మలుపు తిప్పే వివేగం | Vivaham movie is a movie that will turn the actors and technical careers in the film | Sakshi
Sakshi News home page

మలుపు తిప్పే వివేగం

Published Sat, Jul 15 2017 1:22 AM | Last Updated on Tue, Sep 5 2017 4:02 PM

మలుపు తిప్పే వివేగం

మలుపు తిప్పే వివేగం

తమిళసినిమా: వివేగం చిత్రం అందులో నటించిన నటీనటులు, సాంకేతిక వర్గం కేరీర్‌ను మలుపు తిప్పే చిత్రంగా ఉంటుందట. ఇది అన్నది ఎవరో కాదు ఆ చిత్ర దర్శకుడు శివ. అజిత్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం వివేగం. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలింస్‌ సంస్థ భారీఎత్తున్న నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కాజల్‌అగర్వాల్‌ కథానాయకిగా నటిస్తున్న ఇందులో అక్షరహాసన్‌ ముఖ్య భూమికను పోషిస్తున్నారు.

అనిరుథ్‌ సంగీతాన్ని అందిస్తున్న వివేకం చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఆగస్ట్‌ 10న తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది.చిత్రాన్ని సెన్సార్‌కు పంపే పనిలో చిత్ర యూనిట్‌ ఉంది. కాగా ఇందులో అజిత్‌ రిస్కీ సన్నివేశాల్లోనూ డూప్‌ లేకుండా నటించారని ఇప్పటికే ఆ చిత్ర చాయాగ్రహకుడు వెట్రి గొప్పగా చెప్పారు. కాగా వివేగం చిత్రాన్ని అజిత్‌ సహా చిత్ర యూనిట్‌ అంతా చూశారని, అందరూ ఏక కంఠంతో చెప్పిన మాట ఈ చిత్రం తమ కెరీర్‌ను మలుపు తిప్పే చిత్రంగా ఉంటుందనేనని దర్శకుడు శివ అన్నారు. కాగా ఇందులో అనిరుథ్‌ కర్ణాటక సంగీతంతో ఒక పాటకు ప్రయోగం చేశారట. ఆ పాట చిత్రానికి హైలెట్‌ అవుతుందంటున్నాయి చిత్ర వర్గాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement