హైకోర్టును ఆశ్రయించిన నటి | khushboo seeks court permission to go abroad | Sakshi
Sakshi News home page

హైకోర్టును ఆశ్రయించిన నటి

Published Sat, Apr 22 2017 11:12 AM | Last Updated on Mon, Oct 8 2018 3:56 PM

హైకోర్టును ఆశ్రయించిన నటి - Sakshi

హైకోర్టును ఆశ్రయించిన నటి

పెరంబూర్‌: విదేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వాల్సిందిగా నటి, కాంగ్రెస్‌ నాయకురాలు కుష్బూ శుక్రవారం మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు విదేశాలకు వెళుతున్నానని మదురై బెంచ్‌కు విన్నవించుకున్నారు. తన ప్రయాణానికి అనుమతి తెలపాలని విజ్ఞప్తి చేశారు. విదేశాలకు వెళ్లే ముందు ఏ దేశానికి వెళ్లుతున్నారు, ఎక్కడ బస చేస్తారు లాంటి వివరాలను తమకు తెలియజేయాలని న్యాయస్థానం ఆదేశించిండంతో ఆమె కోర్టు అనుమతి కోరారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఈనెల 24 నుంచి మే నెల 14వ తేదీ వరకు ఫ్రాన్స్, స్పెయిన్‌ దేశాలకు విహారయాత్రకు వెళ్లనున్నట్లు కోర్టుకు తెలిపారు. దీనిపై న్యాయస్థానం త్వరలో నిర్ణయం వెలువరించనుంది.

తమిళనాడులో 2011 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించారన్న ఆరోపణలతో కుష్బూపై ఆండిపట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో ఉన్నందున ఆమె పాస్‌పోర్టును రెన్యూవల్‌ చేయడానికి అధికారులు నిరాకరించారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement