షార్ప్‌ షూటర్‌గా దుమ్మురేపిన అజిత్‌! | Ajith Kumar sharpshooter look in Vivegam | Sakshi
Sakshi News home page

షార్ప్‌ షూటర్‌గా దుమ్మురేపిన అజిత్‌!

Published Thu, Mar 23 2017 1:01 PM | Last Updated on Tue, Sep 5 2017 6:54 AM

షార్ప్‌ షూటర్‌గా దుమ్మురేపిన అజిత్‌!

షార్ప్‌ షూటర్‌గా దుమ్మురేపిన అజిత్‌!

అగ్రహీరో అజిత్‌ మోస్ట్‌ ఎవైటెడ్‌ మూవీ 'వివేగం' తాజా లుక్‌ అభిమానులను థ్రిల్లింగ్‌కు గురిచేస్తున్నది. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అజిత్‌ స్నిప్పర్‌గా నటిస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర దర్శకుడు శివ ట్వీట్‌ చేసిన ఫొటోలో షార్ప్‌ షూటర్‌గా అజిత్‌ అదరగొట్టాడు. మంచులో పడుకొని తుపాకీతో గురిపెట్టిన ఆయన తాజా ఫొటో.. అభిమానులను అలరిస్తోంది. ఈ ఏడాది విడుదలవుతున్న రజనీకాంత్‌ 'రోబో 2.0' తర్వాత అంతటి క్రేజ్‌ సంపాదించుకున్న సినిమా 'వివేగం'.

ఈ సినిమాలో అజిత్‌ సిక్స్‌ప్యాక్‌ తో అదరగొట్టబోతున్నాడు. ఈ చిత్రంలో ఆయన పాత్ర ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌ కావడంతో ఎక్కువ శాతం చిత్రీకరణ యూరోపియన్‌ దేశాల్లోనే జరుపుతున్నారు. కమల్‌హాసన్‌ చిన్న కుమార్తె అక్షరా హాసన్‌ తమిళ తెరకు పరిచయమవుతున్న ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ కథానాయిక. హిందీ హీరో వివేక్‌ ఒబెరాయ్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. స్టైలిష్‌ విలన్‌గా వివేక్‌ లుక్‌ ఈ సినిమాలో ఆకట్టుకుంటున్నది. ఈ చిత్రం ఆగష్టు 10న థియేటర్లను పలకరించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement