![Rajinikanth to begin shooting of Siva film in December 5 - Sakshi](/styles/webp/s3/article_images/2019/11/25/Rajinikanth_0.jpg.webp?itok=d2LWrVnp)
రజనీకాంత్
‘ఇక సెట్స్‌కు వెళ్లడమే మిగిలింది. అంతా రెడీ చేసుకున్నారు’.. ఇదీ రజనీకాంత్ కొత్త సినిమా గురించి కోలీవుడ్‌లో వినిపిస్తున్న మాట. రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో స¯Œ పిక్చర్స్ పతాకంపై ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ వచ్చే నెల 5న మొదలవుతుందట. కథానాయికగా జ్యోతిక, కీర్తీ సురేష్‌ల పేర్లు వినిపించాయి. టైటిల్ ‘వ్యూహం’ అని టాక్. ఈ సినిమాకు డి. ఇమ్మాన్ సంగీతం అందించనున్నారు.
‘దర్బార్’ పాట
రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దర్బార్’. ఇందులో నయనతార కథానాయికగా నటించారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. పోలీసాఫీసర్ ఆదిత్య అరుణాచలం పాత్రలో నటించారు రజనీకాంత్. దాదాపు పాతికేళ్ల తర్వాత ఆయన పోలీసాఫీసర్‌గా నటిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమాలోని ‘చుమ్మక్కళై’ పాటను ఈ నెల 27న విడుదల చేయనున్నారు. ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాటకు వివేక్ లిరిక్స్ అందించారు. ఈ సినిమాకు అనిరు«ద్ రవిచంద్రన్ స్వరకర్త. ‘దర్బార్’ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9న విడుదల కానుందని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment