అన్నయ్య రెడీ | Rajinikanth To Resume Shooting Of Siva Film From March 15 | Sakshi
Sakshi News home page

అన్నయ్య రెడీ

Published Fri, Feb 26 2021 1:55 AM | Last Updated on Fri, Feb 26 2021 1:55 AM

Rajinikanth To Resume Shooting Of Siva Film From March 15 - Sakshi

‘అన్నాత్తే’ తిరిగి షూటింగ్‌ను స్టార్ట్‌ చేయబోతున్నాడు. రజనీకాంత్‌ హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘అన్నాత్తే’. పెద్దన్నయ్య అని అర్థం. ఈ చిత్రంలో మీనా, ఖుష్బూ, కీర్తీ సురేష్, నయనతార నటిస్తున్నారు. గత ఏడాది డిసెంబరులో హైదరాబాద్‌లో ‘అన్నాత్తే’ సినిమా షూటింగ్‌ను స్టార్ట్‌ చేశారు. కానీ చిత్రబృందంలో కొందరు కరోనా బారిన పడటంతో సినిమా షూటింగ్‌ ఆగిపోయింది. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించడానికి దర్శకుడు శివ సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్‌లో స్వల్ప అస్వస్థతకు గురయ్యాక, విశ్రాంతిలో ఉన్న రజనీ షూటింగ్‌లో పాల్గొనడానికి రెడీ అయ్యారట. మార్చి 15న చిత్రీకరణ ఆరంభించడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. ఈ షెడ్యూల్‌లోనే రజనీకాంత్‌ కూడా పాల్గొంటారట. ఇప్పటికే షూటింగ్‌ బాగా ఆలస్యమైందని...ఆర్టిస్టుల కాల్షీట్స్‌ ఇబ్బంది లేకుండా సినిమా షూటింగ్‌ను తొందరగా కంప్లీట్‌ చేయాలని భావిస్తున్నారట శివ. నవంబరు 4న ‘అన్నాత్తే’ విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement