Tamil Actress Khushboo Admitted Suddenly In Hospital, Know Her Health Condition - Sakshi
Sakshi News home page

Khushboo: ఆస్పత్రిలో చేరిన ఖుష్బూ.. అదే కారణం..!

Published Fri, Oct 7 2022 3:37 PM | Last Updated on Fri, Oct 7 2022 4:13 PM

Tamil Actress Khushboo Admitted Suddenly In Hospital - Sakshi

సినీ నటి, బీజేపీ మహిళా నేత ఖుష్బూ ఆకస్మాత్తుగా ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. బెడ్‌పై ఉన్న ఓ ఫోటోను ఆమె షేర్ చేశారు. తమిళంతో పాటు టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక సంపాదించుకున్న నటి రాజకీయాల్లోనూ కొనసాగుతున్నారు. నటనతో పాటు సీరియల్స్, టీవీ షోలలో హోస్ట్‌గా, డ్యాన్స్ షోలలో న్యాయనిర్ణేతగా ఉంటూ కొన్ని చిత్రాలను కూడా నిర్మిస్తున్నారు.

'వెన్నెముక విపరీతమైన నొప్పి కారణంగా ఆస్పత్రిలో చేరాను. ఒకటి, రెండు రోజులు విశ్రాంతి అవసరం. కోలుకున్నాక మళ్లీ విధుల్లో యథావిధిగా పాల్గొంటాను' అంటూ ఆమె ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా అందరికీ దసరా శుభాకాంక్షలు కూడా తెలిపారు. దీంతో అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. గెట్‌ వెల్‌ సూన్ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.  కుష్బూ భర్త సుందర్ సి దర్శకత్వంలో 'కాఫీ విత్ కాదల్' అనే చిత్రాన్ని ఆమె నిర్మించారు. ఈ వారం విడుదల కావాల్సిన ఆ చిత్రం పొన్నియన్ సెల్వన్ రాకతో వాయిదా వేసుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement