కోలీవుడ్ భామ అదితి శంకర్‌కు అవకాశాలు క్యూ కడుతున్నాయి. డైరెక్టర్ శంకర్ కూతురిగా విరుమాన్ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన విషయం తెలిసిందే. ఆ చిత్ర సక్సెస్ అదితి శంకర్‌కు బాగా ఉపయోగపడింది. ఆ తర్వాత శివ కార్తికేయన్‌తో జతకట్టిన మావీరన్ చిత్రం కూడా విజయాన్ని అందుకుంది.
(ఇది చదవండి: వరుణ్-లావణ్య పెళ్లి.. అలాంటి పద్ధతిలో?)
తాజాగా ఈ భామ అధర్వ తమ్ముడు ఆకాష్ మురళికి జంటగా నటిస్తున్న చిత్రం షూటింగ్ దశలో ఉంది. దీనికి విష్ణువర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా సెల్వరాగం దర్శకత్వంలో తెరకెక్కనున్న 7జి రెయిన్‌బో కాలనీ–2లో ఈ చిన్నదే నటించే అవకాశాలు ఉన్నట్లు కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.
కాగా అదితి శంకర్‌కు మరో అవకాశం తలుపు తట్టిందన్నది తాజా అప్‌డేట్. ఇంతకుముందు రాక్షసన్ వంటి పలు సక్సెస్‌ఫుల్ చిత్రాలకు దర్శకత్వం వహించిన రామ్ కుమార్ తాజాగా నటుడు విష్ణు విశాల్ హీరోగా చిత్రాన్ని చేయనున్నారు. ఈ చిత్రంలోనూ అదితి శంకర్ నటించబోతున్నట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని సత్య జ్యోతి ఫిలిమ్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.
ఆయన తెలుపుతూ నటి అదితి శంకర్ తమ చిత్ర కథను విన్నారని ఆమె ఇందులో కథానాయకగా నటించనున్నారని తెలిపారు. కాగా ఇంతకుముందు విష్ణు విశాల్, దర్శకుడు రామ్ కుమార్ కాంబినేషన్‌లో రూపొందిన ముండాసు పట్టి, రాక్షసన్ చిత్రాలు సూపర్ హిట్ కావడంతో తాజాగా ఈ కాంబో హ్యాట్రిక్‌కు సిద్ధం అవుతోందన్నమాట.
(ఇది చదవండి: భర్తకి ప్రముఖ నటి విడాకులు.. ప్రాణం పోయిన ఫీలింగ్! )
Comments
Please login to add a commentAdd a comment