Khushbu
-
పార్టీ ఇచ్చిన ఖుష్బూ.. హాజరైన తమిళ స్టార్స్ (ఫోటోలు)
-
కమెడియన్ యోగి బాబు కూతురు పుట్టినరోజు వేడుకలకు కదిలొచ్చిన తమిళ స్టార్స్ (ఫోటోలు)
-
ప్రాణంగా ప్రేమించుకున్న ప్రభు, ఖుష్బూలు విడిపోవడానికి కారణమిదే: నటి
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా వెలుగొందింది ఖుష్బూ. బాలనటిగా ఇండస్ట్రీలో కెరీర్ ఆరంభించిన ఆమె ఆ తర్వాత టాప్ హీరోలందరి సరసన కథానాయికగా నటించింది. 1988లో ధార్మతిన్ తలైవా సినిమాలో బాలనటిగా యాక్ట్ చేసిన ఆమె ఇప్పటివరకు 200కు పైగా సినిమాలు చేసింది. 1991లో వచ్చిన చిన్నతంబి సినిమాలో ప్రభుకు జోడీగా నటించింది ఖుష్బూ. అప్పట్లో ఈ సినిమా బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. ఉత్తమ నటిగా తమిళనాడు స్టేట్ ఫిలింఫేర్ అవార్డు సైతం అందుకుంది. ఇక ఈ సినిమాలో తనతో జోడీ కట్టిన ప్రభుతో ఆమె ప్రేమలో ఉందంటూ జోరుగా ప్రచారం నడిచింది. ఆ ఊహాగానాలను నిజం చేస్తూ 1993 సెప్టెంబర్ 12న వీరి పెళ్లి జరిగింది. పోయిస్ గార్డెన్లో వీరు కొనుక్కున్న ఇంట్లోనే ఈ వివాహం జరిగింది. కానీ ఇదివరకే ప్రభుకు పెళ్లైంది. దీంతో వీరి ప్రేమ పెళ్లిని ప్రభు తండ్రి శివాజీ గణేశన్ సహా అతడి కుటుంబం అంగీకరించలేదు. ఎన్నో గొడవల మధ్య పెళ్లైన నాలుగు నెలలకే ప్రభు, ఖుష్బూ.. ఇద్దరూ విడాకులు తీసుకోక తప్పలేదు. అయితే పెళ్లికి ముందే తనతో నాలుగున్నరేళ్లు సహజీవనం చేశానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది నటి. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రభుకు దూరమవడం ఖుష్బూను మానసికంగా కుంగదీసింది. ఈ వేదన నుంచి బయటపడ్డ అనంతరం ఖుష్బూ 2000 సంవత్సరంలో దర్శకనిర్మాత సుందర్‌ను పెళ్లాడింది. భర్త పేరును తన పేరు చివరన జోడించింది. వీరికి ఇద్దరు కూతుర్లు సంతానం. ఇకపోతే ప్రభు, ఖుష్బూల బంధంపై తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది సీనియర్ నటి కాకినాడ శ్యామల. 'ఖుష్బూ చాలా మంచి అమ్మాయి. ఖుష్బూ, ప్రభు ప్రేమించుకున్నారు. ఒకరంటే ఒకరికి ప్రాణం. కానీ వీరి ప్రేమను ప్రభు భార్య అంగీకరించలేదు. ఈ క్రమంలోనే వారికి గొడవలయ్యాయి. అందుకే ఈ గొడవలన్నీ వద్దని తెగదెంపులు చేసుకున్నారు' అని చెప్పుకొచ్చింది. -
బీజేపీలోని నటీమణులంతా ‘ఐటమ్’లు.. డీఎంకే నేత వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై: బీజేపీ నేతలుగా మారిన పలువురు నటీమణులపై డీఎంకే నేత సాధైయ్ సాధిక్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తమిళనాడు బీజేపీలో ఉన్న సీనియర్ నటీమణులు ఖుష్బు, నమితా, గౌతమి, గాయత్రి రఘురామన్‌లు ‘ఐటమ్’లు అంటూ వ్యాఖ్యానించారు. ఆర్కే నగర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. బీజేపీలో మహిళ నేతలుగా ఉన్న నలుగురు నటీమణులు పెద్ద ఐటమ్లు అంటూ వ్యాఖ్యలు చేశారు. ‘తమిళనాడులో బీజేపీ బలపడుతుందని ఖుష్బూ చెబుతోంది. అమిత్‌షా తలపై వెంట్రుకలైనా మొలుస్తాయోమో కానీ తమిళనాడులో బీజేపీ మాత్రం వికసించదు. డీఎంకేను నాశనం చేసి బీజేపీని బలోపేతం చేసేందుకు వీళ్లు (వేశ్యలు) ఉపయోగపడతారా?. వారి వల్ల కాదు. నా సోదరుడు ఇళయ అరుణ కుష్బుతో ఎన్నోసార్లు కలిశాడు. అంటే నా ఉద్ధేశం ఆమె డీఎంకేలో ఉన్నప్పుడు ఆమెతో దాదాపు ఆరుసార్లు సమావేశాల్లో పాల్గొన్నారు.’ అంటూ విపరీత అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. .@arivalayam functionary Saidai Sadiq's derogatory remarks on women BJP leaders left many in the state's ruling party red-faced. Sadiq's remarks targetting leaders including @khushsundar drew sharp criticism from BJP leaders and others. Watch here : https://t.co/DVbwYrAz6G pic.twitter.com/6NpvZH6Khk — South First (@TheSouthfirst) October 28, 2022 డీఎంకే చేసిన అనుచిత వ్యాఖ్యలను బీజేపీ నాయకురాలు ఖుష్భూ తీవ్రంగా ఖండించారు. ‘పురుషులు స్త్రీలను దుర్భాషలాడటం, అది వారి పెంపకం, వారు పెరిగిన విషపూరిత వాతావరణాన్ని అందరికీ తెలిసేలా చేస్తుంది. ఈ పురుషులు స్త్రీ గర్భాన్ని అవమానిస్తారు. అలాంటి పురుషులు తాము కళైజ్ఞర్ అనుచరులుగా చెప్పుకుంటారు. ఇదేనా సీఎం ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో కొత్త ద్రావిడ నమూనా పాలన’ అంటూ ట్విటర్ వేదికగా సాధిక్ వ్యాఖ్యలను ఎండగడుతూ డీఎంకే మహిళా విభాగం కార్యదర్శి, ఎంపీ కనిమొళిని ట్యాగ్ చేశారు. When men abuse women,it just shows wat kind of upbringing they have had & the toxic environment they were brought up in.These men insult the womb of a woman.Such men call themselves followers of #Kalaignar Is this new Dravidian model under H'ble CM @mkstalin rule?@KanimozhiDMK — KhushbuSundar (@khushsundar) October 27, 2022 దీనిపై స్పందించిన డీఎంకే నేత కనిమొళీ ఖుష్బూకి క్షమాపణలు తెలియజేశారు. మహిళలను కించపరుస్తూ తమ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఓ మనిషిగా, మహిళగా బహిరంగ క్షమాపణ చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేసిన వారు ఎవరైనా, ఏ ప్రాంతం వారైనా, ఏ పార్టీ వారైనా వాటిని సహించలేమన్నారు. తమ నాయకుడు సీఎం స్టాలిన్‌గానీ, పార్టీ అధిష్టానంగానీ ఇలాంటి చర్యలను ఉపేక్షించబోరని స్పష్టం చేశారు. అనంతరం సాధిక్ సైతం తన వ్యాఖ్యలపై క్షమాపణలు కోరారు. ఎవరిని కించపరచడం తమ ఉద్ధేశం కాదని వెల్లడించారు. అయితే బీజేపీ అధిష్టానం చేసిన వ్యాఖ్యలపై మాత్రం ఎవరూ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై.. డీఎంకే మంత్రులను పందులు, జంతువులు అంటూ మాట్లాడారని, . జర్నలిస్టులను కోతులతో పోల్చాడని.. బీజేపీ నేతలు దీనిపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. -
అకస్మాత్తుగా ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నటి.. అదే కారణం..!
సినీ నటి, బీజేపీ మహిళా నేత ఖుష్బూ ఆకస్మాత్తుగా ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. బెడ్‌పై ఉన్న ఓ ఫోటోను ఆమె షేర్ చేశారు. తమిళంతో పాటు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక సంపాదించుకున్న నటి రాజకీయాల్లోనూ కొనసాగుతున్నారు. నటనతో పాటు సీరియల్స్, టీవీ షోలలో హోస్ట్‌గా, డ్యాన్స్ షోలలో న్యాయనిర్ణేతగా ఉంటూ కొన్ని చిత్రాలను కూడా నిర్మిస్తున్నారు. 'వెన్నెముక విపరీతమైన నొప్పి కారణంగా ఆస్పత్రిలో చేరాను. ఒకటి, రెండు రోజులు విశ్రాంతి అవసరం. కోలుకున్నాక మళ్లీ విధుల్లో యథావిధిగా పాల్గొంటాను' అంటూ ఆమె ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా అందరికీ దసరా శుభాకాంక్షలు కూడా తెలిపారు. దీంతో అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. గెట్ వెల్ సూన్ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. కుష్బూ భర్త సుందర్ సి దర్శకత్వంలో 'కాఫీ విత్ కాదల్' అనే చిత్రాన్ని ఆమె నిర్మించారు. ఈ వారం విడుదల కావాల్సిన ఆ చిత్రం పొన్నియన్ సెల్వన్ రాకతో వాయిదా వేసుకున్నారు. Had a procedure for my coccyx bone yesterday. Back home now. Rest for 2 days n then back to work. Sorry for the wishes, once again wishing you all #happydussehra2022 #HappyVijayadashami2022. pic.twitter.com/S8n1SjHEnS — KhushbuSundar (@khushsundar) October 5, 2022 -
గుండెముక్కలైంది.. టాలీవుడ్ ప్రముఖుల సంతాపం
Actress Meena Husband Vidya Sagar Dies Celebrities Condolence: ప్రముఖ నటి, సీనియర్ హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ మరణించారు. పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్న విద్యాసాగర్ చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (జూన్ 28) రాత్రి హఠాత్తుగా కన్నుమూశారు. దీంతో సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. విక్టరీ వెంకటేశ్, మంచు లక్ష్మీ, ఖుష్బూతోపాటు పలువురు సినీ తారలు విద్యాసాగర్ మృతిపట్ల సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. 'విద్యాసాగర్ మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇది చాలా బాధకరం. మీనా, ఆమె కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.' అని వెకంటేశ్ ట్విటర్లో పేర్కొన్నారు. Extremely sad and shocked by the demise of Vidyasagar gaaru! My heartfelt condolences to Meena gaaru and the entire family! Wishing them with all the strength to sail through this! 🙏🏼 — Venkatesh Daggubati (@VenkyMama) June 29, 2022 'మీనా భర్త మరణించారన్న విషాదకరమైన వార్తతో మేల్కొన్నాను. విద్యాసాగర్ కోవిడ్ సమస్యల కారణంగా కన్నుమూశారు. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి' అని లక్ష్మీ మంచు ట్వీట్ చేశారు. Woke up to devastating news of #meena garu’s husband, Vidyasagar garu passed away due to Covid complications. My deepest and heartfelt condolences to the entire family. — Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) June 29, 2022 'చాలా బాధకరమైన వార్తతో మేల్కొన్నాను. మీనా భర్త సాగర్ ఇక మాతో లేడని తెలిసి గుండె ముక్కలైంది. అతను చాలా కాలంగా ఊపిరితిత్తుల సమస్యతో పోరాడుతున్నాడు. విధి చాలా క్రూరమైంది. బాధను వ్యక్తపరిచేందుకు మాటలు సరిపోవు. మీనా కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.' అని ఖుష్బూ తెలిపారు. Waking up to a terrible news.Heartbroken to learn actor Meena's husband, Sagar, is no more with us. He was battling lung ailment for long. Heart goes out to Meena n her young daughter. Life is cruel. At loss of words to express grief. Deepest condolences to the family. #RIP 🙏😭 — KhushbuSundar (@khushsundar) June 29, 2022 'మీనా భర్త విద్యాసాగర్ అకాల మరణ వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. మీనా, ఆమె కుటుంబ సభ్యులకు నా కుటంబం తరఫున ప్రగాఢ సానుభూతి. విద్యాసాగర్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను' అని నటుడు, రాజకీయవేత్త శరత్ కుమార్ తెలిపారు. It is shocking to hear the news of the untimely demise of Actor Meena's husband Vidyasagar, our family's heartfelt condolences to Meena and the near and dear of her family, may his soul rest in peace pic.twitter.com/VHJ58o1cwP — R Sarath Kumar (@realsarathkumar) June 28, 2022 -
సంచరించే ఆత్మ.. జ్వలించే నటన
సోషల్ నెట్ వర్కింగ్ వెబ్సైట్లు ఫేస్బుక్, ట్విట్టర్లలో సెలబ్రిటీల ‘మనసులోని మాట’లు తాజాగా ఇలా...! అయివుంటే కనుక..! ఉత్తర భారతదేశంలోని సిక్కు దేవాలయాల నిర్వహణ బాధ్యత కలిగిన ‘శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ’.. మద్యం మత్తులో గురుద్వారాను సందర్శించినందుకు క్షమాపణ చెప్పాలని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ని డిమాండ్ చేసింది. దేవుడి దయ వల్ల అతడు విశ్వాసం గలిగిన ‘మజాబీ’ సిక్కు గానీ, నిరుపేద హిందువు గానీ కాదు. అయివుంటే కనుక అతడు చేసిన తప్పు జీవితమంతా పశ్చాత్తాపపడినా కూడా క్షమాపణ లభించనంతటిది! – సోనమ్ మహాజన్, యాక్టివిస్ట్ ధన్యవాదాలు ఆయన కోల్‌కతాకు చెందిన ఒక సామాజిక కార్యకర్త. అంబేడ్కర్ జయంతి రోజు ఆయన తన ప్రసంగంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు జరగవల సిన న్యాయం గురించి ప్రస్తావించారు. ఆయన ఆ పని చేసినందుకు ఎంతో సంతోషంగా, వినయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సుశాంత్ కేసులో సి.బి.ఐ., ఎన్. సి.బి., ఇ.డి. మేల్కోవాలి. – చైతాలీ ముఖర్జీ, నేషనలిస్ట్ ఎట్టకేలకు.. చిట్టచివరికి నేను గత నెలన్నరగా ఆమెను వెంటాడు తున్నాను. కనీసం 11 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలతో మాట్లాడాను... చివరికి ఉప ఎన్నికల ఫలితాలకు ఒక రోజు ముందు మాత్రమే మమతా బెనర్జీ ఇంటర్వ్యూ సాధించగలిగాను. – హిమాద్రీ ఘోష్, ‘ది వైర్’ జర్నలిస్ట్ సంచరించే ఆత్మ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ను పార్టీలోకి చేర్చుకునే విషయమై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసంలో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ప్రశాంత్ ఎప్పుడూ ఒక దేహం కోసం సంచరిస్తున్న ఆత్మలా ఉంటారు. అయితే ఆ ఆత్మను కాంగ్రెస్ అనే దేహం ఆవహించాలను కోవడం పార్టీలోని కొంతమంది నాయకులకు రుచించడం లేదు. – అనూప్, బ్లాగర్ జ్వలించే నటన దక్షిణాది సినిమాలు బాలీవుడ్‌ను ఆక్రమిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. అయితే వారి ‘బాహుబలి’ చిత్రాలకు అభిముఖంగా నిలబడి పోటీని ఇవ్వగల ఏకైక నటి బాలీవుడ్లో ఇప్పుడు ఒక్క కంగనా రనౌత్ మాత్రమే. జ్వలించే ఆమె నటన ఎంతో అద్భుతం! ‘ధాకడ్’ టీజర్ రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే కోటి వీక్షణలు రావడం ఆమె నటనలోని సత్తాను చాటే సంగతే. – రాజు జంగిద్, ఎన్.ఎఫ్.టి. క్రియేటర్ కంటికి ఒత్తిడి నెట్‌ఫ్లిక్స్‌లో తాజాగా వచ్చిన ‘మాయి’లో సాక్షీ తన్వార్ అద్భుతంగా నటించారు. అయితే ఈ ఓటీటీ డైరెక్టర్లు కళ్లకు ఒత్తిడి కలిగించే ముదురు వర్ణాలను భావోద్వేగ భరిత సన్నివేశాలకు ఎందుకు అద్దుతారో తెలియదు. – ఖుష్బూ ఎస్., స్క్రీన్ లవర్ సంరక్షక ప్రధాని శ్రీ నరేంద్ర మోదీజీ మన ప్రధానమంత్రి మాత్రమే కాదు. ఈ దేశానికి, పౌరులకు సంరక్షకుని లాంటి వారు. పీఎం మోదీ లేత మనసులతో సంభాషించడానికి ఇష్టపడతారు. వారికి జ్ఞాన మార్గ దర్శనం చేస్తారు. ఆయన ‘పరీక్షా పే చర్చా’.. పరీక్షల ఒత్తిడిని అధిగమించడానికి లక్షలాది మంది విద్యార్ధులకు సహాయ పడుతోంది. – వరుణ్ పూరి, ఎం.ఇ.ఎ. సలహా సభ్యులు -
ఒంటరిగా ఉండటం నచ్చడం లేదు.. షాకింగ్ న్యూస్ చెప్పిన నటి
సినీ పరిశ్రమలో కరోనా కలకలం రేపుతోంది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖలు, అగ్ర హీరోహీరోయిన్లు వరసగా వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌కు చెందిన స్టార్ హీరో మహేశ్ బాబు, లక్ష్మి మంచు, మనోజ్ మంచులు కరోనా పాజిటివ్‌గా రాగా రీసెంట్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ సైతం ఈ మహమ్మారి బారినా పడ్డాడు. అలాగే ఇటీవల అమెరికా వెళ్లోచ్చిన తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ ఇటీవల కరోనా రాగా.. ఈ రోజు సీనియర్ నటి శోభన కూడా కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ప్రకటించింది. తాజాగా మరో సీనియర్ నటికి కూడా కరోనా సోకింది. చదవండి: మరో వివాదంలో హీరో సిద్ధార్థ్, మహిళా కమిషన్ ఎంట్రీ ప్రముఖ నటి, తమిళ బీజేపీ నాయకురాలు ఖుష్బూ సందర్ కరోనా పాజిటివ్ పరీక్షించినట్లు సోషల్ మీడియా వేదిక వెల్లడించింది. ‘మొత్తానికి కరోనా వచ్చేసింది. గత రెండు వేవ్‌ల నుంచి తప్పించుకున్నప్పటికీ ఈసారి కోవిడ్ నన్ను చేరుకుంది. నిన్న సాయంత్రం వరకు ఎలాంటి లక్షణాలు లేని నాకు ఆ తర్వాత ముక్కు కారడం ప్రారంభమైంది. అది ఎక్కువ కావడంతో టెస్ట్ చేయించుకున్న నాకు పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్న.. ఒంటరిగా ఉండటం చాలా కష్టం ఉంది. కానీ తప్పదు. కాబట్టి రాబోయే 5 రోజులు నన్ను ఎంటర్టైన్ చేయండి. అలాగే ఎలాంటి లక్షణాలు ఉన్న పరీక్షించుకోండి’ అంటూ ఖుష్బూ ఫన్నీగా ట్వీట్ చేసింది. చదవండి: మంత్రి పేర్ని నానితో భేటీ సంతృప్తినిచ్చింది: ఆర్జీవీ Ok. finally #Covid catches up with me after dodging last 2 waves. I have just tested positive. Till last eve i was negative. Have a running nose,did a test n Voila! I have isolated myself. Hate being alone. So keep me entertained for the next 5 days. N get tested if any signs 🥰 — KhushbuSundar (@khushsundar) January 10, 2022 -
తగ్గేదే లే అంటూనే తగ్గారు.. ఎందులో తగ్గారో తెలుసా ?
Celebrities Weight Loss Transformation Story: తగ్గేదే లే అంటున్నారు.. కానీ తగ్గారు. మరి.. ఏ విషయంలో తగ్గేదే లే అంటే.. నటనపరంగా తగ్గేదే లే అంటూ విజృంభిస్తున్నారు. ఏ విషయంలో తగ్గారు అంటే.. బరువు తగ్గారు. సినీ సెలబ్రిటీలకు అందంతోపాటు ఫిట్నెస్ కూడా ఎంతో ముఖ్యం. అందుకే వయసు పెరిగినా ఫిట్నెస్ మాత్రం కచ్చితంగా పాటిస్తారు కొందరు సినీ తారలు. అందంగా ఆరోగ్యంగా ఉండటానికి ‘ఫిట్ అండ్ ఫైన్’ అంటున్నారు. సీనియర్ తారలు జయసుధ, ఖుష్బూ, ప్రభు బాగా బరువు తగ్గి కొత్త లుక్‌లోకి మారిపోయారు. ఆ లుక్‌ని ఓ లుక్కేద్దాం. ‘‘నవ్వండి.. ఉచితంగా లభించే మంచి థెరపీ అది’’ అంటున్నారు జయసుధ. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి ఫామ్‌లో ఉన్న ఆమె బరువు తగ్గాక సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేసి, ఈ విధంగా పేర్కొన్నారు. కొన్ని నెలలుగా అమెరికాలో ఉంటున్న ఈ సహజ నటి అక్కడే బరువు తగ్గే పనిలో పడ్డట్లున్నారు. మామూలుగా సినిమా తారలు బరువు తగ్గితే ఏదైనా పాత్ర కోసం అనుకుంటారు. కానీ ఫిట్‌నెస్‌లో భాగంగానే ఆమె తగ్గారు. పైగా బరువు తగ్గే క్రమంలో ఆమె శాకాహారానికి కూడా మారారని తెలుస్తోంది. ఎందుకంటే ‘వీగన్ ఫుడ్ ట్రై చేద్దాం’ అని ట్వీట్ చేశారు. ఇక ఫిట్‌నెస్‌లో భాగంగానే తగ్గిన మరో తార ఖుష్బూ విషయానికొస్తే.. ఆ మధ్య 15 కిలోలు బరువు తగ్గానంటూ ఓ ఫొటో షేర్ చేశారామె. తాజాగా వెయిట్ మిషన్‌పై నిలబడి చూసుకుని, మరో ఐదు కిలోలు తగ్గానోచ్ అన్నారు. అంటే.. మొత్తం 20 కిలోలు తగ్గించేశారు. ఇలా తగ్గడంవల్ల ఆమె ఆరోగ్యం బాగాలేదని కొందరు అనుకున్నారట. ‘‘నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. ఎక్కడ అనారోగ్యానికి గురయ్యానో అని కొందరు ఆందోళన పడ్డారు. నా పట్ల వారికున్న అభిమానానికి ధన్యవాదాలు. అసలు నేనింత ఫిట్‌గా ఎప్పుడూ లేను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా. దాన్ని దృష్టిలో పెట్టుకునే తగ్గాను. ఈ విషయంలో నేను పది మందికి ఆదర్శంగా నిలిస్తే విజయం సాధించినట్లే’’ అన్నారు ఖుష్బూ. ఈ బ్యూటీ కథానాయికగా మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు ప్రభు సరసన కొన్ని సినిమాల్లో నటించారు. 1990లలో ఈ ఇద్దరిదీ ‘హిట్ పెయిర్’. విశేషం ఏంటంటే.. ఇప్పుడు ప్రభు కూడా తగ్గారు. ఖుష్బూలానే ఆయన కూడా 20 కిలోలు వెయిట్ లాస్ అయ్యారు. అయితే ఫిట్‌నెస్‌లో భాగంగా తగ్గలేదు. మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ‘పొన్నియిన్ సెల్వన్’ కోసం తగ్గారని కోలీవుడ్ టాక్. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభు కీలక పాత్ర చేస్తున్నారట. ఈ పాత్రలో స్లిమ్ లుక్‌లో కనిపించాల్సి రావడంతో వెయిట్ తగ్గినట్లు తెలుస్తోంది. క్యారెక్టర్ కోసమో, ఫిట్నెస్ గురించో సీనియర్లు ఇలా తగ్గడం చూసి ‘భేష్.. నటన విషయంలోనే కాదు... తగ్గే విషయంలో కూడా మీరు ఆదర్శమే’ అని కొందరు యువతారలు అంటున్నారు. అభిమానులైతే ఖుషీ అయిపోతున్నారు. -
ఖుష్బూ ట్విటర్ అకౌంట్ మళ్లీ హ్యాక్.. బ్రియాన్‌గా పేరు మార్పు
Khushbu Sundar Twitter Account Hacked: నటి, తమిళనాడు బీజేపీ నాయకురాలు ఖుష్బూ సందర్ ట్విటర్ మరోసారి హ్యాకింగ్‌కు గురైంది. ఈ సారి హ్యాకర్లు ఆమె అకౌంట్ పేరును బ్రియాన్‌గా మార్చారు. అలాగే కవర్ ఫోటోని కూడా మార్చేశారు. గతంలో ఆమె చేసిన ట్వీట్లన్నీ తొలగించారు. గతేడాది ఏప్రిల్‌లోనూ ఆమె అకౌంట్‌ను ఇలాగే ఎవరో హ్యాక్ చేశారు. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తన ఫాలోవర్స్‌కి తెలియజేసింది. గతంలో ఇలా జరిగినప్పుడు ఆమె తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ట్విటర్ అకౌంట్ హ్యాక్ అయినట్లు చెప్పింది. 48 గంటల నుంచీ తాను పాస్వర్డ్ మార్చడానికి ప్రయత్నిస్తున్నా కుదరడం లేదని, సాయం చేయాలని ఫ్యాన్స్‌ను కోరింది. View this post on Instagram A post shared by Kushboo Sundar (@khushsundar) -
మామకు నేను ఇచ్చే టీ ఎంతో నచ్చుతుంది: కుష్బూ
టీ.నగర్: నటి కుష్బూ పట్ల అభిమానం పెంచుకున్న ప్రజలు ఆమెకు ఏకంగా ఆలయం నిర్మించిన విషయం తెలిసిందే. ఆమె పేరుతో విక్రయానికి వచ్చిన ఇడ్లీలు ప్రాచుర్యం పొందాయి. ఇంతటి కీర్తి సాధించిన కుష్బూ తన ఇంట్లో సామాన్య మహిళలా వంటలు చేస్తారా అనే సందేహం ఉంటుంది. దీన్ని నివృత్తి చేస్తూ ఎన్నికల ప్రచారంలో స్వయంగా ఆమె టీ చేసి చూపించారామె. చెన్నై గులాం అబ్బాస్ ఆలీఖాన్ వీధుల్లో ముస్లిం మహిళల మధ్య ఓట్లు అభ్యర్థించారు. ఆ సమయంలో మహిళలు ఆమెకు ఉత్సాహంగా స్వాగతం పలికారు. ఆటోడ్రైవర్ అయిన ముస్తాఫా ఇంట్లో ఉన్న మహిళలు కుష్బూను చూడగానే అక్కా, మా ఇంట్లో ఏమైనా తాగుతారా? అని ప్రశ్నించారు. అందుకు కుష్బూ ‘‘ఏం ఎందుకు తాగను.. ఇవ్వండి’’ అని బదులిచ్చారు. అంతేకాకుండా తానే టీ తయారు చేసి ఇస్తాను రండంటూ వంటగదికి దారితీసింది. అది చిన్న వంటగది కావడంతో మహిళ కాస్త ఇబ్బందిపడింది. అయినా కుష్బూ ఏమాత్రం సంకోచించకుండా వంటగదిలోకి వెళ్లి టీ తయారు చేసింది. వేడివేడిగా టీ తయారు చేసి ఆమె వెంట వెళ్లిన పార్టీ కార్యకర్తలు, విలేకరులు పది మందికి అందించింది. అంతేకాకుండా అక్కడున్న మహిళలు అక్కా టీ సూపర్ అంటూ ప్రశంసించారు. ఇంట్లో ప్రతిరోజు మామ (భర్త)కు తానే టీ తయారుచేసి ఇస్తానని, ఆయనకు ఎంతో నచ్చుతుందని కుష్బూ తెలిపారు. చదవండి: బాధతోనే అలా అన్నా.. క్షమించండి -
కుష్బూపై 50 పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులు
సాక్షి, చెన్నై: ప్రముఖ సనీ నటి కుష్బూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మండిపడుతూ తమిళనాడు దివ్యాంగుల హక్కుల సంఘం ఆమెపై 50 పోలీసు స్టేషన్ల్లో ఫిర్యాదు చేసింది. బుధవారం కుష్భూ కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. పార్టీ మారిన సందర్భంగా ఆమె మీడియాతో సమావేశంలో కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలు ఆమెను వివాదంలోకి నెట్టాయి. కాంగ్రెస్‌కు మేధో వైకల్యం ఏర్పడిందని, ఆ పార్టీ నేతలు మానసిక వికలాంగులంటూ కుష్బూ విమర్శలు గుప్పించారు. ఆమె వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ తమిళనాడు అసోషియేషన్ ఫర్ ద రైట్స్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ కేర్ గివర్స్ అనే దివ్యాంగుల హక్కుల సంఘం మండిపడింది. (చదవండి: బాధతోనే అలా అన్నా.. క్షమించండి) దీనిపై కుష్బూ స్పందిస్తూ.. తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని.. బాధలో రెండు తప్పుడు పదాలను వాడానని క్షమాపణలు కోరుతూ పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, ఎట్టి పరిస్థిల్లోనూ తన క్షమాపణలు అంగీకరించేది లేదని దివ్యాంగుల హక్కుల సంఘం స్పష్టం చేసింది. అంతేగాక కుష్బూపై రాజీలేని పోరాటానికి దిగుతామంటు తమిళనాడులోని 50 పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కుష్బూ చట్టాన్ని అతిక్రమించారని, ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే అంటూ సంఘం డిమాండ్ చేస్తోంది. చట్టప్రకారం కుష్బూ చేసిన వ్యాఖ్యలకు ఆరు నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. (చదవండి: వాళ్లంతా బుర్ర లేనోళ్లు..!) -
బాధతోనే అలా అన్నా.. క్షమించండి
సాక్షి, చెన్నై: కాంగ్రెస్‌ని మానసిక ఎదుగుదల లేని పార్టీ అంటూ చేసిన వ్యాఖ్యలకుగాను బీజేపీ మహిళా నేత, నటి కుష్బు క్షమాపణ కోరారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రెండు పదబంధాలను తప్పుగా వాడినందుకు క్షమించమని కోరడమే కాక ఇది మరలా జరగకుండా చూస్తానని అన్నారు. కుష్బు చేసిన వ్యాఖ్యల పట్ల తమిళనాడులో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయ్యింది. ఆమె మీద ఓ హక్కుల సంస్థ 30 పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేసింది. బీజేపీలో చేరిన అనంతరం ఈ నెల 14 న కుష్బు చెన్నై వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. మానసిక ఎదుగుదల లేని పార్టీ కాంగ్రెస్ అని, ఆ పార్టీ నాయకులకు బుర్ర కూడా తక్కువే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. (చదవండి: వాళ్లంతా బుర్ర లేనోళ్లు..!) ఇక తన ప్రకటనలో కుష్బు ‘ఆ సమయంలో నేను తీవ్ర దుఖం, వేదనలో ఉన్నాను. ఆ తొందరపాటులో రెండు పదబంధాలను తప్పుగా ఉపయోగించినందుకు నేను బాధపడుతున్నారు. నాకు నేనుగా ఎదిగిన వ్యక్తిని. అలాంటిది నేను వేరే వాళ్ల డైరెక్షన్లో.. వారి ఆలోచనల మేరకు మాట్లాడుతున్నాను అనడం అభ్యంతరకరమైనది’ అన్నారు. అంతేకాక ‘నా కుటుంబ సభ్యులు కొందరు మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. నాకు సమర్థులైన, తెలివైన, డైనమిక్, బైపోలార్ డిజార్డర్, డిప్రెషన్‌తో బాధపడుతున్న ఇలా వేర్వేరు రకాల స్నేహితులు ఉన్నారు. వారి స్నేహం, జ్ఞానం నన్ను ధనవంతురాలిని చేసింది’ అన్నారు కుష్బు. -
జస్టిస్ ఫర్ జయరాజ్ అండ్ బెన్నిక్స్
హీరోయిన్ ఒక హత్య చూస్తుంది. కెవ్వున అరుస్తుంది. పోలీసులకు చెప్పడానికి పరుగెడుతుంది. హీరో ఒక హత్య చూస్తాడు. కెవ్వున అరవబోయిన.. హీరోయిన్ నోటిని చేత్తో మూసేస్తాడు. అతడి రియాక్షన్ తర్వాతెప్పుడో ఉంటుంది. అమె స్పందన మాత్రం వెంటనే ఉంటుంది. తమిళ పోలీసుల ‘బ్రూటాలిటీ’ పై ఇప్పుడు హీరోయిన్లే ముందుగా స్పందించారు. ‘జస్టిస్ ఫర్ జయరాజ్ అండ్ బెన్నిక్స్’ అని నినదిస్తున్నారు. స్త్రీలో ఉండే సహజ గుణమే ఇది.. అన్యాయాన్ని ధైర్యంగా ప్రశ్నించడం. ప్రియాంక చోప్రా శాడ్ అండ్ యాంగ్రీ. నేరం ఏదైనా, చనిపోయేంతగా నిందితుల్ని కొట్టడం అమానుషం. ఆ తండ్రీకొడుకుల కుటుంబాల పరిస్థితిని ఊహించలేకపోతున్నాను. మనమంతా వారికి సపోర్ట్‌గా నిలవాలి. వారి తరఫున మాట్లాడాలి. కరీనా కపూర్ ఇంతటి దుర్మార్గాన్ని సహించకూడదు. కాఠిన్యంపై నోరు తెరవడం మన సామాజిక బాధ్యత. మళ్లీ మళ్లీ ఇలాంటివి జరగకుండా పోరాడాలి. బాధితులకు న్యాయం జరిగేవరకు వారికి మద్దతుగా నిలవాలి. ఖష్బూ జయరాజ్ బెనిక్స్‌ల విషయంలో చట్టం తన పని తను చేసుకుపోయి దోషులైన పోలీసులకు శిక్ష విధిస్తుందని మనం ఆశించవచ్చా? వాళ్ల కుటుంబాలకు తీరని నష్టం జరిగింది. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. కాజల్ అగర్వాల్ నా మనసును మెలిపెట్టింది. సిక్ అయ్యాను. దీనిపై మౌనం వహించకూడదు. అందరం మన నిరసనను వినిపించాలి. ఆ తండ్రీకొడుకుల కుటుంబ సభ్యులకు అండగా ఉండాలి. తాప్సీ పన్ను తరచు జరుగుతుండే వాటిలో ఇదొకటి కావచ్చు. కానీ ఈ ఒక్కటీ ఇక ముందు ఇలాంటివి జరక్కుండా ఉండేందుకు దోహదం అవ్వాలి. వాళ్లెవరో తెలియని వారు కావచ్చు. కానీ వారిపై జరిగిన అమానుషం భీతినిగొల్పింది. నరాలను మెలితిప్పింది. హన్సిక వింటేనే భీతిగొల్పుతోంది! పోలీస్ డిపార్ట్‌మెంట్‌కే అవమానం. దేశానికి కూడా. దోషుల్ని ఉపేక్షించకూడదు. వారిని చట్టం ముందు నిలబెట్టి తీరాలి. జెనీలియా నిశ్చేష్టురాలిని అయ్యాను. ఆ ఘటన గురించి విని నా మనసు గాయపడింది. ఇలాంటిది జరగవలసింది కాదు. గుండె పగిలిపోయింది. ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. రకుల్ ప్రీత్‌సింగ్ గుండె బద్ధలైపోయింది. మనసు చెడిపోయింది. ఈ క్రూరత్వం అమానుషమైనది. కడుపులో తిప్పేసింది. వారి కుటుంబ సభ్యులకు తట్టుకునే శక్తిని ఆ భగవంతుడు ఇవ్వాలి. ‘సింగం’ వన్, టు, త్రీ.. సినిమాల డైరెక్టర్ హరి గోపాలకృష్ణన్ ‘డీప్ షాక్’లో ఉన్నారు. పోలీసుల్ని తనెంతో ఉన్నతంగా, గొప్పగా చూపించాడు! కానీ అందుకు విరుద్ధంగా జరిగింది. తమిళనాడులో ఇద్దరు తండ్రీకొడుకులు పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురై మరణించిన ఘటనను డైరెక్టర్ హరి మరచిపోలేకపోతున్నారు. పోలీసులను హీరోలుగా చూపించినందుకు ప్రాయశ్చిత్తంగా ఇక ఆయన సింగమ్ 4ను తీయాలన్న తన ప్రయత్నాలను విరమించుకోవచ్చనే అనిపిస్తోంది. అయితే ‘సింగమ్’ సిరీస్ హీరో సూర్య ఇంతవరకు ఆ తండ్రీకొడుకుల కస్టడీ డెత్‌పై నేరుగా ఏమీ వ్యాఖ్యానించలేదు! బహుశా ఇవాళో, రేపో ఏమైనా ఖండన వంటిదేమైనా ట్వీట్ చేస్తారేమో. వాస్తవానికి ఇప్పటికే ఆయన ఒక ‘పోలీస్ హీరో’గా తన అభిప్రాయాన్ని వెల్లడించవలసింది. ఆయన ఒక్కరనే కాదు, మిగతా స్టార్ హీరోలు కూడా! ఘటన జరిగి నేటికి వారం. చప్పుడు లేదు. ఉండవలసినంత లేదు. యు.ఎస్.లో గత నెల జార్జి ఫ్లాయిడ్ ఏ విధంగానైతే ఒక పోలీసు చేతిలో చనిపోయాడో.. అదే విధంగా తమిళనాడు, తూత్తుకుడి సమీపంలోని శంతన్కుళంలో తండ్రి జయరాజ్ (58), కొడుకు బెన్నిక్స్ పోలీస్ కస్టడీలో చనిపోయారు. లాక్డౌన్ పని వేళల ఆంక్షల్ని ఉల్లంఘించి తమ సెల్‌ఫోన్ దుకాణాన్ని నడుపుతున్నారన్న ఆరోపణపై ఈ నెల 19 ఆ తండ్రీకొడుకులను పోలీస్‌లు ఆరెస్ట్ చేసి తీసుకెళ్లారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. తీవ్ర రక్తస్రావంతో జూన్ 22 సాయంత్రం కొడుకు, 23 ఉదయం తండ్రి చనిపోయారు. ఏడు రోజులైంది. మానవ హక్కుల సంఘాల వాళ్లింకా పూర్తిగా బయటికి రాలేదు! తమిళ ప్రముఖులెవరూ ఖండనలు ఇవ్వలేదు! హర్హా భోగ్లే, శిఖర్ ధావన్, రితేశ్ దేశ్‌ముఖ్, రాజ్‌దీప్ సర్దేశాయ్, హీరో విశాల్, రాహుల్ గాంధీ, జయం రవి, జీవా.. మరి కొందరు మాత్రం పోలీసుల ‘బ్రూటల్ యాక్ట్’ తమను నిర్ఘాంతపరిచిందని సోషల్ మీడియాలో తమ ఆగ్రహాన్ని, ఆందోళనను వ్యక్తం చేశారు. తమిళనాడు సీయం స్పందించి, కేసును సీబీఐకి అప్పగించేందుకు అనుమతి ఇవ్వాలని మద్రాసు హైకోర్టును కోరబోతున్నట్లు ఆదివారం ప్రకటించారు. అందరికంటే ముందుగా, ఎక్కువగా బాలీవుడ్ నటీమణులు ఈ ఘటనపై మాట్లాడ్డం, న్యాయం జరగాలని కోరడం, పోలీసుల దౌర్జన్యానికి నిరసన తెలియజేయడం విశేషం. మునుపెన్నడూ ఇంతమంది హీరోయిలు ఇలా బయటికి వచ్చి మాట్లాడిన సందర్భం లేదు. ‘జస్టిస్ ఫర్ జయరాజ్ అండ్ బెన్నీ’ అంటూ ప్రియాంకా చోప్రా లాజ్ ఏంజెలిస్ నుంచి ట్వీట్ చేశాక.. సింగర్ సుచిత్ర.. పోలీసుల రాక్షసత్వం పై ఒక వీడియోను విడుదల చేశారు. అందులో ఆ తండ్రీ కొడుకులను ఎలా చిత్రహింసలు పెట్టి చంపిందీ తమిళ్లో, ఇంగ్లిష్‌లో వివరించారు. ఇంకా.. హన్సిక, ఖుష్బూ, ఐశ్వర్యా రాజేశ్, వరలక్ష్మీ శరత్‌కుమార్, పరిణీతి చోప్రా, ఈషా రెబ్బా, రమ్యా సుబ్రహ్మణ్యన్, తమన్నా భాటియా, కైరా అద్వానీ, రకుల్ ప్రీత్ సింగ్, జెనీలియా, కాజల్ అగర్వాల్, తాప్సీ, కరీనా కపూర్.. ఆ ఘటన తమను ఎంతగానో నిర్ఘాంత పరిచిందని సోషల్ మీడియాలో వెల్లడించారు. మౌనంగా ఉండటం సేఫ్ అనే భావన సాధారణంగా సెలబ్రిటీలలో ఉంటుంది. ఏమాట అంటే ఎటుపోయి వస్తుందోనన్న భయం కూడా ఉంటుంది. వీళ్లేం చేశారో, వాళ్లకెందుకు అంత కోపం వచ్చిందో అని ఆలోచించేవారూ ఉంటారు. అయితే హీరోయిన్లు అలా అనుకోవడం లేదు. నిజమైన హీరోల్లా తమ కోపాన్ని, తమ ఆవేదనను, తమ మనసులోని మాటను ధైర్యంగా బయటికి చెబుతున్నారు. -
నిందితులు తప్పించుకోలేరు : ఖుష్బూ
చెన్నై : పోలసుల కస్టడీలో తండ్రీ కుమారుడు ఒకరి తర్వాత మరొకరు మరణించడం రాష్ర్టవ్యాప్తంగా వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. పలువురు సెలబ్రిటీలు సైతం ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ డిమాండ్ చేశారు. ఆలస్యం జరగకుండా దోషులకు త్వరగా శిక్షపడేలా అందరం కలిసికట్టుగా పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు. ఒక కుటుంబం వారి అత్యంత ఆప్తులను కోల్పోయారు. జస్టిస్ ఫర్ జయరాజ్, ఫినిక్స్ అంటూ ట్వీట్ చేశారు. ఈ ఘటనను అమానవీయ చర్యగా పేర్కొంటూ చట్టానికి ఎవరూ అతీతులు కారని నటుడు జయం రవి పేర్కొన్నారు. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్, సింగర్ సుచిత్ర సహా పలువురు ప్రముఖులు సత్వరమే న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. గత కొన్ని రోజులుగా జస్టిస్ ఫర్ జయరాజ్ అండ్ ఫినిక్స్ అనే హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండింగ్‌లో ఉంది. (‘సెల్’ కోసమే దాష్టీకమా? ) Will we and can we see law taking its course and punishing the guilty without any further delay in #Jeyaraj and #Fenix case? The culprits cannot and should not get away. A family has lost their most loved ones. Justice delayed is justice denied. #JusticeForJeyarajAndFenix — KhushbuSundar ❤️ (@khushsundar) June 26, 2020 తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టి సమీపంలోని సాత్తాన్ కులంకు చెందిన జయరాజ్(63), కుమారుడు ఫినిక్స్(31) జ్యుడీషియల్ కస్టడిలో ఒకరి తర్వాత మరొకరు మరణించడం రాష్ట్రంలో కలకలం రేపిన విషయం తెలిసిందే. తాము ఆడిన సెల్ఫోన్లను ఇవ్వలేదన్న ఆగ్రహంతో కక్ష కట్టి జయరాజ్, ఫినిక్స్‌లపై పోలీసులు దాష్టీకాన్ని ప్రదర్శించినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రత్యక్ష సాక్షులు గురువారం మీడియా ముందుకు వచ్చిన ఐదు రోజుల క్రితం ఏమి జరిగిందో వివరించారు. ఇక, పోస్టుమార్టం అనంతరం మృతదేహాల్ని కుటుంబీకులకు అప్పగించారు. సాత్తాన్ కులం వివాదం నేపథ్యంలో అన్ని జిల్లాల ఎస్పీలు, ఐజీ, డీఐజీలకు డీజీపీ త్రిపాఠి ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. (డెత్ వార్ ) ఏదేని కీలక కేసులు ఇకమీద పోలీసుల స్టేషన్లలో విచారించేందుకు వీలు లేదని స్పష్టం చేశారు. డీఎస్పీ లేదా, డీఐజీ కార్యాలయాల్లో విచారణల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కాగా, సాత్తాన్ కులం లాకప్‌డెత్‌కు నిరసగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా దుకాణాల బంద్‌కు వర్తక లోకం పిలుపునిచ్చింది. యజమానాలు నల్ల బ్యాడ్జీలు ధరించి తమ దుకాణాల ఎదుట నిరసన చేపట్టారు. Please share & tag fwd so non-tamil-speaking people can understand what happened #JusticeforJayarajAndFenix @bhakisundar @ahmedmeeranoffl pic.twitter.com/nZ7klPzpsO — suchi_mirchi (@suchislife2019) June 25, 2020 -
ఆడియో టేప్ లీక్: ఖుష్బూ క్షమాపణ
నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ వివాదంలో ఇరుక్కుంది. టీవీ సీరియళ్ల షూటింగ్స్ తిరిగి ప్రారంభించడంపై నిర్మాతల వాట్సాప్ గ్రూపులో ఆమె మాట్లాడిన ఆడియో టేప్ బయటకు లీకైంది. ఇందులో "జర్నలిస్టులకు ఇప్పుడు కోవిడ్ తప్ప ఏ వార్తలూ లేవు. షూటింగ్స్ త్వరలో తిరిగి ప్రారంభం అవుతున్నందున వారు ఫొటోలు, వీడియోల కోసం వెంటపడుతారు. కానీ, అస్సలు ఇవ్వకండి. సొంతంగా కథలు అల్లుతూ మనల్ని చీల్చి చెండాడేందుకు వాళ్లు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి" అని పేర్కొంది. ఖుష్బూ వ్యాఖ్యలపై పాత్రికేయ వర్గాలు పెద్ద ఎత్తున మండిపడ్డాయి. దీంతో ఆమె ట్విటర్ వేదికగా స్పందిస్తూ తన వాయిస్‌ను కొంత ఎడిట్ చేశారని తెలిపింది. (నటి కుష్బూ డాక్టరయ్యారు! ) "నిర్మాతల గ్రూప్‌లో నుంచి ఒకరు దాన్ని కావాలనే లీక్ చేశారు. ఇలాంటి వ్యక్తుల మధ్య ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను. జర్నలిస్టులను అగౌరవపర్చడం నా ఉద్దేశ్యం కాదు. కేవలం స్నేహితుల దగ్గర ఎలా మాట్లాడతామో అలాగే మాట్లాడాను. నాకు ప్రెస్ పట్ల ఎంత గౌరవం ఉందన్న విషయం పాత్రికేయులందరికీ తెలుసు. 34 ఏళ్ల సినీ జీవితంలో ఒక్కసారి కూడా వాళ్లను కించపరుస్తూ మాట్లాడలేదు. ఒకవేళ ఎవరినైనా బాధపెట్టుంటే వారికి నా హృదయపూర్వక క్షమాపణలు" అంటూ పేర్కొంది. ఇక ఆడియో క్లిప్ లీక్ చేసిన నిర్మాత ఎవరో తనకు తెలుసని ఖుష్బూ వ్యాఖ్యానించింది. తన మౌనం, క్షమాగుణమే అతనికి పెద్ద శిక్ష అని పేర్కొంది. (వైరస్ బారిన వారియర్స్) -
ఆ చెత్తంతా ఆపండి.. ఖుష్బూ ఫైర్!
గోమూత్రం, పేడ కరోనా వైరస్‌కు మందంటూ చేస్తున్న ప్రచారంపై సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు ఖుష్బూ మండిపడ్డారు. ఆదివారం ట్విటర్ వేదికగా ఆమె స్పందిస్తూ.. ‘‘ గుడ్డివాళ్లు ఇకనైనా మేల్కొంటారా? గోమూత్రం అన్ని రోగాలను నయం చేస్తుందన్న చెత్త ప్రచారాన్ని ఆపండి. మీరు ప్రజల జీవితాలను ప్రమాదంలో పడేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాలకు సంబంధించిన విషయాల్లో మతాలను, కాషాయ రంగును ప్రవేశపెట్టొద్దు. చదువుకోని పేదలను తప్పుదోవ పట్టించొద్దు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, కోవిడ్‌ను నివారించే శక్తి కేవలం గో మూత్రం, పేడకు మాత్రమే ఉందంటూ హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహారాజ్ అఖిల హిందూ మహాసభ అధ్వర్యంలో గోమూత్ర పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ పార్టీకి దేశ నలుమూలల నుంచి దాదాపు 200మందికి పైగా అతిథులుగా హాజరవ్వడం గమనార్హం. ( కరోనా ఎఫెక్ట్: గో మూత్రంతో విందు ) Can the blind pls wake up? STOP THIS NONSENSE THAT COW URINE WILL CURE ANY AILMENT. You are putting people lives at risk. PLS DO NOT INVOLVE ANY RELIGIOUS LINKINGS OR ADD ANY SAFFRON COLOR TO HEALTH RELATED ISSUES. LETS NOT MISLEAD THE POOR UNEDUCATED FOR WORSE. https://t.co/RrORhatd3s — KhushbuSundar ❤️ (@khushsundar) March 15, 2020 -
పెద్దన్నయ్య
రజనీకాంత్ సినిమాలంటే ఆ ఎనర్జీయే వేరు. ఆయన సినిమా ప్రకటించినప్పటి నుంచే హంగామా మొదలవుతుంది. ఇక టైటిల్ ప్రకటన తర్వాత ఆ హంగామా రెండింతలవుతుంది. ప్రస్తుతం శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారాయన. ఈ సినిమాకు ‘అన్నాత్తే’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు సోమవారం ప్రకటించారు. ‘అన్నాత్తే’ అంటే పెద్దన్నయ్య అని అర్థం. ఇందులో ఖుష్భూ, మీనా, నయనతార, కీర్తీ సురేశ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో రజనీ కుమార్తె పాత్రలో కీర్తీ సురేశ్ నటిస్తున్నారు. నయనతార విలన్‌గా కనిపిస్తారని టాక్. ఈ సినిమాను ఈ ఏడాది దసరాకు విడుదల చేయాలనుకుంటున్నారు. -
కొబ్బరికాయ కొట్టారు
కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టారు రజనీకాంత్. శివ దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో రజనీ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. మీనా, ఖుష్బూ కీలక పాత్రల్లో నటించనున్నారు. కీర్తీ సురేశ్ హీరోయిన్గా నటించనున్నారు. ఈ సినిమా ముహూర్తం బుధవారం జరిగింది. 28 ఏళ్ల తర్వాత రజనీకాంత్ సినిమాలో ఖుష్బూ నటించనుండటం విశేషం. అలాగే ఖుష్భూ తమిళ సినిమాలో కనిపించి దాదాపు పదేళ్లు కావస్తోంది. ఈ నెల రెండోవారంలో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందని సమాచారం. -
మీనా.. ఆ సినిమాలో విలనా !
రజనీకాంత్, మీనా అనగానే ఠక్కున గుర్తొచ్చే జ్ఞాపకం ‘థిల్లానా థిల్లానా.. నా కసి కళ్ల కూనా’ పాటే. ముత్తు సినిమాలోని ఈ పాట అంత పాపులర్. ‘వీరా, యజమాన్, ముత్తు’ సినిమాల్లో రజనీకాంత్ సరసన కథానాయికగా నటించారు మీనా. ఇప్పుడు మరోసారి కలసి నటించబోతున్నారని తెలిసింది. అయితే ఈసారి జంటగా కాదని సమాచారం. శివ దర్శకత్వంలో రజనీకాంత్ ఓ ఫ్యామిలీ డ్రామా చిత్రం చేయనున్న విషయం తెలిసిందే. సన్ పిక్చర్స్ ఈ సినిమా నిర్మించనుంది. ఇందులో మీనా కీలక పాత్రలో కనిపిస్తారని తెలిసింది. విలన్ పాత్రలో అని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. రజనీకాంత్ సరసన ఖుష్భూ, ఆయన కుమార్తెగా కీర్తీ సురేశ్ నటిస్తారన్నది మరో వార్త. ఈ నెల రెండోవారంలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇదిలా ఉంటే ‘ఎంగేయో కేట్ట కురళ్’ సినిమాలో రజనీ కుమార్తెగా నటించారు మీనా. అలాగే రజనీ హీరోగా నటించిన ‘అన్బుళ్ల రజనీకాంత్’లో బాలనటిగా నటించారు మీనా. అలా బాలనటిగా ఒక హీరో సినిమాలో నటించి, ఆ తర్వాత అతని సరసనే హీరోయిన్గా నటించడం అంటే విశేషమే. ఇప్పుడు అదే హీరోకి విలన్‌గా అంటే ఇంకా విశేషం. -
కారు బేజారైంది.. సినీ నటి ఖుష్భూ
సాక్షి, స్టేషన్ మహబూబ్‌నగర్: కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, సినీ నటి ఖుష్భూ ఉమ్మడి జిల్లాలోని పలు చోట్ల జరిగిన రోడ్డు షోల్లో పాల్గొన్నారు. మహబూబ్‌నగర్, గద్వాల, దేవరకద్రలో మహాకూటమి అభ్యర్థులు ఎర్ర శేఖర్, డీకే.అరుణ, డోకూరు పవన్‌కుమార్‌రెడ్డికి మద్దతుగా నిర్వహించిన రోడ్డు షోతో పాటు ప్రచారంలో పాల్గొని ఈసారి టీఆర్ఎస్ను ఓడిగించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో మహిళా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ప్రముఖ సినీనటి, ఏఐసీసీ అధికార ప్రతినిధి ఖుష్భూ విమర్శించారు. మహబూబ్‌నగర్ డీసీసీ కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. అంతకుముందు ఆమె మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో మహాకూటమి అభ్యర్థి ఎర్ర శేఖర్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో కారు బేజారైందని, కారులో కేవలం ఐదుగురికి స్థానం ఉందన్నారు. కేసీఆర్, కేటీఆర్, సంతోష్‌రావు, కవిత, హరీశ్‌రావుకే సరిపోయిందన్నారు. డిక్కీలో ఎక్కుదామన్నా అందులో డబ్బులు నింపుకున్నారు.. సామాన్య ప్రజలు, పేదలకు కారులో స్థానం లేదని, కేవలం సోనియా గాంధీ సారధ్యంలో కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టంచేశారు. మహిళా సంక్షేమాన్ని విస్మరించిన కేసీఆర్ మహిళా మంత్రిలేని కేబినెట్ టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని, మహిళా కమిషన్‌ను సైతం ఏర్పాటు చేయలేదని ఖుస్భూ విమర్శించారు. కవితకు ఎక్కడ ప్రాధాన్యం తగ్గుతుందోమోనని మహిళా మంత్రిని కేబినెట్లోకి తీసుకోలేదా? అని ఆమె ప్రశ్నించారు. మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచార సంఘటనల్లో దక్షిణ భారతంలో తెలంగాణ రెండోస్థానంలో ఉండటం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో మహిళా సంక్షేమం కేవలం మాటలకే పరిమితమైందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 2 కోట్ల మంది మహిళలు ఉన్నారని, వారి సంక్షేమానికి ఎలాంటి పథకాలు అమలుచేయలేదని ఆరోపించారు. ఆస్పత్రుల్లో మహిళల వైద్యసౌకర్యాలు సరిగ్గా లేవని, మెటిర్నిటీ వైద్యం అస్తవ్యస్తంగా తయారైందని అన్నారు. ఇక సెక్రటేరియట్‌కు వెళ్లని ఏకైక సీఎం దేశంలో కేసీఆర్ అని ఖుష్బు మండిపడ్డారు. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలోనే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలయ్యాయని గుర్తుచేశారు. అప్పటి పథకాలకు పేర్లు మార్చి కొనసాగించారని అన్నారు. అప్పుల తెలంగాణగా మార్చారు.. గత ప్రభుత్వ హయాంలో రూ.17వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చిందని ఖుష్బూ ఆరోపించారు. దాదాపు రూ.2.20 లక్షల కోట్ల అప్పు ఉందని, ఈ నిధులు ఎక్కడికి వెళ్లాయని ప్రశ్నించారు. రేషన్ దుకాణాల్లో 9 నిత్యావసర వస్తువులను ఉచితంగా సరఫరా చేస్తామని చెప్పి దానిని మరిచారన్నారు. మహిళా సంఘాలు కూడా నిర్వీర్యం అయ్యాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అన్నివర్గాల సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. కూటమి అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం ఖుష్బూ సమక్షంలో పలువురు ఇతర పార్టీలవారు కాంగ్రెస్‌లో చేరారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి ఎన్పీ వెంకటేశ్, టీజేఎస్ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బెక్కరి అనిత, నేతలు రవికిషన్‌రెడ్డి, సంజీవ్ ముదిరాజ్, చంద్రకుమార్‌గౌడ్, రంగారావు, ఎండి.షౌకత్‌అలీ, మహ్మద్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. -
‘కారు.. వాళ్లకు మాత్రమే సరిపోతుంది’
సాక్షి, మహబూబ్‌నగర్ : టీఆర్ఎస్ పార్టీ గుర్తు(కారు) కేవలం వారి కుటుంబ సభ్యులు కూర్చోవడానికి మాత్రమే సరిపోతుందని ఏఐసీసీ అధికార ప్రతినిధి, స్టార్ క్యాంపెయినర్ ఖుష్బూ ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్‌నగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా... ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివిధ పథకాలలో కమిషన్లు తినడంలో ప్రమేయం ఉందని ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో ఆయనకు 6% శాతం కమిషన్లు అందుతున్నాయని పేర్కొన్నారు. అదే విధంగా తన సొంత ప్రచారాల కోసం ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్న ఘనత కూడా కేసీఆర్‌కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. విద్యావ్యవస్థ కుంటుపడింది.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేసీఆర్ విఫలమయ్యారని ఖుష్బూ విమర్శించారు. టీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో విద్యా వ్యవస్థ పూర్తిగా కుంటుపడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 90 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఇంతవరకు సెక్రటేరియట్‌కు వెళ్లని ఏకైక సీఎం కేసీఆర్ ఒక్కరేనని ఎద్దేవా చేశారు. తెలంగాణలో మహిళలకు రక్షణ కరువైందని, మహిళకు టీఆర్ఎస్ వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. క్యాబినెట్లో మహిళలకు అవకాశం కల్పించకపోవడం ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. -
4న నటి కుష్బూకు శస్త్ర చికిత్స
చెన్నై: నటి, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రచార కర్త కుష్బూకు నవంబర్ 4వ తేదీన వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించనున్నారు. ఆమె ఇటీవల ఇంట్లో కాలు జారి పడడంతో మోకాలికి గాయం అయింది. దీంతో కుష్బూ కాలుకు శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు తెలిపినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని నటి కుష్బూ కొట్టిపారేశారు. తనకు వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించాలన్నది నిజమే కానీ, కాలికి కాదనీ, మోకాలు నొప్పి నెల రోజులుగా ఉన్నందుకు వైద్యులు కట్డు కట్టారన్నారు. తనకు కడుపులో ఏర్పడ్డ చిన్న గడ్డను తొలగించడానికి శస్త్ర చికిత్స అవసరం అవుతుందని వైద్యులు తెలిపారన్నారు. అందుకు వచ్చే నెల 4వ తేదీన శస్త్ర చికిత్స చేయించుకునే అవకాశం ఉందని కుష్బూ తెలిపారు. కాగా ఇందిరాగాంధీ శతాబ్దిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో వచ్చే నెల 4, 8, 17వ తేదీల్లో నటి కుష్బూ పార్టీ సమావేశాల్లో పాల్గొనాల్సి ఉంది. ఈ క్రమంలో 4న తనకు శస్త్ర చికిత్స జరిగితే పార్టీ సమావేశాల్లో పాల్గొనలేనని ఆమె పార్టీ ఆధిష్టానానికి లేఖ రాశారట. Ok friends..2 mny news abt me bng hospitalised..i nd 2 undergo a surgery n tat is slated 4 the 4th..wl b rested 4 2wks..thanks 4 d concern 😊 — khushbusundar (@khushsundar) October 29, 2017 -
రజనీ రాజకీయ ప్రవేశంపై ట్విట్టర్ వార్!
చెన్నై: ట్విట్టర్లో కుష్బు, తమిళి సై మధ్య మాటల తూటాలు పేలాయి. పరస్పరం విమర్శలతో ఎవరికి వారే అన్నట్టుగా ఇద్దరూ చాటింగ్‌తో రచ్చకెక్కారు. గురువారం ఇద్దరు మహిళా నేతల మధ్య ఏకంగా కొంతసేపు ట్విట్టర్లో వ్యాఖ్యల తూటాలు పేలడం చర్చకు దారి తీసింది. ఆ ఇద్దరిలో ఒకరు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, నటి కుష్బు, మరొకరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై. ట్విట్టర్ వార్ : రజనీకాంత్ రాజకీయ ప్రవేశం చర్చ ఈ ఇద్దరు మహిళా నేతల మధ్య ట్విట్టర్‌వార్ నడిచింది. రజనీకాంత్ బీజేపీ వైపుగా రావాలని తమిళి సై చేసిన ట్విట్లో కుష్బు వ్యంగ్యాస్త్రంతో కూడిన కామెంట్ చేయడంతో వివాదానికి దారి తీసింది. ఇలా, బ్రతిమలాడి పార్టీలోకి ఆహ్వానించడం కాదు అని, సిద్ధాంతాలకు ఆకర్షితులై రావాలని సూచిస్తూ, ఈ ట్విట్ భిక్షాటనతో సమానం అన్నట్టుగా కుష్బు స్పందించడం తమిళిసైకు ఆగ్రహం కలిగించింది. ఇందుకు ఆమె సమాధానమిస్తూ, ప్రస్తుతం తమరికి ఎదురవుతున్న సమస్యలు నాకు తెలుసు అని, సిద్ధాంతాల ఆకర్షణ అంటే, వేరే పార్టీలో చేరడమా, లేదా జంప్ జిలానీనా అని ప్రశ్నించారు. ఇందుకు కుష్బు సమాధానమిస్తూ, తమరి మనసులో ఇలాంటి ఉద్దేశం ఉందా తనకు తెలియదంటూ, తనకు నచ్చిన పార్టీ కాంగ్రెస్ అని వ్యాఖ్యలు చేశారు. తనను ఎవ్వరూ కాంగ్రెస్‌లో చేరాలని ఆహ్వానించలేదు, దూతల్ని పంపించలేదంటూ వ్యంగ్యాస్త్రం సందించారు. దీంతో తమిళి సై మరింత దూకుడు పెంచి, డీఎంకే నుంచి తమరిని గెంటేశారుగా అని ట్విట్ చేయడం కుష్బులో మరింత ఆగ్రహం రేపింది. తమరు తనకు పీఆర్వోనా, అసిస్టెంటా? అని ప్రశ్నిస్తే ఏ కారణంతో తాను డీఎంకే నుంచి బయటకు వచ్చానో తెలుసా?, తన గురించి తమరికి ఏమి తెలుసు పెద్దరికంతో వ్యవహరిస్తే బాగుంటుందని, తమరేమైనా మానసిక వైద్యులా అని ప్రశ్నిస్తూ.. తమిళి సైకు కుష్బు చురకలు అంటించారు. ఇందుకు తమిళి సై ట్విట్ చేస్తూ, తాను డాక్టర్నే, ఇతరుల మెదడు స్కాన్ చేసే సత్తా ఉందని సమాధానం ఇచ్చారు. చురకలు అంటించిన సామన్యుడు.. సెకండ్ గ్యాప్‌లో ఈ ట్వీట్ వార్‌ను ఆసక్తిగా పరిశీలిస్తూ వచ్చిన ఓ వ్యక్తి ట్వీట్‌తో ఆ ఇద్దరికి చురకలు అంటించే కామెంట్ పెట్టడం గమనార్హం. 2014లో కుష్బు డీఎంకే నుంచి బయటకు వచ్చారని, అప్పుడు ఆమెను తమ వైపు రావాలని బీజేపీ తరఫున తమిళి సై కూడా ఆహ్వానించిన్నట్టుందేనని కామెంట్ చేశాడు. అప్పుడు ఇలా వార్ సాగ లేదే అని చురకలు అంటించడంతో, సీనియర్ నేతగా, మహిళా నాయకురాలిగా ఉన్న తమిళి సైకు తాను గౌరవం ఇస్తున్నట్టు ట్విట్టర్‌ను కుష్బు సైన్ అవుట్ చేశారు. ఇక, ఈ యుద్ధం కాస్త మీడియాలోకి ఎక్కడంతో వేదికల మీదే కాదు, ట్విట్టర్లోనూ తాము ఏ మాత్రం తగ్గమని ఇద్దరు మహిళా నేతలు నిరూపించుకోవడం గమనార్హం. -
హైకోర్టును ఆశ్రయించిన నటి
పెరంబూర్: విదేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వాల్సిందిగా నటి, కాంగ్రెస్ నాయకురాలు కుష్బూ శుక్రవారం మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు విదేశాలకు వెళుతున్నానని మదురై బెంచ్‌కు విన్నవించుకున్నారు. తన ప్రయాణానికి అనుమతి తెలపాలని విజ్ఞప్తి చేశారు. విదేశాలకు వెళ్లే ముందు ఏ దేశానికి వెళ్లుతున్నారు, ఎక్కడ బస చేస్తారు లాంటి వివరాలను తమకు తెలియజేయాలని న్యాయస్థానం ఆదేశించిండంతో ఆమె కోర్టు అనుమతి కోరారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఈనెల 24 నుంచి మే నెల 14వ తేదీ వరకు ఫ్రాన్స్, స్పెయిన్ దేశాలకు విహారయాత్రకు వెళ్లనున్నట్లు కోర్టుకు తెలిపారు. దీనిపై న్యాయస్థానం త్వరలో నిర్ణయం వెలువరించనుంది. తమిళనాడులో 2011 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించారన్న ఆరోపణలతో కుష్బూపై ఆండిపట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో ఉన్నందున ఆమె పాస్‌పోర్టును రెన్యూవల్ చేయడానికి అధికారులు నిరాకరించారన్నారు. -
కమల్ టు ఖుష్బూ! సినీ 'పన్నీర్' జల్లు!!
-
కమల్ టు ఖుష్బూ! సినీ 'పన్నీర్' జల్లు!!
జయలలిత మృతిపై, తన రాజీనామాపై తొలిసారి పెదవివిప్పిన తమిళనాడు ఆపద్ధర్మ సీఎం ఓ. పన్నీర్ సెల్వంపై సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించారు. తొలిసారి ధైర్యంగా మాట్లాడి.. మనస్సులో మాటలో బయటపెట్టినందుకు, వెన్నుముక కలిగిన నేతగా నిరూపించుకున్నందుకు ఆయనను కొనియాడారు. కమల్ హాసన్, అరవింద స్వామి, ఖుష్బూ, గౌతమి తదితరులు పన్నీర్ సెల్వాన్ని ప్రశంసించారు. మంగళవారం మెరీనా బీచ్‌లో అమ్మ సమాధి వద్ద దీక్ష అనంతరం ఆయన శశికళకు వ్యతిరేకంగా మాట్లాడిన తీరును కొనియాడారు. వారు ఏమన్నారంటే.. కమల్ హాసన్: తమిళనాడు ప్రజలారా త్వరగా పడుకోండి. రేపు వాళ్లు మనకంటే ముందే నిద్రలేస్తారు. గుడ్‌నైట్. సిద్ధార్థ: మెరీనాలో ఓపీఎస్. తమిళనాడు రాజకీయాలు గేమ్ ఆఫ్ థోర్న్స్, హౌస్ ఆఫ్ కార్డ్స్ (హాలీవుడ్ మూవీ)ను తలపిస్తున్నాయి. ఆర్య: సరైన సమయంలో ఓపీఎస్ సర్ గొప్పగా, ధైర్యంగా మాట్లాడారు. ఆయనకు నా హాట్సాప్. అరవింద స్వామి: బటానీలు తింటూ న్యూస్ చూస్తున్నా. హుప్స్ (ఓపీఎస్) ఒకటి పగిలింది. ఇక పాప్‌కార్న్ తింటాను గౌతమి: అందుకే అమ్మ ఓపీఎస్‌ను ఎంచుకున్నారు. అంతరాత్మ మేరకు నడుచుకునే ధైర్యం ఆయనకు ఉంది. ఇది తమిళనాడుకు, అమ్మకు న్యాయం చేయడమే. (ప్రధాని నరేంద్రమోదీకి ట్యాగ్ చేశారు) ఖుష్బూ: ఓపీఎస్ మౌనాన్ని వీడారు. ఒక హీరోగా ముందుకొచ్చారు. డ్రామా ఇప్పుడే మొదలైంది. దేశ రాజధానికి చెందిన 56 ఇంచుల ఛాతి ఉన్న నాయకుడి తరఫున ఓపీఎస్ పనిచేయడం లేదని నేను ఆశిస్తున్నా. -
కోహ్లీ మీద ప్రేమతో ఖుష్బూ ఏం చేసిందంటే..
ఇండోర్: టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అంటే మీకు ఇష్టమేనా? అతని ఆటను ఆస్వాదిస్తారా? సరే, కేవలం మ్యాచ్ చూడటమే కాకుండా ఆ క్రీడాకారుడిపై అభిమానాన్ని ఎలా చాటుకుంటారు? మహాఅయితే కోహ్లీ సెంచరీ కొట్టినప్పుడో, అతని పుట్టిన రోజునో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారేమో! కానీ కేవలం కోహ్లీ మీద ప్రేమతో బర్త్ డే డేట్ ని మార్చుకోగలరా? ఇండోర్ (మధ్యప్రదేశ్) కు చెందిన ఖుష్బూ తన అసలు పుట్టిన రోజును ఎప్పుడో మర్చిపోయింది. కోహ్లీ పుట్టినరోజైన నవంబర్ 5నే ఆమె కూడా బర్త్ డే జరుపుకొంటుంది. ఆ ఆటగాడంటే ఆమెకు అంత అభిమానం! రెండు రోజుల కిందటే 16వ పుట్టినరోజు జరుపుకొన్న ఖుష్బూ.. ఇప్పటివరకు విరాట్ కోహ్లీకి సంబంధించిన 3000 ఫొటోలను సేకరిచింది. వాటిలో కోహ్లీ చిన్ననాటివేకాక సెంచరీలు కొట్టినవి, టాలూలుక సంబంధించినవి, అమ్మానాన్నలతో దిగినవి, గర్ల్ ఫ్రెండ్స్ తో కలిసున్నవి.. వందలకొద్దీ ఫొటోలున్నాయి ఖుష్బూ దగ్గర. 'నా పదో ఏట అనుకుంటా.. ఒక రోజు ఇంట్లో క్రికెట్ మ్యాచ్ చూశా, కోహ్లీ ఇరగదీశాడు. ఎందుకో ఆ క్షణమే ఆయనకు అభిమానినైపోయా. అప్పటినుంచి కోహ్లీపై ప్రేమ పెరుగుతూ వచ్చింది. ఆ ఇష్టంతోనే అతనికి సంబంధించిన ఫొటోలు సేకరిస్తా. ఇప్పటిదాకా 3వేల పైచిలుకు ఫొటోలున్నాయి. చివరికి నా అసలు పుట్టిన రోజుకు బదులు కోహ్లీ బర్త్ డే నాడే నేనూ కేక్ కట్ చేస్తున్నా. అమ్మానాన్నలు కూడా నా అభిమానానికి ఏనాడూ అడ్డు చెప్పలేదు. ఎప్పటికైనా కోహ్లీని కలవాలనేది నా కల'అని చెబుతుంది ఖుష్బూ. మొన్నటి న్యూజిలాండ్ సిరీస్ లో మూడో టెస్లు ఇండోర్ లో జరిగినప్పుడు కోహ్లీని కలిసేందుకు ఖుష్బూ ప్రయత్నించింది. కానీ విఫలమైంది. ఏదో ఒకరోజు ఆమె కల నెరవేరాలని కోరుకుందామా.. -
నలుగురూ స్నేహితులే!
నటనలో, అందంలో ఈ నలుగురూ నలుగురే. సుమారు ముప్ఫై ఏళ్లుగా దక్షిణాది సినిమాల్లో నటిస్తున్నారు. 90వ దశకంలో నువ్వా నేనా అన్నట్లు పోటాపోటీగా సినిమాలు చేశారు. అప్పట్లో అగ్ర హీరోయిన్లు ఎవరు? అనడిగితే... ఊర్వశి, రాధిక, ఖుష్బూ, సుహాసిని.. ఈ నలుగురి పేర్లూ తప్పకుండా వినిపించేవి. వీళ్ల మధ్య పోటీ సినిమాల వరకే. మేకప్ తీసేసిన తర్వాత నలుగురూ స్నేహితులే. హెల్దీ కాంపిటీషన్ అనమాట. ఎయిటీస్ రీ-యూనియన్ పేరుతో ప్రతి ఏడాది గెట్ టుగెదర్ పార్టీలు నిర్వహిస్తుంటారు. ఇప్పుడీ నలుగురి గురించి ప్రస్తావన ఎందుకంటే... వీళ్లంతా కలసి ఓ సినిమాలో నటించనున్నారని చెన్నై కోడంబాక్కమ్ వర్గాల సమాచారం. నలుగురు సీనియర్ హీరోయిన్లు ఓ సినిమాలో నటించడం వింతేముంది? అనుకోవచ్చు. అసలు విషయం ఏంటంటే.. ఈ నలుగురూ కలసి నటిస్తున్న ఫస్ట్ సినిమా ఇది. ఇంకొకటి.. నిజ జీవితంలో స్నేహితులైన వీళ్లు సినిమాలోనూ స్నేహితులుగానే నటించనున్నారు. జేమ్స్ వసంతన్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా హిందీ ‘జిందగీ నా మిలేగీ దొబారా’ తరహాలో ఫన్నీ ఎంటర్టైనర్గా ఉంటుందట. ఈ నలుగురి క్యారెక్టరైజేషన్లను 90వ దశకంలో వాళ్లు నటించిన హిట్ సినిమాల్లోని క్యారెక్టర్స్ ఇన్స్పిరేషన్తో డిజైన్ చేశారట. వచ్చే వారమే ఆస్ట్రేలియాలో షూటింగ్ స్టార్ట్ అవుతుందని, సింగిల్ షెడ్యూల్లో షూటింగ్ అంతా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. రియల్ లైఫ్‌లో ఈ నలుగురూ స్నేహితులు కావడంతో సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. -
ప్రచారానికి చిరంజీవి, ఖుష్భూ, రమ్య
బెంగళూరు : త్వరలో జరగబోయే బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ)ఎన్నికలకు కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(కేపీసీసీ) సన్నద్ధం అవుతోంది. బీబీఎంపీ ఎన్నికల ప్రచారంలో సొంత రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాలకు చెందిన సినీ తారలను ఉపయోగించుకునేందుకు కేపీపీసీ సన్నాహాలు చేస్తోంది. ఓటర్లను ఆకర్షించడంలో భాగంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని రమ్యా, భావనతో పాటు చిరంజీవి ఖుష్భును ఆహ్వానించినట్లు కేపీసీసీ చీఫ్ డాక్టర్ పరమేశ్వర్ తెలిపారు. మరోవైపు వరుసగా రెండోసారి బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలనే కమల నాథుల వ్యూహాలకు ఆదిలోనే హంసపాదు ఎదురవుతోంది. బీబీఎంపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం కుదరదని అనంతకుమార్‌తోపాటు యడ్యూరప్ప సైతం ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్‌జోషికి ఇప్పటికే తేల్చిచెప్పినట్టు సమాచారం. -
'నా సినీ ప్రస్థానం ముగిసింది'
తిరువనంతపురం: తన సినీ ప్రస్థానం ఇక ముగిసిందని ప్రముఖ నటి ఖుష్బూ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతగా మారిన ఆమె ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో ఏర్పడిన కేంద్ర ప్రభుత్వం పనిచేయడంలో విఫలమైందని ఆరోపించారు. సాటి మహిళగా తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలితను ఆమోదిస్తానని, కానీ ఆమె అహంకారాన్ని మాత్రం తాను అంగీకరించలేనని చెప్పారు. 'నాపిల్లలు ఇప్పుడిప్పుడే పెద్దవాళ్లవుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పలు కార్యక్రమాలతో తీరిక లేకుండా ఉన్నాను. ఇప్పుడు నటన మీద దృష్టి పెడితే పార్టీకి సంబంధించిన సమావేశాలకు హాజరయ్యేందుకు ఇబ్బంది అవుతుంది. సినిమాలకు ఒప్పుకుని నిర్మాతలను నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఇక నా సినీ జీవితానికి ముగింపు పలికే సమయం వచ్చినట్లేనని చెప్పగలను' అని ఆమె ఆదివారం మీడియాకు తెలిపారు. ఇక మోదీ సర్కార్‌పై ఆమె విమర్శలు గుప్పిస్తూ.. పేదలు, రైతుల జీవితాలు దారుణంగా తయారయ్యాయని, ఈ రెండు కారణాలు చాలు మోదీ సర్కార్ పూర్తిగా విఫలమైందని చెప్పడానికి అంటూ ఆమె విమర్శించారు. ఆయన పాలనలో పేదవారు నిరు పేదవారిగా, ధనికులు మరింత ధనికులుగా మారుతున్నారని ఆరోపించారు. -
సునందా పుష్కర్ ఆత్మహత్యోదంతమా?
నటి కుష్బు పేరు మరోసారి వార్తల్లో కెక్కింది. దర్శకుడు ఏఎం ఆర్మ్రేష్ ఆమెపై ధ్వజమెత్తారు. ఇంతకుముందు గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ఇతివృత్తంతో వనయుద్ధం, రాజీవ్‌గాంధీ హత్యోదంతో కుప్పి చిత్రాన్ని తెరకెక్కించిన ఈయన తాజాగా ఒరు మెల్లియకొడు పేరుతో చిత్రం రూపొందిస్తున్నారు. ఇందులో అర్జున్, శ్యామ్, మనీషా కొయిరాలా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం కాంగ్రెస్ మాజీ కేంద్ర మంత్రి శశిధర్ భార్య సునందా పుష్కర్ ఆత్మహత్య సంఘటన ఇతివృత్తంతో రూపొందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ చిత్ర కథ గురించి చెప్పాలని చిత్ర యూనిట్ సభ్యులను కుష్బు డిమాండ్ చేసినట్లు దర్శకుడు రమేష్ ఆరోపణలు చేశారు. అంతేకాదు కుష్బు చర్యలను ఆయన మండిపడ్డారు. కుష్బు తమ యూనిట్‌కు చెందిన ఒకరితో చిత్ర కథ గురించి విచారించారన్నారు. సునందా పుష్కర్ ఆత్మహత్యోదంతమా? అంటూ అడిగారని అన్నారు. అయితే తన చిత్ర కథను ఎవరికి చెప్పేది లేదన్నారు. ఏ దర్శకుడు, నటుడు తన చిత్ర కథ గురించి బయటకు చెప్పరన్నారు. అయినా కుష్బు తన సహాయ దర్శకుడిని కథ గురించి అడిగేకంటే డెరైక్ట్‌గా తననే అడగవచ్చన్నారు. నిజమే తన చిత్రం ఒక మర్మ హత్య సంఘటన ఇతివృత్తంతో రూపొందిస్తున్న చిత్రమేనని స్పష్టం చేశారు. మనీషా కొయిరాల హత్యకు గురవుతారన్నారు. ఆ హత్య గురించి ఇన్వెస్టిగేషన్నే చిత్ర ఇతివృత్తం అని చెప్పారు. ఇంతకంటే ప్రస్తుతానికి ఏమీ చెప్పలేనని దర్శకుడు రమేష్ అన్నారు. నేను ఎవరినీ అడగలేదు : రమేష్ ఆరోపణలను నటి కుష్బు ఖండించారు. దీని గురించి ఆమె తన ట్విట్టర్లో పేర్కొంటూ సునందా పుష్కర్ ఆత్మహత్య సంఘటన ఇతివృత్తంలో చిత్రం రూపొందుతోందని ఆ చిత్ర కథ గురించి చెప్పాలని తాను డిమాండ్ చేసినట్లు అసత్య ప్రచారం జరుగుతోందన్నారు. నిజానికి అలా తాను ఎవరినీ అడగలేదని స్పష్టం చేశారు. అర్జున్ భార్య చిత్రంలో నటించమని తనను అడిగారన్నారు. తాను చిత్రాల్లో నటించడం మానేసి చాలా కాలం అయ్యిందని వారికి చెప్పానని అంతేకానీ కథ గురించి కూడా అడగలేదని కుష్బు పేర్కొన్నారు. -
కుష్బూ డ్రీమ్ మ్యాన్!
చాలామందికి సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ యాంగ్రీ యంగ్మ్యాన్గానే పరిచయం. ఈ ఇమేజ్‌తోనే అభిమానుల హృదయాలకు చేరువైన బిగ్ బీ... నటి కుష్బూకు మాత్రం కలల రాకుమారుడట. చిన్నప్పటి నుంచీ అమితాబ్ అంటే తెగ ఇష్టం అని... ఆయన్ను చూసినప్పుడల్లా కలలు కనేదానినని చెప్పిందీ తార. అనుకున్నది అనుకున్నట్టు నిర్మొహమాటంగా మాట్లాడేసే కుష్బూ.. అప్పటికి, ఇప్పటికీ అమితాబే తన రియల్ హీరో అంటోంది. ఇదే విషయాన్ని ట్విట్టర్లో అమితాబ్‌కు మెసేజ్ కూడా పెట్టిందట..! అమితాబ్ ఎలా స్పందిస్తాడో చూడాలి మరి! -
బుజ్జగింపులు
సాక్షి, చెన్నై : నటి ఖుష్బును బుజ్జగించేందుకు డీఎంకే ద్వితీయ శ్రేణి నేతలు రంగంలోకి దిగినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. తనకు తీవ్ర అవమానం జరిగిందని, నిర్ణయాన్ని పునఃసమీక్షించబోయేది లేదంటూ ఖుష్బు కుండ బద్ధలుకొట్టినట్లు సమాచారం.ఖుష్బు డీఎంకేకు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిం దే. కమలం గూటికి చేరడానికి ఆమె సన్నద్ధ అవుతున్నట్టు సంకేతాలు వెలువుడుతున్నాయి. ఈ సమయంలో డీఎంకే ద్వితీయ శ్రేణి నాయకులు కొందరు బుజ్జగించినట్లు వెలుగులోకి వచ్చింది. పార్టీలో ప్రత్యేకంగా మహిళా సినీ గ్లామర్ అంటూ ఎవ్వరూ లేని దృష్ట్యా, ఆ గ్లామర్‌ను కోల్పోవాల్సి వచ్చిందన్న డైలమాలో డీఎంకే అధిష్టానం పడ్డట్టు సమాచారం. అధినేత ఎం కరుణానిధి సూచన మేరకు ద్వితీయ శ్రేణి నాయకులు కొందరు ఖుష్బును బుజ్జగించే పనిలో పడ్డారు. ఖుష్బు సన్నిహితంగా ఉన్న వారి ద్వారా కూడా సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. ఆవేదన : బుజ్జగింపుల బాట పట్టిన నాయకులు, సన్నిహితుల వద్ద ఖుష్బు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసి ఉన్నారు. దివంగత పెరియార్ సిద్ధాంతాలతో, దివంగత అన్నా ఆదర్శంతో ప్రజా సంక్షేమం కోసం శ్రమిస్తున్న కరుణానిధి మార్గదర్శకంలో పనిచేయాలన్న కాంక్షతో డీఎంకేలో చేరినట్టుగా వారికి వివరిస్తున్నారు. పార్టీ కోసం శ్రమిస్తున్న సమయంలో తనలాంటి వారికి డీఎంకేలో చోటు లేదన్న విషయాన్ని గ్రహించినట్టు వాపోతున్నారు. పార్టీ కి మంచి జరగాలన్న ఉద్దేశంతో కొన్ని వ్యాఖ్యలు చేస్తే, ఇంటిపై రాళ్లు వేయించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రు. తన పిల్లలు ఆ క్షణంలో పడ్డ మనోవేదన కళ్ల ముం దు ఇంకా మెదులుతున్నట్టుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మైనారిటీ సామాజిక వర్గం నుంచి వచ్చిన తనకు లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణ చెన్నై లేదా కోయంబత్తూరు సీటు ఇవ్వాలని కోరిగా, అందుకు పార్టీలోని కొందరు పెద్దలు అవహేళన చేసినట్టుగా ఆరోపిస్తున్నారు. అధినేత తర్వాత ఆయన స్థానంలో కూర్చోవాలనుకుంటున్న వారు తనను పార్టీలో ఎదగనీయకుండా అడ్డుకున్నారంటూ పరోక్షంగా స్టాలిన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తుండడం గమనార్హం. తనను తీవ్రంగా అవమానించారని, కనీస గౌరవం కూడా ఇవ్వకుండా కించ పరచడంతో చివరకు అధినేత కరుణానిధికి తన రాజీనామా పంపాల్సి వచ్చిందని ఆమె వాపోతున్నారట. అదే సమయంలో తన నిర్ణయంలో ఎలాంటి మార్పులు ఉండవని, పునః సమీక్షించే ప్రసక్తే లేదంటూ ఖుష్బు కరాఖండిగా తేల్చుతుండడం గమనార్హం. ఇక, ఖుష్బు రాజీనామా గురించి డీఎంకే మాజీ ఎంపీ, సీనియర్ నాయకులు టీకేఎస్ ఇళంగోవన్‌ను కదిలించగా, తాను పడుతున్న ఇబ్బందులు, ఎదుర్కొంటున్న సమస్యలను ముందుగా అధిష్టానం దృష్టికి ఆమె తెచ్చి ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొనడం కొసమెరుపు. -
కమలం గూటికి ఖుష్బు?
సాక్షి, చెన్నై:నటి ఖుష్బు డీఎంకేను వీడిన విష యం తెలిసిందే. పార్టీకి రాజీనామా చేస్తూ అధినేత కరుణానిధికి లేఖాస్త్రాన్ని ఆమె సంధించారు. అయితే, తదుపరి తన అడుగులు ఎటో అన్నది ఆమె ప్రశ్నార్థకంగా ఉంచినా, కమలం తీర్థం పుచ్చుకోవడం ఖాయం అన్న సంకేతాలు వెలువడుతున్నాయి. డీఎంకేను వీడాలన్న నిర్ణయాన్ని ఖుష్బు హఠాత్తుగా తీసుకున్నది మాత్రం కాదన్నట్టు కోలీవుడ్‌లో చర్చ మొదలైంది. ఎప్పుడో డీఎంకేను వీడాల్సిన ఆమె, ఆలస్యంగా నిర్ణయం తీసుకున్నారంటూ చెబుతున్నారు.ఎన్నికలప్పుడే మంతనాలు : తనను డీఎంకేలో పక్కన పెడుతూ రావడంపై ఖుష్బు తీవ్ర మనోవేదనకు లోనైనట్టు సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో తనకు సీటు వస్తుందన్న ఆశతో ఆమె ఉన్నట్టు, చివరకు డీఎంకే అధిష్టానం మొండి చేయి చూపించడాన్ని జీర్ణించుకోలేక పోయార న్నట్టుగా చర్చ సాగుతోంది. ఈ విషయమై మీడియా కదిలించినప్పుడు అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నానంటూ వ్యాఖ్యానించిన సందర్భం ఉంది. ఇదే సమయంలో ఢిల్లీలో, బాలీవుడ్లో తనకు ఉన్న పరిచాయాల మేరకు బీజేపీ గూటికి చేరడానికి చాప కింద నీరులా ఖుష్బు ప్రయత్నాలు చేసినట్టు సమాచారం వెలుగు చూసింది. ఈ విషయం డీఎంకే అధినేత ఎం కరుణానిధి దృష్టికి చేరడంతో ఆయన బుజ్జగించినట్టు, ఆయన సూచనకు తలొగ్గిన ఖుష్బు ఆలస్యంగా ప్రచారానికి రెడీ అయ్యారన్న చర్చ డీఎంకేలో సాగుతోంది. పార్టీ కోసం తాను శ్రమిస్తున్నా, తనకు సరైన గుర్తింపు ఇవ్వడంలో అధిష్టానం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుండడం, తనను కేవలం ప్రచార వస్తువుగా మాత్రమే డీఎంకే వాడుకుంటోందన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుని అధినేత కరుణానిధికి లేఖాస్త్రం సంధించినట్టున్నారు. కమలం గూటికి: ఎన్నికలప్పుడే బీజేపీలో చేరడానికి ఖుష్బు మార్గం సుగమం చేసుకున్నట్టు సంకేతాలు వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారానికి వచ్చిన నరేంద్ర మోడీ సమక్షంలో కోయంబత్తూరు వేదికగా పార్టీలో చేరే సమయంలో అధినేత కరుణానిధి అడ్డు పడినట్లు సమాచారం. చివరి క్షణంలో తన ప్రయత్నాన్ని వీడిన ఖుష్బు తాజాగా మళ్లీ కమలం గూటికి చేరే ప్రయత్నాల్లో ఉన్నట్టుగా ప్రచారం మొదలైంది. నటి, కేంద్ర మంత్రి సృతి ఇరానీకి మద్దతుగా ఇది వరకు ఖుష్బు పలు సందర్భాల్లో వ్యాఖ్యలు చేసి ఉన్నారు. దీని వెనుక బీజేపీలో చేరనున్న సంకేతం ఉన్నట్టు కమలాలయం వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌తో ఖుష్బుకు పరిచయం ఉన్నట్టు, అందుకే ఆమెకు అభినందనలు సైతం ఖుష్బు ప్రకటించి ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఎన్నికలప్పుడే ఆమె తమ గూటికి చేరి ఉంటే, ఏదో ఒక చోట అభ్యర్థిగా నిలబడి పార్లమెంట్ మెట్లు ఎక్కి ఉండే వార ని చెబుతున్నారు. ఇప్పటికైనా ఆమె తమ పార్టీలోకి వస్తే ఆహ్వానించేందుకు సిద్ధం అని బీజేపీ నేత ఒకరు పేర్కొనడం గమనార్హం. అదే సమయంలో, రాష్ట్ర బీజేపీలో ప్రత్యేక ఆకర్షణగా ఇద్దరు మహిళా నాయకులు మాత్రమే ఉన్నారు. అయితే, సినీ గ్లామర్ బీజేపీలో లేదు. ఖుష్బు చేరిన పక్షంలో రాష్ట్ర బీజేపీకి మరింత ఆకర్షణ రావడం ఖాయం. ఢిల్లీలో ఉన్న పరిచయాల మేరకు ఆమె తమ పార్టీలోకి తప్పకుండా వచ్చే అవకాశాలు ఉన్నాయని మరో నేత పేర్కొనడం బట్టి చూస్తే, త్వరలో కమలం గూట్లో చేరే అధికారిక ప్రకటనను ఖుష్బు చేసేనా? అన్నది వేచి చూడాల్సిందే! -
డీఎంకే తరపున నటి కుష్బూ ప్రచారం