
Khushbu Sundar Twitter Account Hacked: నటి, తమిళనాడు బీజేపీ నాయకురాలు ఖుష్బూ సందర్ ట్విటర్ మరోసారి హ్యాకింగ్‌కు గురైంది. ఈ సారి హ్యాకర్లు ఆమె అకౌంట్ పేరును బ్రియాన్‌గా మార్చారు. అలాగే కవర్ ఫోటోని కూడా మార్చేశారు. గతంలో ఆమె చేసిన ట్వీట్లన్నీ తొలగించారు.
గతేడాది ఏప్రిల్‌లోనూ ఆమె అకౌంట్‌ను ఇలాగే ఎవరో హ్యాక్ చేశారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తన ఫాలోవర్స్‌కి తెలియజేసింది. గతంలో ఇలా జరిగినప్పుడు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ట్విటర్ అకౌంట్ హ్యాక్ అయినట్లు చెప్పింది. 48 గంటల నుంచీ తాను పాస్‌వర్డ్ మార్చడానికి ప్రయత్నిస్తున్నా కుదరడం లేదని, సాయం చేయాలని ఫ్యాన్స్‌ను కోరింది.