రజనీకాంత్
అజిత్ హీరోగా దర్శకుడు శివ ‘విశ్వాసం’ అనే చిత్రాన్ని రూపొందించారు. ఆ సినిమా పొంగల్‌కు రిలీజ్ అయి మంచి హిట్ అయింది. ఈ సినిమాకు పోటీగా రజనీకాంత్ ‘పేట్టా’ కూడా రిలీజ్ అయింది. అది మంచి విజయం సాధించింది. తాజాగా ‘విశ్వాసం’ సినిమా చూసిన రజనీకాంత్ దర్శకుడు శివను అభినందించి, ఇంటికి రమ్మని ఆహ్వానించారని తెలిసింది. రజనీ నివాసానికి వెళ్లిన శివ ఒక గంటకుపైనే రజనీకాంత్‌తో ముచ్చటించారట. ‘‘సినిమా బాగా తీశారని, సినిమాలో సెంటిమెంట్ సీన్లు బాగా నచ్చాయంటూ దర్శకుడిని అభినందించారని, తన కోసం ఓ స్క్రిప్ట్ తయారు చేయమని రజని కోరారని’’ వాళ్ల చర్చల్లో ప్రధానాంశం అని చెన్నై టాక్. మరి ఈ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందనే వార్తలను విశ్వసించవచ్చా? వేచి చూద్దాం.
Comments
Please login to add a commentAdd a comment