ధనుష్‌తో కలిసి బాలీవుడ్‌కి | Abhinaya Debuts In Bollywood With Dhanush-Akshara Hassan Film | Sakshi
Sakshi News home page

ధనుష్‌తో కలిసి బాలీవుడ్‌కి

Published Wed, Aug 27 2014 1:49 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

ధనుష్‌తో కలిసి బాలీవుడ్‌కి - Sakshi

ధనుష్‌తో కలిసి బాలీవుడ్‌కి

నటుడు ధనుష్‌తో కలిసి బాలీవుడ్‌కు ఎగబాకారు నటి అభినయ. పేరుకు తగ్గట్టుగానే ఈ ముగ్ధ మనోహరి అభినయంతో అభినందనలందుకుంటోంది. కాకపోతే చిన్న కొరత. ఈమె మూగ, బధిర అయినా వాటిని జీవితానికి బంధకాలుగా ఈ బ్యూటీ భావించలేదు. తన మైనస్‌ను ప్లస్ చేసుకుంటూ నటిగా ఎదుగుతున్నారు. తన లాంటి వారికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. నాడోడిగళ్ చిత్రం ద్వారా నటిగా పరిచయమైన అభినయ తొలి చిత్రంతోనే అందరి హృదయాల్ని దోచుకున్నారు.
 
 అదే చిత్రం రీమేక్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ భామ తాజాగా బాలీవుడ్‌కు ఎగబాకడం విశేషం. బాలీవుడ్‌లో ధనుష్, అమితాబ్ బచ్చన్, అక్షర హాసన్‌లు నటిస్తున్న క్రేజీ చిత్రం షమితాబ్. ఈ చిత్రంలో అభినయ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ విషయం గురించి ఆమె తండ్రి ఆనందవర్మ వెల్లడించారు. అభినయ సెలెక్టెడ్ చిత్రాలనే చేస్తున్నారని చెప్పారు. తాజాగా హిందీలో షమితాబ్ చిత్రంలో చాలా ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తున్నారని చెప్పారు.
 
 ఈ చిత్రం కోసం ఇటీవలే ఈ చిత్రం కోసం కొన్ని రోజులు పని చేశారని తెలిపారు. త్వరలో ప్రారంభం కానున్న తదుపరి షెడ్యూల్‌లో ధనుష్‌తో డ్యూయెట్ పాడటానికి సిద్ధం అవుతున్నట్లు పేర్కొన్నారు. ఈ చిత్రంతోపాటు తమిళంలో విశాల్ చిత్రం పూజై, జయం రవి చిత్రం తనీ ఒరువన్ లోను, పిరవి, మేళతాళం అనే మరో రెండు చిత్రాల్లోనూ నటిస్తున్నట్టు తెలిపారు. జయం రవి చిత్రంలో శాస్త్రవేత్తగాను, విశాల్ పూజై చిత్రంలో ఆయన మామకూతురుగాను నటిస్తున్నట్టు వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement