హలో..బై తప్ప స్నేహం లేదట | Vivegam will be released on the 10th of next month. | Sakshi
Sakshi News home page

హలో..బై తప్ప స్నేహం లేదట

Published Mon, Jul 17 2017 2:25 AM | Last Updated on Tue, Sep 5 2017 4:10 PM

హలో..బై తప్ప స్నేహం లేదట

హలో..బై తప్ప స్నేహం లేదట

తమిళసినిమా: సాధారణంగా ఒకే చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తే వారి మధ్య స్నేహం, లేదా వైరం ఏర్పడుతుండడం చూస్తుంటాం. మిత్రత్వం అయితే ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తుకుంటారు. అదే ఒకరికొకరు పొసగక పోతే గొడవలు, విమర్శలే. కానీ ఇద్దరు నటీమణులు ఒక చిత్రంలో కలిసి నటించినా హలో..బై అనే మాటలతోనే సరిపెట్టుకున్నారట. 

వారెవరో కాదు, అందాల భామ కాజల్‌అగర్వాల్, అక్షరహాసన్‌. ఈ ముద్దుగుమ్మలు కలిసి నటించిన చిత్రం ఏమిటో ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎస్‌.వివేగం, అజిత్‌ కథానాయకుడిగా నటించిన ఇందులో కాజల్‌అగర్వాల్‌ కథానాయకిగా నటించింది. మరో ప్రధాన పాత్రలో కమలహాసన్‌ రెండవ వారసురాలు అక్షరహాసన్‌ నటించింది. శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలింస్‌ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. షూటింగ్‌ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ చిత్రంలో కాజల్‌అగర్వాల్‌కు అక్షరహాసన్‌కు మధ్య ఎక్కువ సన్నివేశాలు ఉండవట.

దీంతో వీరి మధ్య పెద్దగా స్నేహం ఏర్పడలేదట. షూటింగ్‌ స్పాట్‌లో ఎదురు పడినప్పుడు మాత్రం హలో చెప్పుకునే వారట. షూటింగ్‌ పూర్తి అయ్యి గుమ్మడికాయ కొట్టినప్పుడు ఒక సెల్ఫీ తీసుకుని బై చెప్పడం వరకే ఈ భామలు పరిమితం అయ్యారట. ఇంతకీ ఈ బ్యూటీస్‌ మధ్య స్నేహం ఏర్పడకపోవడానికి కారణాలేంటబ్బా ‘ ఇప్పుడీ విషయమే సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. మొత్తం మీద వివేగం చిత్రం వచ్చే నెల 10వ తేదీన తెరపైకి రానుంది. ఎవరి నటన ఎలా ఉంది, ఎవరికి ఎంత పేరు తెచ్చి పెడుతుంది అన్నది తేలేది అప్పుడే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement