
చెన్నై: నటి, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రచార కర్త కుష్బూకు నవంబర్ 4వ తేదీన వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించనున్నారు. ఆమె ఇటీవల ఇంట్లో కాలు జారి పడడంతో మోకాలికి గాయం అయింది. దీంతో కుష్బూ కాలుకు శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు తెలిపినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని నటి కుష్బూ కొట్టిపారేశారు. తనకు వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించాలన్నది నిజమే కానీ, కాలికి కాదనీ, మోకాలు నొప్పి నెల రోజులుగా ఉన్నందుకు వైద్యులు కట్డు కట్టారన్నారు.
తనకు కడుపులో ఏర్పడ్డ చిన్న గడ్డను తొలగించడానికి శస్త్ర చికిత్స అవసరం అవుతుందని వైద్యులు తెలిపారన్నారు. అందుకు వచ్చే నెల 4వ తేదీన శస్త్ర చికిత్స చేయించుకునే అవకాశం ఉందని కుష్బూ తెలిపారు. కాగా ఇందిరాగాంధీ శతాబ్దిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో వచ్చే నెల 4, 8, 17వ తేదీల్లో నటి కుష్బూ పార్టీ సమావేశాల్లో పాల్గొనాల్సి ఉంది. ఈ క్రమంలో 4న తనకు శస్త్ర చికిత్స జరిగితే పార్టీ సమావేశాల్లో పాల్గొనలేనని ఆమె పార్టీ ఆధిష్టానానికి లేఖ రాశారట.
Ok friends..2 mny news abt me bng hospitalised..i nd 2 undergo a surgery n tat is slated 4 the 4th..wl b rested 4 2wks..thanks 4 d concern 😊
— khushbusundar (@khushsundar) October 29, 2017