Akshara Hassan
-
ట్రెండింగ్ టిక్‌టాక్‌లో శృతిహాసన్, అక్షర హాసన్
టిక్‌టాక్‌లో రకరకాల వీడియోలు ట్రెండ్ సృష్టిస్తూ ఉంటాయి. అలాంటి వీడియోని సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రెటీల వరకు ప్రతి ఒక్కరు చేస్తూ ఉంటారు. అలాంటి ట్రెండింగ్ టిక్‌టాక్ వీడియో ఒకదానిని ఈ లాక్డౌన్ టైంలో తన ఫ్యాన్స్ కోసం శృతిహాసన్ తన చెల్లెలు అక్షరహాసన్‌తో కలిసి చేసింది. ఈ వీడియోలో కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. దీని ద్వారా ఒకరి గురించి ఒకరికి ఎంతవరకు తెలుసో పరీక్షించుకోవచ్చు. అయితే ఈ వీడియోలో అక్షర హాసన్ లాస్ వేగస్‌లో డబ్బులు పోగొట్టుకొన్న విషయాన్ని ఒప్పుకుంది. శృతి హాసన్ ఎక్కువగా డబ్బులు దానం చేస్తూ ఉంటుందన్న విషయాన్ని తెలిపారు. (బుట్టబొమ్మగా మారిన వార్నర్ భార్య) అదేవిధంగా ఇద్దరిలో ఎవరు డ్రామా క్వీన్ అంటే శృతినే ఇద్దరిలో డ్రామా క్వీన్ అని ఇద్దరూ ఒప్పుకున్నారు. శృతి తన కుటుంబానికి దూరంగా ముంబాయిలోని తన ఇంట్లో ఉంటున్నట్లు ఇది వరకే తెలిపింది. ఇక అక్షయహాసన్ తన తండ్రి కమల్‌హాసన్‌తో కలిసి చెన్నైలో ఉంటుంది. దీనికి సంబంధించిన వీడియోని శృతి హాసన్ షేర్ చేసింది. ఇది మన వీడియో. ఈ ఫన్నీ ఐడియా బాగుంది. థ్యాంక్యూ అంటూ శృతి వీడియోని పోస్ట్ చేసింది. ప్రస్తుతం శృతి ఇంటిపనుల్లో, వర్క్అవుట్స్ చేస్తూ, మ్యూజిక్‌తో బిజీగా ఉంది. దీనికి సంబంధించి ఆమె ఇన్‌స్టాలో ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్‌కి సమాచారం అందిస్తూనే ఉంది. ఇక శృతి తమిళ్లో నటించిన లాభం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. తెలుగులో చేస్తున్న క్రాక్ షూటింగ్ లాక్డౌన్ కారణంగా మధ్యలో ఆగింది. లాక్డౌన్ అనంతరం ప్రారంభం కానుంది. (‘షీలా కి జవాని’కి వార్నర్ ఇరగదీశాడు..) -
కమల్ కూతురికి గిల్టీగా లేదా?
‘‘హిందీ పరిశ్రమలో బంధుప్రీతి బాగా ఎక్కువ. వారసులకు ఇచ్చిన ప్రాధాన్యం బయటి నుంచి వచ్చినవారికి ఇవ్వరు’’ అని కథానాయిక కంగనా రనౌత్ విమర్శనాస్త్రాలు విసురుతుంటారు. ఇప్పుడు తమిళ పరిశ్రమలో ‘నెపోటిజమ్’ (బంధుప్రీతి) వివాదం మొదలైంది. ‘‘ఇక్కడ వారసులదే హవా. ప్రతిభను పట్టించుకోరు. బిగ్ డాడీ (కమల్ని ఉద్దేశించి మీరా ఇలా అంటారట)కి, చిత్రపరిశ్రమలోని పెద్దలకు వారసులు చాలు. పైగా ఎవరైనా (బయటనుంచి వచ్చిన ఆర్టిస్టులు) పాపులర్ అవుతుంటే భరించలేరు. వాళ్లు యాక్ట్ చేసిన సీన్స్‌ని కత్తిరించేస్తారు. సినిమాలు చేజారేలా చేస్తారు’’ అని తమిళ నటి మీరా మిథున్ సోషల్ మీడియా సాక్షిగా ఆరోపణలు చేశారు. మోడల్‌గా కెరీర్ ఆరంభించి, ‘8 తోటాక్కళ్’ (2017)తో సినిమా కెరీర్ మొదలుపెట్టారామె. ఆ తర్వాత నాలుగైదు సినిమాల్లో నటించిన మీరా ప్రస్తుతం కమల్‌హాసన్ హోస్ట్ చేస్తున్న తమిళ ‘బిగ్ బాస్ 3’లో పాల్గొన్నారు. హౌస్ నుంచి బయటకు వచ్చేశారు కూడా. ‘బిగ్ బాస్ 3’ మీరాకి కావాల్సినంత క్రేజ్‌ని తెచ్చింది. ఈ క్రేజ్‌తో తమిళంలో చాలా అవకాశాలు వస్తాయని కూడా ఊహించారామె. దానికి తగ్గట్టే మీరాకి అవకాశాలు వస్తున్నాయి. అయితే ‘అగ్ని శిరగుగళ్’ అనే íసినిమాలో నటించే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది. ఆ తర్వాత ఆ సినిమాలో అక్షరాహాసన్ని కథానాయికగా తీసుకున్నారు. ‘‘కోలీవుడ్‌లో నెపోజిటమ్ ఏ స్థాయిలో ఉందో ఇప్పుడు బాగా స్పష్టం అయిపోయింది. ఈ సినిమా నుంచి నన్ను తప్పించడానికి కమల్‌హాసన్ కారణం అయ్యుంటారు. ఎందుకంటే ఆయన సొంత కూతురు అక్షరాహాసన్ని తీసుకున్నారు. అక్షరాకి కొంచెం కూడా గిల్టీ అనిపించడంలేదా? నవీన్ (చిత్రదర్శకుడు), టి. శివమ్మా (నిర్మాత).. మీ ఇద్దరి ద్వంద్వ వైఖరి నాకు అర్థమైంది’’ అని మీరా మిథున్ ట్వీటర్లో పేర్కొన్నారు. అందుకు బదులుగా ‘‘మీరా మిథున్ని ఈ చిత్రంలో నటింపజేయాలని అనుకోలేదు. మాతో మాట కూడా చెప్పకుండా తనంతట తనే ఈ సినిమా చేస్తున్నట్లు మీడియాకి చెప్పింది. కానీ నేను వివాదం చేయదలచుకోలేదు. అందుకని మాట్లాడలేదు. మేం ముందు షాలినీ పాండేని అనుకున్నాం. ఇప్పుడు తన స్థానంలో అక్షరాహాసన్ని తీసుకున్నాం’’ అని ట్వీటర్ ద్వారా నవీన్ పేర్కొన్నారు. అయితే మీరా మిథున్ జిమ్నాస్ట్ కాబట్టి, ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో తనని తీసుకోవాలనుకుంటున్నాం అని నవీన్ చెప్పిన ఇంటర్వ్యూని బయటపెట్టారు మీరా. ‘‘ఈ ఇంటర్వ్యూ ఇచ్చిన సంగతి మీకు గుర్తుందా? లేక ప్రెస్ కూడా అబద్ధం ఆడిందంటారా? ఏంజెలినా జోలీ (హాలీవుడ్ నటి) లాంటి నటి కావాలని నన్ను తీసుకుంటున్నట్లు మీరు చెప్పిన విషయం మరచిపోయారా? మీకు జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్య ఏమైనా ఉందేమో! అందుకే నేను గుర్తు చేస్తున్నాను’’ అంటూ మీరా ఘాటుగా స్పందించారు. అంతేకాదు.. ఓ పురుషుడివి అయ్యుండి నిజం చెప్పడానికి గట్స్ లేవా అంటూ ఓ ఇంటర్వ్యూలో నవీన్‌ని ఉద్దేశించి అన్నారు మీరా. అందుకు నవీన్ స్పందిస్తూ – ‘‘మగవాడిగా పుట్టినందుకు గర్వపడే వ్యక్తిని కాదు నేను. స్త్రీలు అయినప్పటికీ మా అమ్మ, సోదరి, నా భార్య నాకన్నా గట్స్ ఉన్నవాళ్లు. మీకేదో సమస్య ఉందనుకుంటా మీరా.. డాక్టర్ని సంప్రదించండి. మీ ‘సిల్లీ ట్వీట్స్’కి ఇదే నా చివరి సమాధానం. శుభాకాంక్షలు’’ అన్నారు. ‘‘మాటలు జాగ్రత్త. ఒక స్త్రీని డాక్టర్ని కలవమని చెప్పే అధికారం మీకెవరు ఇచ్చారు? ‘అగ్ని శిరగుగళ్’ సినిమా గురించి, నా పాత్ర గురించి మనం మాట్లాడినట్లు నిర్ధారించడానికి నా దగ్గర ఆడియో ఉంది. అది కనుక నేను బయటపెడితే మీకొక్కరికే కాదు మీ కుటుంబంలో ఉన్న స్త్రీల మీద కూడా ఆ ప్రభావం పడుతుంది. మరి.. నేను బయటపెట్టనా? ఎదుర్కొనే గట్స్ మీకున్నాయా?’’ అని ట్వీట్ చేశారు మీరా. అందుకు నవీన్ నుంచి సమాధానం రాకపోవడంతో ‘‘ఏమైంది నవీన్ కుమార్. ఎందుకు సైలెంట్ అయిపోయారు. సవాల్‌ని ఎదుర్కోకుండా ఎందుకు మౌనంగా ఉన్నారు’’ అని ట్వీట్ చేశారు మీరా.ఇలా వాడివేడి ట్వీట్స్‌తో మీరా మిథున్ టాక్ ఆఫ్ కోలీవుడ్ అయ్యారు. అయితే ఈ వివాదం గురించి మంగళవారం సాయంత్రం వరకూ కమల్, అక్షరా నుంచి ఎలాంటి స్పందన లేదు. మరి.. స్పందిస్తారో? సైలెంట్‌గా ఉండిపోతారో చూడాలి. -
నా ఫిట్నెస్ గురువు తనే
‘‘మిస్టర్ కేకే’ ట్రైలర్ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. ఈ చిత్రంలో చాలా వైవిధ్యమైన పాత్ర చేశాను. మా ప్రొడ్యూసర్స్‌కి థ్యాంక్స్. కమల్‌గారికి మరీ మరీ థ్యాంక్స్. తెలుగులో చాలా బాగా ప్రమోషన్స్ చేస్తున్నారు’’ అని విక్రమ్ అన్నారు. అక్షరాహాసన్, అభిహాసన్ కీలక పాత్రల్లో విక్రమ్ లీడ్ రోల్లో నటించిన తమిళ చిత్రం ‘కడరమ్ కొండాన్’. రాజేష్ ఎం.సెల్వ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని టి.అంజయ్య సమర్పణలో టి.నరేష్ కుమార్, టి. శ్రీధర్ ‘మిస్టర్ కేకే’ పేరుతో శుక్రవారం తెలుగులో విడుదల చేస్తున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో విక్రమ్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో నటించినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. నా ఫ్రెండ్ సెల్వ హార్డ్ వర్కర్. నా ఫిట్నెస్ గురువు కూడా ఆయనే’’ అన్నారు. ‘‘కమల్‌హాసన్‌గారు ఇండస్ట్రీకి ఒక డిక్షనరీ లాంటివారు. ఆయన సొంత బ్యానర్లో నిర్మించిన చిత్రంలో మేం భాగమైనందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. విక్రమ్‌గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఎనర్జీలో కొంత నాకు ఉన్నా ఓకే. మళ్లీ ఈ సినిమా సక్సెస్ మీట్లో కలుద్దాం’’ అన్నారు టి. అంజయ్య. ‘‘నా రెండవ సినిమానే రాజ్‌కమల్ ప్రొడక్షన్లో చేయడం నా అదృష్టం. రవీంద్రన్‌గారు ఈ ప్రాజెక్ట్‌ని తీసుకొచ్చారు. తర్వాత విక్రమ్‌గారు యాడ్ అయ్యాక ఇదొక పెద్ద సినిమా అయిపోయింది. రామజోగయ్య శాస్త్రిగారు చాలా మంచి పాటలు అందించారు’’ అన్నారు దర్శకుడు రాజేష్ ఎం.సెల్వ. ‘‘ఇందులో గర్భవతి పాత్ర చేశాను. ఈ పాత్ర చేయలేననుకున్నా. కానీ రాజేష్‌గారు, మా నాన్నగారు చాలా సపోర్ట్ చేశారు’’ అన్నారు అక్షరాహాసన్. రామజోగయ్య శాస్త్రి, గోవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కమల్– విక్రమ్–అక్షర ఓ సినిమా
యస్.. కమల్‌హాసన్, ఆయన చిన్న కుమార్తె అక్షరా హాసన్, విక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుంది. అయితే ఇందులో కమల్ నటించడంలేదు. విక్రమ్, అక్షర జంటగా నటించనున్నారు. ఈ చిత్రాన్ని తన సొంత బేనర్ రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్పై కమల్‌హాసన్ నిర్మించనుండటం విశేషం. ట్రిడెంట్ ఆర్ట్స్ బ్యానర్స్ మరో నిర్మాణ సంస్థగా వ్యవహరించనుంది. కమల్‌తో ‘తూంగావనమ్’ (తెలుగులో ‘చీకటి రాజ్యం’) చిత్రానికి దర్శకత్వం వహించిన రాజేశ్ ఎమ్. సెల్వ ఈ చిత్రానికి దర్శకుడు. ‘‘ఈ కాంబినేషన్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు కమల్. ‘‘విక్రమ్, అక్షరాహాసన్‌కు థ్యాంక్స్. నా శక్తి సామర్థ్యాలను నమ్మిన కమల్‌హాసన్‌గారికి స్పెషల్ థ్యాంక్స్’’ అన్నారు రాజేశ్ ఎమ్. సెల్వ. ఇదిలా ఉంటే... కమల్‌హాసన్ నటించి, దర్శకత్వం వహించిన ‘విశ్వరూపం 2’ విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు ‘శభాష్‌నాయుడు’ అనే చిత్రంలో కమల్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆయనే దర్శకుడు. ఇందులో కమల్ కూతురిగా శ్రుతీహాసన్ నటిస్తున్నారు. ఓ కీలక పాత్రను బ్రహ్మానందం చేస్తున్నారు. ఆ మధ్య కమల్ కాలికి గాయం కావడంతో ఈ సినిమా షూటింగ్‌కి బ్రేక్ పడింది. త్వరలో షూటింగ్ మొదలుపెట్టాలనుకుంటున్నారు. -
అజిత్ 'వివేగానికి' భారీ రేటు!
భారీ అంచనాలతో తెరకెక్కుతున్న హీరో అజిత్ తాజా చిత్రం 'వివేగం'.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా మేకర్స్ తాజాగా తెలుగు మార్కెట్‌పై దృష్టి పెట్టారు. స్పై థ్రిల్లర్‌గా తమిళ, తెలుగు భాషల్లో ఆగస్టు 10న ఈ సినిమా విడుదలకానుంది. విశ్వసనీయ వర్గాల ప్రకారం ఈ సినిమా తెలుగు థియేట్రికల్ హక్కులు ఏకంగా రూ. 4.5 కోట్లకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. వ్యాపారపరంగా చూసుకుంటే తెలుగు మార్కెట్లో అజిత్ సినిమాకు ఇదే హయ్యెస్ట్ రేటు. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అజిత్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. అక్షరహాసన్ కీలక పాత్రలోనూ నటిస్తోంది. హిందీ స్టార్ నటుడు వివేక్ ఓబెరాయ్ ప్రతినాయకుడిగా కనిపించనున్న ఈ సినిమాలో అజిత్ రిస్కీ సన్నివేశాల్లోనూ డూప్ లేకుండా నటించారని చిత్రబృందం చెప్తోంది. -
హలో..బై తప్ప స్నేహం లేదట
తమిళసినిమా: సాధారణంగా ఒకే చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తే వారి మధ్య స్నేహం, లేదా వైరం ఏర్పడుతుండడం చూస్తుంటాం. మిత్రత్వం అయితే ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తుకుంటారు. అదే ఒకరికొకరు పొసగక పోతే గొడవలు, విమర్శలే. కానీ ఇద్దరు నటీమణులు ఒక చిత్రంలో కలిసి నటించినా హలో..బై అనే మాటలతోనే సరిపెట్టుకున్నారట. వారెవరో కాదు, అందాల భామ కాజల్‌అగర్వాల్, అక్షరహాసన్. ఈ ముద్దుగుమ్మలు కలిసి నటించిన చిత్రం ఏమిటో ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎస్.వివేగం, అజిత్ కథానాయకుడిగా నటించిన ఇందులో కాజల్‌అగర్వాల్ కథానాయకిగా నటించింది. మరో ప్రధాన పాత్రలో కమలహాసన్ రెండవ వారసురాలు అక్షరహాసన్ నటించింది. శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలింస్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ చిత్రంలో కాజల్‌అగర్వాల్‌కు అక్షరహాసన్‌కు మధ్య ఎక్కువ సన్నివేశాలు ఉండవట. దీంతో వీరి మధ్య పెద్దగా స్నేహం ఏర్పడలేదట. షూటింగ్ స్పాట్లో ఎదురు పడినప్పుడు మాత్రం హలో చెప్పుకునే వారట. షూటింగ్ పూర్తి అయ్యి గుమ్మడికాయ కొట్టినప్పుడు ఒక సెల్ఫీ తీసుకుని బై చెప్పడం వరకే ఈ భామలు పరిమితం అయ్యారట. ఇంతకీ ఈ బ్యూటీస్ మధ్య స్నేహం ఏర్పడకపోవడానికి కారణాలేంటబ్బా ‘ ఇప్పుడీ విషయమే సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తోంది. మొత్తం మీద వివేగం చిత్రం వచ్చే నెల 10వ తేదీన తెరపైకి రానుంది. ఎవరి నటన ఎలా ఉంది, ఎవరికి ఎంత పేరు తెచ్చి పెడుతుంది అన్నది తేలేది అప్పుడే. -
మలుపు తిప్పే వివేగం
తమిళసినిమా: వివేగం చిత్రం అందులో నటించిన నటీనటులు, సాంకేతిక వర్గం కేరీర్‌ను మలుపు తిప్పే చిత్రంగా ఉంటుందట. ఇది అన్నది ఎవరో కాదు ఆ చిత్ర దర్శకుడు శివ. అజిత్ కథానాయకుడిగా నటించిన చిత్రం వివేగం. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలింస్ సంస్థ భారీఎత్తున్న నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కాజల్‌అగర్వాల్ కథానాయకిగా నటిస్తున్న ఇందులో అక్షరహాసన్ ముఖ్య భూమికను పోషిస్తున్నారు. అనిరుథ్ సంగీతాన్ని అందిస్తున్న వివేకం చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఆగస్ట్ 10న తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది.చిత్రాన్ని సెన్సార్‌కు పంపే పనిలో చిత్ర యూనిట్ ఉంది. కాగా ఇందులో అజిత్ రిస్కీ సన్నివేశాల్లోనూ డూప్ లేకుండా నటించారని ఇప్పటికే ఆ చిత్ర చాయాగ్రహకుడు వెట్రి గొప్పగా చెప్పారు. కాగా వివేగం చిత్రాన్ని అజిత్ సహా చిత్ర యూనిట్ అంతా చూశారని, అందరూ ఏక కంఠంతో చెప్పిన మాట ఈ చిత్రం తమ కెరీర్‌ను మలుపు తిప్పే చిత్రంగా ఉంటుందనేనని దర్శకుడు శివ అన్నారు. కాగా ఇందులో అనిరుథ్ కర్ణాటక సంగీతంతో ఒక పాటకు ప్రయోగం చేశారట. ఆ పాట చిత్రానికి హైలెట్ అవుతుందంటున్నాయి చిత్ర వర్గాలు. -
హీరోయిన్గా అక్షరహాసన్!
తమిళసినిమా: నటుడు కమలహాసన్ రెండో వారసురాలు అక్షరహాసన్ ఎట్టకేలకు హీరోయిన్ అవుతున్నారు. తన అక్క శ్రుతీహాసన్ మాదిరిగానే వృత్తిపరంగా వారు కోరుకున్నది ఒకటి, జరిగింది మరొకటి అయ్యింది. శ్రుతీహాసన్‌కు సంగీతంపై మక్కువ అన్నది తెలిసిందే. తను సంగీత రంగంలో రాణించాలని ఆశ పడ్డారు. అదేవిధంగా పలు ప్రైవేట్ సంగీత ఆల్బంలు చేసిన శ్రుతి తన తండ్రి కమలహాసన్ నటించిన ఉన్నైపోల్ ఒరువన్ చిత్రం ద్వారా సంగీతదర్శకురాలిగా రంగప్రవేశం చేశారు. అయితే ఆ తరువాత అనూహ్యంగా హీరోయిన్గా అవతారమెత్తారు. హిందీలో లక్ చిత్రంతో తన లక్కును పరిక్షించుకున్నా, తెలుగు చిత్రం గబ్బర్‌సింగ్‌తోనే స్టార్‌డమ్‌ను పొందగలిగారు. ఇక అక్షరహాసన్ కెమెరా వెనుక కెప్టెన్ కావాలని ఆశించారు. అందుకు దర్శకుడు బాల్కీ వద్ద సహాయదర్శకురాలిగా పనిచేశారు కూడా. అయితే తను యాదృచ్ఛికంగానే హిందీ చిత్రం షమితాబ్ చిత్రం ద్వారా నటిగా రంగప్రవేశం చేశారు. తాజాగా అజిత్ హీరోగా నటిస్తున్న వివేగం చిత్రంలో ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. అయితే ఈ రెండు చిత్రాల్లోనూ అక్షరహాసన్ కథానాయకి కాదు. తాజాగా హీరోయిన్ అవకాశం ఈమెను వరించిందని సమాచారం. అయితే ఈ అవకాశం అక్షరకు శాండిల్‌వుడ్‌లో రావడం విశేషం. కన్నడంలో ప్రముఖ నటుడు రవిచంద్రన్ వారసుడు విక్రమ్ చంద్రన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రంలో అక్షర ఆయనకు జంటగా నటించనున్నారని సమాచారం. -
నాన్నకూ.. అక్కకూ సహాయం!
కమల్‌హాసన్, శ్రుతీహాసన్ తండ్రీకూతుళ్లుగా ‘శభాష్ నాయుడు’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి అక్షరాహాసన్ కూడా పని చేస్తున్నారు. అయితే కమల్, శ్రుతి ఆన్ స్క్రీన్ కనిపిస్తే, అక్షరాహాసన్ మాత్రం ఆఫ్ ద స్క్రీన్‌కి పరిమితమవుతారు. మలయాళ దర్శకుడు రాజీవ్ కుమార్ దర్శకత్వంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం తెరకె క్కుతోంది. ఇప్పటికే పలు హిందీ చిత్రాలకు దర్శకత్వ విభాగంలో పనిచేసిన అనుభవం ఉన్న అక్షర ఈ సినిమాకు దర్శకత్వ విభాగంలో పనిచేయడానికి ఆసక్తి కనబర్చారట. దీనికి కమల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నాన్నా, అక్కా నటిస్తున్న సినిమాకి సహాయ దర్శకురాలిగా చేస్తున్నందుకు అక్షర సంబరపడిపోతున్నారు. -
'మేమిద్దరం డేటింగ్ చేస్తున్నట్టు చెప్పామా?'
కమల్ హాసన్ తనయ అక్షర హాసన్, తనుజ్ విర్వానిల రిలేషన్షిప్ ముగిసిందని, ఇక మీదట స్నేహితులుగా ఉండాలని వీరిద్దరూ నిర్ణయించుకున్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కాగా అక్షర, తాను డేటింగే చేయలేదని తనుజ్ చెబుతున్నాడు. తామిద్దరం డేటింగ్ చేస్తున్నట్టు ఎప్పుడూ చెప్పలేదన్నాడు. తమ అనుబంధం పట్ల అక్షర తల్లి సారిక, తన తల్లి రతి అగ్నిహోత్రి అభ్యంతరం వ్యక్తం చేసినట్టు వచ్చిన వార్తలను తనుజ్ తోసిపుచ్చాడు. తమ గురించి అక్షర, తన కుటుంబ సభ్యులకు తెలుసునని వెల్లడించాడు. గతంలో ముంబై శివారు ప్రాంతాల్లో పలుమార్లు అక్షర, తనుజ్ ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ మీడియా కంటపడ్డారు. -
ఆ తలనొప్పి వాళ్లదే!
అభిమానులలాగే తానూ మామయ్యతో కలిసి నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని హీరో ధనుష్ అంటే.... ‘క్రమశిక్షణ, హార్డ్‌వర్కే ఎవరినైనా సక్సెస్ వైపు నడిపిస్తాయి కానీ కుటుంబ నేపథ్యం కాదు’ అంటోంది హీరోయిన్ అక్షర హాసన్. ‘షమితాబ్’ చిత్రం ప్రమోషన్ కోసం ఇద్దరూ నగరానికి వచ్చిన సందర్భంగా ‘సిటీ ప్లస్’ పలకరించింది. ఆ చిట్‌చాట్ వారి మాటల్లోనే... ధనుష్: ‘మా మావయ్య (రజనీ కాంత్)తో నటించరా?’ అని చాలా మంది అడుగుతుంటారు. నిజంగా అలాంటి అవకాశం వస్తే అది అద్భుతం. నేనూ అందుకోసమే ఎదురు చూస్తున్నాను. ఇద్దరికీ సరిపడా కథ వస్తే నా భార్య సౌందర్యతో కలిసి కూడా నటిస్తానేమో. భార్యే హీరోయిన్ అయితే మీరు వివాదాలేమీ సృష్టించరు (నవ్వుతూ). అందుకే సొంత బ్యానర్... నా సోదరుడు (సెల్వరాఘవన్), నేను ఇండస్ట్రీలోకి రావడానికి పడ్డ ఇబ్బందులు నాకు గుర్తున్నాయి. అందుకే ‘వండర్‌బార్ ఫిల్మ్స్’ బ్యానర్‌ను స్థాపించాం. దీని ద్వారా దర్శకులు, నటులు, మ్యూజీషియన్స్, ఎడిటర్స్‌ను సైతం పరిచయం చేశాం. నాకెందుకా భారం..! ఈ సినిమాలో నా లుక్ గురించి ఎలాంటి కేర్ తీసుకున్నారని అడుగుతున్నారు. అయినా అదంతా నాకెందుకు చెప్పండి? మా స్టైలిస్ట్ తలనొప్పి కదా (నవ్వుతూ). ఇదే సమాధానం నా డ్రీమ్క్యారెక్టర్ ప్రశ్నకూ వర్తిస్తుంది. ఫీల్డ్కి వచ్చిన కొత్తలో అలాంటివి చేయాలి? ఇలాంటివి చేయాలి? అనే ఆలోచనలు ఉండేవి. ఇప్పుడు నా కోసం మంచి పాత్రలు సృష్టించే పని చేసేవాళ్లు చేస్తున్నారు. ఇక నాకెందుకా భారం చెప్పండి?( నవ్వుతూ) పూర్తిగా కొత్త సబ్జెక్ట్... షమితాబ్ ఇప్పటిదాకా ఎవరూ టచ్ చేయని సబ్జెక్ట్. ఓ మూడు రకాల వ్యక్తిత్వాలున్న ముగ్గురు వ్యక్తుల మధ్య కథ. డబ్బింగ్ తొలుత పూర్తి చేసి ఆ తర్వాత షూటింగ్ చేయడం దగ్గర్నుంచి... ఎన్నో ప్రయోగాలు చేశాం. ఇక ఇండియన్ సినిమాకు లెజండ్రీ పర్సనాలిటీ అయిన అమితాబ్‌తో నటించడం గొప్ప ఎక్స్పీరియన్స్. ఆయనతో షూటింగ్ చేస్తున్నంత సేపూ నేర్చుకుంటూనే ఉన్నాను. లొకేషన్లోకి వచ్చాక తానొక లెజెండ్ అని కాక, యాక్టర్ మాత్రమే అని మనం గుర్తు పెట్టుకునేలా ప్రవర్తిస్తారు. భాష నేర్చుకున్నాకే.... అక్షర: అసిస్టెంట్ డెరైక్టర్‌గా కొన్నేళ్లు పనిచేశాక... ముంబయిలో ఒక నాటకంలో క్యారెక్టర్ ప్లే చేశాను. అప్పుడే నటనపై ఆసక్తి ఏర్పడింది. అలా నటుడిగా మారాను. డెరైక్షన్, యాక్షన్.. దేని కష్టం దానిదే. హార్డ్ వర్క్‌తో దేనిలోనైనా పరిపూర్ణత సాధించగలం. నన్ను నేను నిరూపించుకోవాలి ఫ్యామిలీలో అందరూ సినిమారంగంలో ఉన్నవారే. అయితే నేనేంటో నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. జయాపజయాలు పూర్తిగా వ్యక్తిగతం. వాటికి నాదే బాధ్యత. క్రమశిక్షణ, హార్డ్‌వర్క్... ఇవే నన్ను సక్సెస్ చేస్తాయి తప్ప కుటుంబ నేపథ్యం కాదని నా నమ్మకం. తెలుగులోనూ ఓకే... తెలుగులో నటించడానికి అభ్యంతరం ఏముంటుంది? అయితే బాలీవుడ్లో ఇప్పుడే ప్రవేశించాను. హిందీ భాష కాస్త కష్టంగానే ఉంది. ముందు భాష మీద పట్టు సాధించాలి. అప్పుడే మరింత బాగా నటించగలం. బాలీవుడ్లో తొలి చిత్రమే అమితాబ్, ధనుష్ వంటి మంచి ఆర్టిస్ట్‌లతో నటించే అవకాశం రావడం వల్ల ఎంతో నేర్చుకున్నా. - సత్యబాబు -
అక్షర ఆరంభం
అక్షర... ఈ మూడు అక్షరాల వెనుక పెద్ద నటనాధ్యాయమే ఉంది. నటననే శ్వాసి స్తూ దాన్ని శాసించే స్థాయికి ఎదిగిన కమలహాసన్, సారికల ముద్దు బిడ్డ అక్షరహాసన్. నటనలో ఎదుగుతున్న శ్రుతి హాసన్ చెల్లెలు. మొత్తం మీద నటనే నమ్ముకున్న కుటుంబం నుంచి నటనలో నడకలు నేర్చుకోవడానికి శ్రీకా రం చుట్టిన అక్షర తొలి అడుగు ఫలితం కోసం చెప్పలేనంత ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అక్షరహాసన్ నటించిన తొలి చిత్రం షమితాబ్ (హిందీ) చిత్రం త్వరలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా నటన లో ఓనమాలు దిద్దుకున్న ఈ బ్యూటీ పలుకులు ఏంటో చూద్దాం. తొలి చిత్ర అనుభవం షమితాబ్ చిత్రంలో నటించడం చాలా తీయని అనుభవం. అమితాబ్‌బచ్చన్ లాంటి గొప్ప నటులతో పని చేసిన బాల్కి దర్శకత్వంలో నటించే అవకాశం రావడం తో ఎగ్జైట్‌గా ఫీల్ అయ్యాను. అంతేకాదు నా తొలి చిత్రంలోనే అమితాబ్ తో కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టం. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. అలాగే ధనుష్ నుంచి కూడా. ఈ చిత్ర యూ నిట్ లో అందరికన్నా అన్ని విషయాల్లోనూ చిన్నదాన్ని నేనే. నాన్న నుంచి చాలా నేర్చుకున్నా అయితే నటన విషయంలో అమ్మానాన్నల నుంచి చాలా నేర్చుకున్నాను. ఇక నేను వాళ్ల జీన్స్‌ను కాబట్టి వారి క్వాలిటీస్ నాలో సహజంగానే ఉంటాయి. అయితే అమ్మానాన్నలు లోతైన ఆలోచనలు నన్నిప్పటికీ విస్మయపరుస్తుంటాయి. నటన లో నాన్న నుంచి చాలా టిప్స్ పొందాను. సమాజాన్ని కూడా సున్నితంగా గమని స్తుంటాను. సగటు మనిషి ప్రవర్తన ఎలాంటిదని తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. కారణం అదే షమితాబ్ చిత్రానికి ముందు తమిళం లో మణిరత్నం దర్శకత్వంలో కడల్ చిత్రంలో నటించే అవకాశం వచ్చిం ది. అయితే ఆ సమయంలో నేను నటన గురించి ఆలోచించలేదు. బాలీవుడ్ దర్శకుడు రాహుల్ డోల కియా వద్ద సహాయ దర్శకులుగా పని చేస్తున్నాను. కెమెరావెనుక చాలా నేర్చుకోవాలన్న దృక్పథంలోనే ఉన్నాను. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ సమయంలో నేను నృత్యం నేర్చుకుంటున్నాను. అందుకే మణిరత్నం చిత్రంలో నాయికిగా నూరుశా తం న్యాయం చేయగలనా అన్న సందేహం కారణంగా ఆ అవకాశాన్ని అందుకోలేకపోయాను. షమితాబ్లో అవకాశం ఎలా వచ్చింది? ఒకరోజు క్యాజువల్‌గా దర్శకుడు బాల్కిని కలిశాను. ఆ సమయంలో ఆయన షమితాబ్ చిత్రం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు. ఆ స్క్రిప్ట్ పూర్తిగా చదివి ఎలా ఉం దని నా వైపు చూశారు. ఆయన స్క్రిప్టు నరేషన్ చేసిన విధానం చూసి నేను బౌల్డ్ అయిపోయాను. అదే విషయాన్ని ఆయనతో చెప్పాను. అందులో నాయికి పాత్ర చేస్తావా? అని అడిగారు. వెంటనే నేను ఎస్ అన్నాను. అయినా రెండు రోజులు గడువు అడిగి మా అమ్మతో సంప్రదించాను. అమ్మ నిర్ణయాన్ని నాకే వదిలేశారు. దీంతో నటించడానికి సిద్ధం అయ్యాను. షమితాబ్ చిత్రం చూశాక.. షమితాబ్ చిత్రం చూసిన తరువాత నా నిర్ణయం రైట్ అనిపించింది. అయితే అది నన్ను సముచిత స్థాయికి చేర్చుతుందని ఇప్పుడే చెప్పలేను. ఎలా ఆదరిస్తారన్నది ప్రేక్షకుల చేతుల్లోనే ఉంది. అయితే ఒక మంచి చిత్రం ద్వారా పరిచయం అవుతున్నానన్న సంతృప్తి మాత్రం నాకుంది. అక్క శ్రుతి హాసన్ మాదిరిగానే భారతీయ నటిగా పేరు తెచ్చుకోవాలనుంది. తమిళంలోనూ మంచి కథా పాత్రల్లో నటించాలని ఆశిస్తున్నాను. చాలా అవకాశాలు వస్తున్నాయి. త్వరలోనే మంచి చిత్రం ఎంచుకుని నటిస్తాను. -
శ్రీదేవికి సవతి కూతురిగా...
కమలహాసన్ రెండో కుమార్తె అక్షరాహాసన్‌కు ఇప్పుడు అవకాశాల మీద అవకాశాలు వచ్చిపడుతున్నట్టున్నాయి. తొలి సినిమా ఇంకా విడుదల కాక ముందే ఆమెను తమ చిత్రాల్లో బుక్ చేసుకోవడానికి దర్శక, నిర్మాతలు ఉత్సాహం చూపుతున్నారు. నిర్మాత బోనీ కపూర్, తన శ్రీమతి శ్రీదేవి నటిస్తున్న తదుపరి చిత్రంలో కీలక పాత్ర కోసం అక్షరను సంప్రతించినట్లు సమాచారం. వాణిజ్య ప్రకటన చిత్రాలు రూపొందించే రవి ఉదయవర్ నిర్దేశకత్వంలో శ్రీదేవితో ఒక భారీ చిత్రం తీయాలని బోనీ కపూర్ నిర్ణయించుకున్నారట! సవతి తల్లికీ, సవతి కూతురికీ మధ్య సాగే భావోద్వేగభరితమైన కథగా ఈ చిత్రం సాగుతుందట! ఆర్. బల్కి దర్శకత్వంలో ‘షమితాబ్’ ద్వారా హిందీ చిత్రసీమలో కాలుమోపుతున్న అక్షర ఈ తాజా చిత్రంలో సవతి కూతురు పాత్ర పోషిస్తారని సమాచారం. ‘షమితాబ్’లోని కొన్ని సన్నివేశాలను ముందుగానే చూసిన బోనీకపూర్ ఈ కూతురు పాత్రకు అక్షర అతికినట్లు సరిపోతుందని భావించారు. తాజాగా నిర్మించిన ‘తేవర్’ చిత్రం ఆశించినంత విజయం సాధించని నేపథ్యంలో ఇప్పుడీ కొత్త చిత్రానికి బోనీకపూర్ శ్రీకారం చుడుతున్నట్లు సమాచారం. మొత్తానికి, అక్షర కొద్ది రోజుల్లోనే ప్రముఖుల చిత్రాల్లో స్థానం సంపాదిస్తున్నారన్న మాట! -
ధనుష్‌తో కలిసి బాలీవుడ్‌కి
నటుడు ధనుష్‌తో కలిసి బాలీవుడ్‌కు ఎగబాకారు నటి అభినయ. పేరుకు తగ్గట్టుగానే ఈ ముగ్ధ మనోహరి అభినయంతో అభినందనలందుకుంటోంది. కాకపోతే చిన్న కొరత. ఈమె మూగ, బధిర అయినా వాటిని జీవితానికి బంధకాలుగా ఈ బ్యూటీ భావించలేదు. తన మైనస్‌ను ప్లస్ చేసుకుంటూ నటిగా ఎదుగుతున్నారు. తన లాంటి వారికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. నాడోడిగళ్ చిత్రం ద్వారా నటిగా పరిచయమైన అభినయ తొలి చిత్రంతోనే అందరి హృదయాల్ని దోచుకున్నారు. అదే చిత్రం రీమేక్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ భామ తాజాగా బాలీవుడ్‌కు ఎగబాకడం విశేషం. బాలీవుడ్లో ధనుష్, అమితాబ్ బచ్చన్, అక్షర హాసన్‌లు నటిస్తున్న క్రేజీ చిత్రం షమితాబ్. ఈ చిత్రంలో అభినయ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ విషయం గురించి ఆమె తండ్రి ఆనందవర్మ వెల్లడించారు. అభినయ సెలెక్టెడ్ చిత్రాలనే చేస్తున్నారని చెప్పారు. తాజాగా హిందీలో షమితాబ్ చిత్రంలో చాలా ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తున్నారని చెప్పారు. ఈ చిత్రం కోసం ఇటీవలే ఈ చిత్రం కోసం కొన్ని రోజులు పని చేశారని తెలిపారు. త్వరలో ప్రారంభం కానున్న తదుపరి షెడ్యూల్లో ధనుష్‌తో డ్యూయెట్ పాడటానికి సిద్ధం అవుతున్నట్లు పేర్కొన్నారు. ఈ చిత్రంతోపాటు తమిళంలో విశాల్ చిత్రం పూజై, జయం రవి చిత్రం తనీ ఒరువన్ లోను, పిరవి, మేళతాళం అనే మరో రెండు చిత్రాల్లోనూ నటిస్తున్నట్టు తెలిపారు. జయం రవి చిత్రంలో శాస్త్రవేత్తగాను, విశాల్ పూజై చిత్రంలో ఆయన మామకూతురుగాను నటిస్తున్నట్టు వివరించారు.