Kanguva : అదిరిపోయిన 'ఫైర్ సాంగ్' | First Single 'Fire Song' Out From Kanguva Movie | Sakshi
Sakshi News home page

Kanguva : అదిరిపోయిన 'ఫైర్ సాంగ్'

Jul 23 2024 12:57 PM | Updated on Jul 23 2024 5:51 PM

First Single 'Fire Song' Out From Kanguva Movie

తమిళ స్టార్‌ హీరో సూర్య నటించిన తాజా పాన్‌ ఇండియా చిత్రం ‘కంగువ’. పీరియాడిక్ యాక్షన్ జానర్ లో ఇప్పటిదాకా తెరపైకి రాని ఒక కొత్త కాన్సెప్ట్ తో దర్శకుడు శివ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అక్టోబర్‌ 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నేడు(జులై 23) సూర్య బర్త్‌ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌ సింగిల్‌ ‘ఫైర్‌ సాంగ్‌’ని రిలీజ్‌ చేశారు మేకర్స్‌. 

ఈ పాటలో యుద్ధ వీరుడిగా సూర్య మేకోవర్, ఫెరోషియస్ లుక్స్  ఆకట్టుకుంటున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ 'ఫైర్ సాంగ్' కు ఫైర్ ఉన్న పవర్ ఫుల్ ట్యూన్ కంపోజ్ చేశారు. శ్రీమణి ఆకట్టుకునే లిరిక్స్ అందించగా అనురాగ్ కులకర్ణి ఎనర్జిటిక్ గా పాడారు. 'ఆది జ్వాల..అనంత జ్వాల..వైర జ్వాల.. వీర జ్వాల..దైవ జ్వాల..దావాగ్ని జ్వాల.. ' అంటూ ఈ పాట సాగుతుంది. 'పైర్ సాంగ్'  "కంగువ"కు స్పెషల్ అట్రాక్షన్ కానుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement