సాక్షి, చెన్నై: కాంగ్రెస్‌ని మానసిక ఎదుగుదల లేని పార్టీ అంటూ చేసిన వ్యాఖ్యలకుగాను బీజేపీ మహిళా నేత, నటి కుష్బు క్షమాపణ కోరారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రెండు పదబంధాలను తప్పుగా వాడినందుకు క్షమించమని కోరడమే కాక ఇది మరలా జరగకుండా చూస్తానని అన్నారు. కుష్బు చేసిన వ్యాఖ్యల పట్ల తమిళనాడులో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయ్యింది. ఆమె మీద ఓ హక్కుల సంస్థ 30 పోలీసు స్టేషన్‌లలో ఫిర్యాదులు చేసింది. బీజేపీలో చేరిన అనంతరం ఈ నెల 14 న కుష్బు చెన్నై వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. మానసిక ఎదుగుదల లేని పార్టీ కాంగ్రెస్ అని, ఆ పార్టీ నాయకులకు బుర్ర కూడా తక్కువే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. (చదవండి: వాళ్లంతా బుర్ర లేనోళ్లు..!)
ఇక తన ప్రకటనలో కుష్బు ‘ఆ సమయంలో నేను తీవ్ర దుఖం, వేదనలో ఉన్నాను. ఆ తొందరపాటులో రెండు పదబంధాలను తప్పుగా ఉపయోగించినందుకు నేను బాధపడుతున్నారు. నాకు నేనుగా ఎదిగిన వ్యక్తిని. అలాంటిది నేను వేరే వాళ్ల డైరెక్షన్‌లో.. వారి ఆలోచనల మేరకు మాట్లాడుతున్నాను అనడం అభ్యంతరకరమైనది’ అన్నారు. అంతేకాక ‘నా కుటుంబ సభ్యులు కొందరు మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. నాకు సమర్థులైన, తెలివైన, డైనమిక్, బైపోలార్ డిజార్డర్, డిప్రెషన్‌తో బాధపడుతున్న ఇలా వేర్వేరు రకాల స్నేహితులు ఉన్నారు. వారి స్నేహం, జ్ఞానం నన్ను ధనవంతురాలిని చేసింది’ అన్నారు కుష్బు.
Comments
Please login to add a commentAdd a comment