ట్రెండింగ్‌ టిక్‌టాక్‌లో శృతిహాసన్‌, అక్షర‌ హాసన్‌ | Shruti Haasan made a trending Vedio With Her sister Akshara Haasan | Sakshi
Sakshi News home page

‘శృతి హాసన్‌ బెస్ట్‌ డ్రామా క్వీన్‌’

May 2 2020 2:36 PM | Updated on May 2 2020 8:40 PM

Shruti Haasan made a trending Vedio With Her sister Akshara Haasan - Sakshi

టిక్‌టాక్‌లో రకరకాల వీడియోలు ట్రెండ్‌ సృష్టిస్తూ ఉంటాయి. అలాంటి వీడియోని సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రెటీల వరకు ప్రతి ఒక్కరు చేస్తూ ఉంటారు. అలాంటి ట్రెండింగ్‌ టిక్‌టాక్‌ వీడియో ఒకదానిని ఈ లాక్‌డౌన్‌ టైంలో తన ఫ్యాన్స్‌ కోసం శృతిహాసన్‌ తన చెల్లెలు అక్షరహాసన్‌తో కలిసి  చేసింది. ఈ వీడియోలో కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. దీని ద్వారా ఒకరి గురించి ఒకరికి ఎంతవరకు తెలుసో పరీక్షించుకోవచ్చు. అయితే ఈ వీడియోలో అక్షర హాసన్‌ లాస్‌ వేగస్‌లో డబ్బులు పోగొట్టుకొన్న విషయాన్ని ఒప్పుకుంది. శృతి హాసన్‌ ఎక్కువగా డబ్బులు దానం చేస్తూ ఉంటుందన్న విషయాన్ని తెలిపారు.  (బుట్టబొమ్మగా మారిన వార్నర్ భార్య)

అదేవిధంగా ఇద్దరిలో ఎవరు డ్రామా క్వీన్‌ అంటే శృతినే ఇద్దరిలో డ్రామా క్వీన్‌ అని ఇద్దరూ ఒప్పుకున్నారు. శృతి తన కుటుంబానికి దూరంగా ముంబాయిలోని తన ఇంట్లో ఉంటున్నట్లు ఇది వరకే తెలిపింది. ఇక అక్షయహాసన్‌ తన తండ్రి కమల్‌హాసన్‌తో కలిసి చెన్నైలో ఉంటుంది. దీనికి సంబంధించిన వీడియోని శృతి హాసన్‌ షేర్‌ చేసింది. ఇది మన వీడియో. ఈ ఫన్నీ ఐడియా బాగుంది. థ్యాంక్యూ అంటూ శృతి వీడియోని పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం శృతి ఇంటిపనుల్లో, వర్క్‌అవుట్స్‌ చేస్తూ, మ్యూజిక్‌తో బిజీగా ఉంది. దీనికి సంబంధించి ఆమె ఇన్‌స్టాలో ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్‌కి సమాచారం అందిస్తూనే ఉంది. ఇక శృతి తమిళ్‌లో నటించిన లాభం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. తెలుగులో చేస్తున్న క్రాక్‌ షూటింగ్‌ లాక్‌డౌన్‌ కారణంగా మధ్యలో ఆగింది. లాక్‌డౌన్‌ అనంతరం ప్రారంభం కానుంది. (షీలా కి జవానికి వార్నర్ ఇరగదీశాడు..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement