'దిశా పటాని' డ్రెస్‌పై సెన్సార్‌ అభ్యంతరం | Censor Board Ordered Disha Patani Dress In Kanguva Song Should Be Removed Or Replaced | Sakshi
Sakshi News home page

'కంగువ' సాంగ్‌లో 'దిశా పటాని' డ్రెస్‌పై సెన్సార్‌ అభ్యంతరం

Published Thu, Oct 24 2024 9:05 AM | Last Updated on Thu, Oct 24 2024 11:12 AM

Censor Board Objective Disha Patani Dress In Kanguva Song

కోలీవుడ్‌ టాప్‌ హీరో సూర్య నటించిన ‘కంగువ’ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌, సాంగ్స్‌ ప్రేక్షకులను మెప్పించాయి. అయితే, తాజాగా విడుదలైన ఒక పాటలో నటి 'దిశా పటాని' ధరించిన డ్రెస్‌పై అభ్యంతరాలు వచ్చాయి. దీంతో సెన్సాబోర్డ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. భారీ పీరియాడికల్‌ యాక్షన్‌ చిత్రంగా దర్శకుడు శివ తెరకెక్కించారు. నవంబరు 14న రిలీజ్‌ కానున్న ఈ మూవీని  స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్‌ బ్యానర్స్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా, వంశీ, ప్రమోద్‌  నిర్మించారు.

తాజాగా సూర్య- దిశా పటానీ మధ్య 'యోలో – యు ఓన్లీ లైవ్ వన్స్' అనే పాటను మేకర్స్‌ విడుదల చేశారు. ప్రస్తుతం నెట్టింట ఈ సాంగ్‌ ట్రెండ్‌లో ఉంది. ఇందులో వారిద్దరి మధ్య కెమిస్ట్రీ సూపర్‌ అంటూ ప్రశంసలు కూడా వచ్చాయి. అయితే, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) మాత్రం అభ్యంతరం చెప్పింది. ఈ పాటలో మూడు సెకన్ల పాటు తొలగించాలని బోర్టు తెలిపింది.  దిశా పటానీ ధరించిన 'డీప్ క్లీవేజ్' డ్రెస్‌తో ఉన్న సన్నివేశాలను తొలగించాలని బోర్డు సూచించింది.  దీంతో చిత్ర యూనిట్‌ తగిన నిర్ణయం తీసుకోనుంది.

ఈ సాంగ్‌లో దిశా పటాని గ్లామర్‌కు కుర్రకారు ఫిదా అవుతుంది. సూర్యతో ఆమె వేసిన స్టెప్పులు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ సినిమా కథపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉ‍న్నాయి. ఈ మూవీ టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఓ గిరిజన యోధుడైన కంగువ 1678 నుంచి ప్రస్తుత కాలానికి వస్తాడు. ఓ మహిళా సైంటిస్ట్‌ సాయంతో తన మిషన్‌ని పూర్తి చేయాలనుకుంటాడు. ఆ మిషన్‌ ఏంటి? ఆ కాలం నుంచి ఇప్పటి కాలానికి అతను టైమ్‌ ట్రావెల్‌ ఎలా చేశాడు? అనే నేపథ్యంలో భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలతో ఈ సినిమా కథ సాగుతుందని టాక్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement