ఉద్వేగం కలిగించే అజిత్‌ | vivegam movie is released worldwide on 24th of this month | Sakshi
Sakshi News home page

ఉద్వేగం కలిగించే అజిత్‌

Published Fri, Aug 11 2017 1:42 AM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM

ఉద్వేగం కలిగించే అజిత్‌ - Sakshi

ఉద్వేగం కలిగించే అజిత్‌

తమిళసినిమా: ఇతరులకు ఉద్వేగం కలిగించడంలో ఆజిత్‌కు ఆయనే సాటి అని ప్రముఖ హాలీవుడ్‌ నటి అమిలా టెర్జిమెహిక్‌ పేర్కొన్నారు. అజిత్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం వివేగం. కాజల్‌అగర్వాల్‌ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి శివ దర్శకుడు. బోలెడు విశేషాలు, అంతకంటే మరిన్ని అంశాలతో వివేగం చిత్రం ఈ నెల 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది.

ఇందులో అజిత్‌ కౌంటర్‌ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ టీమ్‌లో ప్రధాన పాత్రను పోషించిన అమిలా టెర్జిమెహిక్‌ తన అనుభవాలను పంచుకుంటూ అంతర్జాతీయ స్థాయి చిత్రం వివేగం ద్వారా భారతీయ చిత్ర పరిశ్రమలోకి పరిచయం కావడం సంతోషంగా ఉందన్నారు. తాను నటించన హాలీవుడ్‌ చిత్రం ది నవంబర్‌ మెన్‌ చిత్రం చూసి దర్శకుడు శివ తనను వివేగం చిత్రంలో నటిండానికి ఎంపిక చేసినట్లు తెలిసిందన్నారు.

ఈ చిత్ర కథ, అందులో తన పాత్ర గురించి దర్శకుడు చెప్పగానే చాలా నచ్చేసిందన్నారు. నటుడు అజిత్‌ను కలువక ముందే ఆయన ఎంత పెద్ద నటుడో తెలుసుకున్నానని చెప్పారు. అంత పెద్ద స్టార్‌ నిడరంబరంగా ఉండటం ఆయనకే చెల్లిందన్నారు. చిత్రంలో రిస్కీ ఫైట్స్‌లోనూ ఎలాంటి డూప్‌ లేకుండా నటించడం తనకు ఆశ్చర్యం కలిగించిందని పేర్కొన్నారు. ఆయన ప్రవర్తనను, వృత్తి భక్తిని చూసి స్ఫూర్తి పొందానని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement