నా ఫిట్‌నెస్‌ గురువు తనే | Vikram Mister KK Movie Pre Release Event | Sakshi
Sakshi News home page

నా ఫిట్‌నెస్‌ గురువు తనే

Published Thu, Jul 18 2019 12:19 AM | Last Updated on Thu, Jul 18 2019 5:10 AM

Vikram Mister KK Movie Pre Release Event - Sakshi

‘కేకే’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో నరేష్, శ్రీధర్, అంజయ్య, రాజేష్, అభిహాసన్, అక్షర, విక్రమ్‌

‘‘మిస్టర్‌ కేకే’ ట్రైలర్‌ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. ఈ చిత్రంలో చాలా వైవిధ్యమైన పాత్ర చేశాను. మా ప్రొడ్యూసర్స్‌కి థ్యాంక్స్‌. కమల్‌గారికి మరీ మరీ థ్యాంక్స్‌. తెలుగులో చాలా బాగా ప్రమోషన్స్‌ చేస్తున్నారు’’ అని విక్రమ్‌ అన్నారు. అక్షరాహాసన్, అభిహాసన్‌ కీలక పాత్రల్లో విక్రమ్‌ లీడ్‌ రోల్‌లో నటించిన తమిళ చిత్రం ‘కడరమ్‌ కొండాన్‌’. రాజేష్‌ ఎం.సెల్వ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని టి.అంజయ్య సమర్పణలో టి.నరేష్‌ కుమార్, టి. శ్రీధర్‌ ‘మిస్టర్‌ కేకే’ పేరుతో శుక్రవారం తెలుగులో విడుదల చేస్తున్నారు.

హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకలో విక్రమ్‌ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో నటించినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. నా ఫ్రెండ్‌ సెల్వ హార్డ్‌ వర్కర్‌. నా ఫిట్‌నెస్‌ గురువు కూడా ఆయనే’’ అన్నారు.  ‘‘కమల్‌హాసన్‌గారు ఇండస్ట్రీకి ఒక డిక్షనరీ లాంటివారు. ఆయన సొంత బ్యానర్‌లో నిర్మించిన చిత్రంలో మేం భాగమైనందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. విక్రమ్‌గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఎనర్జీలో కొంత నాకు ఉన్నా ఓకే. మళ్లీ ఈ సినిమా సక్సెస్‌ మీట్‌లో కలుద్దాం’’ అన్నారు టి. అంజయ్య. 

‘‘నా రెండవ సినిమానే రాజ్‌కమల్‌ ప్రొడక్షన్‌లో చేయడం నా అదృష్టం. రవీంద్రన్‌గారు ఈ ప్రాజెక్ట్‌ని తీసుకొచ్చారు. తర్వాత విక్రమ్‌గారు యాడ్‌ అయ్యాక ఇదొక పెద్ద సినిమా అయిపోయింది. రామజోగయ్య శాస్త్రిగారు చాలా మంచి పాటలు అందించారు’’ అన్నారు దర్శకుడు రాజేష్‌ ఎం.సెల్వ. ‘‘ఇందులో గర్భవతి పాత్ర చేశాను. ఈ పాత్ర చేయలేననుకున్నా. కానీ రాజేష్‌గారు, మా నాన్నగారు చాలా సపోర్ట్‌ చేశారు’’ అన్నారు అక్షరాహాసన్‌. రామజోగయ్య శాస్త్రి, గోవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement