శ్రీదేవికి సవతి కూతురిగా... | Akshara Haasan To Play Sridevi's Daughter? | Sakshi

శ్రీదేవికి సవతి కూతురిగా...

Published Fri, Jan 16 2015 10:32 PM | Last Updated on Sat, Sep 2 2017 7:46 PM

శ్రీదేవికి సవతి కూతురిగా...

శ్రీదేవికి సవతి కూతురిగా...

కమలహాసన్ రెండో కుమార్తె అక్షరాహాసన్‌కు ఇప్పుడు అవకాశాల మీద అవకాశాలు వచ్చిపడుతున్నట్టున్నాయి. తొలి సినిమా ఇంకా విడుదల కాక ముందే ఆమెను తమ చిత్రాల్లో బుక్ చేసుకోవడానికి దర్శక, నిర్మాతలు ఉత్సాహం చూపుతున్నారు. నిర్మాత బోనీ కపూర్, తన శ్రీమతి శ్రీదేవి నటిస్తున్న తదుపరి చిత్రంలో కీలక పాత్ర కోసం అక్షరను సంప్రతించినట్లు సమాచారం.

వాణిజ్య ప్రకటన చిత్రాలు రూపొందించే రవి ఉదయవర్ నిర్దేశకత్వంలో శ్రీదేవితో ఒక భారీ చిత్రం తీయాలని బోనీ కపూర్ నిర్ణయించుకున్నారట! సవతి తల్లికీ, సవతి కూతురికీ మధ్య సాగే భావోద్వేగభరితమైన కథగా ఈ చిత్రం సాగుతుందట! ఆర్. బల్కి దర్శకత్వంలో ‘షమితాబ్’ ద్వారా హిందీ చిత్రసీమలో కాలుమోపుతున్న అక్షర ఈ తాజా చిత్రంలో సవతి కూతురు పాత్ర పోషిస్తారని సమాచారం.

‘షమితాబ్’లోని కొన్ని సన్నివేశాలను ముందుగానే చూసిన బోనీకపూర్ ఈ కూతురు పాత్రకు అక్షర అతికినట్లు సరిపోతుందని భావించారు. తాజాగా నిర్మించిన ‘తేవర్’ చిత్రం ఆశించినంత విజయం సాధించని నేపథ్యంలో ఇప్పుడీ కొత్త చిత్రానికి బోనీకపూర్ శ్రీకారం చుడుతున్నట్లు సమాచారం.  మొత్తానికి, అక్షర కొద్ది రోజుల్లోనే ప్రముఖుల చిత్రాల్లో స్థానం సంపాదిస్తున్నారన్న మాట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement