
యస్.. కమల్‌హాసన్, ఆయన చిన్న కుమార్తె అక్షరా హాసన్, విక్రమ్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనుంది. అయితే ఇందులో కమల్ నటించడంలేదు. విక్రమ్, అక్షర జంటగా నటించనున్నారు. ఈ చిత్రాన్ని తన సొంత బేనర్ రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్‌నేషనల్‌పై కమల్‌హాసన్ నిర్మించనుండటం విశేషం. ట్రిడెంట్ ఆర్ట్స్ బ్యానర్స్ మరో నిర్మాణ సంస్థగా వ్యవహరించనుంది. కమల్‌తో ‘తూంగావనమ్’ (తెలుగులో ‘చీకటి రాజ్యం’) చిత్రానికి దర్శకత్వం వహించిన రాజేశ్ ఎమ్. సెల్వ ఈ చిత్రానికి దర్శకుడు.
‘‘ఈ కాంబినేషన్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు కమల్. ‘‘విక్రమ్, అక్షరాహాసన్‌కు థ్యాంక్స్. నా శక్తి సామర్థ్యాలను నమ్మిన కమల్‌హాసన్‌గారికి స్పెషల్ థ్యాంక్స్’’ అన్నారు రాజేశ్ ఎమ్. సెల్వ. ఇదిలా ఉంటే... కమల్‌హాసన్ నటించి, దర్శకత్వం వహించిన ‘విశ్వరూపం 2’ విడుదలకు సిద్ధమవుతోంది.
మరోవైపు ‘శభాష్‌నాయుడు’ అనే చిత్రంలో కమల్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆయనే దర్శకుడు. ఇందులో కమల్ కూతురిగా శ్రుతీహాసన్ నటిస్తున్నారు. ఓ కీలక పాత్రను బ్రహ్మానందం చేస్తున్నారు. ఆ మధ్య కమల్ కాలికి గాయం కావడంతో ఈ సినిమా షూటింగ్‌కి బ్రేక్ పడింది. త్వరలో షూటింగ్ మొదలుపెట్టాలనుకుంటున్నారు.