Hero Suriya Starts His New Movie With Director Siruthai Siva, Deets Inside - Sakshi
Sakshi News home page

Suriya-Siruthai Siva: సూర్య కొత్త సినిమాకు శ్రీకారం.. దర్శకుడిగా ఆ మాస్‌ డైరెక్టర్‌

Published Thu, Aug 25 2022 12:37 PM | Last Updated on Thu, Aug 25 2022 1:21 PM

Suriya 42:Suriya Starts His New Movie With Director Siruthai Siva - Sakshi

సూర్య హీరోగా నటించనున్న 42వ సినిమాకి శ్రీకారం జరిగింది. తమిళంలో మాస్‌ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. స్టూడియో గ్రీన్‌ బేనర్‌తో కలిసి టాలీవుడ్‌లో అగ్ర బేనర్లలో ఒకటైన యూవీ క్రియేషన్స్‌ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ చిత్రం ప్రారంభోత్సవం పలువురు ప్రముఖుల సమక్షంలో జరిగింది. త్వరలో పూర్తి వివరాలు తెలియజేస్తామని దర్శక-నిర్మాతలు పేర్కొన్నారు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్లో వంశీ, ప్రమోద్, జ్ఞానవేల్‌ రాజా, విక్రమ్‌ నిర్మించున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement