజనీకాంత్ దర్శకుడు శివను అభినందించి, ఇంటికి రమ్మని ఆహ్వానించారని తెలిసింది. రజనీ నివాసానికి వెళ్లిన శివ ఒక గంటకుపైనే రజనీకాంత్‌తో ముచ్చటించారట. ‘‘సినిమా బాగా తీశారని, సినిమాలో సెంటిమెంట్ సీన్లు బాగా నచ్చాయంటూ దర్శకుడిని అభినందించారని, తన కోసం ఓ స్క్రిప్ట్ తయారు చేయమని రజని కోరారని’’ వాళ్ల చర్చల్లో ప్రధానాంశం అని చెన్నై టాక్. మరి ఈ కాంబినేషన్లో సినిమా ఉంటుందనే వార్తలను విశ్వసించవచ్చా? వేచి చూద్దాం. -
అభిమానులకు పండగే
అభిమాన హీరో సినిమా రిలీజ్ అవ్వడమే అభిమానులకు పండగ. ఆ పండక్కే పండగ లాంటి సినిమా ఇవ్వాలనుకుంటారు దర్శక, నిర్మాతలు. సూర్య అభిమానులకు ఇలాంటి పండగనే అందించడానికి సిద్ధమయ్యాం అంటున్నారు స్టూడియోగ్రీన్ బ్యానర్ అధినేత జ్ఞానవేల్‌రాజా. సూర్య హీరోగా దర్శకుడు శివ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాను స్టూడియోగ్రీన్ నిర్మిస్తోంది. సూర్య 39వ చిత్రంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ‘‘ఈ కాంబినేషన్ మీద ఆకాశాన్ని అంటే అంచనాలున్నాయి. సూర్య అభిమానులకు ఈ సినిమా కచ్చితంగా పండగే’’ అని నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ పేర్కొంది. ప్రస్తుతం సుధా కొంగర దర్శకత్వంలో సూర్య ‘శూరరై పోట్రు’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత శివ–సూర్యల సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
అజిత్ రూటే సపరేట్.. ఎందుకంటే!
సాక్షి, చెన్నై : కోలీవుడ్ హీరోలలో నటుడు అజిత్ రూటే సపరేట్ అన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాను, తన కుటుంబం, నటన తప్ప ఇతరత్రా ఏ విషయాల జోలికి ఆయన వెళ్లరు. అనవసరంగా ఎలాంటి కామెంట్స్ చేయరు. ఇలా తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండే అజిత్ తన చిత్రాల ప్రచార కార్యక్రమాల్లో కూడా పాల్గొనరు. ఈ విషయంలో ఎవరేమన్నా లెక్క చేయకుండా నెక్ట్స్ ఏమిటీ అంటూ తన పనిలో మునిగిపోతారు. ఇక తనకు నచ్చిన వ్యక్తిని అంత సులభంగా వదులుకోరు. అది అప్పుకుట్టి లాంటి చిన్న నటుడు అయినా, శివ లాంటి హిట్ చిత్రాల దర్శకుడు అయినా ఏఎం.రత్నం, టీజీ.త్యాగరాజన్ లాంటి నిర్మాతలయినా సరే. నిర్మాత ఏఎం.రత్నం సంస్థలో ఆరంభం, వేదాళం చిత్రాలను చేశారు. ఇక దర్శకుడు శివతో వరుసగా వీరం, వేదాళం, వివేగం అంటూ వరుసగా మూడు చిత్రాలు చేశారు. తాజా చిత్రానికి ఆయనకే దర్శకత్వం బాధ్యతలను అప్పగించనున్నారు. కాగా అజిత్ తాజా చిత్రం ఏంటి, ఏ చిత్ర నిర్మాణ సంస్థలో చేయనున్నారన్న ఆసక్తి ఆయన అభిమానులతో పాటు, చిత్ర పరిశ్రమ వర్గాలోనూ నెలకొంది. అయితే ఆ సస్పెన్స్ ఇప్పుడు తొలగిపోయింది. అవును అజిత్ తాజా చిత్రాన్ని ఇంతకు ముందు వివేగం వంటి భారీ చిత్రాన్ని నిర్మించిన సత్య జ్యోతిఫిలింస్ సంస్థనే నిర్మించనుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ అధినేత టీజీ.త్యారాజన్ స్వయంగా వెల్లడించారు. అంతే కాదు మరిన్ని వివరాలను ఆయన వెల్లడించారు. తాజా చిత్ర టైటిల్ విశ్వాసం. దీన్ని 2018 జనవరిలో ప్రారంభించి, అదే ఏడాది దీపావళికి విడుదల చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఇక ఇందులో నాయకి, ఇతర తారాగణం, సాంకేతిక వర్గ వివరాలను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. మొత్తం మీద అజిత్ తన విశ్వాసాన్ని సత్యజ్యోతి ఫిలింస్‌కు చూపిస్తున్నారన్న మాట. మరో విషయం ఏమిటంటే ఈ చిత్రానికి వీ సెంటిమెంట్‌ను కొనసాగిస్తున్నారు. -
వి’ ఫర్ విక్టరీ!
‘వి’ సింబల్ అనగానే తెలుగులో విక్టరీ వెంకటేశ్ గుర్తుకురాక మానరు. తమిళంలో విక్టరీకి చిరునామా అనదగ్గ హీరో అజిత్. వరుస విజయాలతో దూసుకెళోతున్న ఈ హీరోకీ, దర్శకుడు శివకీ, ‘వి’కీ లింకుంది. అసలు మేటర్ ఏంటంటే.. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటి వరకు వచ్చిన ‘వీరమ్’, ‘వేదాళం’, ‘వివేగం’ చిత్రాలు బాక్సాఫీసు వద్ద కనకవర్షం కురిపించాయి. ఇప్పుడు మరో ‘వి’ కోసం.. అదేనండీ విక్టరీ కోసం ఈ ఇద్దరూ చేతులు కలిపారని కోలీవుడ్ సమాచారం. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో స్టార్ట్ కానుందట. వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమా టైటిల్స్ అన్ని ‘వి’ లెటర్‌తోనే స్టార్టయ్యాయి. దీంతో రాబోయే సినిమా టైటిల్‌ని కూడా ‘వి’ అక్షరంతోనే స్టార్ట్ చేస్తారేమోనన్న టాపిక్ ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ‘వి’ అక్షరంతో టైటిల్ పెట్టకపోయినా సక్సెస్ గ్యారంటీ అని, ఎందుకంటే.. అజిత్–శివ చేస్తే సక్సెస్ఫుల్ సినిమాయే చేస్తారని ఫ్యాన్స్ అంటున్నారు. అన్నట్లు ఇంకోమాట.. హీరో అజిత్ ఈ సినిమా తర్వాత ‘విక్రమ్ వేదా’ సినిమా దర్శక ద్వయం పుష్కర్–గాయత్రిల డైరెక్షన్లో నటించనున్నారనే వార్త నిజం కాదట. ‘‘అజిత్ సార్‌తో సినిమా ఇంకా సెట్ కాలేదే. ఆయనతో సినిమా చేసే చాన్స్ రావాలని తాము కోరుకుంటున్నాం’’ అని వాళ్లు పేర్కొన్నారు. -
హీరో అజిత్ రూటే సెపరేట్
చెన్నై : హీరో అజిత్ అండ్ కో తాజా చిత్రానికి రెడీ అవుతున్నారన్నది కోలీవుడ్ వర్గాల టాక్. అజిత్ రూటే సెపరేట్ అని చెప్పవచ్చు. సాధారణంగా వరుసగా ఒకే దర్శకుడితో చిత్రాలు చేయడానికి ఇష్టపడరు. అయితే ఇందుకు అజిత్ భిన్నం. కథ నచ్చితే ఒకే దర్శకుడితో ఎన్ని చిత్రాలు చేయడానికైనా రెడీ అనే తత్వం ఆయనది. అదేవిధంగా తనకు నచ్చితే నిర్మాతకు కూడా వరుసగా చిత్రాలు చేసేస్తారు. ఈ రెండు విషయాలు ఇప్పటికే రుజువయ్యాయి. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సంస్థలో ఆరంభం, వేదాళం చిత్రాలను వరుసగా చేశారు. ఇక దర్శకుడు శివతో కలిసి వీరం, వేదాళం, వివేగం చిత్రాలను వరుసగా చేశారు. ఈ చిత్రాలన్నీ కమర్షియల్‌గా మంచి విజయాలను సాధిం చాయి. ఇక అసలు విషయం ఏమిటంటే అజిత్ తాజా చిత్రం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. ఆయన రిస్కీ సన్నివేశాల్లో నటించడానికి ఏమాత్రం వెనుకాడరు. అలా పలుమార్లు గాయాలకు గురవడం పరిపాటే. ఇటీవల వివేగం చిత్ర షూటింగ్లో కూడా గాయాలకు గురై శస్త్ర చికిత్స చేయించుకుని ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్నారు. మళ్లీ శివ దర్శకత్వంలోనే నటించడానికి సిద్ధం అవుతున్నారు. అజిత్, శివ కాంబినేషన్లో తెరకెక్కనున్న తాజా చిత్రాన్ని ఎవరు నిర్మించనున్నారన్నది ఆసక్తిగా మారింది. అయితే అజిత్ అంగీకరిస్తే ఆయన తాజా చిత్రాన్ని నిర్మించడానికి తాము రెడీ అని ఇటీవల ఏఎం రత్నం కోడలు ఐశ్యర్య పేర్కొన్నారు. -
మరో చిత్రానికి రెడీ!
తమిళసినిమా: కోలీవుడ్ నటులలో అజిత్ రూటే వేరు. ఎవరి గురించి పట్టించుకోరు. వివాదాల జోలికి పోరు. తాననుకున్నది చేసుకుపోయే మనస్తత్వం. తన నిర్మాతల్ని, దర్శకుల్ని తనే ఎంచుకుంటారు. అలా దర్శకుడు శివతో వీరం, వేదాళం, తాజగా వివేగం అంటూ వరుసగా మూడు చిత్రాలు చేశారు. ఈ మూడు చిత్రాలు ప్రేక్షకుల మధ్య విశేష ఆదరణను చూరగొన్నాయి. గత వారం విడుదలైన వివేగం చిత్రం మిశ్రమ స్పందనలతో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. రజనీకాంత్ నటించిన కబాలి చిత్ర రికార్డులనే బ్రేక్ చేస్తోందంటున్నారు సినీపండితులు. ఈ చిత్రం సాధిస్తున్న వసూళ్లను, ఎదుర్కొంటున్న విమర్శలను వింటూ మౌనం పాటిస్తున్న అజిత్ ఇటీవల దర్శకుడు శివను తన ఇంటికి పిలిపించుకుని వివేగం చిత్రానికి సంబంధించిన చాలా విషయాలను చర్చించారట. చిత్రంపై వస్తున్న విమర్శల గురించి కలత వద్దనీ, వాటిని అధిగమించేలా మరో చిత్రం చే ద్దాం అన్నారట. దీంతో నోట మాట రాక దర్శకుడు శివ కంట ఆనందభా ష్పాలు రాలాయట. దీని గురించి శివ తెలుపుతూ వివేగం చిత్ర నిర్మాణ సమయంలోనే అజిత్‌కు పలు కథలను చెప్పానని, అందులో తనకు నప్పే కథను అజిత్ ఎంచుకునే అవకాశం ఉందని తెలిపారు. అయితే తమ తాజా చిత్రం గురించి అజిత్‌నే వెల్లడిస్తారని శివ పేర్కొన్నారు. కాగా వీరం, వేదా ళం, వివేగం మూడు వేర్వేరు నేపథ్యాల్లో తెరకెక్కిన కథా చిత్రాలుగా విజ యం సాధించిన నేపథ్యంలో ఈ సారి అజిత్, శివ కాంబినేషన్లో భారీ ఛారి త్రక కథా చిత్రం రూపొందే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. -
షార్ప్ షూటర్‌గా దుమ్మురేపిన అజిత్!
అగ్రహీరో అజిత్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'వివేగం' తాజా లుక్ అభిమానులను థ్రిల్లింగ్‌కు గురిచేస్తున్నది. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అజిత్ స్నిప్పర్గా నటిస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర దర్శకుడు శివ ట్వీట్ చేసిన ఫొటోలో షార్ప్ షూటర్‌గా అజిత్ అదరగొట్టాడు. మంచులో పడుకొని తుపాకీతో గురిపెట్టిన ఆయన తాజా ఫొటో.. అభిమానులను అలరిస్తోంది. ఈ ఏడాది విడుదలవుతున్న రజనీకాంత్ 'రోబో 2.0' తర్వాత అంతటి క్రేజ్ సంపాదించుకున్న సినిమా 'వివేగం'. ఈ సినిమాలో అజిత్ సిక్స్‌ప్యాక్ తో అదరగొట్టబోతున్నాడు. ఈ చిత్రంలో ఆయన పాత్ర ఇంటర్‌పోల్ ఆఫీసర్ కావడంతో ఎక్కువ శాతం చిత్రీకరణ యూరోపియన్ దేశాల్లోనే జరుపుతున్నారు. కమల్‌హాసన్ చిన్న కుమార్తె అక్షరా హాసన్ తమిళ తెరకు పరిచయమవుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయిక. హిందీ హీరో వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. స్టైలిష్ విలన్‌గా వివేక్ లుక్ ఈ సినిమాలో ఆకట్టుకుంటున్నది. ఈ చిత్రం ఆగష్టు 10న థియేటర్లను పలకరించనుంది. VIVEGAM -
అజిత్‌కి ఏమైంది?
మంచు దుప్పటి కప్పేసిన ప్రాంతంలో ఓ మడుగు... అదీ రక్తపు మడుగు! అందులో నుంచి మెల్లగా బయటకు నడుచుకొస్తున్న ఓ మనిషి... అతని శరీరమంతా రక్తపు చారలు, కాలిన గాయాలు. అయినా వీరోచితంగా పోరాడుతున్నాడు. అతనెవరో కాదు... అజిత్. సడన్‌గా ‘కట్’ అనే సౌండ్ వినిపించింది. వెంటనే ఫైట్‌కి ఫుల్స్టాప్ పెట్టేసిన అజిత్ రక్తపు మడుగు నుంచి కాస్త పక్కకు జరిగారు. అప్పుడు తీసిన ఫొటోనే మీరు చూస్తున్నారు. అజిత్ హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘వివేగమ్’. ఇందులో అజిత్ ఇంటర్‌పోల్ ఆఫీసర్‌గా నటిస్తున్నారట. ప్రస్తుతం బల్గేరియాలో చిత్రీకరణ జరుగుతోంది. బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంలో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. హీరో ఇంటర్‌పోల్ ఆఫీసర్ కనుక ఎక్కువ శాతం చిత్రీకరణ యూరోపియన్ దేశాల్లోనే జరుపుతున్నారు. ఈ చిత్రంలో అజిత్ ఫస్ట్ లుక్‌ను ఎప్పుడో విడుదల చేశారు. సిక్స్ ప్యాక్‌లో అజిత్‌ను చూసిన ఫ్యాన్స్ సంబరపడిపోయారు. ఇప్పుడీ లేటెస్ట్ లుక్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచింది. కమల్‌హాసన్ చిన్న కుమార్తె అక్షరా హాసన్ తమిళ తెరకు పరిచయమవుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయిక. హిందీ హీరో వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఆగస్టులో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారట!