మరో చిత్రానికి రెడీ! | Ajith is ready for another film | Sakshi
Sakshi News home page

మరో చిత్రానికి రెడీ!

Published Thu, Aug 31 2017 3:03 AM | Last Updated on Sun, Sep 17 2017 6:09 PM

మరో చిత్రానికి రెడీ!

మరో చిత్రానికి రెడీ!

తమిళసినిమా: కోలీవుడ్‌ నటులలో అజిత్‌ రూటే వేరు. ఎవరి గురించి పట్టించుకోరు. వివాదాల జోలికి పోరు. తాననుకున్నది చేసుకుపోయే మనస్తత్వం. తన నిర్మాతల్ని, దర్శకుల్ని తనే ఎంచుకుంటారు. అలా దర్శకుడు శివతో వీరం, వేదాళం, తాజగా వివేగం అంటూ వరుసగా మూడు చిత్రాలు చేశారు. ఈ మూడు చిత్రాలు ప్రేక్షకుల మధ్య విశేష ఆదరణను చూరగొన్నాయి. గత వారం విడుదలైన వివేగం చిత్రం మిశ్రమ స్పందనలతో వసూళ్ల వర్షం కురిపిస్తోంది.

రజనీకాంత్‌ నటించిన కబాలి చిత్ర రికార్డులనే బ్రేక్‌ చేస్తోందంటున్నారు సినీపండితులు. ఈ చిత్రం సాధిస్తున్న వసూళ్లను, ఎదుర్కొంటున్న విమర్శలను వింటూ మౌనం పాటిస్తున్న అజిత్‌ ఇటీవల దర్శకుడు శివను తన ఇంటికి పిలిపించుకుని వివేగం చిత్రానికి సంబంధించిన చాలా విషయాలను చర్చించారట. చిత్రంపై వస్తున్న విమర్శల గురించి కలత వద్దనీ, వాటిని అధిగమించేలా మరో చిత్రం చే ద్దాం అన్నారట. దీంతో  నోట మాట రాక దర్శకుడు శివ కంట ఆనందభా ష్పాలు రాలాయట.

దీని గురించి శివ తెలుపుతూ వివేగం చిత్ర నిర్మాణ సమయంలోనే అజిత్‌కు పలు కథలను చెప్పానని, అందులో తనకు నప్పే కథను అజిత్‌ ఎంచుకునే అవకాశం ఉందని తెలిపారు. అయితే తమ తాజా చిత్రం గురించి అజిత్‌నే వెల్లడిస్తారని శివ పేర్కొన్నారు. కాగా వీరం, వేదా ళం, వివేగం మూడు వేర్వేరు నేపథ్యాల్లో తెరకెక్కిన కథా చిత్రాలుగా విజ యం సాధించిన నేపథ్యంలో ఈ సారి అజిత్, శివ కాంబినేషన్‌లో భారీ ఛారి త్రక కథా చిత్రం రూపొందే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement