మీనా.. ఆ సినిమాలో విలనా ! | Veteran actress Meena to star in Rajinikanth Next Movie | Sakshi
Sakshi News home page

మీనా.. ఆ సినిమాలో విలనా !

Published Thu, Dec 5 2019 12:11 AM | Last Updated on Thu, Dec 5 2019 5:02 AM

Veteran actress Meena to star in Rajinikanth Next Movie - Sakshi

రజనీకాంత్, మీనా

రజనీకాంత్, మీనా అనగానే ఠక్కున గుర్తొచ్చే జ్ఞాపకం ‘థిల్లానా థిల్లానా.. నా కసి కళ్ల కూనా’ పాటే. ముత్తు సినిమాలోని ఈ పాట అంత పాపులర్‌. ‘వీరా, యజమాన్, ముత్తు’ సినిమాల్లో రజనీకాంత్‌ సరసన కథానాయికగా నటించారు మీనా. ఇప్పుడు మరోసారి కలసి నటించబోతున్నారని తెలిసింది. అయితే ఈసారి జంటగా కాదని సమాచారం. శివ దర్శకత్వంలో రజనీకాంత్‌ ఓ ఫ్యామిలీ డ్రామా చిత్రం చేయనున్న విషయం తెలిసిందే. సన్‌ పిక్చర్స్‌ ఈ సినిమా నిర్మించనుంది. ఇందులో మీనా కీలక పాత్రలో కనిపిస్తారని తెలిసింది.

విలన్‌ పాత్రలో అని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. రజనీకాంత్‌ సరసన ఖుష్భూ, ఆయన కుమార్తెగా కీర్తీ సురేశ్‌ నటిస్తారన్నది మరో వార్త. ఈ నెల రెండోవారంలో ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది. ఇదిలా ఉంటే ‘ఎంగేయో కేట్ట కురళ్‌’ సినిమాలో రజనీ కుమార్తెగా నటించారు మీనా. అలాగే రజనీ హీరోగా నటించిన ‘అన్బుళ్ల రజనీకాంత్‌’లో బాలనటిగా నటించారు మీనా. అలా బాలనటిగా ఒక హీరో సినిమాలో నటించి, ఆ తర్వాత అతని సరసనే హీరోయిన్‌గా నటించడం అంటే విశేషమే. ఇప్పుడు అదే హీరోకి విలన్‌గా అంటే ఇంకా విశేషం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement