స్టార్‌ హీరోతో ఛాన్స్ కొట్టేసిన డైరెక్టర్‌ కూతురు! | Star Director Daughter Gets Chance In Star Hero Movie | Sakshi
Sakshi News home page

Aditi Shankar: ఆ స్టార్ హీరోతో క్రేజీ ఛాన్స్ కొట్టేసిన ఆదితి శంకర్..!

Published Wed, Jan 10 2024 9:21 AM | Last Updated on Wed, Jan 10 2024 9:29 AM

Star Director Daughter Gets Chance In Star Hero Movie - Sakshi

వైద్య విద్య చదివి హీరోయిన్‌గా సినీ రంగప్రవేశం చేసిన నటి ఆదితి శంకర్‌. అంతే కాదు కోలీవుడ్ స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చింది. కార్తీకి జంటగా విరుమాన్‌ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమైన ఆదితి శంకర్‌ తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్నారు. అందులో ఈ చైన్నె చంద్రం పక్కా పల్లెటూరి యువతిగా నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు. అంతేకాకుండా తొలి చిత్రంలోని పాటను కూడా పాడి సింగర్‌గా కూడా పరిచయమయ్యారు. ఆ తరువాత శివకార్తికేయన్‌ సరసన మావీరన్‌ చిత్రంలో నటించారు. ఆ చిత్రం కూడా అనూహ్య విజయాన్ని అందుకుంది.

కాగా.. ప్రస్తుతం విష్ణువర్ధన్‌ దర్శకత్వంలో ఆకాష్‌ మురళికి జంటగా నటిస్తున్నారు. నటుడు అధర్వ తమ్ముడు ఆకాష్‌ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రమిది. ఈ చిత్ర నిర్మాణంలో ఉండగానే ఆదితి శంకర్‌ మరో లక్కీచాన్స్‌ తలుపు తట్టినట్టు తాజా సమాచారం. విరుమాన్‌ చిత్రంలో కార్తీతో జత కట్టిన ఈ బ్యూటీ ఇప్పుడు స్టార్ హీరో సూర్య సరసన నటించడానికి సిద్ధమైనట్లు సమాచారం. 

కాగా... నటుడు సూర్య ప్రస్తుతం కంగువా చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. శివ దర్శకత్వంలో ఈ భారీ చారిత్రక కథా చిత్రం త్రీడీ ఫార్మెట్లో తెరకెక్కుతోంది. ఈ చిత్రం ఈ ఏడాది సమ్మర్‌ స్పెషల్‌గా తెరపైకి రానుంది. కాగా వెట్రిమారన్‌ దర్శకత్వంలో వాడి వాసల్‌ చిత్ర షూటింగ్‌లో సూర్య 10 రోజులు పాల్గొననున్నారు.

ఆ తరువాత సుధా కొంగర దర్శకత్వం వహించనున్న చిత్ర షూటింగ్‌లో పాల్గొంటారని సమాచారం. ఇందులో దుల్కర్‌ సల్మాన్‌ ,విజయ్‌వర్మ ముఖ్యపాత్రలు పోషించనున్నారు. అదేవిధంగా ఇందులో నజ్రియా నాయకిగా నటిస్తున్నట్లు మొదట్లో ప్రచారం జరిగింది. కానీ ఆ స్థానంలో ఆదితి శంకర్‌ను తీసుకున్నట్లు లేటెస్ట్ టాక్‌. ఈ చిత్రాన్ని సూర్యకు చెందిన 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తుండగా.. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్‌కుమార్‌ సంగీతాన్ని అందించనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement