ప్రముఖ నటి ఇంట్లో తీవ్ర విషాదం..! | Tamil Actress Babilona Brother Vignesh Found Dead At Chennai Apartment | Sakshi
Sakshi News home page

Babilona: అనుమానాస్పద స్థితిలో నటి సోదరుడు మృతి!

Oct 27 2023 1:41 PM | Updated on Oct 27 2023 2:08 PM

Tamil Actress Babilona Brother Vignesh Found Dead At Chennai Apartment - Sakshi

ప్రముఖ కోలీవుడ్ నటి ఇంట్లో విషాదం నెలకొంది.  నటి బాబిలోనా సోదరుడు విఘ్నేష్ కుమార్ ‍  అలియాస్ విక్కీ ఇటీవల చెన్నైలోని తన నివాసంలో అనుమానాస్పద రితీలో మృతి చెందారు.  విఘ్నేష్ వయస్సు 40 ఏళ్లు కాగా.. ప్రస్తుతం చెన్నైలోని సాలిగ్రామం దశరథపురం అపార్ట్‌మెంట్‌లో చాలా ఏళ్లుగా ఒంటరిగానే నివసిస్తున్నట్లు తెలుస్తోంది.  ఈ విషయాన్ని గమనించిన  అతని స్నేహితుడు విరుగంబాక్కం పోలీసులకు సమాచారమిచ్చారు. 

అపార్ట్‌మెంట్‌లోని బెడ్‌రూమ్‌లో విగతజీవిగా పడి ఉన్న విఘ్నేశ్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కిల్పాక్కం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  అయితే అతని తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

అయితే బాబిలోనా సోదరుడిని కొద్ది రోజుల క్రితం చెన్నైలోని వలసరవాక్కంలో సాధారణ పెట్రోలింగ్‌లో పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. మద్యం మత్తులో గొడవ చేయడంతో అదుపులోకి తీసుకున్నారు. విఘ్నేష్‌కు క్రిమినల్ ట్రాక్ రికార్డ్ కూడా ఉంది. గతంలోనూ అతను అనేక నేరాలకు పాల్పడినట్లు సమాచారం. 

కాగా.. నటి బాబిలోనా శాస్త్ర (2000), ఇష్క్ కా ఆచార్ (2004), లెవెల్ క్రాస్ (2002) వంటి సినిమాల్లో నటించింది. తెలుగులో నిర్మలా ఆంటీ అనే చిత్రంలో కనిపించారు. అందాల ఆరబోతతో తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో సెక్సీ నటిగా పేరు తెచ్చుకున్నారు. తెలుగు కుటుంబానికి చెందిన ఆమె అసలు పేరు భాగ్యలక్ష్మి కాగా.. పారిశ్రామికవేత్త సుందర్ బాబుల్ రాజును 2015లో ప్రేమ వివాహం చేసుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement